
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఆదివారం రాత్రి హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఘనంగా జరిగాయి.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఆదివారం రాత్రి ట్యాంక్‌బండ్‌పై ఘనంగా జరిగాయి. వర్షంలోనే ఆవిర్భావ ఉత్సవాలు కొనసాగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ హాజరవ్వగా, ఆయనతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, మంత్రులు ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు.
ఉత్సవాల్లో భాగంగా కళాకారుల నృత్యాలు, ఆటపాటలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో పూర్తి తెలంగాణ గీతాన్ని వినిపించారు. జయ జయహే తెలంగాణ గేయం 13.5 నిమిషాల పూర్తి వెర్షన్ విడుదల చేశారు. గేయ రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణిలను ఘనంగా సత్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించడానికి నగరవాసులు భారీగా తరలివచ్చారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. లైటింగ్, భారీ ఎల్‌ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు.