
సాక్షి, హైదరాబాద్: నగరంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. జగద్గిరిగుట్టలోని భూదేవిహిల్స్ సమీపంలోని పరికి చెరువు వద్ద ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. గాజులరామారంలోని మహదేవపురం ప్రాంతంలోని కొన్ని బేస్మెంట్లను కూడా కూల్చివేశారు. గత వారం చెరువు పరిరక్షణ సమితి సభ్యులు హైడ్రాకు ఫిర్యాదు చేసిన క్రమంలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీగా మోహరించారు.
కాగా, నగర శివార్లలో ఫాం ల్యాండ్ ప్లాట్ల పేరిట అక్రమ లేఔట్ల అమ్మకాలు జరుగుతున్నాయని, అనుమతి లేని వాటిలో ప్లాట్లు ఖరీదు చేసి ఇబ్బందులు పడొద్దని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) సోమవారం హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఫార్మ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై నిషేధం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు జరుగుతున్నాయని తమకు ఫిర్యాదులు వచ్చాయని స్పష్టం చేసింది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం లక్ష్మీగూడ గ్రామంలోని సర్వే నం.50లోని 1.02 ఎకరాల్లో ఫాం ప్లాట్ల పేరిట లే ఔట్ వేసి అమ్మేస్తున్నారని ప్రజావాణి ద్వారా హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నగర ప్రజలను అప్రమత్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ మున్సిపల్ యాక్ట్–2019, తెలంగాణ పంచాయత్ రాజ్ యాక్ట్–2018 ప్రకారం ఎక్కడా ఫాం ల్యాండ్ ప్లాట్లుగా అమ్మడానికి వీలులేదని ఆయన పేర్కొన్నారు.

ఫాం ల్యాండ్ అంటే కనీసం 2 వేల చదరపు మీటర్లు, లేదా 20 గుంటల స్థలం ఉండాలని ప్రభుత్వం గతంలోనే నిర్దేశించిందని వివరించారు. ఈ మేరకు ఫాం ప్లాట్లురిజిస్ట్రేషన్లు చేయరాదని స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖకు ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు కూడా ఇచి్చందని రంగనాథ్ తెలిపారు. జీవో నం.131 ప్రకారం 2020 ఆగస్టు 31 తర్వాత వెలసిన అక్రమ లేఔట్లలోని ప్లాట్లలో ఇల్లు నిరి్మంచడానికి ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం గుర్తించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment