సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రుణమాఫీ గురించి ప్రభుత్వం ఎ ట్టకేలకు చేసిన ప్రకటన ఇందూరు రైతుల కు ఊరట కలిగించింది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రధాన అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఒకేసారి కాకుండా నాలుగు విడతలలో రుణమాఫీ చేసేందు కు సుముఖత వ్యక్తం చేయడంతోపాటు, మొదటి విడతగా 25 శాతం నిధులను విడుదల చేసింది. దీంతో జిల్లాకు చెందిన 4,33,132 మంది రైతులకు తీపి కబురందినట్లయ్యింది. జిల్లాలో రూ.1863.65 కోట్ల రుణమాఫీ కావాల్సి ఉండగా, తొలి విడతలో రూ. 465.91 కోట్లు మాఫీ కా నున్నాయి. అయితే, ఈ జాబితాలో ఎవరెవరికీ అవకాశం ఉంటుందన్న చర్చ రైతులలో సాగుతోంది.
ఎవరికో ముందు ఎడతెగని కసరత్తు
రుణమాఫీ కోసం అర్హులైన రైతుల జాబితాను రూపొందించడానికి అధికారులు ఎడతెగని కసరత్తు చేశారు. ఎ, బి, సి, డి, ఇ దశలుగా విభజించి వివరాలు సేకరించా రు. ప్రభుత్వ ఉత్తర్వులు, రిజర్వుబ్యాంకు మార్గదర్శకాలు పరస్పరం విరుద్ధంగా ఉండటంతో అధికారులు, బ్యాంకర్లు ఓ నిర్ణయానికి రావడానికి చాలా కాలం పట్టింది.
ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఒక కుటుంబానికి రూ. లక్ష వరకు రుణమాఫీ వర్తింప చేయాల్సి ఉంది. ఇందుకోసం రైతు కుటుంబంలోని సభ్యులు, వారి పేర్లతో ఉన్న ఖాతాలు, బంగారంపై తీసుకున్న రుణాల మొత్తాలను లెక్కగట్టాల్సి వచ్చింది. ఇలా చేస్తే ఎంతమందికి ఈ పథకం వర్తిస్తుంది? ఎన్ని కోట్ల రూపాయలు మాఫీ అవుతాయి? అన్న అంశాలు కీలకంగా మారాయి. సుమారు మూడు మాసాల నెలల వ్యవధిలో వివిధ దశలు, ప్రక్రియల ద్వారా అర్హులైన జాబితాను రూపొందించారు. 4,33, 132 మంది రైతులకు రూ.1863.65 కోట్ల పంట రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని తేల్చారు.
రుణాలు ఇచ్చింది ఇలా
ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో జిల్లాలోని 4,33,132 మంది రైతులకు రూ. 1,863.65 కోట్ల రుణాలు నాలుగు విడతలలో మాఫీ కానున్నాయి. మొదటి విడతగా రూ. 465.91 కోట్ల రుణాలు మాఫీ కానున్నాయి. 2013-14లో రూ.1,921.00 కోట్లు లక్ష్యం కాగా రూ.1,810.01 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. ఇందులో ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.1,152.6 కోట్లు కాగా, రూ.1,075.24 కోట్లు ఇచ్చారు. రబీలో రూ.768.4 కోట్లకుగాను రూ.734.77 కోట్లు పంపిణీ చేశారు.
అదే విధంగా జిల్లాలోని 142 సహకార సంఘాలతో పాటు వివిధ బ్యాంకులలో రైతులు బంగారం తాకట్టు పెట్టి రూ.53.64 కోట్లు పంట రుణాలు తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా రైతులు తీసుకున్న మొత్తం రుణాలు రూ.1863.65 కోట్లు కాగా, ఇవన్నీ కూడ రుణమాఫీ కిందకు వస్తాయని అధికారులు నెలరోజుల కిందటే ప్రకటించారు. మొదటి విడతతోపాటు మిగతా రుణాలు మా ఫీ చేసేందుకు అవకాశం ఉందని చెబుతున్న అధికారులు రీ-షెడ్యూల్ తేదీలను ఖరారు చేయడం చర్చనీయాంశంగా మారింది.
రుణమాఫీ విందు..ఎవరికో ముందు
Published Wed, Sep 24 2014 2:27 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement