సాక్షి, జగద్గిరిగుట్ట: భూవివాదం నేపథ్యంలో జగద్గిరిగుట్ట కార్పొరేటర్ జగన్‌పై అసత్య ప్రచారం చేయడంతో పాటు బెదిరింపులకు దిగారన్న ఆరోపణలపై తీన్మార్ మల్లన్నపై కోర్టు ఆదేశాలతో జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్టకు చెందిన కొందరు వ్యక్తులు కార్పొరేటర్ జగన్ తమ భూమి కబ్జా చేశారని తీన్మార్ మల్లన్నను సంప్రదించారు. దీంతో అతడి టీమ్ సభ్యులు కార్పొరేటర్ పీఏగా పనిచేస్తున్న సంపత్‌రెడ్డికి కాల్‌చేసి భూవివాదం విషయమై అడిగారు.
అయితే తనపై బెదిరింపులకు దిగడంతో పాటు భూమిని ఆక్రమించామని అసత్య ప్రచారం చేశారని ఆరోపిస్తూ సంపత్‌రెడ్డి జూలై 21న కోర్టును ఆశ్రయించాడు. తీన్మార్ మల్లన్న గ్రూపు సభ్యులు మాట్లాడిన కాల్ రికార్డును పరిశీలించిన కోర్డు అతడిపై కేసు నమోదు చేయాలని జగద్గిరిగుట్ట పోలీసులకు ఉత్తర్వు కాపీని అందజేయడంతో బుధవారం కేసు నమోదు చేశారు.
చదవండి: పబ్‌లో చిన్నారి డాన్స్ వైరల్.. పోలీసుల సీరియస్
Comments
Please login to add a commentAdd a comment