chintapandu navinkumar
-
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బ్లాక్ మెయిలర్: గాదరి కిషోర్
హైదరాబాద్: ఎల్లుండి (సోమవారం) జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఉండే నల్గొండ పట్టభద్రులు వెళ్లి ఓటు వేయాలని బీఆర్ఎస్ నేత గాదరి కిషోర్ కుమార్ కోరారు. ఆయన శనివారం తెలంగాణ భవన్లో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బ్లాక్ మెయిలర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక మొత్తం ఇలాగే ఉంది. వందలాది కేసులు ఉన్న వ్యక్తి మల్లన్న. బ్లాక్ మెయిల్ కేసులు ఉన్నాయి. రేవంత్‌రెడ్డి సీఎం అవ్వగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చి, మేమే ఇచ్చినం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. చేసింది చెప్పుకోలేక మేము ఓడిన వాతావరణం కనిపించింది. ఏదైనా అడిగితే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టడం తప్ప చేసిందేమీ లేదు. రైతు బంధు ఇవ్వలేదు, సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇస్తాం అంటున్నారు. మేనిఫెస్టోలో అన్ని రకాల వడ్లకు రూ. 500 ఇస్తామన్నారు. రైతు రుణమాఫీ ఇద్దరు భార్యాభర్తలకు కలిపి రెండు లక్షలు చేస్తామని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ కథ మొదటికి వచ్చింది. మోసపూరిత మాటలతో ప్రజల్ని మభ్య పెడుతున్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడారు కాంగ్రెస్ నాయకులు’’ అని గాదరి కిషోర్ మండిపడ్డారు. -
రైతులకు మద్దతు.. తీన్మార్ మల్లన్న అరెస్ట్
సాక్షి, హన్మకొండ: జిల్లాలోని ఆరెపల్లిలో భూసేకరణ జీఓ 80ఏ ను రద్దు చేయాలని కోరుతూ చేపట్టిన రైతుల ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీసింది. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును అడ్డుకునేందుకు రైతులు, రైతు కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గ్రామసభ నిర్వహిస్తుంటే పోలీసులు వచ్చి అడ్డుకున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆందోళన కారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు రైతులను నెట్టేసి, తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసి వేలేరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. సాయంత్రం స్వంత పూచికత్తుపై వదిలిపెట్టారు. అయితే జీఓ 80ను వ్యతిరేకంగా ఆరెపల్లిలో రైతులు పోచమ్మ ఆలయం వద్ద గ్రామ సభ నిర్వహించగా వారికి మద్దతుగా వెళ్ళితే అరెస్టు చేయడంతో పాటు అక్రమ కేసు నమోదు చేశారని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. కేసులకు భయపడేది లేదని, ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించిన జీవో 80ఏ ను రద్దు చేసే వరకు రైతుల పక్షాన పోరాడుతానని స్పష్టం చేశారు. గ్రామంలో ప్రశాంతంగా గ్రామ సభ పెట్టుకుంటే పోలీసులు వచ్చి సభను భగ్నం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతమందిని అరెస్ట్ చేసిన ఉద్యమం ఆగదని, భూసేకరణ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చదవండి: ఊరు మునిగింది.. ఉపాధి పోయింది! -
తీన్మార్ మల్లన్నపై మంత్రి పువ్వాడ రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. ఏడు రోజుల్లో!
సాక్షి, ఖమ్మం లీగల్: ఎలాంటి ఆధారాల్లేకుండా తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ చింతపండు నవీన్‌కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేశారు. ఈమేరకు హైదరాబాద్‌కు చెందిన న్యాయవాదులు పేరి వెంకటరమణ, పేరి ప్రభాకర్ ద్వారా ఆయన మల్లన్నకు నోటీసులు పంపించారు. ప్రజాసేవలో ఉన్న తమ క్లయింట్‌పై ఆరోపణలు చేయడం ద్వారా ప్రచారం పొందాలనే దురుద్దేశంతో తీన్మార్ మల్లన్న తన చానల్, పత్రికలో అబద్ధాలు ప్రసారం చేశారని నోటీసులో పేర్కొన్నారు. బీజేపీకి చెందిన మల్లన్న జర్నలిస్ట్‌గా చెలామణి అవుతూ జర్నలిజంలో కనీస ప్రమాణాలు పాటించకుండా అసత్యపు ప్రచారం చేశారని తెలిపారు. ఈమేరకు సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం మంత్రికి రూ.10 కోట్లు పరిహారం చెల్లించాలని, దీంతో పాటు చట్టప్రకారం తగిన చర్యలకు బాధ్యులవుతారని పేర్కొన్నారు. కాగా, ఏడు రోజుల్లోగా తన క్లయింట్ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు మల్లన్న బేషరతుగా క్షమాపణ చెప్పాలని న్యాయవాదులు నోటీసులో సూచించారు. చదవండి: VTuber: వీట్యూబర్లు ఎవరో తెలుసా..వీళ్లు సృష్టిస్తున్న హంగామా ఏంటో విన్నారా -
బీజేపీకి తీన్మార్ మల్లన్న గుడ్‌బై?
సాక్షి, హైదరాబాద్: చింతపండు నవీన్‌కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న బీజేపీ నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది. పార్టీలో ఆశించిన మేర ప్రాధాన్యత లభించని కారణంగానే మల్లన్న బీజేపీని వీడాలని నిర్ణయించుకున్నట్లుగా ఆయన అనుయాయులు చెబుతున్నారు. కాగా, మల్లన్న వ్యవహారంపై బీజేపీ నాయకులెవరూ స్పందించవద్దని రాష్ట్ర నాయకత్వం సూచించినట్లు సమాచారం. తాజా పరిణామాలపై తీన్మార్ మల్లన్న అభిప్రాయం కనుక్కునేందుకు సాక్షి ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు. తీన్మార్ మల్లన్న డిసెంబర్ 7న ఢిల్లీలో బీజేపీలో చేరారు. కేసీఆర్ తనపై 38 కేసులు పెట్టినా, ఏమి సాధించలేకపోయారని బీజేపీలో చేరిన తర్వాత తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షును ఉద్దేశిస్తూ అవమానకరంగా తీన్మార్ మల్లన్న సోషల్ మీడియాలో నిర్వహించిన పోల్‌పై బీజేపీ అధిష్టానం అప్పట్లో కన్నెర్ర చేసింది. కాగా, బీజేపీ నుంచి బయటకు వచ్చి కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని తీన్మార్ మల్లన్న భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. -
చంచల్ గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన తీన్మార్ మల్లన్న
సాక్షి, హైదరాబాద్: ‘క్యూ న్యూస్’ ఛానల్ అధినేత, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌కు సోమవారం తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంచల్ గూడ జైలు నుంచి తీన్మార్ మల్లన్న బెయిల్‌పై విడుదలయ్యారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని తనను బెదిరించాడని ఓ జ్యోతిష్యుడు కొద్ది రోజుల క్రితం చిలకలగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో క్యూ న్యూస్ కార్యాలయంలో సైబర్ క్రైం పోలీసులు సోదాలు జరిపారు. కొన్ని హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. చదవండి: Q News Mallanna: తీన్మార్ మల్లన్నపై ఇన్ని కేసులా? బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలతో తీన్మార్ మల్లన్నను ఆగష్టులో పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరిపారు. కాగా తీన్మార్ మల్లన్నపై ఇప్పటివరకు 38 కేసులు నమోదు అయ్యియి. అందులో 6 కేసులను హైకోర్టు కొట్టివేయగా.. మిగతా 32 కేసుల్లో 31 కేసులకు ఇదివరకే బెయిల్ మంజూరైంది. అయితే పెండింగ్‌లో ఉన్న చిలకలగూడ కేసులో తాజాగా హైకోర్టు బెయిల్ ఇచ్చింది. తీన్మార్ మల్లన్న రెండు నెలలకు పైగా జైల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే బెయిల్ కోసం తీన్మార్ మల్లన్న దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం సోమవారం బెయిల్ మంజూరు చేసింది. -
Q News Mallanna: తీన్మార్ మల్లన్నపై ఇన్ని కేసులా?
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టు చింతపండు నవీన్‌కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై ఒకే తరహా అభియోగాలున్నా అనేక కేసులు నమోదు చేయడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. ఒకే విధమైన అభియోగాలు ఉన్నప్పుడు ఒక కేసులో దర్యాప్తు చేపట్టాలని, మిగిలిన కేసులను స్టేట్‌మెంట్స్‌గా పరిగణించాలని, మిగిలిన కేసులను మూసేయాలని స్పష్టంచేసింది. ఈ కేసుల దర్యాప్తును డీజీపీ వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం తీర్పునిచ్చారు. ‘నవీన్‌కుమా ర్‌పై 35 కేసులు నమోదు చేయగా, ఇందులో 22 కేసులు హైదరాబాద్ పరిధిలోనికి కాగా 13 వివిధ ప్రాంతాలకు సంబంధించినవి. ఈ కేసుల్లో పీటీ వారెంట్, వారెంట్ జారీ అయిన సమాచారాన్ని నవీన్‌కుమార్‌కు లేదా ఆయన భార్య మత్తమ్మకు వారంలో తెలియజేయాలి. నవీన్‌కు మార్పై నమోదుచేసిన కేసుల్లో ఏడేళ్లకు మించి శిక్షపడే నేరాల్లేవని, ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అర్నేష్‌కుమార్ కేసులో ఇచ్చిన తీర్పు మేరకు నేర విచారణ చట్టం సెక్షన్ 41–ఎ కింద దర్యాప్తు అధికారులు నోటీసులు జారీచేయాలి. (సమాచారం: తెలంగాణ హైకోర్టుకు దసరా సెలవులు) నవీన్‌కుమార్‌ను అరెస్టు చేయాలనుకున్నా, పీటీ వారెంట్ కింద అరెస్టు చూపించాలనుకున్నా డీకే బసు కేసులో సుప్రీంకోర్టు నిబంధనలను పాటించాలి. ప్రతీకారం తీర్చుకునే తరహాలో పోలీసులు వ్యవహరించరాదు. నవీన్‌కుమార్, ఆయన భార్యను వేధింపులకు గురిచేయరాదు. వీరిపై కేసుల నమోదుకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి దర్యాప్తు చేపట్టేలా డీజీపీ రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్ల ఎస్ హెచ్వోలను ఆదేశించాలి. దర్యాప్తు న్యాయబద్ధంగా, పారదర్శకంగా చేయాలి’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. (చదవండి: తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ ఉజ్జల్ భుయాన్) -
తీన్మార్ మల్లన్న కేసులో తెరపైకి మాజీ రౌడీషీటర్
సాక్షి, హైదరాబాద్: మాజీ రౌడీషీటర్ అంబర్‌పేట శంకర్ పేరు సుదీర్ఘ కాలం తర్వాత తెరపైకి వచ్చింది. క్యూ న్యూస్ ఛానల్ వ్యవస్థాపకుడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై చిలకలగూడ పోలీసుస్టేషన్లో నమోదైన కేసులో ఇతడి పేరు బయటకు వచ్చింది. దీంతో ఆదివారం శంకర్‌ను పిలిచిన పోలీసులు విచారించారు. అతడి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన బెదిరింపుల కేసుకు సంబంధించి తీన్మార్ మల్లన్నను పోలీసులు గత నెల 27న అరెస్టు చేసిన విషయం విదితమే. ఏప్రిల్ 19న తనకు వాట్సాప్ ద్వారా ఫోన్ చేసిన తీన్మార్ మల్లన్న రూ.30 లక్షలు డిమాండ్ చేశాడని లక్ష్మీకాంత్ శర్మ ఆరోపించారు. ఈ కేసులోనే ప్రస్తుతం మల్లన్నను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ డబ్బు చెల్లింపు విషయంలో తనకు–శర్మకు మధ్య సెటిల్మెంట్ చేయడానికి అంబర్‌పేట శంకర్ ప్రయత్నించాడని మల్లన్న బయటపెట్టారు. దీంతో ఆదివారం శంకర్‌ను పిలిచిన పోలీసులు అతడిని విచారించారు. శర్మ కోరిన మీదట ఇరువురి మధ్యా రాజీ చేయడానికి ప్రయత్నించిన మాట వాస్తవమే అని, అయితే తాను అందులో విఫలమయ్యానని శంకర్ పోలీసులకు తెలిపాడు. ఈ మేరకు అతడి నుంచి చిలకలగూడ అధికారులు వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. చదవండి: ట్యాంక్‌బండ్‌పై సండే సందడి నేటినుంచి రాత్రి 11.15 గంటల వరకు మెట్రో సేవలు -
