సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టు చింతపండు నవీన్‌కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై ఒకే తరహా అభియోగాలున్నా అనేక కేసులు నమోదు చేయడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. ఒకే విధమైన అభియోగాలు ఉన్నప్పుడు ఒక కేసులో దర్యాప్తు చేపట్టాలని, మిగిలిన కేసులను స్టేట్‌మెంట్స్‌గా పరిగణించాలని, మిగిలిన కేసులను మూసేయాలని స్పష్టంచేసింది. ఈ కేసుల దర్యాప్తును డీజీపీ వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం తీర్పునిచ్చారు.
‘నవీన్‌కుమా ర్‌పై 35 కేసులు నమోదు చేయగా, ఇందులో 22 కేసులు హైదరాబాద్ పరిధిలోనికి కాగా 13 వివిధ ప్రాంతాలకు సంబంధించినవి. ఈ కేసుల్లో పీటీ వారెంట్, వారెంట్ జారీ అయిన సమాచారాన్ని నవీన్‌కుమార్‌కు లేదా ఆయన భార్య మత్తమ్మకు వారంలో తెలియజేయాలి. నవీన్‌కు మార్‌పై నమోదుచేసిన కేసుల్లో ఏడేళ్లకు మించి శిక్షపడే నేరాల్లేవని, ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అర్నేష్‌కుమార్ కేసులో ఇచ్చిన తీర్పు మేరకు నేర విచారణ చట్టం సెక్షన్ 41–ఎ కింద దర్యాప్తు అధికారులు నోటీసులు జారీచేయాలి. (సమాచారం: తెలంగాణ హైకోర్టుకు దసరా సెలవులు)
నవీన్‌కుమార్‌ను అరెస్టు చేయాలనుకున్నా, పీటీ వారెంట్ కింద అరెస్టు చూపించాలనుకున్నా డీకే బసు కేసులో సుప్రీంకోర్టు నిబంధనలను పాటించాలి. ప్రతీకారం తీర్చుకునే తరహాలో పోలీసులు వ్యవహరించరాదు. నవీన్‌కుమార్, ఆయన భార్యను వేధింపులకు గురిచేయరాదు. వీరిపై కేసుల నమోదుకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి దర్యాప్తు చేపట్టేలా డీజీపీ రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్ల ఎస్ హెచ్‌వోలను ఆదేశించాలి. దర్యాప్తు న్యాయబద్ధంగా, పారదర్శకంగా చేయాలి’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. (చదవండి: తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ ఉజ్జల్ భుయాన్)
Comments
Please login to add a commentAdd a comment