Tankbund
-
అఫ్జల్‌గంజ్ టూ ట్యాంక్‌బండ్ అలర్ట్.. బీదర్ ముఠా ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని అఫ్జల్‌గంజ్ కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ట్రావెల్స్ ఆఫీసు మేనేజర్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ఇక, ఈ కాల్పులకు పాల్పడిన ముఠాను బీదర్ ఏటీఎం దొంగల ముఠాగా పోలీసులు తేల్చారు. దీంతో, నిందితుల కోసం పోలీసుల దర్యప్తు కొనసాగుతోంది.అఫ్జల్‌గంజ్ కాల్పుల కలకలం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల కోసం ఎనిమిది ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. నిందితులు ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు చెందినట్లు గుర్తించారు. అడ్డ దారుల్లో రాయ్‌పూర్ పారిపోయినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. నిందితులు అఫ్జల్ గంజ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఆటోలో వెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. అయితే, అక్కడి నుంచి ఎటువైపు వెళ్లారనేది మాత్రం తెలియరాలేదు. దీంతో, గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.ఏం జరిగిందంటే..?కర్ణాటకలోని బీదర్‌లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. బీదర్‌లో గురువారం ఉదయం ఏటీఎంకు డబ్బులు తరలిస్తున్న వాహనంపై దోపిడీ దొంగలు దాడి చేశారు. బైక్‌పై వచ్చిన దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మృతి చెందారు. దాడి అనంతరం డబ్బు పెట్టెతో దుండగులు అక్కడి నుంచి ఉడాయించారు. అందులో సుమారు రూ.93 లక్షల నగదు ఉన్నట్లు సమాచారం. మరోవైపు దాడి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిని అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.ఇక దొంగలు తెలంగాణ వైపు తమ బైక్‌ను మళ్లించినట్లు బీదర్ పోలీసులు నిర్ధారించుకున్నారు. దీంతో పోలీసులు బీదర్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో అఫ్జల్‌గంజ్ వద్ద దొంగలకు బీదర్ పోలీసులు కనిపించారు. దొంగల ముఠా.. తప్పించుకునేందుకు అఫ్జల్‌గంజ్‌లో ఉన్న ఓ ట్రావెల్స్ కార్యాలయంలోకి ప్రవేశించారు. పోలీసులపై కాల్పులు జరుపుతుండగా.. అక్కడే ఉన్న ట్రావెల్స్ కార్యాలయం మేనేజర్‌కు బుల్లెట్లు తగిలాయి. దీంతో అతనికి తీవ్ర రక్తస్రావం జరిగింది. అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు కూడా బీదర్ పోలీసులతో పాటు దొంగల ముఠాను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఎయిర్ షో
-
వెంటాడిన మృత్యువు!
సాక్షి, సిటీబ్యూరో/లంగర్‌హౌస్: మద్యం మత్తులో కారు నడుపుతూ వచ్చిన వ్యక్తి శనివారం రాత్రి లంగర్‌హౌస్‌లోని మిలటరీ వాటర్ ట్యాంక్ వద్ద చేసిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన భార్యాభర్తలు మోన ఠాకూర్, దినేష్ గిరిలను యాక్సిడెంట్స్ వెంటాడాయి. మోన కుటుంబంలో ఇద్దరు ప్రమాదాల బారినేపడి మృతి చెందగా..దినేష్‌ను రెండేళ్ల క్రితం ఓ ‘నిషా’చరుడు ఢీ కొట్టాడు. అప్పట్లో తీవ్రగాయాలతో బయటపడినా..ఇప్పుడు మరో మందుబాబు డ్రైవింగ్‌కు భార్యతో సహా అశువులుబాశారు. మోన ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి కావడంతో కుటుంబీకులు, తల్లిని కోల్పోవడంతో ఇద్దరు చిన్నారులు తల్లడిల్లిపోతున్నారు. అప్పుడు బతికిపోయినా ఇప్పుడు... బంజారాహిల్స్‌కు చెందిన దినేష్ గిరికి, ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త నుంచి విడిపోయిన లంగర్‌హౌస్‌కు చెందిన మోన ఠాకూర్‌కు 2022లో వివాహం నిశ్చయమైంది. ఆ ఏడాది అక్టోబర్ 6న దినేష్ తన ద్విచక్ర వాహనంపై ట్యాంక్‌బండ్ నుంచి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. లక్డీకాపూల్ ప్రాంతంలో మద్యం మత్తులో కారు నడుపుతూ వచ్చిన పవన్ రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టాడు. వాటిలో ఓ వాహనంపై ఉన్న దినేష్ కు ముఖం, తల, ఛాతి భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు నెల రోజులు ఆస్పత్రిలో చికిత్స పొంది బయటపడ్డారు. అప్పటికీ వివిధ సర్జరీల కారణంగా పూర్తిగా కోలుకోవడానికి ఏడు నెలలు పట్టింది. దీంతో మోనతో జరగాల్సిన పెళ్లి ఆలస్యమై... 2023 మే 25న ఒక్కటయ్యారు.ఆమె కుటుంబంలోనూ విషాదాలెన్నో... లంగర్‌హౌస్ పెన్షన్‌పురకు చెందిన మోన ఠాకూర్ కుటుంబంలోనూ విషాదాలు ఎన్నో ఉన్నాయి. ఈమె తండ్రి భగవాన్ సింగ్ మొదటి భార్య ఇందిర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రెండో భార్య రత్నభాయికి పుట్టిన సంతానమే మోన. మొదటి భార్య కుమారుడు బచ్చన్ (మోన సవతి సోదరుడు) వెల్డింగ్ పనులు చేస్తూ జీవించే వారు. 2007 మేలో తన సమీప బంధువుతో ద్విచక్ర వాహనంపై వెళ్తూ శంషాబాద్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. శనివారం రాత్రి లంగర్‌హౌస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్తతో సహా మోన కన్నుమూసింది. ఆ సమయానికి ఆమె నాలుగు నెలల గర్భవతి కావడంతో కుటుంబీకులు, బంధువులు తీవ్ర విషాదంలో ముగినిపోయారు. సొంత తండ్రి వద్ద దొరకని ప్రేమ దినేష్ వద్ద... మోనకు మొదటి భర్త ద్వారా ఇద్దరు కుమార్తెలు కలిగారు. ప్రేరణ శ్రీ (12) తొమ్మిదో తరగతి, ధ్రితి శ్రీ (9) ఐదో తరగతి చదువుతున్నారు. ఒకేసారి రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందడంతో వీళ్లు అనాథలుగా మారారు. తమ సొంత తండ్రి నిత్యం గొడవలు పడేవాడని, తమను వేధించేవాడని ఈ చిన్నారులు చెబుతున్నారు. దినేష్ గిరి సవతి తండ్రి అయినప్పటికీ..సొంత బిడ్డల్లా ప్రేమగా చూసుకునేవాడని చెప్తూ కన్నీరుమున్నీరవుతున్నారు. తాము తల్లిదండ్రులతో కలిసి గడిచిన 18 నెలల్లో ఎన్నో సందర్శనీయ ప్రాంతాలకు వెళ్లి సరదాగా గడిపి వచ్చామని జ్ఞాపకం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఎక్కడకు వెళ్లినా తమను తీసుకునే వెళ్లేవారని, అయితే పరీక్షల కారణంగా ఇటీవల గోవా వెళ్లలేకపోయామని చెప్తున్నారు. దీంతో గోవా నుంచి వచ్చిన రోజే తాము కోరడంతో ఆహారం తేవడానికి వెళ్లి కన్నుమూశారని బాధగా చెప్తున్నారు. ప్రణయ్‌ను పోలీసు కస్టడీకి కోరాంలంగర్హౌస్ రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడు ప్రణయ్‌ను అరెస్టు చేశాం. ఆదివారం రాత్రి కోర్టులో ప్రవేశపెట్టే సమయానికి మత్తు నుంచి బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన విషయం కూడా తనకు తెలియదని, మద్యం మత్తులో ఏమి చేశానో తెలియదని చెబుతున్నాడు. స్నేహితులతో కాకుండా తాను ఒక్కడినే మద్యం తాగానని చెబుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టడానికి నిందితుడిని పోలీసు కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరాం. – కె.రఘుకుమార్, లంగర్‌హౌస్ ఇన్స్పెక్టర్ -
Tank Bund: చల్ మోహన రంగ
సిడ్నీ, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని తలపించే ట్యాంక్ బండ్..అద్భుత అందాలతో పాటు చారిత్రాత్మక వైభవాలకు ప్రతీకనగరానికి మణిహారం సాగర తీరం..చెప్పుకుంటూ పోతే మరెన్నో.. రింజిమ్..రింజిమ్..హైదరాబాద్.. రిక్షావాలా జిందాబాద్.. మూడు చక్రమలు గిరగిర తిరిగితే మోటరు కారు బలాదూర్.. అటు చూస్తే చారి్మనారు.. ఇటు చూస్తే జుమ్మా మసీదు అటు చూస్తే చారి్మనారు.. ఇటు చూస్తే జుమ్మా మసీదు ఆ వంకా అసెంబ్లీ హాలు.. ఈ వంకా జూబిలి హాలూ తళతళ మెరిసే హుస్సేనుసాగరు.. దాటితే సికింద్రబాదూ...ఇలా చెప్పుకుంటూ పోతే.. పర్యాటక ప్రాంతాలకు కొదవేలేదు.. ఎటుచూసినా ఏదో ఒక విశేషమైన ప్రాంతం చూపరులను అబ్బురపరుసూనే ఉంటాయి... వాటిల్లో ముఖ్య ఆకర్షణగా నిలిచేది.. ట్యాంక్ బండ్.. నగరాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరికీ ట్యాంక్ బండ్‌తో అవినాభావ సంబంధం ఉంటుంది. ట్యాంక్ బండ్ ప్రారంభంలోనే ‘నగర రెజిమెంట్‌కు చెందిన ఆర్మీ జవాన్ల పోరాట స్ఫూర్తికి నిదర్శనం’గా ఏర్పాటు చేసిన యుద్ధనౌక స్వాగతం పలుకగా, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ పార్క్ అందాలు, మహనీయుల విగ్రహాల పలకరింపుతో సాగర్‌లోని నీటి ఫౌంటేన్ల తుంపరల మధ్య శాంతిమయుడు గౌతమ బుద్ధుడిని తిలకిస్తూ అక్కడి అందాలను ఆస్వాదించడం భలే అనుభూతిని కలిగిస్తుంది. దీంతో పాటు మరికొన్ని ప్రాంతాల గురించి లుసుకుందాం... సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర చరిత్రకు తలమానికమైన చారి్మనార్, గోల్కొండ కోట వంటి ప్రాంతాలే కాకుండా..దేశానికే తలమానికంగా నిరి్మతమైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పార్లమెంట్‌ను పోలిన నిర్మాణం పైన భారీ ఎత్తులో నిరి్మతమైన ఈ విగ్రహం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడి నుంచి తిలకించినా సగర్వంగా కనిపిస్తుంది. బుద్ధుడిని స్పూర్తిగా తీసుకుని దేశం గరి్వంచదగ్గ వ్యక్తిగా ఎదిగిన అంబేద్కర్., హుస్సేన్ సాగర్‌లోని బుద్ధుని వెనుకనే నిరి్మంచడంతో సింబాలిక్‌గా నిలుస్తుంది. నగర వైభవాన్ని ప్రతిబింబించే నిర్మాణాలైన చారి్మనార్, అసెంబ్లీ భవనాల సరసన నిలిచేలా నూతనంగా నిర్మితమైన బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం, కేబుల్ బ్రిడ్జి వంటివి చూపు తిప్పుకోనివ్వవు అంటే అతిశయోక్తి కాదేమో..! ఎన్.టి.ఆర్ గార్డెన్... అరుదైన బొన్సాయ్ మొక్కలు, ఆరి్టఫీషి యల్ మర్రిచెట్టులోంచి రైలు ప్రయాణం, భయపెట్టించే హంటర్ హౌస్, అబ్బురపరిచే పూల వనాలు, వింటేజ్ కార్లలో స్నాక్స్, అత్యంత ఎత్తులో నెక్లెస్ రోడ్ అందాలను చూపించే జేయింట్ వీల్, అండర్ గ్రౌండ్లో ఆటలు, ఆకట్టుకునే బొమ్మలు, ఆశ్చర్యపరిచే ఎడారి మొక్కలు, కళ్లముందు మ్యాజిక్ చేసే త్రీడి షో.. వెరసి అందరినీ అలరించే ఎన్.టీ.ఆర్ గార్డెన్. ఇక్కడే దివంగత ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ హీరో ఎన్.టీ.రామారావు సమాధిని సందర్శింవచ్చు.ప్రసాద్ ఐమాక్స్.. సినిమా, షాపింగ్, గేమింగ్, ఈటింగ్ ఇలా అన్ని రకాల నగర జీవన శైలికి అద్దం పట్టే వేదిక ఐమాక్స్. ఇందులో సినిమా చూస్తే అదో క్రేజ్‌లా మారేంతలా గుర్తింపు పొందింది. కొత్త సినిమాల విడుదలతో ప్రతీ శుక్రవారం ఇక్కడ సెలబ్రిటీలు, మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూలతో సందడిగా ఉంటుంది. జల్ విహార్... కేవలం నీళ్లలో ఆడే ఆటలతో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ అలరిస్తుంది నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్. రేయిన్ డ్యాన్స్, వాటర్ఫూల్స్లో ఎత్తునుంచి జారవిడిచే ఆటలతో పాటు ఇతర వాటర్ గేమ్స్ ప్రేక్షకులను బయటకు రానివ్వవు.థ్రిల్ సిటీ... ఈ మధ్యనే ప్రారంభమైన థ్రిల్ సిటీ ప్రమాదకరమైన ఆటలతో భయానకమైన వాతావరణంతో థ్రిల్లింగ్ అనుభూతిని పంచుతుంది. రోమాలను నిక్కబొడుచుకునేలా చేసే థ్రిల్లింగ్ గేమ్స్ విశేషంగా ఆకట్టుకుంటాయి.పీవీ జ్ఞాన భూమి... ఇంతకు ముందు ఎరుగని ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి దిశలో నడిపించిన ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు సమాధి ఈ జ్ఞాన భూమిలో కొలువుదీరింది. దేశానికి పనిచేసిన ఏ ప్రధాన మంత్రి సమాధిని చూడాలన్నా ఢిల్లీ వెళ్లాల్సిందే. కానీ దక్షిణాది ప్రధానిగా చక్రంతిప్పిన పీవీ సమాధి మాత్రం నెక్లెస్ రోడ్లో చూడవచ్చు.సంజీవయ్య పార్క్... అనేక రంగులతో అలరించే రోస్ గార్డెన్, రంగురంగుల సీతాకోకచిలుకలను కలుసుకునే బటర్ఫ్లవర్ పార్క్, ఎత్తులో దేశంలో రెండో అతిపెద్ద జాతీయ జెండాలను ప్రత్యక్షంగా చూడాలంటే సంజీవయ్య పార్క్ వెళ్లాల్సిందే. ఎత్తులో రెండో స్థానం అయినప్పటికీ త్రివర్ణ పతాకం సైజులో మాత్రం దేశంలోనే అతిపెద్దది.ఈట్ స్ట్రీట్–ఆర్ట్ స్ట్రీట్.. ఆహార ప్రియులకు అనువైన చోటు నెక్లెస్ రోడ్‌లోని ఈట్ స్ట్రీట్., సాగర్ నీటి అలల అంచున కూర్చోని వివిధ డిష్‌లను ఆస్వాదించవచ్చు. దీని ఎదురుగానే ఉన్న వీధుల్లోని ఇళ్లను మొత్తం విభిన్న చిత్రాలతో కళాకారులు తయారు చేశారు. డాగ్ పార్క్.. ప్రతీ ఆదివారం ఉదయం నగరంలోని అన్ని రకాల కుక్కలతో వారి యజమానులు ఈ డాగ్ పార్క్‌కు వస్తారు. జంతు ప్రేమికులను ఇది విశేషంగా అలరిస్తుంది. సైక్లింగ్ క్లబ్.. థ్రిల్ సిటీకి ఎదురుగా ఉన్న సైక్లింగ్ క్లబ్ ఫిట్‌నెస్‌కు మంచి మార్గం. ఇందులో మొంబర్íÙప్ తీసుకుని ఎవరైనా సైక్లింగ్ చేయవచ్చు.అమరవీరుల స్మారక కేంద్రం... తెలంగాణ అమరవీరుల త్యాగాలకు శాశ్వత శ్రద్ధాంజలిగా దీపం రూపంలో నిరి్మంచిన స్మారక కేంద్రం కొత్త శోభను తీసుకొచి్చంది. ఇందులో ప్రత్యేకంగా ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేయడం అదనపు ఆకర్షణ.టూరిస్టు సర్కిల్‌గా ట్యాంక్బండ్ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని గుర్తుచేసేలా సాగర్ మధ్యలో ఏర్పాటు చేసిన బుద్ధ విగ్రహం నగరానికే తలమానికం. చూట్టూ ఆవరించి ఉన్న నీటి మధ్యలో ఈ బుద్ధ విగ్రహాన్ని చూడటం అద్భుతమైన అనుభూతి. ఇక్కడి బోటింగ్ సదుపాయాలు అదనపు ఆనందం.బిర్లా ప్లానిటోరియం.. విజా్ఞనం, వినూత్నం, వివేకానికి బిర్లా ప్లానిటోరియం మంచి వేదిక. విద్యార్థుల నుంచి పరిశోధకుల వరకూ అవసరమైన శాస్త్ర–సాంకేతిక, పురాతత్వ విషయాలను తెలుసుకొవచ్చు. ఇక్కడే అంతరిక్షానికి చెందిన ప్రత్యేక స్కై షో కూడా చూడవచ్చు. లుంబినీ పార్క్, బోటింగ్.. ఆటవిడుపుకు, కాలక్షేపానికి అడ్డాగా మాత్రమే కాకుండా హుస్సేన్‌సాగర్ అందాలను తనివితీరా చూపించే బోటింగ్ సదుపాయం లుంబినీ పార్క్ సొంతం. సాధారణ బోటింగ్, సినిమాల్లో చూపించే వేగంగా ప్రయాణించే స్పీడ్ బోట్లతో పాటు వ్యక్తిగత పారీ్టలు సైతం నిర్వహించుకునేలా లగ్జరీ బోట్లు అందుబాటులో ఉండటం ఇక్కడి ప్రత్యేకత. -
కనుల పండువగా సాంస్కృతిక మహోత్సవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు ముగింపుగా ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన తెలంగాణ సాంస్కృతిక మహోత్సవం కనుల పండువగా జరిగింది. వైవిధ్యభరితమైన తెలంగాణ సంస్కృతిని సమున్నతంగా చాటే కళాకారుల ప్రదర్శనలు.. ‘జయజయహే తెలంగాణ’పూర్తి గీతం నేపథ్యంగా ఐదు వేల మందితో జరిగిన ఫ్లాగ్ వాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ తెలంగాణ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, గీత రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి, తెలంగాణ ఉద్యమకారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన స్టాళ్లను గవర్నర్, సీఎం సందర్శించారు. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు తెలంగాణ అస్తిత్వాన్ని, వివిధ జిల్లాల వైవిధ్యాన్ని ఆవిష్కరిస్తూ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారులు కార్నివాల్ నిర్వహించారు. మహిళా కళాకారుల డప్పుదరువు, ఒగ్గుడోలు ప్రదర్శన, బోనాలు, పోతురాజులు, ఘట విన్యాసం, బైండ్ల జమిడికలు, చిందు యక్షగానం, బతుకమ్మలు, గుస్సాడీ, థింసా, శివసత్తులు, మాధురి, లంబాడా నృత్య ప్రదర్శనలతో కార్నివాల్ సాగింది. ప్రముఖ నృత్యకారిణి అలేఖ్య పుంజుల బృందం ప్రదర్శించిన తెలంగాణ నృత్య నీరాజనం ఆకట్టుకుంది. ఉద్వేగ భరితం ‘జయ జయహే’గీతం 13.5 నిమిషాల నిడివితో ఉన్న ‘జయ జయహే తెలంగాణ’పూర్తి గీతాన్ని ఈ సందర్భంగా విడుదల చేశారు. దీనిని వినిపిస్తున్న సమయంలో 5 వేల మంది పోలీసు శిక్షణ అభ్యర్థులు జాతీయ జెండాలతో ‘ఫ్లాగ్ వాక్’చేశారు. అప్పటికే వర్షం మొదలైనా కవాతు విజయవంతంగా సాగింది. ఈ సమయంలో వేదికపై గీత రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణిలను సీఎం సన్మానించారు. ఆటంకం కలిగించిన వర్షం ట్యాంక్‌బండ్‌పై వేడుకలు మొదలైన కొంతసేపటికే వర్షం మొదలైంది. దీంతో వేడుకలకు వచ్చిన జనం ఇబ్బందిపడ్డారు. ఫ్లాగ్‌వాక్ సమయానికి వాన తీవ్రత మరింత పెరగడంతో ఇతర కార్యక్రమాలను హడావుడిగా ముగించాల్సి వచ్చింది. చివరిలో పది నిమిషాల పాటు బాణాసంచా పేల్చేందుకు ఏర్పాట్లు చేసినా.. వాన కారణంగా కొన్ని నిమిషాలకే పరిమితం చేశారు. మరోవైపు తమకు ఆహ్వనం ఉన్నప్పటికీ వేడుకల్లో పాల్గొనేందుకు పోలీసులు అనుమతించడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. పాస్‌లు లేనివారిని అనుమతించలేదని పోలీసులు తెలిపారు. ఢిల్లీలో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఆదివారం అమర వీరుల స్తూపానికి, అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ.. పదేళ్లుగా తెలంగాణ ఎన్నో సవా ళ్లు, చిక్కుముడులు ఎదురైనా సమష్టిగా ఎదుర్కొని అనేక రంగాలలో ప్రగతి పథంలో నిలిచిందని తెలిపారు. వేడుకల్లో తెలంగాణ భవన్ మాజీ రెసిడెంట్ కమిషనర్ అశోక్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. -
దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ వేడుకలకు సంబంధించిన షెడ్యూల్, ఇతర వివరాలను రాష్ట్ర సమాచారశాఖ కమిషనర్ హనుమంతరావు శనివారం వెల్లడించారు. దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఉత్సవాలు జరగనున్నాయని చెప్పారు. కార్యక్రమాలు ఉదయం 9.30 గంటలకు గన్‌పార్క్ వద్ద మొదలై.. రాత్రి 9 గంటలకు ట్యాంక్‌బండ్‌పై ముగుస్తాయని తెలిపారు. ట్యాంక్ బండ్‌పై నిర్వహించే వేడుకలకు వచ్చే ప్రజలు సాయంత్రం 5 గంటలోపే చేరుకోవాలని సూచించారు. సర్వాంగ సుందరంగా ట్యాంక్‌బండ్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల కోసం పరేడ్ గ్రౌండ్స్‌లో, ట్యాంక్‌బండ్‌పై చేస్తున్న ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఇతర నేతలు పరిశీలించారు. పరేడ్ గ్రౌండ్స్‌లో వేదికలు, హాజరయ్యే వారికోసం సిద్ధం చేస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఇక దశాబ్ది ఉత్సవాల కోసం ట్యాంక్‌బండ్‌ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రంగురంగుల విద్యుద్దీపాలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై జరిగే కార్యక్రమాలను వీక్షించడానికి పలుచోట్ల ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. 80కిపైగా ఫుడ్, వస్తువుల స్టాల్స్ ఏర్పాటు చేశారు.మంచినీటిని అందుబాటులో పెట్టారు. పదేళ్ల తర్వాత ప్రజాస్వామిక తెలంగాణ వచ్చిందని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. నాడు సోనియా గాంధీ ఒక అడుగు వెనక్కి వేసి ఉంటే తెలంగాణ రాకపోయేదన్నారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ నేత సుష్మాస్వరాజ్ పాత్రను మరవలేమన్నారు. ఇక ప్రత్యేక తెలంగాణ కోసం ప్రపంచం గరి్వంచదగ్గ ఉద్యమం జరిగిందని.. కానీ ఆ ఉద్యమానికి అనుగుణంగా గత పదేళ్లలో పాలన జరగలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఈ పరిశీలనలో మంత్రుల వెంట ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.ఉత్సవాల షెడ్యూల్ ఇలా..⇒ ఉదయం 9.30 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుంటారు. అమరులకు నివాళులు అర్పిస్తారు. ⇒ 9.55 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌కు సీఎం చేరుకుంటారు. ⇒ 10.00 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సాయుధ బలగాల కవాతు, గౌరవ వందనం ఉంటాయి. ⇒10.15 నుంచి 10.35 వరకు బలగాల మార్చ్ ఫాస్ట్ ఉంటుంది. ⇒10.35 గంటలకు ‘జయ జయహే తెలంగాణ’రాష్ట్ర గీతాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరిస్తారు. ⇒ 10.38 కార్యక్రమానికి సోనియా గాంధీ హాజరైతే ఆమె తొలుత ప్రసంగిస్తారు. తర్వాత సీఎం రేవంత్ ప్రసంగం ఉంటుంది. సోనియా రాకుంటే నేరుగా సీఎం ప్రసంగిస్తారు. ⇒ 11.08 గంటలకు పోలీసు, ఉత్తమ కాంటింజెంట్ల అవార్డుల ప్రదానం. ⇒11.20కు పరేడ్ ముగింపు కోసం పరేడ్ కమాండర్‌కు అనుమతి ⇒11.25 గంటలకు అవార్డుల స్వీకర్తలతో ఫొటో సెషన్ ⇒11.30 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో కార్యక్రమం ముగింపు.సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై కార్యక్రమాలివీ..⇒ 6.50 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటారు. ⇒ 7.00 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాళ్లను సందర్శిస్తారు ⇒ 7.20 గంటలకు కార్నివాల్ మొదలవుతుంది. ⇒ 7.30 నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు.. కళాకారుల నృత్యాలు, ఆటపాటలు ⇒ 8.30కు ఫ్లాగ్ వాక్.. జయ జయహే తెలంగాణ గేయం 13.5 నిమిషాల పూర్తి వెర్షన్ విడుదల. ⇒ 8.44 గంటలకు గేయ రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణికి సన్మానం ⇒ 8.50 గంటలకు ఆకట్టుకునేలా బాణసంచా ⇒ 9.00గంటలకు ట్యాంక్‌బండ్‌పై కార్యక్రమం ముగింపు. -
ఉదయం పరేడ్ గ్రౌండ్స్‌లో.. సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను జూన్ 2న అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఉదయం, సాయంత్రం రెండు పూటలా వేడుకలను నిర్వహించాలని సూచించారు. ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 2న జరిగే కార్యక్రమాల షెడ్యూల్ ఇదీ..అమరవీరులకు నివాళులతో మొదలుజూన్ 2న ఉదయం 9.30కు అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్, మంత్రులు నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమవుతుంది. తొలుత సీఎం జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. పోలీసు బలగాల పరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటాయి.తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం ‘జయ జయహే తెలంగాణ’ను ఆవిష్కరి స్తారు. అనంతరం ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తారు. విశిష్ట సేవలు అందించిన పోలీసు సిబ్బందికి, ఉత్తమ కాంటింజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు స్వీకర్తలతో ఫొటో సెషన్ అనంతరం ఉదయం కార్యక్రమం ముగుస్తుంది.సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై వేడుకగా..2న సాయంత్రం ట్యాంక్‌బండ్ మీద వేడుకలు నిర్వహిస్తారు. తెలంగాణకు సంబంధించిన హస్తక ళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6.30కు సీఎం రేవంత్ ట్యాంక్‌బండ్‌కు చేరుకుని వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. తర్వాత తెలంగాణ కళారూ పాలకు అద్దం పట్టేలా కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటు చేస్తున్న వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి.అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్బండ్ఒక చివర నుంచి మరో చివరి వరకు 5 వేల మంది భారీ ఫ్లాగ్‌వాక్ నిర్వహి స్తారు. ఈ ఫ్లాగ్‌వాక్ జరుగుతున్న సమయంలో ‘జయ జయహే తెలంగాణ’ రాష్ట్ర గేయం ఫుల్‌వెర్షన్ (13.30 నిమిషాల)ను విడుదల చేస్తారు. గీత రచయిత, కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిలను సన్మానిస్తారు. రాత్రి 8.50 గంటలకు పది నిమిషాల పాటు హుస్సేన్ సాగరం మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా సాగే బాణసంచా కార్యక్రమంతో వేడుకలు ముగుస్తాయి.యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న ఏర్పాట్లుతెలంగాణ ఆవిర్భావ వేడుకలకు అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాన వేదికతోపాటు, ముఖ్య అతిథులు, ఆహ్వానితులు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా లాంజ్‌లు సిద్ధం చేస్తున్నారు. వేసవి తీవ్రత నేపథ్యంలో భారీ టెంట్లను, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, కార్నివాల్, బాణసంచా, లేజర్ షో, ఫుడ్, గేమింగ్ స్టాళ్ల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దాదాపు 80 స్టాళ్లను సిద్ధం చేస్తున్నారు. వీటిలో హస్తకళలు, మహిళా బృందాలు తయారు చేసిన ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు, హైదరాబాద్‌లోని పలు ప్రముఖ హోటళ్ల స్టాల్స్, చిన్న పిల్లలకు గేమింగ్ షోలు ఉన్నాయి. కార్నివాల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పలు సాంస్కృతిక కళాబృందాలు ప్రదర్శన ఇవ్వనున్నాయి. -
నెక్లెస్‌రోడ్డులో లైట్ అండ్ సౌండ్ లేజర్‌షో ప్రారంభం (ఫొటోలు)
-
రేపు సద్దుల బతుకమ్మ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా రేపు(ఆదివారం) సద్దుల బతుకమ్మను సంబురంగా జరుపుకోనున్నారు. ఇక, హైదరాబాద్ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను అంగరంగవైభవంగా నిర్వహిస్తున్నారు. బతుకమ్మ చివరి రోజు ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలను నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు లుంబినీ పార్కు, అప్పర్ ట్యాంక్‌బండ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ కారణంగా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. #HYDTPinfo Commuters, please make a note of #TrafficAdvisory in view of #SaddulaBathukamma, celebrated on 22-10-2023 at #LumbiniPark & Upper #TankBund.#TrafficAlert #Bathukamma #Festival #Celebrations #Dussehra #Dussehra2023 @AddlCPTrfHyd pic.twitter.com/WMp9Qcpiqa — Hyderabad Traffic Police (@HYDTP) October 21, 2023 ట్రాఫిక్ మళ్లింపులు ఇలా.. ►తెలుగుతల్లి ఫ్లై ఓవర్, కర్బాలా మైదాన్ వైపు నుంచి వచ్చే వాహనాలకు ట్యాంక్‌బండ్ మీదుగా మధ్యాహ్నాం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అనుమతి లేదు. ►సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ పైకి వచ్చే వాహనాలను కర్బాలా మైదాన్ వద్ద బైబిల్ హౌస్ మీదుగా తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు మళ్లిస్తారు. ►ఇక్బాల్ మినార్ నుంచి వచ్చే వాహనాలను, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు మళ్లిస్తారు. ►పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డులో నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీదుగా వచ్చే వాహనాలను నెక్లెస్ రోటరీ ఇందిరాగాంధీ విగ్రహాం వద్ద ఐమాక్స్ రూట్లోకి మళ్లిస్తారు. ►నల్లగుట్ట నుంచి బుద్దభవన్ వైపు అనుమతి లేదు. నల్లగుట్ట క్రాస్‌రోడ్డు వద్ద రాణిగంజ్, నెక్లెస్ రోడ్డు వైపు ఈ వాహనాలను మళ్లిస్తారు. ►హిమాయత్‌నగర్, బషీర్‌బాగ్, అంబేద్కర్ విగ్రహాం వైపు నుంచి ట్యాంక్‌బండ్‌పైకి అనుమతి లేదు. ఈ వాహనాలు ఇక్బాల్ మినార్ వైపు వెళ్లి యూ టర్న్ తీసుకొని తెలుగు తల్లి జంక్షన్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌పై నుంచి వెళ్లాలి. ►సికింద్రాబాద్ వచ్చే వాహనాలను అప్పర్ ట్యాంక్‌బండ్ పైకి అనుమతించరు. ఆ వాహనాలను డీబీఆర్ మిల్స్ వద్ద కట్టమైసమ్మ ఆలయం, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు మళ్లిస్తారు. ►ముషీరాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనాలను కవాడిగూడ క్రాస్‌రోడ్డు వద్ద మళ్లిస్తారు. ►ఇతర జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను జేబీఎస్ స్వీకార్-ఉపకార్ వద్ద మళ్లిస్తారు. సిటీ బస్సులను కర్బాలా మైదాన్ వద్ద మళ్లిస్తారు. ►బతుకమ్మ వేడుకలకు వచ్చే వారికి స్నో వరల్డ్, ఎన్టీఆర్ స్టేడియం, ఎన్టీఆర్ గార్డెన్ పక్కనే ఉన్న మీ కోసం పార్కింగ్ ప్రాంతాలలో పార్కింగ్ స్థలాలను కేటాయించారు. -
హైదరాబాద్‌లో వర్షం.. వానలోనే గణనాథుల నిమజ్జనం..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మళ్లీ వర్షం ప్రారంభమైంది. ట్యాంక్ బండ్లో వినాయక నిమజ్జనాలు జరుగుతున్న సందర్భంగా వర్షం కురుస్తుండటం ఇబ్బందికరంగా మారింది. వర్షంలోనే ట్యాంక్ బండ్‌పై వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం కురుస్తోంది. బషీర్‌బాగ్, ఎంజే మార్కెట్, ట్యాంక్ బండ్, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇక, వర్షంలోనే గణనాథులు ట్యాంక్ బండ్‌పైకి తరలి వస్తున్నాయి. వర్షంలోనే వినాయక విగ్రహాల నిమజ్జనం జరుగుతోంది. వర్షం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విగ్రహాల తరలింపునకు ఆటంకం కలుగుతోంది. ఇదిలా ఉండగా, ఇప్పటికే ఖైరతాబాద్ గణేష్, బాలాపూర్ గణనాథుల నిమజ్జనం ముగిసింది. #28SEP 5PM⚠️ HEAVY THUNDERSTORMS ALERT FOR South -East #Hyderabad ⛈️#SaroorNagar,#Uppal,#Malakpet,#Amberpet ,#Ou ,#Secunderabad surroundings Seeing Intense Downpour⛈️⚠️ & These Stroms will Later Spread towards Central City.,#HyderabadRains pic.twitter.com/fjHhxcvUxR — Hyderabad Rains (@Hyderabadrains) September 28, 2023 Hyderabad right now! #rain #hyderabadrains #weather pic.twitter.com/r8lyCBXmEg — Stella Paul (@stellasglobe) September 28, 2023 మరోవైపు.. హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హిమాయత్‌నగర్, కవాడిగూడ, నారాయణగూడ, ముషీరాబాద్, ఉప్పల్, అంబర్పేట్, ఓయూ, తర్నాక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. #24HrWx #Telangana #Hyderabad High chances of thunderstorms in parts of the city particularly in the evening time. pic.twitter.com/fBpORkJxeg — Weather@Hyderabad|TS|AP 🇮🇳 (@Rajani_Weather) September 28, 2023 RED WARNING FOR HYDERABAD ⚠️ As expected, Huge thunderstorms clouds forming in Central Zone like Himayatnagar, Kavadiguda, Narayanguda, Musheerabad, Uppal, Amberpet, OU, Tarnaka side will later cover other parts too. Get ready for the blast 🔥⚡️⚡️⚡️⚡️#HyderabadRains — Telangana Weatherman (@balaji25_t) September 28, 2023 Pouring really hard. Almost like a curtain/waterfall. Can't see anything. Video somehow there's some visibility. #HyderabadRains pic.twitter.com/PmVPU4dEHd — VT-RRB ◢◤ (@rb_41) September 28, 2023 -
దర్శనాలకు బ్రేక్.. రాత్రి 12 గంటలకు ఖైరతాబాద్ గణపతికి చివరి పూజ
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్ గణపతి వద్దకు దర్శనం నిలిపివేశారు. ఇప్పటి వరకు క్యూలైన్లో ఉన్న భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తున్నారు. ఇక, శోభాయాత్రకు ఖైరతాబాద్ గణపతి సిద్ధమవుతున్నాడు. ఈరోజు రాత్రి 12 గంటలకు గణపతికి చివరి పూజ ఉంటుంది. రేపు(గురువారం) ఉదయమే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఉంటుంది. ఈ నేపథ్యంలో నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కాగా, తలసాని మీడియాతో మాట్లాడుతూ.. గణేశ్ శోభాయాత్ర, నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయన్నారు. గణేశ్ విగ్రహాల శోభాయాత్ర నిర్వహించే అన్ని రహదారులలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. విద్యుత్ తీగలు, చెట్ల కొమ్మలు అడ్డం లేకుండా తొలగించినట్లు పేర్కొన్నారు.అదేవిధంగా అవసరమైన ప్రాంతాల్లో రహదారుల మరమ్మతులు చేపట్టడంతో పాటు 52వేల విద్యుత్ లైట్లను సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు తాగునీటిని అందించడం 34 లక్షల వాటర్ ప్యాకెట్లు సిద్ధం చేశామన్నారు. ఇందుకోసం 122 స్టాల్స్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా విగ్రహాల నిమజ్జనం కోసం 125 స్టాండింగ్, 244 మొబైల్ మొత్తం 369 క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 12 కిలోమీటర్ల మేర బారికేడింగ్ కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 37 హెల్త్ క్యాంప్‌ల ఏర్పాటుతో అత్యవసర వైద్యసేవల కోసం 15 హాస్పిటల్స్‌లో ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. శోభాయాత్ర, నిమజ్జనం జరిగే ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూసేందుకు 3వేల మంది పారిశుధ్య సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా చూసే 68 అడుగుల ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. విగ్రహాల నిమజ్జనం కోసం 74 ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశామని, అలాగే 33 బేబీ పాండ్స్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 200 మంది స్విమ్మర్లు, 5 బోట్లను కూడా అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాన్ని నమొద్దని సూచించారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో ఒక్కసారిగా భారీ వర్షం.. రెడ్ అలర్ట్ -
సర్దార్ పాపన్నగౌడ్ ఆశయాలను కొనసాగిస్తాం
గన్‌పౌండ్రీ (హైదరాబాద్): సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఆదివారం రవీంద్రభారతిలో సర్దార్ పాపన్న మహారాజ్ ధర్మ పరిపాలన సంస్థ, జై గౌడ్ ఉద్యమం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో తొలి తెలుగు బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయ్ పాపన్న గౌడ్ మహరాజ్ 373వ జయంతి జాతీయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌడ కులస్తుల అనేక సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు. పాపన్న చరిత్ర తెలుసుకుంటే జాతిపట్ల అప్పట్లో ఎంత వివక్షత ఉందో తెలుస్తుందన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు గుర్తుచేశారు. ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహాన్ని పెట్టేందుకు జీవో జారీ చేశామని హెచ్ఎండీఏ అధికారులు స్థలాన్ని అన్వేషీస్తున్నట్లు వెల్లడించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ మాట్లాడుతూ, బహుజనులంతా ఐక్యంగా ఉన్నప్పుడే బీసీలకు రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు భరత్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెలిపారు. 75 సంవత్సరాల రాజమండ్రి పార్లమెంటు చరిత్రలో మొట్టమొదటిసారి ఒక బీసీ వ్యక్తి పార్లమెంటుకు ఎంపిక కావడమే అందుకు నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా పాపన్నగౌడ్ బయోపిక్‌పై రూపొందించిన సినిమా వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించగా పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసన మండలి మాజీ చైర్మన్ కె.స్వామిగౌడ్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కిగౌడ్, పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, గౌడ కార్పొరేషన్ చైర్మన్ పల్లే రవికుమార్‌గౌడ్, జై గౌడ్ ఉద్యమం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వి.రామారావుగౌడ్ పాల్గొన్నారు. -
Telangana: అమరుల స్మారక చిహ్నాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ (ఫొటోలు)
-
హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ ఒడ్డున అమరవీరుల స్మారక చిహ్నం (ఫొటోలు)
-
కేసీఆర్ పాలన మహిళలకు ల్యాండ్‌మైన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం మహిళలకు ఒక ల్యాండ్‌మైన్‌లా తయారయ్యిందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. ఎక్కడ బయటకు అడుగేస్తే ఎవరు వేధిస్తారోననే భయం మహిళల్లో నెలకొందన్నారు. బంగారు తెలంగాణలో మహిళలకు రక్షణ కరువైందని, రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళలకు రక్షణ కరువైందని నిరసిస్తూ ట్యాంక్‌బండ్‌పై నల్లబ్యాడ్జీలతో షర్మిల మౌనదీక్ష చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గత ఐదేళ్లలో మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలకు సంబంధించి వేల కేసులు నమోదయ్యాయన్నారు. ఆయా ఘటనలకు పాల్పడిన వారిలో ఎక్కువగా బీఆర్ఎస్ కార్యకర్తలే ఉన్నారని ఆమె ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ను మహిళా ద్రోహిగా అభివర్ణించారు. రాష్ట్రంలో మహిళా కమిషన్ డమ్మీగా మారిందని, ఒక మహిళా గవర్నర్‌కు కనీస గౌరవం సైతం లభించడం లేదని ఆక్షేపించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్టీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కవిత, చైతన్యారెడ్డి, కల్పనాగాయత్రీ, ఝాన్సీరెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ కోఆర్డినేటర్ వాడుక రాజ్‌గోపాల్, అధికార ప్రతినిధి గట్టు రాంచందర్‌రావు పాల్గొన్నారు. కాగా, దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు షర్మిలను అరెస్టు చేశారు. కాగా, దీక్షకు ముందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఫిలింనగర్లో బుధవారం చాకలి ఐలమ్మ విగ్రహానికి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల పూలమాల వేసి నివాళులర్పించారు. షర్మిల ‘బస్తీబాట’ వాయిదా:.. వైఎస్ షర్మిల తలపెట్టిన గ్రేటర్ హైదరాబాద్ బస్తీ బాటపై ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆ పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గ్రేటర్ అధ్యక్షుడు వాడుక రాజగోపాల్ ఆరోపించారు. గురువారం చేపట్టాల్సిన పాదయాత్రకు పోలీసులు అనుమతిని నిరాకరించడంతో బస్తీబాట వాయిదా పడిందన్నారు. -
Hyderabad: తటాక తీరాన.. మణి మకుటాలు..
అటు చూస్తే తుది దశకు చేరిన నూతన సచివాలయ నిర్మాణం.. ఇటు చూస్తే పూర్తి కావస్తున్న అమర వీరుల స్మారకం. ఆ వంక రూపుదిద్దుకుంటున్న అంబేడ్కర్ విగ్రహం. భాగ్యనగరి కీర్తి కిరీటంలో మణిమకుటాలుగా విరాజిల్లనున్నాయి. హుస్సేన్‌సాగర్ తీరానికి సరికొత్త సొబగులను అద్దనున్నాయి. నగరవాసులకు, పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. -
వాహనదారులకు అలర్ట్.. ఎన్టీఆర్ మార్గ్ మూసివేత
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హుస్సేన్ సాగర్ తీరం ఉత్కంఠభరితమైన రేసింగ్ లీగ్‌కు సిద్ధమైంది. శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీలు జరుగనున్నాయి. దీంతో, నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఈ నేపథ్యంలో శుక్రవారం 11 గంటలకు ఎన్టీఆర్ మార్గ్‌ను పూర్తిగా మూసివేయనున్నట్టు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. కాగా, రేసింగ్ పోటీలు జరుగనున్న నేపథ్యంలో ట్రాక్ పనులు చేసేందుకు శుక్రవారం నుంచే పనులు ప్రారంభమయ్యాయి. ట్రాక్ పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు రోడ్డును మూసివేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ క్రమంలో వాహనదారులు ఎన్టీఆర్ మార్గ్ కాకుండా వేరే మార్గాల నుండి వెళ్లాలని పోలీసులు వెల్లడించారు. -
‘హిందువులంతా సద్దికట్టుకుని ట్యాంక్‌బండ్‌కు రండి’
కవాడిగూడ (హైదరాబాద్): పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఒక నాస్తికుడని అందుకే వినాయక నిమజ్జనానికి ఆటంకం కలిగిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. గణనాథులను ట్యాంక్బండ్లోనే నిమజ్జనం చేద్దామని, అందుకు హిందువులంతా సద్దికట్టుకుని ట్యాంక్‌బండ్‌పైకి రావాలని పిలుపునిచ్చారు. ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జన ఏర్పాట్లను బుధవారం సంజయ్ పలువురు నేతలతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి దీక్షలకు, బీజేపీ నిరసనలకు దిగొచ్చి ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌పై క్రేన్లను ఏర్పాట్లు చేస్తోందన్నారు. ట్యాంక్‌బండ్‌పై వినాయక మండపాల నిర్వాహకులను పోలీసులు అడ్డుకుంటుంటే దారుసలాంలో సంబురాలు చేసుకుంటున్నారన్నారు. నిఖా ర్సయిన హిందువునని ప్రకటించుకునే సీఎం కేసీఆర్‌కు ఇది తగునా? అని ప్రశ్నించారు. ఇదీ చదవండి: Telangana: స్పీకర్‌పై చర్యలు తీసుకోవాలి: బండి సంజయ్ -
ట్యాంక్‌బండ్ వద్ద సండే సందడి
-
ట్యాంక్‌బండ్‌పై సందడిగా " సండే ఫన్డే''
-
సండే-ఫన్ డే మళ్లీ షురూ!
-
ట్యాంక్ బండ్‌పై 'సన్డే-ఫన్డే' సందడి ఫొటోలు
-
‘ట్యాంక్‌బండ్‌పైకి నో ఎంట్రీ’.. ఎందుకో తెలుసా..?
సాక్షి, సిటీబ్యూరో: ట్యాంక్‌బండ్ పైకి ఆదివారాల్లో వాహనాలకు నో ఎంట్రీ విధానం అమలు చేస్తున్నారు. దీన్ని ఇప్పటి వరకు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య కేవలం సందర్శకులకే కేటాయించారు. ఈ సమయాన్ని మరో రెండు గంటలు పొడిగించాలని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ నిర్ణయించారు. ఆయన నుంచి ఆదేశాలు అందుకున్న క్షేత్రస్థాయి అధికారులు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ విధానం అమలుకు కసరత్తు చేస్తున్నారు. (చదవండి: ఇంట్లో మృతిచెందినా పరిహారం) ఈ ఆదివారం (సెప్టెంబర్ 26వ తేదీ) నుంచే దీన్ని కార్యరూపంలోకి తేవాలని భావిస్తున్నారు. గత నెల 24న అశోక్ చంద్రశేఖర్ అనే నెటిజనుడు చేసిన ట్వీట్‌కు స్పందించిన మంత్రి కేటీఆర్ ఆదివారాల్లో ట్యాంక్‌బండ్‌ను సందర్శకులకే కేటాయించేలా చర్యలు తీసుకోవాలని పోలీసు విభాగాన్ని సూచించారు. దీంతో యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్న ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం అధికారులు గత నెల 29వ తేదీ నుంచి దీన్ని అమలులోకి తీసుకువచ్చారు. ఇటీవల ప్రభుత్వం సైతం భారీగా నిధులు వెచ్చించి ట్యాంక్‌బండ్‌ను సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టింది. దీనికి తోడు ఆదివారం సాయంత్రం వేళల్లో వాహనాలను నో ఎంట్రీ జోన్‌గా మార్చడంతో ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ విధానం అమలైన తొలిరోజు స్వయంగా నగర కొత్వాలే ట్యాంక్‌బండ్ వద్దకు వెళ్లి సందర్శకులతో మాట్లాడారు. ఇప్పటి వరకు మూడు ఆదివారాలు ఈ విధానం అమలు కాగా.. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో గత వారం సాధ్యం కాలేదు. ఆ ప్రాంతానికి వస్తున్న సందర్శకుల తాకిడి, వారి అభిప్రాయాలను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిగణనలోకి తీసుకుంటున్నారు. వీటి ఆధారంగా మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్‌బండ్‌ను సందర్శకులకే కేటాయించాలని నిర్ణయించారు. ఆదివారం సాయంత్రం వేళల్లో ట్యాంక్‌బండ్‌కు వచ్చే సందర్శకుల కోసం దానిపైనే పార్కింగ్ ఏర్పాటు చేశారు. రెండు పక్కలా పార్కింగ్ ఉండేలా చర్యలు తీసుకున్నారు. అంబేడ్కర్ విగ్రహం వైపు నుంచి వచ్చే సందర్శకుల వాహనాలకు లేపాక్షి వరకు, రాణిగంజ్ వైపు నుంచి వచ్చే వాటికి చిల్డ్రన్ పార్క్ వరకు పార్కింగ్‌కు కేటాయించారు. (చదవండి: తెలంగాణ పర్వతారోహకుడికి సీఎం జగన్ భారీ ఆర్థిక సహాయం) Glimpses of Sunday-Funday @TankBund yesterday @KTRTRS @HMDA_Gov pic.twitter.com/1mldNxzug3 — Arvind Kumar (@arvindkumar_ias) September 13, 2021 -
కొత్త సచివాలయ పనులు సీఎం కేసీఆర్ పరిశీలన
సాక్షి, హైదరాబాద్: అత్యాధునికంగా.. సకల సౌకర్యాలతో కొత్త సచివాలయ నిర్మాణం తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన పనులను షాపూర్ పల్లోంజీ చేపడుతోంది. రూ.617 కోట్లతో చేపట్టిన ఈ నిర్మాణ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. అయితే ఈ పనులను మంగళవారం సీఎం కేసీఆర్ ఆకస్మికంగా పరిశీలించారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న అనంతరం సీఎం కేసీఆర్ ట్యాంక్‌బండ్‌కు చేరుకుని సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో సచివాలయ నిర్మాణ పనులపై సీఎం కేసీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయ నిర్మాణ పనులను అక్కడున్న సిబ్బందిని అడిగి కొన్ని సూచనలు చేశారు. త్వరితగతిన ఈ పనులను పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. -
హుస్సేన్ సాగర్ ఉగ్రరూపం..
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో గ్రేటర్ హైదరాబాద్ రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ట్యాంక్‌బండ్ వద్ద హుస్సేన్ సాగర్ ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. వరద నీటిని చూసేందుకు స్థానికులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ మహ్మద్ బాబా ఫసియుద్దీన్‌లు బుధవారం ట్యాంక్ బండ్‌ను సందర్శించి వరద పరిస్థితులను పరిశీలించారు. వరద నీటి దృష్ట్యా నగర వాసులంతా బయటకు రావొద్దని ఇళ్లలోని సురక్షితంగా ఉండాలంటూ ప్రజలను విజ్ఞప్తి చేశారు. (చదవండి: వరద బీభత్సానికి అద్దం పడుతున్న దృశ్యం) అదే విధంగా జలమండలి ఎండీ దాన కిషోర్ హిమాయత్ సాగర్‌ను సందర్శించారు. వరద పరిస్థితిపై అధికారులతో సమావేశమయ్యారు. జలాశయం దిగువన ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిచాలని ఆదేశించారు. మరోవైపు హైదరాబాద్ మహాత్మగాంధీ బస్‌స్టాండ్‌లోకి వరద నీరు భారీగా రావడంతో వచ్చిపోయే బస్సులకు ఆటంకం కలిగి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. (చదవండి: తెలంగాణలో ఇవాళ, రేపు సెలవులు) -
‘నీరా’ వచ్చేస్తోంది.. త్వరలో మార్కెట్లోకి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నీరా ఉత్పత్తులు త్వరలోనే మార్కెట్లోకి రానున్నాయి. నీరాను తీయడంతోపాటు అనుబంధ ఉత్పత్తుల తయారీకి అనుమతిస్తూ ఎక్సైజ్ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన జీవోను ఎక్సైజ్ కమిషనర్ సోమేశ్‌కుమార్ సోమవారం విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం రాష్ట్రంలోని కల్లుగీత సహకార సొసైటీలు, తెలంగాణ గీత పారిశ్రామిక, ఆర్థిక సంక్షేమ సంస్థ, లేదా గౌడ, ఈడిగ కులాలకు చెందిన ఇతర సొసైటీల్లో సభ్యులుగా ఉన్న వారికి నీరా లైసెన్సులు ఇవ్వనున్నారు. లైసెన్సులు పదేళ్ల కాలం చెల్లుబాటు అవుతాయి. అనంతరం మళ్లీ వాటిని రెన్యువల్ చేస్తారు. నీరా ఉత్పత్తులను అమ్ముకునేందుకు మున్సిపాలిటీలు, పర్యాటక ప్రాంతాల్లో అనుమతివ్వనున్నారు. ఇందుకు సంబంధించి రిటైల్ ఔట్లెట్లను కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. కేవలం నీరాతోపాటు వాటి అనుబంధ ఉత్పత్తులైన తాటి బెల్లం, తాటి పంచదార లాంటి వాటిని కూడా లైసెన్సీలు తయారు చేసుకోవచ్చు. ప్రభుత్వ సహకార సంస్థలు, ప్రభుత్వం అనుమతిచ్చిన పరిశ్రమలకు కూడా నీరాను నాన్ ఆల్కహాలిక్ ఉత్పత్తుల తయారీకి ముడిసరుకుగా ఉపయోగించుకునేందుకు అమ్ముకునేలా లైసెన్సీలకు వెసులుబాటు ఇచ్చారు. అయితే నీరా లైసెన్సులు కేవలం నీరాను అమ్ముకునేందుకే వర్తిస్తాయి తప్ప కల్లు అమ్ముకునేందుకు వర్తించవని మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించినా, నీరాను కల్తీ చేసేందుకు యత్నించినా సంబంధిత లైసెన్సులను రద్దు చేయనున్నారు. మార్గదర్శకాలతో కూడిన ప్రతులను మంగళవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో జరిగిన కార్యక్రమంలో మంత్రులు టి.హరీశ్‌రావు, కె. తారక రామారావు, వి.శ్రీనివాస్‌గౌడ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఎక్సైజ్ కమిషనర్ సోమేశ్‌కుమార్‌లతోపాటు గౌడ కులానికి చెందిన ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్, ఎమ్మెల్యే వివేకానందగౌడ్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశంగౌడ్, ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌడ ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పాలసీ ప్రతులను విడుదల చేస్తున్న మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్. చిత్రంలో సీఎస్ ఎస్కే జోషి, ఎక్సైజ్ కమిషనర్ సోమేశ్‌కుమార్ తదితరులు ఎన్నికల హామీ మేరకు గౌడ కులస్తుల సంక్షేమానికి ప్రభుత్వం నీరా పాలసీని ప్రకటించిందని, త్వరలోనే ప్రభుత్వ నీరా స్టాల్స్ ఏర్పాటు చేస్తామని, హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ పరిసరాల్లోనే మొదటి స్టాల్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. 70 ఏళ్లుగా పాలించిన ప్రభుత్వాలు గీత కార్మికులపై ఆంక్షలు పెట్టడమే కానీ వారి వృత్తికి సంబంధించిన ఎలాంటి సాయం చేయలేదన్నారు. నీరా పేరుతో ఇతర దేశాల్లో పర్యటించారు కానీ అమల్లోకి తేలేదని, గౌడ వృత్తిని కాపాడటం కోసం ‘హరితహారం’లో తాటిచెట్లను నాటిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. హైదరాబాద్‌లో నీరా అమ్మకాలకు అనుమతివ్వడం ఆనందంగా ఉందని, దశలవారీగా అన్ని జిల్లాల్లో అమ్మకాలు జరిగేలా చూస్తామన్నారు. నీరాను గీయడం, అమ్మడం కేవలం గౌడ కులస్తులే చేయాలని సీఎం చెప్పారని, ఈ మేరకు గౌడ కులస్తులకే నీరా లైసెన్సులిస్తామని చెప్పారు. నీరాలో అనేక ఔషధ గుణాలున్నాయని, షుగర్, మధుమేహ వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుందని చెప్పారు. ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ నీరా స్టాల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
పట్నం దాకా.. పల్లె ‘నీరా’
ఆదరణకు నోచుకోని కల్లుగీత కార్మికులకు త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి. వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడంతో పాటు ఔషధ గుణాలు కలి గిన నీరాను కార్మికుల నుంచి రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి విక్రయిం చాలని నిర్ణయించింది. ముందుగా అన్ని జిల్లాల్లో సేకరించి హైదరాబాద్‌కు తరలించనున్నారు. అక్కడి ట్యాంకుబండ్ వద్ద స్టాళ్లను ఏర్పాటుచేసి విక్రయించేలా ఎక్సైజ్ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. సాక్షి, మహబూబ్‌నగర్: ప్రతిరోజూ ఉదయం తీసిన నీరా.. పాల ట్యాంకర్ల మాదిరిగా రాష్ట్ర రాజధానికి పెద్ద ఎత్తు న సరఫరా చేయనున్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీని వాస్‌గౌడ్ చొరవతో ఏర్పాట్లన్నీ చకచకా సాగిపోతున్నాయి. సంబంధిత ఫైలుపై సీఎం కేసీఆర్ సైతం ఆమోదం తెలపడంతో మరో రెండు రోజుల్లో జీఓ విడుదల కావచ్చని అధి కారులు చెబుతున్నారు. అయితే ముందుగా అన్ని జిల్లాల నుంచి నీరాను హైదరాబాద్‌కు తరలించి అక్కడ విక్రయాలని నిర్ణయించారు. ఆ తర్వాత డిమాం డ్కు అనుగుణంగా అన్ని జిల్లాల్లోనూ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం కల్లు గిరాకీ లేకపోవడంతో గీతకార్మికులకు ఆర్ధిక ఇ బ్బందులు తప్పడం లేదు. చాలా మంది కార్మికులు గీత వృత్తినే మా నేసి ఇతర పనుల వైపు మొగ్గు చూపుతున్నా రు. సంప్రదాయ వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న వారు కొందరు మాత్రమే మిగి లారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో కల్లుగీత కార్మి కులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. 10వేలకు పైగా మందికి లబ్ధి ఉమ్మడి పాలమూరు పరిధిలోని మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాం బ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మొత్తం 939 కల్లుగీత సొసైటీలు, పది వేల మంది గీతకార్మికులు ఉన్నారు. ముఖ్యంగా నారాయణపేట జిల్లాలోని మాగనూరు, మక్తల్, జోగుళాంబ గద్వా ల జిల్లాలోని గట్టు, ధరూరు, అయిజ, వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు, అమరచింత, నాగర్‌కర్నూల్ జిల్లాలోని చారకొండ, అచ్చంపేట, కొల్లాపూర్ ప్రాంతా ల్లో ఈత, తాటి చెట్లు ఎక్కువగా ఉన్నా యి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 6,27,990 ఈత, తాటి చెట్లు ఉన్నాయి. వీటినుంచి రోజుకు సగం చొప్పున రెండు లక్షల లీటర్ల కల్లు తీస్తారు. విస్తృత ప్రచారం ఆరోగ్యవంతమైన సమాజం కోసం చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం శీతల పానీయాల కంటే ఔషధ గుణాలు కలిగిన నీరానే తాగేలా విస్తృతంగా ప్రచారం చేయనుంది. ఇది తాగితే.. కిడ్నీలలో రాళ్లు తొలిగిపోతాయని, క్యాన్సర్, నరాల బలహీనత, మధుమేహం వంటి వ్యాధులకు ఉత్తమ ఔషధమనే ప్రచారానికి త్వరలోనే తెరలేపనుంది. ఇన్ని గుణాలు ఉన్న నీరాను ఇప్పటికే దక్షిణాఫ్రికా, కంబోడియా, అమెరికా, ఇండోనేషియా, మలేషియా, శ్రీలంకలో ఎక్కువగా వాడుతున్నారు. ఏదిఏమైనా ఈ కల్లు కొత్త పాలసీ తమ జీవితాల్లో వెలుగులు నింపుతుందని గీతకార్మికులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే జీఓ తెస్తాం కల్లుగీత వృత్తికి పూర్వవైభవం తెచ్చేలా హైదరాబాద్‌లో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటుచేసి నీరాను విక్రయించాలని సీఎం నిర్ణయించారు. ఆ మేరకు ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. గీత కార్మికుల నుంచి సేకరించి వాటిని ఫ్రీజర్లలో పెట్టి రాష్ట్ర రాజధానికి తరలిస్తాం. దీనికి సంబంధించి రెండు రోజుల్లో జీఓ తెస్తాం. ఔషధ గుణాలు కలిగిన నీరాతో కేవలం గీత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడటమేగాక ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం జరుగుతుంది. – శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి -
కొనసాగుతున్న గణేష్ శోభాయాత్ర
-
ట్యాంక్ బండ్ వద్ద గంగా తెప్పోత్సవం
-
అందమైన కల..ఆవిరైన వేళ..
కడపలో ట్యాంక్‌బండ్? కడప నగరం పాతకడప చెరువు ప్రాంతాన్ని ట్యాంక్‌బండ్‌లాగా తీర్చిదిద్దాలని కొందరు విజ్ఞులు డాక్టర్ వైఎస్సార్‌కు సూచించారు. ఆయన ముఖ్యమంత్రిగా ‘రైట్’ అన్నారు. నగర ప్రాంతం గనుక నగర పాలక సంస్థ ఆ«ధ్వర్యంలో చెరువును సుందరీకరించాలని ప్రణాళికలు సిద్ధం చేయమన్నారు. ఆ తర్వా త ఆయన లేరు. దాని గురించి పట్టించుకున్న వారు కూడా లేరు. కడప కార్పొరేషన్లో కొందరు వైఎస్సార్ అభిమానులు, ఆ తర్వాత ఆ చెరువు సుందరీకరణ విషయాన్ని తెరపైకి తెచ్చారు. ఆయన కలను నిజం చేసేందుకు కృషి ప్రారంభించారు. ప్రభుత్వ పరంగా అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. చెరువు రోడ్డువైపు సగం మేర చుట్టూ రోడ్డు వేసేందుకు చదును చేశారు. సిమెంటు చేసి ప్లాట్‌ఫాంగా మార్చి పూలమొక్కలు, ఆకర్శణీయమైన బొమ్మలు ట్యాంక్‌బండ్ తరహాలో జిల్లాకు చెందిన మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా రోడ్డుపై కొన్నిచోట్ల సిమెంటు బెంచీలను కూడా ఏర్పాటు చేశారు. చెరువులోకి చెత్త కొట్టుకు రాకుండా చుట్టూ ఆరు అడుగుల ఎత్తున ఇనుపజాలి వేశారు. అన్నీ పూర్తయ్యాక ఇప్పటికే ఉన్న బోటిం గ్ను భారీ స్థాయిలో అభివృద్ధి చేయాలని భావించారు. కానీ వైఎస్సార్‌కు పేరొస్తుందన్న కారణంగా ఇప్పటికీ చెరువు అభివృద్ధికి కొందరు వ్యక్తులు అడ్డు తగులుతున్నారు. ఫలితంగా చెరువు అభివృద్ధి ఆగిపోయింది. నగర వాసుల కల చెదిరింది. ఆడిటోరియందీ అదే దారి కడపకు కలల జిల్లాగా పేరుంది. నగరంలో మొన్నటివరకు కళా ప్రదర్శనలు తరు చూ జరిగేవి. మున్సిపల్ షాదీఖానా పక్కన ప్రత్యేకంగా ఉండిన రంగస్థలంలో కార్యక్రమాలు నిర్వహించేవారు. కాలక్రమంలో అది కూలిపోగా దాని స్థానంలో డాక్టర్ వైఎ స్ మ్యుమంత్రిగా ఉన్నప్పుడు కొత్త ఆడిటోరియం నిర్మింపజేశారు. నిత్యం కళా ప్రదర్శనతో కళకళలాడాలని, నగర వాసులకు ఆహ్లాదం అందించాలన్నది ఆయన ధ్యేయం. కానీ ఆయనతోనే ఆ ఆశలు ఆవిరయ్యాయి. కళా ప్రదర్శనలకు నెలవుగా ఉంటుందని భావించిన ఆ రంగస్థలం నేడు మున్సిపల్ షాదీమహల్ పక్కనే మరో కల్యాణ మండపంగా మారింది. కనీసం వివాహాలకు కూడా ఆ వేదిక పూర్తిస్థాయిలో ఉపయోగపడటం లేదు. దీంతో ఈ ఆడిటోరియం ఉండీ లేనట్లుండి ఉని కిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. మళ్లీ ఆయన లాంటి పాలన వస్తేగానీ వీటి ఉద్దేశాలు నెరవేరే అవకాశం కనిపించడం లేదు. ఆయన దార్శనికుడు జిల్లా సర్వతోముఖాభివృద్ధిని కాం క్షించి ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసిన జిల్లా ముద్దుబిడ్డ డాక్టర్ వైఎస్సార్. కన్నతల్లి రుణం తీర్చుకునే ప్రయత్నం చేయడంలో కడప నగరాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. మరో విడత ఉండి ఉంటే ఈ నగరం దేశానికే ఆదర్శంగా నిలిచేది. – ఖాజా రహమతుల్లా, కడప రుణం తీర్చుకున్నారు కడప తల్లి బిడ్డగా డాక్టర్ వైఎస్సార్ జిల్లా రుణాన్ని తీర్చుకున్నారు. కడపను అందంగా తీర్చిదిద్దడానికి ఎం తో కృషి చేశారు. ఆయన కృషి అనితర సాధ్యం. మరిన్ని రోజులు గనుక ఉండిఉంటే జిల్లాను ఊహించనంతగా తీర్చేవారు. ముఖ్యంగా నగరం కళకళలాడేది. – నాగేంద్రారెడ్డి, కడప -
మీరేమన్నా అంటే.. చచ్చిపోతా..!
హిమాయత్‌నగర్ : ‘ఓ వ్యక్తిపై యజమానురాలు ఇంటి అద్దె చెల్లించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు ఆ వ్యక్తిని పోలీసులు పిలిచి మందలించారు. దీంతో ఆ వ్యక్తి ‘మీరేమన్నా అంటే.. నేను చచ్చిపోతా.. అంటూ బ్లాక్మెయిల్ చేశాడు. ముగ్గురు క్యాబ్డ్రైవర్లు, ఐదారుగురు ఫుడ్ డెలివరీ బాయ్స్ తమకు డబ్బులు ఇవ్వడం లేదని ఓ వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆ వ్యక్తిని పిలిచి విచారించగా.. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా.. నన్ను పీఎస్‌కు పిలిచి మందలిస్తారా.. మీ పద్ధతి ఏం బాగోలేదు’ అంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. ఇదీ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కొద్దిరోజులుగా జరుగుతున్న వ్యవహారం. ఇది మీ పద్ధతి కాదు అని హెచ్చరించినందుకే వీరిద్దరూ పోలీసులపై తిరగబడి వింతగా ప్రవర్తిస్తున్నారు. నీ పేరు రాసి చచ్చిపోతా.. హైదర్‌గూడలో పెట్రోల్ బంక్ సమీపంలోని ఓ వృద్ధురాలి ఇంట్లో ప్రకాశరావు అనే వ్యక్తి భార్యతో కలిసి ఉంటున్నారు. జనవరిలో వృద్ధురాలి ఇంట్లో కి అద్దెకు దిగారు. అప్పటి నుంచి సరిగ్గా ఇంటి అద్దె కూడా ఇవ్వలేదు. అద్దెకు దిగేప్పుడు రూ.50 వేలకు ఓ చెక్కును ఇచ్చాడు. అసలు ఇతగాడికి బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. వృద్ధురాలు అద్దె కావాలి అనడంతో అప్పుడప్పుడు రూ.2వేలు ఇచ్చేవాడు. ఈ విషయంపై వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు పిలిచి మందలించారు. నాపైనే పోలీసులకు ఫిర్యాదు ఇస్తావా..? అంటూ వృద్ధురాలిని వేధించడం మొదలు పెట్టాడు. ట్యాంక్‌బండ్‌పై సూసైడ్ స్లిప్‌తో.. తన వేధింపులు భరించలేకపోతున్నా అంటూ వృద్ధురాలు మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. మళ్లీ ఆ వ్యక్తిని పీఎస్‌కి పిలిపించారు. పద్ధతి మార్చుకుని ఆమెకు అద్దె డబ్బులు ఇవ్వాలని చెప్పారు. దీంతో ‘మీరేమన్నా అంటే నేను చచ్చిపోతా’ అంటూ పోలీసులను బ్లాక్మెయిల్ చేశాడు. ‘నన్ను నారాయణగూడ పోలీసులు వేధిస్తున్నారు. నాకు బతకాలని లేదు.. చచ్చిపోతా’ అంటూ సూసైడ్ నోట్ రాసుకుని లేక్‌పోలీస్ స్టేషన్ ఎదురుగా తిరుగుతున్నాడు. అనుమానం వచ్చిన లేక్ పోలీసులు ఓ ఉన్నతాధికారికి సమాచారం ఇచ్చారు. మరుసటి రోజు ఆ వ్యక్తి ఉన్నతాధికారిని కలిసి సూసైడ్ నోట్ చూపించాడు. విషయం గురించి ఉన్నతాధికారి నారాయణగూడ ఇన్స్పెక్టర్ బండారి రవీందర్‌కు ఫోన్ చేసి అడగడంతో ఇతడి లీలలు వివరించారు. దీంతో సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ వద్దకు పంపారు. ఇది సివిల్ మ్యాటర్ దీనిలో ఇన్వాల్వ్ అవ్వడానికి ఆస్కారం లేదు అని చెప్పారు. దీంతో సదరు వ్యక్తి పోలీసులను నన్ను వేధిస్తున్నారంటూ వారిపై కేసు వేయాలని లాయర్‌ను కూడా సంప్రదించాడు. క్యాబ్, ఫుడ్ఆర్డర్ డబ్బులు ఎగ్గొట్టాడు నారాయణగూడ పీఎస్ పరిధిలోని బర్కత్‌పుర సిగ్నల్ వద్ద ఓ ఇంట్లో చంద్రశేఖర్ భార్యతో కలిసి ఉంటున్నాడు. పనుల నిమిత్తం పలుమార్లు ఓలా, ఊబర్ క్యాబ్ బుక్ చేసుకొని పని నిమిత్తం నగరంలోని పలు ప్రాంతాలకు తిరిగి ఇంటికి చేరతాడు. పర్సులో డబ్బులు సరిపడా లేవు తీసుకొస్తా అని ఇంటిపైకి వెళ్తాడు. మళ్లీ బయటకు రాడు. నచ్చిన ఫుడ్‌ని ఆన్లైన్లో ఆర్డర్ చేసి పార్సిల్ తీసుకుని ఇంట్లోకి వెళ్లిపోతాడు. డెలవరీ బాయ్ ఎంతసేపు పిలిచినా స్పందన ఉండదు. పలుమార్లు కాలింగ్ బెల్ కొడితే భార్య బయటకు వచ్చి ఆయన ఇంట్లో లేరు అని చెబుతుంది. దీంతో క్యాబ్డ్రైవర్లు, ఫుడ్‌డెలివరీ బాయ్స్ నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీరిలా నన్ను నిందించడం సరికాదు క్యాబ్ డ్రైవర్ల ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు వ్యక్తిని పీఎస్‌కు పిలిపించి విచారించారు. నేను ఎవరికీ డబ్బులు ఇచ్చేది లేదంటూ బదులిచ్చాడు. దీంతో పోలీసులు మందలించడంతో ‘ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా..? పీఎస్‌కు పిలిపించి నిందించడం సరికాదు’ అంటూ పోలీసులపైనే ఎదురు దాడికి దిగడంతో అందరూ అవాక్కయ్యారు. -
‘స్ఫూర్తి సభ’ భగ్నం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపునిచ్చిన ‘మిలియన్ మార్చ్’ను, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తు చేసుకోవడానికి.. తెలంగాణ జేఏసీ చేపట్టిన మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభను పోలీసులు భగ్నం చేశారు. శనివారం ఉదయం నుంచే ట్యాంక్‌బండ్‌ను, పరిసర ప్రాంతాలను పూర్తిగా స్వాధీనంలోకి తీసుకున్నారు. సాయంత్రం వరకు వాహనాల రాకపోకలను కూడా నిషేధించారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దిలీప్కుమార్లతోపాటు టీజేఏసీ నాయకులు, కార్యకర్తలు, సీపీఐ, న్యూడెమోక్రసీ, అరుణోదయ, పీవోడబ్ల్యూ, తదితర వామపక్ష ప్రజాసంఘాలకు చెందిన వందలాది మంది నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభకు తరలివస్తున్న వారిని హైదరాబాద్ శివార్లలోనే అదుపులోకి తీసుకున్నారు. ముళ్ల కంచెలు.. బారికేడ్లు.. మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడం, అయినా సభ జరిపి తీరుతామని టీజేఏసీ, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, తెలంగాణ ప్రజాఫ్రంట్, అరుణో దయ తదితర పార్టీలు, ప్రజాసంఘాలు ప్రకటించడంతో పోలీసులు భారీగా మోహరించారు. ట్యాంక్‌బండ్‌పైకి ఎవరూ వెళ్లకుండా మార్గాలన్నింటినీ మూసేశారు. అన్ని చోట్లా ఇనుప కంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్‌కు ఇరువైపులా లిబర్టీ, ఇందిరాపార్కు, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం తదితర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దూసుకొచ్చిన ఉద్యమకారులు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినా.. పలువురు టీజేఏసీ నాయకులు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు, పీవోడబ్ల్యూ సంధ్య, ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి అనురాధ, పీవోడబ్ల్యూ నగర అధ్యక్షురాలు సరళ తదితరులు ట్యాంక్‌బండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వరకు చేరుకున్నారు. అది గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో తీవ్రస్థాయిలో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. ఇదే సమయంలో మరోవైపు నుంచి పీడీఎస్యు విద్యార్థులు ట్యాంక్‌బండ్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారందరినీ అరెస్టు చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. టీజేఏసీ హైదరాబాద్ అధ్యక్షుడు సత్యంగౌడ్, న్యూడెమోక్రసీ రాయల వర్గానికి చెందిన రాష్ట్ర నాయకురాలు రమ, ఎస్ఎల్ పద్మ, అరుణ తదితరులను తెలుగు తల్లి విగ్రహం వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఇక టీజేఏసీ మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభకు మద్దతు ప్రకటించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను పోలీసులు గృహనిర్బంధం చేశారు. అక్కడికి వచ్చిన ఎమ్మార్పీఎస్, ఇతర ప్రజా సంఘాల నేతలను అరెస్టు చేశారు. కోదండరాం నివాసం వద్ద హైడ్రామా టీజేఏసీ మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో.. పోలీసులు శుక్రవారం రాత్రి నుంచే టీజేఏసీ చైర్మన్ కోదండరాం ఇంటిని చుట్టుముట్టారు. పరిసర ప్రాంతాల్లో మోహరించారు. కోదండరాంను కలసి స్ఫూర్తి సభకు వెళ్లేందుకు అక్కడికి వచ్చిన జేఏసీ నాయకులు, విద్యార్థి నాయకులను అరెస్టు చేశారు. ఇక మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో కోదండరాంను అరెస్టు చేసేందుకు హైడ్రామా నడిపించారు. కోదండరాం నివాసం పక్కనే ఉన్న మరో ఇంట్లోకి వెళ్లిన పోలీసులు.. అక్కడి నుంచి కోదండరాం ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులను దారి మళ్లించేందుకు టీజేఏసీ కార్యకర్త ఒకరు కోదండరాం ఇంటి ప్రహరీ గోడ దూకి వెళుతున్నట్టుగా పారిపోయారు. అది చూసి హైరానా పడిన పోలీసులు.. ఆయనను పట్టుకునేందుకు పరుగులు తీశారు. అయితే పోలీసుల తీరుపై మండిపడిన కోదండరాం.. పలువురు జేఏసీ నాయకులతో కలసి తన ఇంటికి తాళం వేసుకుని స్వీయ నిర్బంధం ప్రకటించుకున్నారు. కానీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంట్లోంచి బయటకు రావడంతో అరెస్టు చేశారు. నిరంకుశ పాలనకు నిదర్శనమిది టీజేఏసీ చైర్మన్ కోదండరాం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని టీజేఏసీ చైర్మన్ కోదండరాం మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అప్రజాస్వామికంగా నిర్బంధిస్తూ, అరెస్టులు చేస్తున్నారని పేర్కొన్నారు. పాలకుల వైఖరిని కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పారు. కోదండరాం అరెస్టుకు ముందు తన నివాసంలో, అరెస్టు తర్వాత బొల్లారం పోలీస్‌స్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మేమే తెలంగాణ తెచ్చినం, మా ఇష్టమున్నట్టుగా పాలన సాగిస్తాం..అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలపై ఇంత నిర్బంధమా.? 2011లో ఎన్ని ఆంక్షలున్నా మిలియన్ మార్చ్‌ను విజయవంతం చేశాం. తెలంగాణ వచ్చాక ప్రభుత్వమే మిలియన్ మార్చ్ స్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఇంతకాలం ఎదురుచూశాం. ఆ దిశగా ప్రభుత్వం స్పందించకపోవడంతోనే.. మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభను ఏర్పాటు చేశాం. కానీ ప్రభుత్వం ఈ స్ఫూర్తి సభకు అనుమతి నిరాకరించడం నిరంకుశ పాలనకు నిదర్శనం..’’అని కోదండరాం మండిపడ్డారు. మిలియన్ మార్చ్ స్ఫూర్తి çసభ సీఎం కేసీఆర్‌కు ఇష్టం లేదని, అందుకే రెండు రోజుల నుంచి ముందస్తు అరెస్టులు చేశారని చెప్పారు. వేల మంది నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారని.. అప్రజాస్వామికంగా కొనసాగుతున్న అరెస్టులపై కోర్టును ఆశ్రయిస్తామని, పాలకుల వైఖరిని కోర్టులోనే తేల్చుకుంటామని తెలిపారు. మాకూ అలాంటి స్వేచ్ఛ ఉంది సీఎం కేసీఆర్ తొలి నుంచీ తనను ప్రశ్నించే వారిపట్ల నిరంకుశ వైఖరిని ప్రదర్శిస్తున్నారని కోదండరాం ఆరోపించారు. రాష్ట్ర సమస్యలపై ఢిల్లీలో ధర్నా చేసేందుకు ముఖ్యమంత్రికి ఎలాంటి స్వేచ్ఛ ఉందో.. స్ఫూర్తి సభలో పాల్గొనేందుకు తమకు కూడా అలాంటి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబించడం సరికాదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తు చేయడానికి తాము తలపెట్టిన స్ఫూర్తి సభ విజయవంతమైందన్నారు. 2011లో తనను అరెస్టు చేసి బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారని, ఇప్పుడూ అక్కడికే తీసుకొచ్చారని గుర్తు చేసుకున్నారు. నియంత పాలన: చాడ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. మిలియన్ మార్చ్ స్ఫూర్తి కార్యక్రమంలో పాల్గొనేందుకు ట్యాంక్‌బండ్‌కు బయలుదేరిన ఆయనను.. పార్టీ కార్యాలయం మగ్దూంభవన్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని.. అక్రమ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ఈ నిర్బంధాలతో ఏం సాధిస్తారని కేసీఆర్‌ను ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది సీపీఐ కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేశారని.. వారికి రాత్రి నుంచి తిండి కూడా పెట్టకుండా బాధ పెట్టారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అవసరమైన సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు అవసరం లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్బంధం విధించినా.. నైతికంగా సీపీఐ టీజేఏసీలే గెలిచాయన్నారు. నన్నెందుకు అరెస్టు చేశారు? పోలీసులను నిలదీసిన సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ శనివారం మగ్దూంభవన్ వద్ద సీపీఐ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఏదో పని నిమిత్తం కార్యాలయానికి వచ్చిన సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను కూడా అరెస్టు చేశారు. దీంతో ఆయన పోలీసులను నిలదీశారు. ‘‘మా పార్టీ ఉమ్మడి కార్యాలయం ఇక్కడే ఉంది. ఓ పని నిమిత్తం నేను ఇక్కడికి వచ్చాను. నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు..’’అని రామకృష్ణ ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్షలతో వచ్చిన తెలంగాణలో పోలీసు నిర్బంధం ఇంతగా ఉండడం విచారకరమని వ్యాఖ్యానించారు. కాగా.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కల్పించాలంటూ పెద్ద ఉద్యమం జరుగుతోందని.. దేశంలోని పలు పార్టీలు కూడా మద్దతిస్తున్నాయని రామకృష్ణ తెలిపారు. టీడీపీ ఎన్డీయేతో ఉన్న బంధాన్ని పూర్తిగా తెంచుకుని బయటకు వచ్చి.. హోదాపై పోరాటం చేయాలని పేర్కొన్నారు. -
జీవో 515 అమలు చేయండి
-
మోత్కుపల్లి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు గురువారం నగరంలోని ట్యాంక్‌బండ్ దగ్గర గల అంబేద్కర్ విగ్రహం వద్ద మౌనదీక్షకు దిగారు. ఎస్సీ వర్గీకరణలో జాప్యాన్ని నిరసిస్తూ ఆయన దీక్షకు దిగారు. ఇదిలా ఉండగా దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్బంగా మోత్కుపల్లి నర్సింహులు కంటతడి పెట్టారు. ఎస్సీ వర్గీకరణ కోసం 22 ఏళ్లుగా పోరాటం చేస్తున్న మందకృష్ణను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. కేసీఆర్ నియంతృత్వ పోకడకు నిదర్శనమంటూ భావోద్వేగంతో కంటతడి పెట్టారు. కేసీఆర్‌కు మేము వ్యతిరేకం కాదు... అణగదొక్కితే తిరగబడతాం... అంటూ అఖిలపక్షాన్ని ఢిల్లీకి ఎప్పుడు తీసుకువెళ్తారో చెప్పాలన్నారు. మందకృష్ణను వెంటనే విడుదల చేయాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు. -
తెలుగుతల్లి ఫ్లైఓవర్ చేరుకున్న గణేశుడు
-
శోభాయాత్రకు సిద్ధమైన ఖైరతాబాద్ గణేశుడు
-
బాలుడిని ట్యాంక్ బండ్లో తోసేసిన బాబాయి
హైదరాబాద్ (రాంగోపాల్‌పేట్): ఓ చిన్నారిని బాబాయే హుస్సేన్ సాగర్ నీళ్లలో తోసి వేయగా, లేక్ పోలీసులు, స్థానికుల సహాయంతో ఆ చిన్నారి ప్రాణాలతో భయటపడ్డారు. ఈ ఘటన రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం శనివారం సాయంత్రం ట్యాంక్ బండ్‌పై ఉన్న లేపాక్షి భవనం వద్దకు ఆర్య విద్యాలయ హైస్కూ్ల్లో చదువుకుంటున్న మహేష్, సుభద్రల కుమారుడు ధనుష్ (5)ను అతని బాబాయ్ తీసుకుని వచ్చాడు. బాలుడిని నీళ్లలో తోసి అక్కడి నుంచి పరారయ్యాడు. నీటిలో మునిగిపోతున్న ధనుష్‌ను గుర్తించిన స్థానికులు లేక్ పోలీసులకు సమాచారం అందించడం వారు స్థానికుల సహాయంతో అతడిని రక్షించారు. అయితే ఆ బాలుడు తల్లిదండ్రులు పేర్లు, పాఠశాల పేరు మాత్రమే చెబుతుండగా, ఏ ప్రాంతమనేది చెప్పడం లేదు. దీంతో అతని తల్లిదండ్రుల కోసం రాంగోపాల్‌పేట్ పోలీసులు విచారణ చేపట్టారు. తనను సంతు అనే తన బాబాయ్ ట్యాంక్‌బండ్‌కు తీసుకువచ్చి నీటిలో తోసివేసినట్లు తెలిపారు. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలుడి ఆచూకీ కోసం నగరంతో పాటు తెలంగాణాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించినట్లు తెలిపారు. -
ట్యాంక్‌బండ్‌పై యువకుని ఆత్మహత్య
హైదరాబాద్ : ట్యాంక్‌బండ్‌పై చెట్టుకు ఉరివేసుకుని గుర్తుతెలియని యువకుడు గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మార్గంలో ఉదయం వాకింగ్‌కు వచ్చిన వ్యక్తులు యువకుని మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. లేక్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
‘మహా బతుకమ్మ’కు భారీ ఏర్పాట్లు
-
‘మహా బతుకమ్మ’కు భారీ ఏర్పాట్లు
సాక్షి,సిటీబ్యూరో: నగరంలో మహా బతుకమ్మ ఉత్సవాలకు జీహెచ్ఎంసీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఎల్బీ స్టేడియం, ట్యాంక్ బండ్ లపై మహా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించనున్నారు. గురువారం ట్యాంక్ బండ్ పై ఉత్సవ ఏర్పాట్లను జీహెచ్ఎంసి కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్‌పై ఉత్సవ వాతావరణం కనిపించేలా విద్యుత్ దీపాలతో ఆకర్షనీయంగా తీర్చిదిద్దుతున్నారు. బతుకమ్మల నిమజ్జనానికి ప్రత్యేకంగా కొలనులను ఏర్పాటుచేస్తున్నారు. ఈనెల 8న ఎల్బీస్టేడియంలో, 9న ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకు గాను 1060 మంది పారిశుధ్య కార్మికులు, 95 మంది ఎస్ఎఫ్ఏలతో కూడిన 11 బతుకమ్మ యాక్షన్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. గిన్నీస్ రికార్డు సాధన లక్ష్యంగా ఎల్బీస్టేడియంలో నిర్వహించే మహా బతుకమ్మతో గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించాలని జీహెచ్ఎంసీ యోచిస్తోంది. మహా బతుకమ్మకు నగరంలోని పదివేల మంది స్వయం సహాయక బృందాల మహిళలు హాజరుకానున్నారు. ట్యాంక్‌బండ్‌తో పాటు సరూర్‌నగర్, ఐడీఎల్ చెరువు, హస్మత్‌పేట్ చెరువు, ప్రగతీనగర్ చెరువు, సున్నం చెరువు, గంగారం చెరువు, దుర్గం చెరువు, పల్లెచెరువు, పెద్ద చెరువు తదితర ప్రాంతాల్లో బతుకమ్మ పండుగను నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు, రోడ్ల మరమ్మతులు, ప్రత్యేక లైటింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నగరంలోని దాదాపు 100ప్రాంతాల్లో భారీ బతుకమ్మలను ఏర్పాటు చేశా>రు. బతుకమ్మ పండుగ ఔనత్యాన్ని తెలిపే హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. నగరం వివిధ మతాలు, సాంస్కృతి సాంప్రదాయాలకు నిలయమని, నగర ఔనత్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిఒక్కరూ సహకరించాలని కమిషనర్ నగరవాసులను సూచించారు. నిమజ్జనానికి ప్రత్యేక కొలనులు నగరంలో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి గాను ప్రత్యేకంగా నిర్మించిన కొలనులను బతుకమ్మల నిమజ్జనానికి ఉపయోగించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించినట్లు కమిషనర్ తెలిపారు. హుస్సేన్ సాగర్ జలవిహార్ సమీపంలోని నిమజ్జన కొలను వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. బతుకమ్మల నిమజ్జనానికి కొలనును స్వచ్ఛమైన నీటితో నింపాలని, కొలను చుట్టూ బతుకమ్మలు అడే విధంగా మైదానాన్ని చదును చేయడంతో పాటు లైటింగ్, మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, అడిషనల్ కమిషనర్ రవికిరణ్, శంకరయ్య, చీఫ్ ఇంజనీర్ సుభాష్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా కాకా 87వ జయంతి
సాక్షి, హైదరాబాద్: సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి(కాకా) 87వ జయంతి వేడుకలను బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న వెంకటస్వామి విగ్రహానికి పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ కార్మికులు, దళితజాతి కోసం కాకా ఎనలేని కృషిచేశారన్నారు. ఆయన చేసిన సేవలను భవిష్యత్తు తరాలు గుర్తుంచుకోవాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహం ఏర్పాటు చేయించారన్నారు. షేర్వానీ దుస్తులతో హైదరాబాద్ బ్రాండ్‌ను మరింత పెంపొందించారని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ వ్యాఖ్యానించారు. తెలంగాణ స్వరాష్ట్రకాంక్షను కాకా బలంగా కోరుకున్నారనీ, అందుకు పోరాటం చేశారనీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. దళితుల ఉన్నత విద్యకోసం అంబేడ్కర్ విద్యాసంస్థలను నెలకొల్పి మార్గదర్శనం చేశారన్నారు. రాజకీయాల్లో తనకు కాకా తండ్రిలాంటి వారని ఎంపీ కె.కేశవరావు కొనియాడారు. కార్మికశాఖ మంత్రిగా కాకా ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. కాకా సహకారం వల్లే రాజకీయ ఓనమాలు నేర్చుకున్నానని ఎంపీ డి.శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో వెంకటస్వామి కుమారులు మాజీ మంత్రి జి.వినోద్, మాజీ ఎంపీ జి.వివేక్లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిని వెంకటస్వామి కుటుంబసభ్యులు శాలువ, జ్ఞాపికతో సన్మానించారు. పెద్దపల్లి జిల్లాకు వెంకటస్వామి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ కాకా అభిమానులు నినాదాలిచ్చారు. -
23 క్రేన్ల ఏర్పాటు
► నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌పై 23 క్రేన్ల ఏర్పాటు. ► పోలీసు నిఘా నీడలో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు....హుస్సేన్ర్ పరిసర ప్రాంతాల్లో సుమారు 800 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు నిమజ్జనోత్సవాన్ని సమీక్షించడం కనిపించింది. ► షీటీమ్‌లు మఫ్టీ డ్రెస్‌లో ట్యాంక్‌బండ్‌పై సంచరించారు. ► ఖైరతాబాద్ గణనాథుడు గతంలో ఎన్నడూలేని విధంగా మధ్యాహ్నమే నిమజ్జనం కావడంతో ట్యాంక్‌బండ్‌పై జనం సందడి గతంతో పొల్చుకుంటే కొంత తగ్గింది. ► పలు ప్రైవేటు ఆస్పత్రులు భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. ► పోలీసు కంట్రోల్ రూమ్ నుంచి గాంధీనగర్ ఇన్స్ పె క్టర్ ఎ. సంజీవరావు నిమజ్జనోత్సవం సందర్భంగా ఇటు పోలీసులకు భక్తులకు పలు సూచనలు చేయడం కనిపించింది.. ► వరంగల్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి తదితర జిల్లాల నుంచి పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. ► ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6 వరకు అప్పర్ ట్యాంక్‌బండ్‌లో సుమారు 844 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. ► గణేష్ నిమజ్జనానికి తరలి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ అధికారులు ఎన్టీఆర్ స్టేడియం వద్ద నుంచి నగరం నలుమూలలకు గణేష్ నిమజ్జనం స్పెషల్ బస్సులను నడిపారు. ► భక్తుల కోసం జలమండలి అధికారులు ఎన్టీఆర్ స్టేడియం, అశోక్‌నగర్ మెయిన్ రోడ్డులో ప్రత్యేకంగా ఉచిత వాటర్ ప్యాకెట్లు, మంచినీరు అందించే ఏర్పాట్లు చేశారు. – బన్సీలాల్‌పేట్ -
ట్యాంక్ బండ్ పరిసరాల్లో భక్తుల సందడి
-
ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయండి
దోమలగూడ: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని తెలంగాణ రజక ఐక్య వేదిక ఫౌండర్ చైర్మన్ సి.శంకర్, అధ్యక్షుడు అమానపు అప్పారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దోమలగూడలో మంగళవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో దాదాపు 30 లక్షల మంది రజకులు ఉండగా అందులో వృత్తిపై ఆధారపడిన వారు 10 లక్షల మంది వరకు ఉంటారన్నారు. ప్రభుత్వం రజకుల రక్షణకు చట్టం చేయడంలో, సమగ్రాభివృద్ధికి నిధులు విడుదల చేయడంలో, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వీరనారి చాకలి ఐలమ్మకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని, ఆమె విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం హిమాయత్‌నగర్‌లోని వెనుకబడిన తరగతుల సాధికారిత సంస్థ కార్యాలయంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని నిర్వహిస్తున్నామని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. -
పూలే విగ్రహం ఏర్పాటుపై సీఎంతో చర్చిస్తా
పూలే జయంతి సభలో మంత్రి జోగురామన్న హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌పై పూలే విగ్రహం ఏర్పాటు విషయుంపై వుుఖ్యవుంత్రితో చర్చిస్తానని రాష్ర్ట వెనుకబడిన తరగతుల సంక్షేవు శాఖ వుంత్రి జోగురావున్న చెప్పారు. సోమవారం రవీంద్రభారతిలో మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి ఉత్సవాలు జరిగాయి. పూలే జయంతి ఉత్సవ కమిటీ నిర్వహించిన ఈ ఉత్సవంలో మంత్రి జోగు రామన్నతో పాటు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు ఆర్ కృష్ణయ్య, చింతల రామచంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ‘పూలే ఆశయ సాధనకు శక్తివంచన లేకుండా కృషిచేస్తాం. ఆయన విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పైనా లేక అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసే ప్రాంగణంలో నెలకొల్పాలా అన్నది సీఎం కేసీఆర్‌తో చర్చించి నిర్ణయిస్తాం. అలాగే పది జిల్లాల్లో బీసీ భవన్లు, ప్రతి నియోజకవర్గంలో రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తాం. కళాశాలల వసతి గృహాలు నెలకొల్పతాం. ప్రతి జిల్లాకూ ఒక స్టడీ సర్కిల్ అందుబాటులోకి తెచ్చి అందులో ఏడాదంతా శిక్షణ కొనసాగేలా చర్యలు తీసుకొంటాం. బీసీ కార్పొరేషన్ కింద పదివేల మందికి రుణాలు మంజూరు చేశాం. ఈ ఏడాది 50 వేల మందికి తగ్గకుండా రుణాలు ఇస్తాం. కుల సంఘాల సదస్సులు నిర్వహించుకొనేలా ఆడిటోరియం నిర్మిస్తాం. త్వరలోనే బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తాం. పూలే జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేరుస్తాం’ అని చెప్పారు. ప్రభుత్వాన్ని నిందించడం తగదు... స్వామిగౌడ్ మాట్లాడుతూ... ఏమీ చేయలేదని ప్రభుత్వాన్ని నిందించడం కంటే బీసీల అభ్యన్నతికి మనమేం చేస్తున్నామో ఆలోచించాలన్నారు. పూలే ఆశయ సాధనకు పాటుపడకుండా బీసీలను అగ్రవర్ణాలు అణగదొక్కుతున్నాయనడం సరికాదన్నారు. జన్మతః సంక్రమించే హక్కులను కూడా పోరాటం చేసి సాధించుకోవడం దురదృష్టకరమని ఆర్ కృష్ణయ్య అన్నారు. అనంతరం బీసీ హాస్టల్లో చదువుకుంటూ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఆనంద్‌ను సత్కరించారు. ఉత్సమ కమిటీ చైర్మన్ రామరాజు, వైస్‌చైర్మన్ కుందారం గణేష్‌చారి, బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రతినిధి సోమేశ్‌కుమార్, బీసీ నాయకుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. పూలే కృషి స్ఫూర్తిదాయకం... రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అధ్యక్షతన అంబర్‌పేట చౌరస్తాలో జరిగిన పూలే జయంతి ఉత్సవంలో మంత్రి జోగురామన్న పాల్గొన్నారు. సాంఘిక దురాచారాలు రూపుమాపేందుకు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే చేసిన కృషి స్ఫూర్తిదాయకమని మంత్రి కొనియాడారు. అనంతరం పూలే విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అంబర్‌పేట చే నంబర్ చౌరస్తాలో జ్యోతిరావుపూలే పేరిట ఆడిటోరియాన్ని నిర్మించాలన్న వీహెచ్ మంత్రిని కోరగా, సీఎం దృష్టికి తీసుకెళతానని ఆయన హామీ ఇచ్చారు. -
సాగర్ లోకి దూకిన ప్రేమజంట: ప్రియుడి మృతి
హైదరాబాద్: సమస్యలు పరిష్కరించుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతోన్న హైదరాబాద్ నగర వాసులకు హుస్సేన్ సాగర్ అడ్డాగామారిన నేపథ్యంలో లేక్ పోలీస్ వ్యవస్థను ఏర్పాటుచేసి ఆత్మహత్యలతోపాటు అసాంఘిక శక్తులకూ అడ్డుకట్టవేసే ప్రయత్నం జరిగింది. అయినాకూడా అక్కడ ఆత్మహత్యోదంతాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఈ రోజు(బుధవారం) ఉదయం కూడా ట్యాంక్ బండ్ పై నుంచి హుస్సేన్ సాగర్ లోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిందో ప్రేమజంట. రామ్ గోపాల్ పేట పోలీసులు తెలిపిన వివరాలను బట్టి నగరానికే చెందిన నరేశ్(29) అనే వ్యక్తి తన ప్రేయసితో కలిసి బుధవారం ఉదయం హుస్సేన్ సాగర్ లోకి దూకాడు. ఇది గమనించిన లేక్ పోలీసులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే నరేశ్ ప్రాణాలు కోల్పోయాడు. అపస్మారక స్థితిలోఉన్న ప్రేమికురాలిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వీరికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడంతోపాటు కుటుంబసభ్యులకు సమాచారం అందించేపనిలోపడ్డారు పోలీసులు. -
ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు...
రెడ్డిజన సంఘం వజ్రోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ వెల్లడి రెడ్డి హాస్టల్ విస్తరణకు స్థలంతో పాటు రూ. 10 కోట్లు హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌పై త్వరలోనే తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంలో ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేయలేదన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సురవరం ప్రతాపరెడ్డి, రాజ బహదూర్ వెంకట్రామిరెడ్డిలతో పాటు రావి నారాయణరెడ్డి, రఘుపతిరెడ్డి లాంటి ఎంతో మంది తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారన్నారు. అలాంటి మహనీయుల విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లోని పాతబస్తీ అలియాబాద్‌లో రెడ్డి జన సంఘం వజ్రోత్సవ వేడుకలకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డితో కలసి స్మారక స్తూపాన్ని, సావనీర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ 75 ఏళ్లుగా రెడ్డి జన సంఘం ప్రజా సేవలో నిమగ్నమవడం అభినందనీయమన్నారు. ఇలాంటి చారిత్రక కార్యక్రమానికి హాజరుకావడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. రాజబహదూర్ వెంకట్రామిరెడ్డి 98 ఏళ్ల క్రితమే రెడ్డి హాస్టల్ స్థాపించి ఎంతో మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. నగరంలో 1933లోనే మహిళా కళాశాలను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఈ చారిత్రక పరంపర కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రెడ్డి హాస్టల్లో అన్ని కులాలకు సంబంధించిన వారు విద్యనభ్యసించడం అభినందనీయమని సీఎం అన్నారు. రెడ్డి హాస్టల్ విస్తరణ కోసం 5 నుంచి 10 ఎకరాల స్థలం కావాలని నిర్వాహకులు తనను అడిగారని... విస్తరణ అవసరాన్ని గుర్తించి నగర శివార్లలో వారం పది రోజుల్లో స్థలాన్ని సేకరిస్తామన్నారు. ప్రభుత్వం తరఫున రూ. 10 కోట్ల నిధులను విడుదల చేస్తామని ప్రకటించారు. అనంతరం హోం మంత్రి నాయిని నర్సింహ్మా రెడ్డి మాట్లాడుతూ రెడ్డి జన సంఘం సేవా కార్యక్రమాలను తాను స్వయానా చూశానన్నారు. 50 ఏళ్ల క్రితం తాను చందూలాల్ బేలాలో నివాసం ఉండేవాడినని, సంఘ సేవా కార్యక్రమాలలో కూడా పలుమార్లు పాల్గొన్నానన్నారు. అనంతరం జస్టిస్ సుభాషణ్ రెడ్డి మాట్లాడుతూ 75 ఏళ్ల క్రితం సంఘం ఏర్పాటు చేసి ఆర్థిక వనరులు సృష్టించుకొని సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి ఉస్మానియా విశ్వ విద్యాలయం తెలుగు విభాగం మాజీ హెచ్‌వోడీ ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకట్ రెడ్డి సభాధ్యక్షత వహించగా.. వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి, ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బద్ధం బాల్‌రెడ్డి, రెడ్డి జన సంఘం అధ్యక్షుడు బి.మాధవరెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్.రాంరెడ్డి, ఉపాధ్యక్షుడు బి.శ్యాంసుందర్ రెడ్డి, కార్యదర్శి ఎస్.శివారెడ్డి, సంయుక్త కార్యదర్శి ఎస్.మధుసూదన్ రెడ్డి, ఉప కార్యదర్శులు బొక్క రాంచంద్రారెడ్డి, మామిడి శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి పి.బోజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ట్యాంక్‌బండ్‌పై కాకా విగ్రహావిష్కరణ
-
ట్యాంక్‌బండ్‌పై కాకా విగ్రహావిష్కరణ
హైదరాబాద్ : దివంగత కాంగ్రెస్ నేత జి.వెంకటస్వామి (కాకా) విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ట్యాంక్‌బండ్‌పై ఆవిష్కరించారు. ట్యాంక్ బండ్ ఆరంభంలో ఉన్న అంబేద్కర్ పార్క్‌లో కాకా విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ కోసం కాకా చివరిదాకా పరితపించారన్నారు. కాకా సేవలను గుర్తు చేసుకున్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మరోవైపు కాకా విగ్రాహావిష్కరణను నిరసిస్తూ తెలంగాణ ఎమ్మార్పీఎస్ నేతలు నిరసనకు దిగారు. దీంతో ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
వైభవంగా వినాయక నిమజ్జనం
హైదరాబాద్: జంట నగరాల్లో వినాయకుడి నిమజ్జన శోభాయాత్ర వైభవంగా సాగుతోంది. లక్షలాది మంది భక్తులు గణనాథుడిని దర్శించుకున్నారు. ఆదివారం సాయంత్రానికి దాదాపు 26 వేల వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి వేలాది విగ్రహాలు హుస్సేన్ సాగర్ వైపు కదులుతున్నాయి. మహానగరం అంతా డప్పులు, డ్యాన్సులు, డీజేలతో సందడిగా మారింది. ముఖ్యంగా ట్యాంక్‌బండ్, హుస్సేన్ సాగర్ ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. ట్యాంక్‌బండ్‌తో పాటు 25 చెరువుల్లో వినాయకుడి నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. తొమ్మిది ప్రధాన మార్గాల నుంచి వినాయక విగ్రహాలు ట్యాంక్ బండ్ కు చేరుకుంటున్నాయి. ఇదిలా ఉండగా, ఖైరతాబాద్ త్రిశక్తిమయ మోక్ష గణపతి నిమజ్జనం సోమవారం ఉదయానికి పూర్తయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కాసేపట్లో ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన యాత్ర ప్రారంభంకానుంది. వినాయక నిమజ్జనం కోసం 25 వేల భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఒడిశా, తమిళనాడు పోలీసులతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు కమాండింగ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా 400 సీసీ కెమెరాలతో మానిటర్ చేస్తున్నారు. గతంలో ఇబ్బందులు ఎదురైన ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించి... నిమజ్జనం దారిలోని ప్రతి కూడాలిలో సీసీ కెమెరాలు అమర్చారు. ఎలాంటి ఘటన జరగకుండా కమాండింగ్ కంట్రోల్ ద్వారా మానిటర్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ జంట నగరాల్లో పలుప్రాంతాల్లో సందర్శించి ఏర్పాట్లును సమీక్షించారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి నగరంలో పటిష్ట పోలీసు బలగాలను ఉంచారు. ఎలాంటి ఇబ్బంది కలిగినా సమాచారం అందించాలని కోరారు. -
ట్యాంక్‌బండ్ వద్ద కలకలం
హైదరాబాద్: వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద కలకలం చెలరేగింది. ట్యాంక్ బండ్ వద్ద వినాయక నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన క్రేన్ నెంబర్ 20 వద్ద మృతదేహం లభ్యమైంది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. -
ట్యాంక్‌బండ్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం
రాంగోపాల్‌పేట్: కుటుంబ కలహాలతో ఓ మహిళ హుస్సేన్ సాగర్‌లో దూకేందుకు యత్నించగా లేక్ పోలీసులు రక్షించారు. ఇన్స్పెక్టర్ శ్రీదేవి తెలిపిన వివరాల ప్రకారం.. జీరా ఇందిరానగర్‌కాలనీకి చెందిన హంసమ్మ(36) బాలేష్‌లు భార్యాభర్తలు. వీరికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొద్ది రోజుల నుంచి భర్త రోజు మద్యం సేవించి భార్యను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. ఆదివారం ఉదయం కూడా మద్యం సేవించి వచ్చిన బాలేష్ భార్యను తిట్టడం మొదలు పెట్టాడు. దీంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురై ట్యాంక్‌బండ్‌పై ఉన్న లేపాక్షి భవనం వద్దకు వచ్చి హుస్సేన్ సాగర్‌లో దూకేందుకు యత్నిస్తుండగా లేక్ పోలీసులు రక్షించారు. అనంతరం ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వెళ్లి కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
కొడుకు వైద్యం కోసం వచ్చితండ్రి ఆత్మహత్య
హైదరాబాద్: కొడుకు వైద్యం కోసం వచ్చి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన నగరంలోని లోయర్ ట్యాంక్ బండ్ సమీపంలో బుధవారం ఉదయం జరిగింది. వివరాలు... నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలంలోని రత్తాలరాంరెడ్డికి చెందిన రైతు లింబయ్య కొడుకు వైద్యం కోసం నగరానికి వచ్చాడు. అయితే ఈ రోజు ఉదయం బస్సు కిందపడి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. అది విఫలం కావడంతో లోయర్ ట్యాంక్‌బండ్ సమీపంలోని కట్టమైసమ్మ దేవాలయం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కుమారుడి వైద్యం చేయించలేక పోతున్నానే మనస్ధాపంతో లింబయ్య ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. లింబయ్య మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
వెలిగిపోతున్న టాంక్బండ్
-
31వరకు ట్యాంక్‌బండ్‌పై రాకపోకలు బంద్
-
31వరకు ట్యాంక్‌బండ్‌పై రాకపోకలు బంద్
హెదరాబాద్ : చారిత్రక హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పనుల్లో భాగంగా చేపడుతున్న నాలా మళ్లింపు పనుల కారణంగా శుక్రవారం నుంచి ఈ నెల 31 వరకు ట్యాంక్‌బండ్‌పై రాకపోకలను నిషేధించారు. లిబర్టీ నుంచి రాణిగంజ్ వరకు వాహనాల రాకపోకలకు వీలు లేకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. బుద్ధభవన్ నుంచి రాణిగంజ్- కలాసీగూడ నాలా వరకు పారిశ్రామిక వ్యర్థ జలాలను మళ్లించేందుకు భారీ పైప్‌లైన్ వేయనున్నందున ట్రాఫిక్ పోలీసుల నుంచి అనుమతులు తీసుకొని రాకపోకలు నిలిపివేసినట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. కాగా కూకట్పల్లి, జీడిమెట్ల నాలాల నుంచి రోజువారీగా వచ్చి చేరుతున్న 400 మిలియన్ లీటర్ల పారిశ్రామిక వ్యర్థజలాలు సాగర్‌లోకి చేరకుండా నేరుగా అంబర్‌పేట్‌లోని మురుగు శుద్ధి కేంద్రానికి మళ్లించేందుకు సుమారు రూ.40 కోట్ల అంచనా వ్యయంతో నాలా మళ్లింపు పనులు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ పనుల్లో భాగంగా ప్రకాశ్‌నగర్- నెక్లెస్‌రోడ్డు - పి.వి.ఘాట్- జీహెచ్ఎంసీ హెర్బల్ గార్డెన్- మారియట్ హోటల్ మార్గాల్లోనూ నాలా మళ్లింపు పనులను యుద్ధప్రాతిపాదికన చేపడుతున్నట్లు జలమండలి ప్రాజెక్టు విభాగం డెరైక్టర్ కొండారెడ్డి తెలిపారు. -
ఉచిత వైఫై సేవలు ప్రారంభం
-
దంపతుల ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ : ట్యాంక్ బండ్ వద్ద హుస్సేన్‌సాగర్‌లో దూకి దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే లేక్ పోలీసులు రంగంలోకి దిగి భర్త శ్రవణ్‌ను కాపాడి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. భార్య పావని గల్లంతవగా ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దంపతులు సికింద్రాబాద్ సిఖ్ విలేజ్ ప్రాంత వాసులుగా పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. (రామ్‌గోపాల్‌పేట్) -
హల్చల్ చేసిన మహిళా కానిస్టేబుల్
-
ఇది అప్రజాస్వామికం: వైఎస్సాఆర్ సీపీ ఎమ్మెల్యేలు
-
వైఎస్సాఆర్ సీపీ ఎమ్మెల్యేల పాదయాత్ర!
-
నలుగురు ఆకతాయిల అరెస్ట్
హైదరాబాద్ క్రైం: హైదనాబాద్ ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డులో గురువారం రాత్రి 9 గంటల సమయంలో పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆ ప్రాంతంలోకి వచ్చిన ప్రేమ జంటలను వేధిస్తున్న నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
ట్యాంక్‌బండ్‌పై మృతదేహం.. ట్రాఫిక్ జాం
హైదరాబాద్: హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ట్యాంక్ బండ్‌పై గురువారం రాత్రి గుర్తు తెలియని యువకుడి మృతదేహం పడి ఉంది. మృతదేహాన్ని చూసేందుకు వాహనదారులు ఆపడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో అటుగా వెళ్లున్న వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కాగా మృతదేహం ఎవరిది, ఈ ఘటనకు గల కారణాలేంటి అన్న విషయాలు తెలియాల్సివుంది. -
ట్యాంక్ బండ్ పై ఓ ఎమ్మెల్యే కుమారుడి వీరంగం!
హైదరాబాద్: వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడు బుధవారం సాయంత్రం ట్యాంక్ బండ్ పై వీరంగం సృష్టించాడు. అతని అనుచరులతో కలిసి మరో ఎమ్మెల్యే ఫ్లెక్సీని చించేసి నానా హంగామా చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడానికి యత్నించారు. తాను ఎమ్మెల్యే కుమారుడినంటూ పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. ఆ దాడిని అడ్డుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల లొల్లి!
-
సద్దుల బతుకమ్మ ఉయ్యాలో.. ఉయ్యాలా..
-
ఏమేమి పువ్వొప్పునే..
నేడే సద్దుల బతుకమ్మ ట్యాంక్‌బండ్ వద్ద భారీ ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ ఉత్సవాల చివరిరోజును ధూంధాంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లాల్లోనూ బతుకమ్మ ఉత్సవాల ముగింపు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనుంది. ఇందుకోసం బతుకమ్మ పుష్పోత్సవం పేరిట పెద్దఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో ఆకట్టుకునేలా విద్యుద్దీపాల అలంకరణ, లేజర్ షోలు, బతుకమ్మ బంగారు రథాలు, ఆయా జిల్లాల్లోని విశిష్టతను చాటిచెప్పేలా ఒక్కో జిల్లా నుంచి ఒక్కో శకటం బతుకమ్మ ఊరేగింపు కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. హుస్సేన్‌సాగర్‌లో లేజర్ షో, బీమ్ లైట్ల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలతో సద్దుల బతుకమ్మ కార్యక్రమం గురువారం అట్టహాసంగా జరగనుంది. ఇందుకోసం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. కాగా బతుకమ్మ ఉత్సవాలపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు బుధవారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. బతుకమ్మ నిమజ్జనానికి వచ్చే మహిళలు చెరువుల వద్ద ఎలాంటి ఇబ్బందులు పడకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగానికి సూచించారు. కాగా.. ఈ ముగింపు కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్, సీఎం కేసీఆర్ పాల్గొంటారు. మహిళల కోసం 631 బస్సులు.. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చే మహిళల కోసం జీహెచ్ఎంసీ పరిధిలో 631 బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్‌పై ఈ కార్యక్రమంలో దాదాపు 25 వేల మంది మహిళలు పాల్గొంటుండగా.. పదివేల మందికి పైగా సందర్శకులు వస్తారని అంచనా. ఈ వేడుకలు రావాల్సిందిగా ప్రభుత్వమే దాదాపు నాలుగు వేల మందికి ఆహ్వానపత్రాలు పంపించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ప్రసాదం కూడా పంపిణీ చేయనున్నారు. బషీర్‌బాగ్ నుంచి ప్రారంభం.. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ వద్ద ఉన్న ఆలియా కళాశాల నుంచి మొత్తం 11 బంగారు బతుకమ్మ రథాలు బయలుదేరుతాయి. పౌర సంబంధాల శాఖ ఏర్పాటు చేయనున్న రథంపై బతుకమ్మతో పాటు ఎవరెస్ట్‌ను అధిరోహించిన మాలావత్ పూర్ణ, క్రీడాకారిణి గుత్తా జ్వాల, సౌందర్య, సింధు, నైనా జైస్వాల్ తదితరులు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మలతో ఉంటారని పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య తెలిపారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా శకటం ఆలంపూర్ జోగులాంబ దేవాలయ నమూనాతో ఉంటుందని, నల్లగొండ నుంచి పానగల్ చెరువు విశిష్టతను చెబుతూ, ఖమ్మం జిల్లా నుంచి తెప్పోత్సవ నమూనా.. ఇలా శకటాలు ఉంటాయని వివరించారు. 2 వేల మంది.. 10 వేల బతుకమ్మలు.. సద్దుల బతుకమ్మలను తయారు చేయడానికి రెండు వేల మంది మహిళలు ఎల్బీ స్టేడియంలో బుధవారం నుంచే పని ప్రారంభించారు. తెలంగాణ జిల్లాల నుంచి సేకరించిన 35 టన్నుల పూలతో గురువారం సాయంత్రంలోగా 10 వేల బతుకమ్మలను పేర్చనున్నారు. ఇందులో కొన్ని బతుకమ్మలను భారీస్థాయిలో రూపొందిస్తున్నారు. కాగా కార్యక్రమం ముగింపు దశలో చేపట్టనున్న బాణసంచా పేలుడు కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ఒక అధికారి చెప్పారు. హుస్సేన్‌సాగర్ రోటరీ ఘాట్‌ను బతుకమ్మ ఘాట్‌గా రూపొందిస్తున్నామని అక్కడ పది వేల బతుకమ్మలను నిమజ్జనం చేస్తారని తెలిపారు. ఒక్కరూ రావట్లేదు..! బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడానికి సీఎం కేసీఆర్ స్వయంగా పలు రాష్ట్రాల మహిళా ముఖ్యమంత్రులను, జాతీయ నేతలను ఆహ్వానించినా... ఒక్కరి నుంచి కూడా తాము హాజరుకానున్నట్లు ఎలాంటి సమాచారం ప్రభుత్వానికి అందలేదు. బతుకమ్మ ఉత్సవాలను తొలిసారి రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నందున... దీనికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా పశ్చిమ బెంగాల్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల సీఎంలతో పాటు మొన్నటి వరకు తమిళనాడు సీఎంగా జయలలితకు కూడా కేసీఆర్ ఆహ్వానం పంపారు. వీరితో పాటు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్లను కూడా ఆహ్వానించారు. వీరందరిలో జయలలిత అవినీతి కేసులో జైలుకు వెళ్లగా.. మిగతా మహిళా నేతలెవరినుంచీ కూడా ఎలాంటి సమాచారం లేదు. కాగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అఖిల భారత సర్వీసు మహిళా ఉన్నతాధికారులను కూడా.. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రత్యేకంగా ఆహ్వానించడం విశేషం. -
ఆ విగ్రహాలను తొలగిస్తే హైదరాబాద్‌కు విఘాతం
హైదరాబాద్ : ట్యాంక్‌బండ్‌పై సీమాంధ్ర ప్రముఖుల విగ్రహాలు అవసరం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనటం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి శంకర్రావు అభిప్రాయపడ్డారు. ఉన్న విగ్రహాలను తొలగించకుండా తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఆయన సోమవారమిక్కడ అన్నారు. సీమాంద్ర విగ్రహాలను తొలగిస్తే హైదరాబాద్‌కు విఘాతం జరుగుతుందని శంకర్రావు వ్యాఖ్యానించారు. తెలుగువారి మధ్య ఐక్యత లేకపోతే అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు మాట్లాడేవారు మధ్య విద్వేషాలు మంచిది కాదని శంక్రరావు అన్నారు. -
కొనసాగుతున్న గణేష్ శోభాయాత్ర
హైదరాబాద్ : గణేష్ శోభాయాత్ర మంగళవారం కూడా కొనసాగుతోంది. నిమజ్జనం కోసం గణనాధులు ట్యాంక్‌బండ్ వద్ద బారులు తీరాయి. భక్తులతో ఆ పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. మరోవైపు ఖైరతాబాద్ లంబోదరుడి శోభాయాత్ర ఇంకా ప్రారంభం కాలేదు. దాంతో వినాయకుడి నిమజ్జనం ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో జరగవచ్చని అంచనా. కాగా మధ్యాహ్నం రెండు గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. అలాగే నిమజ్జనాల కోసం ట్యాంక్‌బండ్‌పై 22, ఎన్టీఆర్ మార్గ్‌లో 9 క్రేన్లను ఏర్పాటు చేశారు.