హైదరాబాద్ : ట్యాంక్‌బండ్‌పై చెట్టుకు ఉరివేసుకుని గుర్తుతెలియని యువకుడు గురువారం ఉదయం ఆత‍్మహత‍్య చేసుకున్నాడు. ఆ మార్గంలో ఉదయం వాకింగ్‌కు వచ్చిన వ‍్యక్తులు యువకుని మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. లేక్ పోలీసులు వెంటనే అక‍్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార‍్టం నిమిత‍్తం గాంధీ ఆస‍్పత్రికి తరలించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.