tankband
-
ట్యాంక్ బండ్‌పై ఘనంగా తెలంగాణ దశాబ్ది వేడుకలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఆదివారం రాత్రి ట్యాంక్‌బండ్‌పై ఘనంగా జరిగాయి. వర్షంలోనే ఆవిర్భావ ఉత్సవాలు కొనసాగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ హాజరవ్వగా, ఆయనతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, మంత్రులు ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు.ఉత్సవాల్లో భాగంగా కళాకారుల నృత్యాలు, ఆటపాటలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో పూర్తి తెలంగాణ గీతాన్ని వినిపించారు. జయ జయహే తెలంగాణ గేయం 13.5 నిమిషాల పూర్తి వెర్షన్ విడుదల చేశారు. గేయ రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణిలను ఘనంగా సత్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించడానికి నగరవాసులు భారీగా తరలివచ్చారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. లైటింగ్, భారీ ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. -
నాకు 90ML బాటిల్ ఇవ్వకపోతే ట్యాంక్ బండ్ లో దూకి చస్తా
-
కొత్త సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
Updates.. సచివాలయాన్ని ప్రారంభించడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అందరికీ నూతన సచివాలయ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ పరిపాలన కేంద్రం అత్యద్భుతంగా రూపుదిద్దుకుందని అన్నారు. సచివాలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరి కృషి ఉందన్నారు. తెలంగాణ కొత్త సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్.. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తూ తొలి సంతకం చేశారు. మొత్తం 6 ఫైళ్లపై సంతకాలు చేశారు. తమ చాంబర్లలో కొలువుదీరిన మంత్రులు హైదరాబాద్‌లో లక్ష బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ ఫైల్‌పై మంత్రి కేటీఆర్ తొలి సంతకం 6వ అంతస్తులోని తన చాంబర్లో కొలువుదీరిన సీఎం కేసీఆర్ పోడు భూములు పంపిణీ ఫైల్‌పై తొలి సంతకం చేసిన సీఎం కేసీఆర్ తన కార్యాలయంలో 6 ఫైల్స్‌పై సంతకం చేసిన సీఎం కేసీఆర్ కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. దీనిలో భాగంగా యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. కొత్త సచివాలయంలో ప్రారంభోత్సవంలో భాగంగా మధ్యాహ్నం గం. 1.15 నిమిషాల ప్రాంతంలో సీఎం కేసీఆర్ అక్కడకు చేరుకున్నారు. - కొత్త సచివాలయం చేరుకున్న మంత్రి కేటీఆర్. - మూడో అంతస్తును కేటీఆర్ పరిశీలించారు. - ట్యాంక్ బండ్ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు రాత్రి 8 గంటల వరకు కొనసాగనున్నాయి. - హుస్సేన్‌సాగర్, నెక్లెస్ రోడ్డు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు. - తెలుగు తల్లి జంక్షన్లో వాహనాల దారి మళ్లింపు. - ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై వాహనాలకు నో ఎంట్రీ. ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి, బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్‌లో వాహనాలకు అనుమతి నిరాకరణ. - ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పార్కులు మూసివేత. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం వద్ద సందడి నెలకొంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టిన కొత్త సెక్రటేరియట్‌ను ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. తర్వాత సీఎంతోపాటు మంత్రులు తమకు కేటాయించిన చాంబర్లలో ఆసీనులై.. కొత్త సెక్రటేరియట్ నుంచి తొలి సంతకాలు చేయనున్నారు. ఆ తర్వాత అతిథులను, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. - గృహలక్ష్మీ సహా కీలక ఫైళ్లపై సంతకాలు చేయనున్న సీఎం కేసీఆర్, మంత్రులు. - హైదరాబాద్‌లో లక్ష బెడ్ రూం ఇళ్ల పంపిణీపై కేటీఆర్ తొలి సంతకం. - మధ్యాహ్నం 2:15 గంటలకు సీఎం కేసీఆర్ ప్రసంగం. కొత్త సచివాలయం విస్తీర్ణం వివరాలివీ.. మొత్తం భూ విస్తీర్ణం: 28 ఎకరాలు భవనం నిర్మించిన ప్రాంతం: 2.45 ఎకరాలు ల్యాండ్ స్కేపింగ్: 7.72 ఎకరాలు సెంట్రల్ కోర్ట్ యార్డ్ లాన్: 2.2 ఎకరాలు పార్కింగ్ సామర్థ్యం: 560 కార్లు, 700 బైకులు ప్రధాన భవన కాంప్లెక్స్ బిల్టప్ ఏరియా: 8,58,530 చదరపు అడుగులు లోయర్ గ్రౌండ్, గ్రౌండ్, ఆరు అంతస్తుల్లో ఒక్కోదాని ఎత్తు: 14 అడుగులు మొత్తం ఎత్తు: 265 అడుగులు నిర్మాణానికి ఉపయోగించిన సామగ్రి ఉక్కు: 8,000 టన్నులు సిమెంటు: 40,,000 టన్నులు ఇసుక: 30,000 టన్నులు (5 వేల లారీలు) కాంక్రీట్: 60,000 క్యూబిక్ మీటర్లు ఇటుకలు: 11 లక్షలు ఆగ్రా రెడ్ స్టోన్: 3,500 క్యూబిక్ మీటర్లు గ్రానైట్: మూడు లక్షల చదరపు అడుగులు మార్బుల్: లక్ష చదరపు అడుగులు ధోల్పూర్ రెడ్‌స్టోన్: 3,500 క్యూబిక్ మీటర్లు కలప: 7,500 క్యూబిక్ అడుగులు పనిచేసిన కారి్మకులు: మూడు షిప్టుల్లో 12,000 మంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘హిందువులంతా సద్దికట్టుకుని ట్యాంక్‌బండ్‌కు రండి’
కవాడిగూడ (హైదరాబాద్): పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఒక నాస్తికుడని అందుకే వినాయక నిమజ్జనానికి ఆటంకం కలిగిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. గణనాథులను ట్యాంక్బండ్లోనే నిమజ్జనం చేద్దామని, అందుకు హిందువులంతా సద్దికట్టుకుని ట్యాంక్‌బండ్‌పైకి రావాలని పిలుపునిచ్చారు. ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జన ఏర్పాట్లను బుధవారం సంజయ్ పలువురు నేతలతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి దీక్షలకు, బీజేపీ నిరసనలకు దిగొచ్చి ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌పై క్రేన్లను ఏర్పాట్లు చేస్తోందన్నారు. ట్యాంక్‌బండ్‌పై వినాయక మండపాల నిర్వాహకులను పోలీసులు అడ్డుకుంటుంటే దారుసలాంలో సంబురాలు చేసుకుంటున్నారన్నారు. నిఖా ర్సయిన హిందువునని ప్రకటించుకునే సీఎం కేసీఆర్‌కు ఇది తగునా? అని ప్రశ్నించారు. ఇదీ చదవండి: Telangana: స్పీకర్‌పై చర్యలు తీసుకోవాలి: బండి సంజయ్ -
ట్యాంక్‌బండ్‌పై సరోజినీ నాయుడి జ్ఞాపకాలు
సాక్షి, హైదరాబాద్: నైటింగేల్ ఆఫ్ ఇండియా, భారత కోకిల, ప్రముఖ కవయిత్రి, వక్త, స్వాతంత్య్ర సమరయోధురాలు, మహిళా సాధికారతకు అలుపెరగని పోరాటం చేసిన సరోజినీ నాయుడు 143వ జయంతిని పురస్కరించుకొని ఆదివారం హైదరాబాద్ ఆమెకు ఘనమైన నివాళి అర్పించింది. నగరంతో ఆమెకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ హుస్సేన్‌సాగర్‌పై ఆమె రాసిన గేయాన్ని స్మరించుకుంది. ట్యాంక్‌బండ్‌పై ఆమె రాసిన కవితతో కూడిన పుస్తకాన్ని ఏర్పాటు చేశారు. ఇది శాశ్వత స్ట్రక్చర్‌గా నిర్మించారు. ఒక స్టాండ్‌పై పుస్తకం, అందులో హుస్సేన్‌సాగర్‌పై ఆమె రాసిన గేయాన్ని పొందుపర్చారు. హైదరాబాద్ అంటే సరోజినీ నాయుడికి ఎంతో ఇష్టమనే విషయం పలు సందర్భాల్లో ఆమె రచనల ద్వారా వెల్లడించారు. హుస్సేన్ సాగర్‌పై హృద్యమైన గేయాన్ని రాశారు. ఆమె జయంతి సందర్భంగా ఈ అపురూప కానుకను ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసినట్లు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ఈ మేరకు ట్వీట్ చేశారు. (క్లిక్: వైన్‌షాప్ ఉండాలా.. వద్దా అంటూ ఓటింగ్.. ఫలితం ఏంటంటే!) -
ట్యాంక్‌బండ్‌పై ‘సండే పండగ’ సందడి... కళ‘కళ’లాడుతున్న సాగర తీరం
-
గణేష్ నిమజ్జనానికి ట్యాంక్ బండ్ ముస్తాబు
-
శవాల శివను సర్ప్రైజ్ చేసిన సోనూసూద్
కరోనా కష్టకాలంలో దేవుడిలా వచ్చి నిరుపేదలను ఆదుకున్న రీల్ విలన్.. రియల్ హీరో ‘సోనూసూద్’. కార్మికులు మొదలు.. రైతులు, నిరుద్యోగులు ఇలా ప్రతి ఒక్కరికి అడిగిన సాయం చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఫలానా చోట.. ఫలానా సమస్య ఉందన్న విషయం తన దృష్టికి వస్తే చాలు చేతికి ఎముక లేదన్నట్లుగా సాయం చేస్తున్నాడు. లాక్డౌన్ మొదలు ఇప్పటి వరకు వేలాది పేదలకు సాయం చేశాడు. వందలాది మంది నిరుద్యోగులకు ఉపాధి చూపించాడు. ఇక ఇప్పడు మరో అడుగు ముందుకేసి అంబులెన్స్ సర్వీస్‌ని ప్రారంభించాడు ఈ రియల్ హీరో. మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ ఏరియాలో అంబులెన్స్ సర్వీస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ప్రమాదవశాత్తు మరణించి, ఆత్మహత్య చేసుకున్నవారి మృతదేహాలను వెలికితీస్తూ ప్రజల హృదయాల్లో నిలిచిన శవాల శివను సోనూసూద్ అభినందించాడు. ప్రజలు ఇచ్చిన విరాళాలతో అంబులెన్స్ కొనుగోలు చేసిన శివ.. దానికి ‘సోనూసూద్ అంబులెన్స్ సర్వీస్’అని పేరుపెట్టి సేవలు అందిస్తున్నాడు. ఈ అంబులెన్స్ ప్రారంభోత్సవానికి రావాలని సోనూసూద్‌ని ఆహ్వానించాడు శివ. అతని కోరిక మేరకు మంగళవారం ట్యాంక్‌బండ్‌కు వెళ్లిన సోనూసూద్.. శవాల శివ ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ చేశాడు. శివ చేస్తున్న సేవలను సోనూసూద్ ప్రశంసించారు. భవిష్యత్తులో ఏమి కావాలన్న తాను ఉన్నానని శివకు భరోసా ఇచ్చాడు. ఇక ఈ అంబులెన్స్ సేవలను విస్తృతం చేస్తామని సోనూసూద్ చెప్పాడు. -
మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభకు తరలిరండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన మిలియన్ మార్చ్ స్ఫూర్తితో ఈ నెల 10న హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే సభకు భారీగా తరలిరావాలని ప్రజలకు టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ పిలుపునిచ్చారు. సభ నిర్వహణపై శనివారం ఇక్కడి మఖ్దూం భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయిందని విమర్శించారు. ఉద్యమ ఆకాంక్షను ప్రభుత్వానికి గుర్తుచేసేందుకే స్ఫూర్తి సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 10న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందని, కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతివ్వాలన్నారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ ఆకాంక్షను ప్రభుత్వం నెరవేరుస్తుందని మూడేళ్లు ఎదురు చూశామని, కానీ వాటిని పట్టనట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. మిలియన్ మార్చ్ చారిత్రక ఘట్టమని, విద్యార్థులు ఉద్యమంలో దెబ్బలు తిని జైలు పాలయ్యారన్నారు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్ మాట్లాడుతూ మిలియన్ మార్చ్‌లో టీజేఏసీ పాత్ర మరువలేనిదన్నారు. జిల్లాల్లో మిలియన్ మార్చ్‌కు స్ఫూర్తిగా అమరుల విగ్రహాల వద్ద స్ఫూర్తి సభలు ఏర్పాటు చేస్తామన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా స్ఫూర్తి సభలో పాల్గొన వచ్చన్నారు. -
ఈసారి సిటీలో బతుకమ్మ ప్రత్యేకతలివే..!
ఓనం తరహాలో ఘనంగా వేడుకలు కవాడిగూడ (హైదరాబాద్ సిటీ): తెలంగాణ సాంస్కృతిక వైభవం, రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబురాలను ఈసారి కూడా నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కేరళ సంప్రదాయ పండుగ ఓనం తరహాలో ట్యాంక్‌బండ్ వద్ద బతుకమ్మ వేడుకను గొప్పగా నిర్వహిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 9న ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహించే ఈ వేడుకల ఏర్పాట్లను ఆయన గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ బతుకమ్మ పండుగకు దేశవ్యాప్తంగా గొప్ప పేరుందని, అందుకు తగినవిధంగానే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో ఈ సంబురాలను నిర్వహిస్తామని తెలిపారు. పెద్ద సంఖ్యలో హాజరయ్యే ప్రజలకు, మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. నగరంలో గణేష్, బక్రీద్ పండుగలు ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయని, అదేవిధంగా బతుకమ్మ పండుగను సైతం ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈసారి వర్షాలు పుష్కలంగా పడినందున ప్రజలు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకొంటున్నారని అన్నారు. బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు చేపట్టేందుకు నీళ్ళు కూడా పుష్కలంగా ఉన్నాయన్నారు. వేడుకలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారిశుద్ధ్య సమస్య రాకుండా సానిటేషన్ సిబ్బంది టీమ్‌లు పనిచేస్తాయన్నారు. రహదారికి ఇరుపైపులా ప్రత్కేక లైటింగ్‌ను, మంచినీటి సౌకర్యం అందిస్తామన్నారు. 'స్వచ్ఛ భారత్- స్వచ్ఛ హైదరాబాద్'లో భాగంగా మొబైల్ మరుగుదొడ్లను ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. మహిళల రక్షణ కోసం నిఘా సిబ్బందితో పోలీసులు ప్రత్కేక భద్రతా ఏర్పాట్లు చేశారని తెలిపారు. టూరిజం శాఖ, జీహెచ్ఎంసీ సంయుక్తంగా నిర్వహించే బతుకమ్మ సంబురాలలో ప్రజలు సంతోషంగా పాల్గొనాలని ఆయన కోరారు. -
తెలంగాణలో రేపు సెలవు
హైదరాబాద్: తెలంగాణ అంతటా మంగళవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించింది. సద్దుల బతుకమ్మ వేడుకల కోసం హైదరాబాద్‌లో అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ పండుగ సందర్భంగా మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు బతుకమ్మలతో ర్యాలీ నిర్వహించనున్నారు. ట్యాంక్‌బండ్‌ను అందంగా ముస్తాబుచేశారు. ఎల్ఈడీ లైట్లతో కూడిన బెలూన్లను ఏర్పాటుచేశారు. బతుకమ్మ వేడుకల చివరిలో పటాకులు పేల్చి సంబరాలు జరుపుతారు. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటుచేసిన బతుకమ్మ ఘాట్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా ట్యాక్‌బండ్ వైపునకు వెళ్లే రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. -
సప్తవర్ణ శోభితం.. ముగింపు ఉత్సవం
♦ అంబరాన్నంటిన సంబురాలు ♦ కనువిందు చేసిన కళారూపాలు ♦ ఇంద్రధనుస్సును తలపించిన ట్యాంక్‌బండ్ ♦ కదలివచ్చిన సకల కళలు.. సబ్బండ వర్ణాలు ♦ హాజరైన గవర్నర్, ముఖ్యమంత్రి దంపతులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తొలి అవతరణ వేడుక ముగింపు సంబురాలు అంబరాన్నంటాయి. ఏడు రోజుల పాటు సాగిన ఉత్సవాలు ఆదివారం రాత్రి హైదరాబాద్ హుస్సేన్ సాగర తీరంలో సప్తవర్ణ శోభితంగా ముగిశాయి. తెలంగాణ సంస్కృతి, కళా వైభవం ఉత్సవాల్లో సమున్నతంగా ప్రతిబింబించింది. నింగిలో విరిసిన వెలుగు పూలు.. సాగర తీరంలో లేజర్ షో తళుకులు... అందుకు అనుగుణంగా తెలంగాణ కళారూపాలతో ప్రతిధ్వనించిన సంగీతం.. ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసింది. రంగు రంగుల విద్యుద్దీపాల కాంతులలో బుద్ధ విగ్రహం దేదీప్యమానంగా వెలుగొందింది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాగిన ముగింపు వేడుక చారిత్రక ఘట్టంగా నిలిచిపోయింది. దాదాపు లక్ష మందికి పైగా రావడంతో ట్యాంక్‌బండ్ జనసంద్రమైంది. తెలంగాణ ఆటాపాటా, బతుకమ్మలు, బోనాలు, పీర్లు, ఒగ్గుడోళ్లు, చిందు యక్షగానాలు, బైండ్ల కథలు, శారద కథలు, గుస్సాడీ నృత్యాలు సహా తెలంగాణ కళలు, సంస్కృతిని ప్రతిబింబించే వందలాది కళారూపాలు ట్యాంక్‌బండ్‌కు తరలివచ్చాయి. పారిశుధ్య కార్మికుల స్వచ్ఛ హైదరాబాద్ ప్రదర్శన, పోతురాజుల నృత్యాలు, కోలాటాలు, లంబాడా నృత్యాలు కన్నుల పండువగా సాగాయి. ముగింపు ఉత్సవాల్లో భాగంగా కాకతీయుల కళా తోరణాన్ని తలపించే విధంగా ట్యాంక్ బండ్‌పై భారీ వేదికను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా వచ్చిన గవర్నర్ నరసింహన్ దంపతులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు వేదికపైకి సాదరంగా ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ స్వయంగా గవర్నర్‌కు లడ్డూ తినిపించారు. డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో ఆకాశంలో ప్రతి బింబించే ‘రోబో పతంగులను’ గవర్నర్, సీఎంలు వేదికపై నుంచి ఎగురవేశారు. పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్ బండ్ వరకు ఊరేగింపుగా వచ్చిన వేలాది మంది కళాకారుల విన్యాసాలను వేదికపై నుంచి తిలకించారు. ఈ వేడుకలకు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, భాషా సంస్కృతి శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ సారథ్యంలో ఆరువేల మంది కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఉత్సవాలకు దూరంగా ఓయూ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తొలి ఉత్సవాలకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు దూరంగా ఉన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి కేంద్రంగా.. ఉద్యమ రణరంగంగా ఉన్న ఓయూ క్యాంపస్‌లో ఉత్సవాల ఊసే లేకపోవడం చర్చనీయాంశమైంది. గత వారం రోజు లుగా రాష్ట్రమంతటా అవతరణ ఉత్సవాలు జరుపుకొని ఆదివారం ముగిసినా ఓయూ క్యాంపస్‌లో ఒక్క విద్యార్థి సంఘం కూడా ఉత్సవాలు జరిపేందుకు ముందుకు రాలేదు. అధికార పార్టీ విద్యార్థి సంఘం టీఆర్ఎస్వీ ఉత్సవ తొలిరోజున కేక్ కోసి జెండా ఎగురవేయగా ఇతర విద్యార్థి సంఘాల నేతలు అడ్డుకొని గొడవకు దిగారు. ఉద్యోగాల భర్తీలో జాప్యం, కాంట్రాక్టు ఉద్యోగుల పర్మనెంట్ తదితర అంశాలతో పాటు సీఎం కేసీఆర్ విధానాలను వ్యతిరేకిస్తున్న ఓయూ విద్యార్థులు కావాలనే ఉత్సవాలకు దూరంగా ఉన్నట్లు విద్యార్థి సంఘాల నేతలు పేర్కొన్నారు. కదం తొక్కిన తెలంగాణ జానపదం ఉత్సవాల్లో భాగంగా వేలాది మంది కళాకారులు నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్ బండ్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. డీజే సంగీత హోరులో.. తెలంగాణ జానపదాలకు అనుగుణంగా కుర్రకారు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, లుంబినీ పార్క్ పరిసరాలు జనజాతరను తలపించాయి. తెలంగాణ పది జిల్లాల నుంచి తరలివచ్చిన వేలాదిమంది కళాకారులు, తెలంగాణ వాదులతో ట్యాంక్ బండ్ కిక్కిరిసిపోయింది. కనువిందు చేసిన లేజర్...‘షో’ పర్యాటక శాఖ హుస్సేన్‌సాగర్ మధ్య నుంచి ప్రదర్శించిన త్రీ డీ లేజర్ షో మిరుమిట్లు గొలుపుతూ అందరినీ మంత్ర ముగ్ధులను చేసింది. లేజర్ వెలుగులో బుద్ధ విగ్రహం, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాకతీయ శిల్పకళా తోరణం రంగుల హరివిల్లుతో కనువిందు చేశాయి. సుమారు గంటపాటు నిర్వహించిన లేజర్ షో ఆకాశంలో ఇంద్ర ధనుస్సును సృష్టిస్తూ పేల్చిన బాణాసంచా ప్రదర్శనకే హైలైట్ అయింది. ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆకట్టుకున్న ప్రదర్శనలు.. ట్యాంక్‌బండ్‌పై వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల సిబ్బంది నిర్వహించిన ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పోలీసు బెటాలియన్స్, బ్రాస్‌బ్యాండ్, ఫైర్ బ్యాండ్, అశ్విక దళం కవాతు, షీ టీమ్స్, పోలీసు సిబ్బంది బైక్ ర్యాలీ అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రధాన వేదిక ముందు నుంచి జీహెచ్ఎంసీ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి చిహ్నంగా రూపొందించిన జాడూ వాహనం, సిబ్బంది కవాతు అలరించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ వేదికపై నుంచి అభివాదం చేస్తూ కళాకారులను ఉత్సాహపరిచారు. లక్ష లడ్డూల పంపిణీ.. ముగింపు ఉత్సవాలకు హాజరైనవారికి ప్రభుత్వం లడ్డూలు పంపిణీ చేసింది. దాదాపు లక్ష లడ్డూలు పంపిణీ చేసినట్లు సమాచారం. ప్రధాన వేదికకు చేరుకునే అవకాశం లేనివారు ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ తెరలపై వేడుకలను తిలకించారు. ఉత్సవాలకు హాజరైన వారి దాహార్తిని తీర్చేందుకు జలమండలి, జీహెచ్ఎంసీల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నీటి క్యాంపులు ఏర్పాటు చేసి వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. -
లక్షమందికి లడ్డూల పంపిణీ: కేసీఆర్
హైదరాబాద్: జూన్ 7 రాత్రి ట్యాంక్‌బండ్ పై తెలంగాణ రాష్ట్ర అవతరణ ముగింపు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆ రోజు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ఉత్సవాలు ఘనంగా నిర్వహంచాలని సీఎం కె.చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. లక్ష మందికి లడ్డూలు పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి నిజా కాలేజీ గ్రౌండ్స్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జంటనగరాల ప్రజలు పాల్గొనాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. హుస్సేన్‌సాగర్ ప్రాంతంలో లేజర్ షోలు, త్రీడీ లైటింగ్, బాణాసంచా పేల్చడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు. -
ట్యాంక్‌బండ్ వద్దకు గణేష్ విగ్రహాలు