
కవాడిగూడ (హైదరాబాద్): పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఒక నాస్తికుడని అందుకే వినాయక నిమజ్జనానికి ఆటంకం కలిగిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. గణనాథులను ట్యాంక్‌బండ్‌లోనే నిమజ్జనం చేద్దామని, అందుకు హిందువులంతా సద్దికట్టుకుని ట్యాంక్‌బండ్‌పైకి రావాలని పిలుపునిచ్చారు.
ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జన ఏర్పాట్లను బుధవారం సంజయ్ పలువురు నేతలతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి దీక్షలకు, బీజేపీ నిరసనలకు దిగొచ్చి ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌పై క్రేన్లను ఏర్పాట్లు చేస్తోందన్నారు. ట్యాంక్‌బండ్‌పై వినాయక మండపాల నిర్వాహకులను పోలీసులు అడ్డుకుంటుంటే దారుసలాంలో సంబురాలు చేసుకుంటున్నారన్నారు. నిఖా ర్సయిన హిందువునని ప్రకటించుకునే సీఎం కేసీఆర్‌కు ఇది తగునా? అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: Telangana: స్పీకర్‌పై చర్యలు తీసుకోవాలి: బండి సంజయ్
Comments
Please login to add a commentAdd a comment