DGP B. Prasada Rao
-
కేసీఆర్, బాబులను కలిసిన డీజీపీ
పలువురు సీనియర్ ఐపీఎస్‌లు కూడా.. హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడులను రాష్ర్ట డీజీపీ బి.ప్రసాదరావుతోపాటు పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మొదట బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని కేసీఆర్ నివాసానికి డీజీపీ ప్రసాదరావుతో పాటు ఇంటెలిజెన్స్ అదనపు డీజీ ఎం. మహేందర్‌రెడ్డి, శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ వీఎస్కే కౌముది, ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ అదనపు డీజీ ఎఆర్ అనురాధ, కో ఆర్డినేషన్ అదనపు డీజీ వీకే సింగ్, రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ద్వారక తిరుమలరావు, సీఐడీ అదనపు డీజీ కృష్ణప్రసాద్, గ్రేహౌండ్స్ ఐజీ సీతారామాంజనేయులు, ఎస్ఐబీ ఐజీ సజ్జనార్‌లతో పాటు పలువురు ఐజీలు వెళ్లి, శుభాకాంక్షలు తెలి పారు. తర్వాత వీరు జూబ్లీహిల్స్‌లోని నారా చంద్రబాబునాయుడు ఇంటికి వెళ్లి ఆయనకూ శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో తనకు పూర్వపరిచయం ఉన్న అధికారులను బాబు గుర్తించి, వారి బాగోగులను తెలుసుకున్నట్లు పోలీసువర్గాలు తెలిపాయి. తెలంగాణకు కేసీఆర్, ఆంధ్రకు చంద్రబాబు ముఖ్యమంత్రులు కానుండడంతో మర్యాదపూర్వకంగా కలిశామని కొందరు ఐపీఎస్‌లు తెలిపారు. కాగా, నగర పోలీస్‌కమిషనర్ అనురాగ్‌శర్మ, నగర కో ఆర్డినేషన్ అదనపు కమిషనర్ అంజనీకుమార్, నగర ట్రాఫిక్ విభాగం అదనపు కమిషనర్ జితేందర్‌తో పాటు ఐదుగురు డీసీసీలు ఇతర సీనియర్ పోలీసుల అధికారులు సైతం కేసీఆర్, చంద్రబాబుల నివాసాలకు వెళ్లి అభినందనలు తెలిపారు. మీరు ఓకే అంటే ఇక్కడే ఉంటాం తెలంగాణ ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇస్తామంటే.. ఇక్కడే ఉండేందుకు ఆప్షన్ ఇస్తామని కొందరు అధికారుల టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వద్ద ప్రస్తావించారు. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు శనివారం ఆయనను కలిసిన నేపథ్యంలో ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. కొందరు అధికారులకు కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ సైతం ఇచ్చారు. మరికొందరికి రెండు మూడు రోజుల్లో విషయం చెబుతామని చెప్పారు. కాగా, ఐఏఎస్‌ల పనితీరు, సమర్ధత వంటి సమాచారాన్ని రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కేవీ రమణాచారి, ఏకే గోయల్, రామలక్ష్మణ్ల ద్వారా కేసీఆర్ సేకరిస్తున్నారు. -
గ్రేహౌండ్స్ విభాగాలూ రెండు
విభజనకు కేంద్ర హోంశాఖ అధికారుల ఆమోదం హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో దేశంలోనే పేరెన్నికగన్న, ప్రతిష్టాత్మకమైన మావోయిస్టు వ్యతిరేక ఆపరేషనల్ విభాగం గ్రేహౌండ్స్ ను సైతం రెండుగా విభజించాలని పోలీసు విభాగం నిర్ణయించింది. కేంద్ర హోంశాఖ (ఎంహెచ్ఏ) ప్రతినిధులతో శుక్రవారం సచివాల యంలోని రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి టీపీ దాస్ నేతృత్వంలో జరిగన సమావేశంలో ఉన్నతాధికారులు ఈ అంశాన్ని స్పష్టం చేశారు. మెజార్టీ అధికారులు చెప్పిన అంశాలతో ఏకీభవించిన కేంద్ర ప్రతినిధులు గ్రేహౌండ్స్ విభజనకు ఆమోదముద్ర వేస్తూ ఎంహెచ్ఏకు ఈ మేరకు నివేదిక ఇస్తామని రాష్ట్ర ఉన్నతాధికారులకు హామీ ఇచ్చారు. డీజీపీ బి.ప్రసాదరావుతో పాటు అనేక విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో భాగంగా గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాలతో పాటు శిక్షణా సంస్థలనూ గరిష్టంగా మూడేళ్ల పాటు కేంద్ర ఆధీనంలో ఉమ్మడిగా ఉంచాలని తొలుత భావించారు. ఆ తర్వాత ఇవి తెలంగాణకే ఉండిపోగా.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ అంశాలన్నిటినీ కేంద్ర ప్రతినిధి అనిల్ గోస్వామి వద్ద రాష్ట్ర ఐపీఎస్ అధికారులు ముక్తకంఠంతో వ్యతిరేకించడంతో అవి రాష్ట్ర పరిధిలోకి వచ్చాయి. -
పోలింగ్ ప్రశాంతం
చెదురుమదురు సంఘటనలే జరిగారుు.. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి ప్రశాంతం బందోబస్తుతో సత్ఫలితం: డీజీపీ ప్రసాదరావు హైదరాబాద్: తెలంగాణలోని పది జిల్లాల్లో తొలి విడత పోలింగ్ బుధవారం చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగిందని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో సైతం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయున బుధవారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. 90 వేల మంది పోలీసులు, 158 కంపెనీల కేంద్ర బలగాలు, 58 కంపెనీల ఏపీఎస్పీ బలగాలతో కలపి కట్టుదిట్టంగా నిర్వహించిన బందోబస్తు మంచి ఫలితాలను ఇచ్చిందని తెలిపారు. అక్కడక్కడా కొన్ని చెదురువుదురు సంఘటనలు చోటుచేసుకున్నాయుని, అందుకు బాధ్యులైన వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయుకులపై కేసులు నమోదు చేశావున్నారు. వివిధ ప్రాంతాల్లో మొత్తం 15 కేసులు హింసాత్మకంగా నమోదయ్యాయున్నారు. డీజీపీ తెలిపిన వివరాల ప్రకారం హింసాత్మక సంఘటనలు ఒక చానల్ కెమెరావున్ను కొట్టినందుకు గజ్వేల్ టీడీపీ అభ్యర్థితో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. నిందితుల్లో కొద్దివుంది గజ్వేల్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయూరు. ఖవ్ముంలో కానిస్టేబుల్‌పై చేరుుచేసుకున్న సీపీఐకి చెందిన ప్రభాకరరావుపై కేసు నమోదు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలం వెంకటాపురం గ్రామంలో ఎస్ఐ శ్రీధర్ అల్లరిమూకను చెదరగొట్టే క్రమంలో ఒక గర్భిణీ కింద పడిపోరుుంది. దీంతో ఆగ్రహం చెందిన గ్రావుస్తులు పోలింగ్‌ను నిలిపివేశారు. నారాయణ్‌పూర్ డీఎస్పీ జోక్యం చేసుకుని ఎస్ఐపై చర్య తీసుకుంటావుని హామీ ఇవ్వడంతో పోలింగ్ తిరిగి ప్రారంభమైంది. కొడంగల్‌లో టీడీపీ అభ్యర్థి రేవంత్‌రెడ్డి తన అనుచరులతో టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడికి పాల్పడడంతో ఉద్రిక్తత నెలకొంది. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఇన్నోవా కారు ఇంజిన్‌తోపాటు, దగ్ధమైన స్థితిలోఉన్న లక్షాయూభైవేల రూపాయులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదైంది. తనపై దాడి చేశాడని బీజేపీ కార్యకర్త శ్రీసాగర్ చేసిన ఫిర్యాదు మేరకు అంబర్‌పేట కాంగ్రెస్ అభ్యర్థి, ఎంపీ వి.హనుమంతరావుపై నారాయణగూడ పోలీసు స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. టీడీపీ కార్యకర్తపై చేరుుచేసుకున్నందుకు ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి సుధీర్‌రెడ్డిపై కేసు నమోదుచేశారు. బేగంపేట ఎస్ఐని అడ్డుకుని దుర్భాషలాడినందుకు కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గజ్జెల కాంతంపై కేసు నమోదైంది. -
మద్యం, మనీ పంపిణీపై కన్నేయండి: డీజీపీ
హైదరాబాద్: సీనియర్ పోలీసు అధికారులతో సోమవారం సమావేశమైన డీజీపీ బి.ప్రసాదరావు తెలంగాణలో తాజా పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ముఖ్యంగా మంగళవారం ఒకరోజు అత్యంత కీలక మైందని... మద్యం, డబ్బు పంపిణీతో పాటు ఇతర గృహోపకరణ వస్తువులు పంపిణీ చేసి ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు జరుగుతాయని, పోలీసు యంత్రాంగం జాగ్రత్తగా మెలగాలని ఆదేశించారు. ప్రధానంగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో స్థానికులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇతర ప్రాంతాల వారు రాకుండా కన్నేసి ఉంచాలని, ఒక వేళ నియోజకవర్గాల్లో ఇతర ప్రాంతాల వారు ఉన్నట్లు తెలిస్తే వెంటనే వారిని పంపించి వేయాలని సూచించారు. -
మావోయిస్టుల నుంచి ముప్పుంది
ఎన్నికలను సవాల్‌గా తీసుకున్నాం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశాం రూ. 120 కోట్ల డబ్బు స్వాధీనం మీట్‌ది ప్రెస్‌లో డీజీపీ బి.ప్రసాదరావు హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు రాష్ర్టంలో మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉందని, దానిని ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని రాష్ర్ట డీజీపీ బి. ప్రసాదరావు స్పష్టం చేశారు. ఈ ఎన్నికలను పోలీస్‌శాఖ పరంగా సవాల్‌గా తీసుకుంటున్నామని వివరించారు. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీలతో పాటు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు వరసబెట్టి వచ్చినప్పటికీ ప్రణాళికాబద్ధంగా బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. మద్యం, డబ్బు పంపిణీ ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి జరుగుతున్న ప్రయత్నాలను వ్యూహాత్మకంగా అడ్డుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్‌లో డీజీపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులు వేసిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. తెలంగాణలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాలు నక్సల్స్ ప్రభావితమైనవని, ఇక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా సరిహద్దులోని ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో మావోయిస్టుల కార్యకలాపాలు పెరగడంతో సమస్యగా మారిందన్నారు. దీంతో సరిహద్దుల్లో నిరంతర సాయుధ పోలీసులతో గాలింపు చర్యలు నిర్వహిస్తున్నామన్నారు. స్పెషల్ యాక్షన్ టీంలను ఏర్పాటు చేసిన మావోయిస్టులు రాజకీయ ప్రముఖులను టార్గెట్ చేసే ప్రమాదముందని, అందువల్ల ప్రముఖులకు తగిన భద్రత కల్పించామన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులో ఉండడం కూడా పోలీసులకు కొంత కలిసివచ్చిందని డీజీపీ అభిప్రాయపడ్డారు. ప్రజాప్రతినిధుల పాలన ఉంటే ఎన్నికల సందర్భంగా నాయకుల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వచ్చేవని, ప్రస్తుతం ఈ ఫిర్యాదులు తక్కువగా ఉన్నాయన్నారు. 60 శాతం డబ్బు వాపస్.. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ. 120 కోట్లను స్వాధీనం చేసుకున్నామని, ఇందులో 60 శాతం డబ్బులను సరైన ఆధారాలు చూపించడంతో సంబంధితులకు అప్పగించామని డీజీపీ ప్రసాదరావు పేర్కొన్నారు. మరో నలభై శాతం డబ్బులను ఇన్‌కం టాక్స్ విభాగానికి అప్పగించామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద మెరుపుదళాలు పోలింగ్ కేంద్రాల వద్ద ఎదైనా ఘటన జరిగితే వెంటనే చర్య తీసుకునేందుకు మెరుపుదళాలు, ప్రత్యేక మెరుపుదళాలను ఏర్పాటు చేశామని డీజీపీ వివరించారు. కొన్ని ప్రాంతల్లో ఒకే భవనంలో ఐదు నుంచి పది వరకు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, అలాంటి చోట్ల అదనపు భద్రతను ఏర్పాటు చేశామన్నారు. ‘చుండూరు’ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తాం దళితులను ఊచకోత కోసిన సంఘటనకు సంబంధించిన చుండూరు కేసులో నిందితులను నిర్ధోషులుగా తేలుస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా అప్పీలు చేస్తున్నామని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. -
రెచ్చగొడితే చర్యలు తప్పవు: డీజీపీ
-
రెచ్చగొడితే చర్యలు తప్పవు: డీజీపీ
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు డీజీపీ బి. ప్రసాదరావు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని ఏపీజేఎఫ్ మీట్ ది ప్రెస్‌లో చెప్పారు. ఎన్నికలప్పుడు మావోలు బహిష్కరణ పిలుపివ్వడం సాధారణమేనని అన్నారు. మావోయిస్టులు ఎన్నికల పోలింగ్‌ను అడ్డుకునే ప్రమాదం ఉందన్నారు. మావోల కదలికలపై నిఘా పెట్టామన్నారు. ఎస్పీల నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల్లో హెలికాప్టర్లను వినియోగిస్తామని వెల్లడించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని ప్రసాదరావు హెచ్చరించారు.