అసత్య ప్రచారం, బెదిరింపులు: తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు
సాక్షి, జగద్గిరిగుట్ట: భూవివాదం నేపథ్యంలో జగద్గిరిగుట్ట కార్పొరేటర్ జగన్‌పై అసత్య ప్రచారం చేయడంతో పాటు బెదిరింపులకు దిగారన్న ఆరోపణలపై తీన్మార్ మల్లన్నపై కోర్టు ఆదేశాలతో జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్టకు చెందిన కొందరు వ్యక్తులు కార్పొరేటర్ జగన్ తమ భూమి కబ్జా చేశారని తీన్మార్ మల్లన్నను సంప్రదించారు. దీంతో అతడి టీమ్ సభ్యులు కార్పొరేటర్ పీఏగా పనిచేస్తున్న సంపత్‌రెడ్డికి కాల్చేసి భూవివాదం విషయమై అడిగారు. అయితే తనపై బెదిరింపులకు దిగడంతో పాటు భూమిని ఆక్రమించామని అసత్య ప్రచారం చేశారని ఆరోపిస్తూ సంపత్‌రెడ్డి జూలై 21న కోర్టును ఆశ్రయించాడు. తీన్మార్ మల్లన్న గ్రూపు సభ్యులు మాట్లాడిన కాల్ రికార్డును పరిశీలించిన కోర్డు అతడిపై కేసు నమోదు చేయాలని జగద్గిరిగుట్ట పోలీసులకు ఉత్తర్వు కాపీని అందజేయడంతో బుధవారం కేసు నమోదు చేశారు. చదవండి: పబ్‌లో చిన్నారి డాన్స్ వైరల్.. పోలీసుల సీరియస్ -
తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్
సాక్షి, హైదరాబాద్: క్యూ నూస్ చానెల్ వ్యవస్థాపకుడు తీన్మార్ మల్లన్నకు సికింద్రాబాద్ కోర్టు శనివారం 14 రోజుల రిమాండ్ విధించింది. సికింద్రాబాద్ మధురానగర్ కాలనీలోని మారుతి జ్యోతిష్యాలయం నిర్వాహకుడు సన్నిధానం లక్ష్మీకాంతశర్మ.. తీన్మార్ మల్లన్న తనపై బెదిరింపులకు పాల్పడడ్డాడంటూ ఫిర్యాదు చేయడంతో శుక్రవారం రాత్రి( ఆగస్టు 27న) మల్లన్నను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా శనివారం మల్లన్నను సికింద్రాబాద్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు విచారణలో భాగంగా తీన్మార్ మల్లన్నపై ఐపీసీ సెక్షన్ 306,సెక్షన్ 511 కింద కేసులు పెట్టడంపై అతని తరపు న్యాయవాది ఉమేశ్ చంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫిర్యాదిదారుడు ఎలాంటి సూసైడ్ అటెంప్ట్ చేయలేదని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాగా ఏడు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని చిలకలగూడ పోలీసులు కోర్టును అడిగింది. ఈ అంశాలన్నింటిని పరిశీలిస్తామని తెలిపిన కోర్టు మల్లన్నకు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం మల్లన్నను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇక తీన్మార్ మల్లన్న తరపు న్యాయవాది ఉమేశ్ చంద్ర బెయిల్ పిటీషన్ దాఖలు చేయనున్నారు. ఇక మల్లన్న కేసు విషయానికి వస్తే.. సికింద్రాబాద్ మధురానగర్ కాలనీలోని మారుతి జ్యోతిష్యాలయం నిర్వాహకుడు సన్నిధానం లక్ష్మీకాంతశర్మ తీన్మార్ మల్లన్న తనపై బెదిరింపులకు పాల్పడడ్డాడంటూ ఏప్రిల్ 22న చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎన్నోఏళ్లుగా తాను జ్యోతిషాలయం నిర్వహిస్తున్నానని.. కానీ ఇటీవల కొందరు వ్యక్తులు నకిలీ భక్తులను పంపి తనను ఇబ్బంది పెడ్తున్నారని, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు . అతని ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు మల్లన్నకు రెండుసార్లు నోటీసులు అందించారు. అయితే నోటీసులపై మల్లన్న నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. చదవండి: తీన్మార్ మల్లన్నను అరెస్టు చేసిన పోలీసులు..! ఓటుకు కోట్లు కేసు: రేవంత్ రెడ్డికి సమన్లు -
తీన్మార్ మల్లన్నను అరెస్టు చేసిన పోలీసులు..!
సాక్షి, హైదరాబాద్: క్యూ న్యూస్ చానల్ వ్యవస్థాపకుడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను హైదరాబాద్‌లోని చిలకలగూడ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన ఒక కేసులో ఆయనకు రెండుసార్లు నోటీసులు ఇచ్చి విచారించామని, ఇప్పుడు అరెస్టు చేశామని ప్రకటించారు. తీన్మార్ మల్లన్న తనను బెదిరిస్తున్నారంటూ.. సికింద్రాబాద్ మధురానగర్ కాలనీలోని మారుతి జ్యోతిష్యాలయం నిర్వాహకుడు సన్నిధానం లక్ష్మీకాంతశర్మ ఈ ఏడాది ఏప్రిల్ 22న చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎన్నోఏళ్లుగా తాను జ్యోతిషాలయం నిర్వహిస్తున్నానని.. కానీ ఇటీవల కొందరు వ్యక్తులు నకిలీ భక్తులను పంపి తనను ఇబ్బంది పెడ్తున్నారని, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.,చదవండి: 27 ఏళ్లుగా పనిచేస్తున్నా జీతం రూ.22 వేలే.. ఏప్రిల్ 19న తీన్మార్ మల్లన్న తనకు వాట్సాప్ ద్వారా ఫోన్ చేసి రూ.30 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించారు. డబ్బులు ఇచ్చేందుకు తాను నిరాకరించడంతో తప్పుడు ప్రచారం చేయిస్తానంటూ బెదిరించారని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 20న తన చానల్లో తప్పుడు వార్తను ప్రసారం చేసి బెదిరించాడన్నారు. దీంతో పోలీసులు మల్లన్నపై కేసు నమోదు చేశారు. ఈ నెల 3న ఆయన కార్యాలయంలో సోదాలు చేశారు. రెండుసార్లు పోలీసుస్టేషన్‌కు పిలిపించి విచారించారు. శుక్రవారం రాత్రి అరెస్టు చేసినట్టుగా ప్రకటించారు. మల్లన్నపై ఉన్న మరికొన్ని కేసుల్లోనూ పీటీ వారెంట్ల ద్వారా అరెస్టులు చేయనున్నట్టు సమాచారం. చదవండి: ఈటల అంటే ఏంటోకేసీఆర్కు అర్థమైంది: రాజేందర్ -
జూబ్లీహిల్స్: తీన్మార్ మల్లన్నపై కేసు
సాక్షి, బంజారాహిల్స్: సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పోలీసులు ఐపీసీ సెక్షన్ 504, 506 కింద కేసు నమోదు చేశారు. శ్రీకృష్ణానగర్‌లో నివసించే మాదాసు రవితేజ అనే వ్యాపారి ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి క్యూన్యూస్‌లో ‘నీకు దమ్ముంటే నాదగ్గరికి రా’ అని తీన్మార్ మల్లన్న సవాల్ విసరడం తనను షాక్‌కు గురి చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సాధారణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆరోపించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఐదున్నర గంటల పాటు తీన్మార్ మల్లన్న విచారణ
సాక్షి, చిలకలగూడ( హైదరాబాద్): క్యూ న్యూస్ ఛానల్ వ్యవస్థాపకుడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గురువారం చిలకలగూడ పోలీసుస్టేషన్లో హాజరయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన బెదిరింపుల కేసుకు సంబంధించి పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. దీంతో గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మల్లన్న ఠాణాకు వచ్చారు. పోలీసులు సాయంత్రం 4.30 గంటల వరకు వివిధ కోణాల్లో ఆయనను విచారించారు. ఆదివారం మరోసారి తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. తనను తీన్మార్ మల్లన్నబ్లాక్ మెయిల్ చేయడంతోపాటు బెదిరించాడని, డబ్బు డిమాండ్ చేశాడని సీతాఫల్‌మండికి చెందిన మారుతి జ్యోతిష్యాలయం నిర్వాహకుడు సన్నిదానం లక్ష్మీకాంత్‌శర్మ ఈ ఏడాది ఏప్రిల్ 22న చిలకలగూడ పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణకు మల్లన్న గురువారం పోలీసుస్టేషన్‌కు వచ్చారు. మహంకాళి ఏసీపీ రమేష్ నేతృత్వంలో చిలకలగూడ ఇన్స్పెక్టర్ నరేష్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సంజయ్‌కుమార్ విచారించారు. అనంతరం తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ..న్యాయస్థానాలపై నమ్మకం ఉందని, విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తానన్నారు. ఇదంతా ప్రభుత్వ కుట్ర అన్నారు. -
తీన్మార్ మల్లన్నపై మరో కేసు.. చిలకలగూడ పీఎస్‌లో హాజరు
హైదరాబాద్: యూ ట్యూబ్ ఛానల్ క్యూ న్యూస్ వ్యవస్థాపకుడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జ్యోతిష్యుడు లక్ష్మీకాంత్ శర్మ ఫిర్యాదుతో తీన్మార్ మల్లన్నపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. దీంతో తీన్మార్ మల్లన్న చిలకలగూడ పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు. కాగా తనను తీన్మార్ మల్లన్న బెదిరిస్తున్నాడని లక్ష్మీకాంత్ శర్మ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇక క్యూస్ సంస్థ మాజీ ఉద్యోగిని ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో నిందితుడిగా పరిగణిస్తూ సీఆర్పీసీ 41ఏ సెక్షన్ కింద పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. పీర్జాదిగూడలోని సంస్థ కార్యాలయంలో బుధవారం రాత్రి సోదాలు నిర్వహించిన పోలీసులు మొత్తం 12 హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. -
తీన్మార్ మల్లన్నకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: యూ ట్యూబ్ ఛానల్ క్యూ న్యూస్ వ్యవస్థాపకుడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం నోటీసులు జారీ చేశారు. ఆ సంస్థ మాజీ ఉద్యోగిని ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో నిందితుడిగా పరిగణిస్తూ సీఆర్పీసీ 41ఏ సెక్షన్ కింద వీటిని ఇచ్చారు. పీర్జాదిగూడలోని సంస్థ కార్యాలయంలో బుధవారం రాత్రి సోదాలు నిర్వహించిన పోలీసులు మొత్తం 12 హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరీక్షల నిమిత్తం రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపనున్నారు. ఆ నివేదికతో పాటు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ఆధారాలను బట్టి న్యాయస్థానానికి నివేదిక అందజేస్తారు. -
ప్రియాంక ఫిర్యాదు.. పోలీసుల అదుపులో తీన్మార్ మల్లన్న
సాక్షి, హైదరాబాద్: యూ ట్యూబ్ చానల్ క్యూ న్యూస్ వ్యవస్థాపకుడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్లన్నతో పాటు క్యూ న్యూస్ చానల్‌పై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే సైబర్ క్రైమ్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ బృందం, స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) అధికారులతో పాటు స్థానిక పోలీసులు రాత్రి క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేశారు. మల్లన్నను అదుపులోకి తీసుకోవడంతో పాటు ఆ సంస్థ కార్యాలయం నుంచి కొన్ని హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజులుగా క్యూ న్యూస్ మాజీ విలేకరి చిలుక ప్రవీణ్, తీన్మార్ మల్లన్న మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ప్రవీణ్ అందులో మల్లన్నపై అవినీతితోపాటు పలు ఆరోపణలు చేశారు. దీనికి కౌంటర్‌గా మల్లన్న ఆదివారం న్యూస్‌లో కొన్ని ప్రత్యారోపణలు చేశారు. సైబర్ క్రైమ్ ఏసీపీకి ప్రియాంక ఫిర్యాదు.. ఈ నేపథ్యంలోనే మల్లన్న.. ప్రవీణ్‌తో కలసి ఉన్న కొందరు యువతుల ఫొటోలు, వీడియోలను ప్రదర్శిస్తూ అభ్యంతరకరంగా వ్యాఖ్యానించారు. వాటిలో ప్రియాంక ఫొటోలు కూడా ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఆమె మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. తాను ప్రవీణ్ స్నేహితురాలినని.. స్నేహపూర్వకంగా దిగిన ఫొటోలను చూపిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆమె పేర్కొన్నారు. క్యూ న్యూస్‌లో మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యల వల్ల తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినడంతో పాటు తీవ్ర మనోవేదనకు గురయ్యానంటూ ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు సోమవారం ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేశారు. మల్లన్న వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను సంగ్రహించారు. వీటి ఆధారంగా బుధవారం రాత్రి క్యూ న్యూస్ కార్యాలయంపై ప్రత్యేక బృందాలు దాడి చేశాయి. సైబర్ క్రైమ్ పోలీసులు మల్లన్నను అదుపులోకి తీసుకోవడంతో పాటు హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. అతన్ని విచారిస్తామని, ఆపై అరెస్టు చేయాలా? నోటీసులు జారీ చేయాలా? అనేది నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు. అదుపులోకి తీసుకునే సమయంలో కొందరు మల్లన్న అభిమానులు క్యూ న్యూస్ కార్యాలయానికి చేరుకొని పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో అక్కడ గందరగోళం నెలకొంది. -
చట్టసభలకు రాకుండా అడ్డుకున్నారు: తీన్మార్ మల్లన్న
సాక్షి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు గెలిచారని స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. శనివారం రాత్రి కౌంటింగ్ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దొంగ ఓట్లు, నోట్ల కట్టలతో తనను చట్టసభలకు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. జాతీయ, రాష్ట్ర పార్టీలను కాదని సామాన్యుడినైన తనను పట్టభద్రులు భుజాలపై ఎక్కించుకుని మోశారని తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా నల్లగొండ కౌంటింగ్ వైపే చూశారన్నారు. ప్రగతిభవన్ గోడలు బద్దలుకొట్టే రోజులు వస్తాయని, సీఎం కుర్చీపై సామాన్యుడిని కూర్చోబెట్టే వరకు తన ఉద్యమం ఆగదని మల్లన్న స్పష్టంచేశారు. డబ్బున్న వాళ్లు మాత్రమే రాజకీయాలు చేయాలనే దానికి ఎన్నికలు సమాధి కట్టాయని, అధికారపక్షం తలదించుకునేలా ప్రజలు తీర్పునిచ్చారన్నారు. ప్రజలు తనను డిస్టింక్షన్లో గెలిపించాలని చూశారు కానీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నకిలీ ఓట్లతో గెలిచారని ఆరోపించారు. ఈ సందర్భంగా పల్లాకు శుభాకాంక్షలు తెలిపారు. -
పేపర్‌బాయ్‌ను ఎమ్మెల్సీ చేయండి
పట్టభద్రుల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి నవీన్‌కుమార్ హన్మకొండ : ‘ఇప్పటిదాక తీన్మార్ చేసిన. గెలిపిస్తే మండలిలో చార్‌మార్ చూపిస్తా.. ఛాయ్‌వాలాను. ప్రధానిని చేశారు. పేపర్‌బాయ్‌గా పనిచేసిన నన్ను ఎమ్మెల్సీగా గెలిపించండి’ అని వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి చింతపండు నవీన్‌కుమార్(తీన్మార్ మల్లన్న) పేర్కొన్నారు. గెలిపిస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు యత్నిస్తానన్నారు. హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టిన వారు గెలిచాక ఆ సొమ్మును రాబట్టుకోవడంపైనే దృష్టిపెడతారు తప్ప ప్రజల బాగోగులు పట్టించుకోరని పేర్కొన్నారు. తీన్మార్ మల్లన్నగా ప్రతి గుడిసె, ప్రతి ఇంటిని తన బాణి, వాణితో మేల్కొలిపానన్నారు. ప్రతి పార్టీని, ప్రతి వ్యక్తిని కూడగట్టే ప్రయత్నం చేస్తున్నానని, సీఎం కేసీఆర్ మద్దతునూ కోరుతానని చెప్పారు. పట్టభద్రులంతా ఓటరుగా నమోదు కావాలని కోరారు. హెల్ప్‌లైన్ సమాచారం కోసం 98665 24314 నంబర్లో సంప్రదించాలని సూచించారు. నాగరాజు, ఉపేందర్, మహేందర్‌రెడ్డి, చెన్నయ్య పాల్గొన్నారు.