సాక్షి, హైదరాబాద్: క్యూ న్యూస్ చానల్ వ్యవస్థాపకుడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను హైదరాబాద్‌లోని చిలకలగూడ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన ఒక కేసులో ఆయనకు రెండుసార్లు నోటీసులు ఇచ్చి విచారించామని, ఇప్పుడు అరెస్టు చేశామని ప్రకటించారు. తీన్మార్ మల్లన్న తనను బెదిరిస్తున్నారంటూ.. సికింద్రాబాద్ మధురానగర్ కాలనీలోని మారుతి జ్యోతిష్యాలయం నిర్వాహకుడు సన్నిధానం లక్ష్మీకాంతశర్మ ఈ ఏడాది ఏప్రిల్ 22న చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎన్నోఏళ్లుగా తాను జ్యోతిషాలయం నిర్వహిస్తున్నానని.. కానీ ఇటీవల కొందరు వ్యక్తులు నకిలీ భక్తులను పంపి తనను ఇబ్బంది పెడ్తున్నారని, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.,చదవండి: 27 ఏళ్లుగా పనిచేస్తున్నా జీతం రూ.22 వేలే..
ఏప్రిల్ 19న తీన్మార్ మల్లన్న తనకు వాట్సాప్ ద్వారా ఫోన్ చేసి రూ.30 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించారు. డబ్బులు ఇచ్చేందుకు తాను నిరాకరించడంతో తప్పుడు ప్రచారం చేయిస్తానంటూ బెదిరించారని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 20న తన చానల్‌లో తప్పుడు వార్తను ప్రసారం చేసి బెదిరించాడన్నారు. దీంతో పోలీసులు మల్లన్నపై కేసు నమోదు చేశారు. ఈ నెల 3న ఆయన కార్యాలయంలో సోదాలు చేశారు. రెండుసార్లు పోలీసుస్టేషన్‌కు పిలిపించి విచారించారు. శుక్రవారం రాత్రి అరెస్టు చేసినట్టుగా ప్రకటించారు. మల్లన్నపై ఉన్న మరికొన్ని కేసుల్లోనూ పీటీ వారెంట్ల ద్వారా అరెస్టులు చేయనున్నట్టు సమాచారం. చదవండి: ఈటల అంటే ఏంటోకేసీఆర్‌కు అర్థమైంది: రాజేందర్
తీన్మార్ మల్లన్నను అరెస్టు చేసిన పోలీసులు..!
Published Fri, Aug 27 2021 11:44 PM | Last Updated on Sat, Aug 28 2021 10:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment