పోలింగ్ ప్రశాంతం
చెదురుమదురు సంఘటనలే జరిగారుు..
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి ప్రశాంతం
బందోబస్తుతో సత్ఫలితం: డీజీపీ ప్రసాదరావు
హైదరాబాద్: తెలంగాణలోని పది జిల్లాల్లో తొలి విడత పోలింగ్ బుధవారం చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగిందని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో సైతం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయున బుధవారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. 90 వేల మంది పోలీసులు, 158 కంపెనీల కేంద్ర బలగాలు, 58 కంపెనీల ఏపీఎస్‌పీ బలగాలతో కలపి కట్టుదిట్టంగా నిర్వహించిన బందోబస్తు మంచి ఫలితాలను ఇచ్చిందని తెలిపారు. అక్కడక్కడా కొన్ని చెదురువుదురు సంఘటనలు చోటుచేసుకున్నాయుని, అందుకు బాధ్యులైన వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయుకులపై కేసులు నమోదు చేశావున్నారు. వివిధ ప్రాంతాల్లో మొత్తం 15 కేసులు హింసాత్మకంగా నమోదయ్యాయున్నారు.
డీజీపీ తెలిపిన వివరాల ప్రకారం హింసాత్మక సంఘటనలు
ఒక చానల్ కెమెరావున్‌ను కొట్టినందుకు గజ్వేల్ టీడీపీ అభ్యర్థితో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. నిందితుల్లో కొద్దివుంది గజ్వేల్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయూరు. ఖవ్ముంలో కానిస్టేబుల్‌పై చేరుుచేసుకున్న సీపీఐకి చెందిన ప్రభాకరరావుపై కేసు నమోదు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలం వెంకటాపురం గ్రామంలో ఎస్‌ఐ శ్రీధర్ అల్లరిమూకను చెదరగొట్టే క్రమంలో ఒక గర్భిణీ కింద పడిపోరుుంది. దీంతో ఆగ్రహం చెందిన గ్రావుస్తులు పోలింగ్‌ను నిలిపివేశారు. నారాయణ్‌పూర్ డీఎస్‌పీ జోక్యం చేసుకుని ఎస్‌ఐపై చర్య తీసుకుంటావుని హామీ ఇవ్వడంతో పోలింగ్ తిరిగి ప్రారంభమైంది. కొడంగల్‌లో టీడీపీ అభ్యర్థి రేవంత్‌రెడ్డి తన అనుచరులతో టీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడికి పాల్పడడంతో ఉద్రిక్తత నెలకొంది.
నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఇన్నోవా కారు ఇంజిన్‌తోపాటు, దగ్ధమైన స్థితిలోఉన్న లక్షాయూభైవేల రూపాయులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదైంది. తనపై దాడి చేశాడని బీజేపీ కార్యకర్త శ్రీసాగర్ చేసిన ఫిర్యాదు మేరకు అంబర్‌పేట కాంగ్రెస్ అభ్యర్థి, ఎంపీ వి.హనుమంతరావుపై నారాయణగూడ పోలీసు స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. టీడీపీ కార్యకర్తపై చేరుుచేసుకున్నందుకు ఎల్‌బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి సుధీర్‌రెడ్డిపై కేసు నమోదుచేశారు. బేగంపేట ఎస్‌ఐని అడ్డుకుని దుర్భాషలాడినందుకు కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గజ్జెల కాంతంపై కేసు నమోదైంది.