సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో తండ్రి,కూతురు వీడియోపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన నిందితుడు యూట్యూబ్ ప్రణిత్ హనుమంతు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పోక్సో చట్టంతో పాటు 67B ఐటీ యాక్ట్, భారత న్యాయ సంహిత చట్టం సెక్షన్లు 79, 294 ప్రకారం కేసు నమోదు చేశారు. ప్రణీత్‌తోపాటు ఆ లైవ్ ఛాటింగ్ చేసిన మరో ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో A2 డల్లాస్ నాగేశ్వర్ రావు, A3 బుర్రా యువరాజ్, A4 సాయి ఆదినారాయణగా ఉన్నారు. ప్రస్తుతం యూట్యూబ్ ప్రణిత్ హనుమంతు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అదుపులో ఉన్నాడు. నిన్న(బుధవారం) బెంగళూరు నుంచి పిటి వారెంట్‌పై పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి హైదరాబాకు తీసుకొచ్చారు.
హనుమంతును విచారించిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. ఈ మధ్యాహ్నం నాంపల్లి కోర్టులో హాజరు పరిచింది. ప్రణీత్ హనుమంతుకు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment