![Case Filed Against Teenmar Mallanna In Jubilee Hills Police Station - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/27/Teenmar-Mallanna.jpg.webp?itok=NLemT3gC)
సాక్షి, బంజారాహిల్స్: సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ఐపీసీ సెక్షన్ 504, 506 కింద కేసు నమోదు చేశారు. శ్రీకృష్ణానగర్‌లో నివసించే మాదాసు రవితేజ అనే వ్యాపారి ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి క్యూన్యూస్‌లో ‘నీకు దమ్ముంటే నాదగ్గరికి రా’ అని తీన్మార్ మల్లన్న సవాల్ విసరడం తనను షాక్‌కు గురి చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సాధారణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆరోపించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment