23 క్రేన్ల ఏర్పాటు
23 క్రేన్ల ఏర్పాటు
Published Fri, Sep 16 2016 12:22 AM | Last Updated on Fri, Aug 3 2018 2:57 PM
► నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌పై 23 క్రేన్ల ఏర్పాటు.
► పోలీసు నిఘా నీడలో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు....హుస్సేన్ర్ పరిసర ప్రాంతాల్లో సుమారు 800 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు నిమజ్జనోత్సవాన్ని సమీక్షించడం కనిపించింది.
► షీటీమ్‌లు మఫ్టీ డ్రెస్‌లో ట్యాంక్‌బండ్‌పై సంచరించారు.
► ఖైరతాబాద్ గణనాథుడు గతంలో ఎన్నడూలేని విధంగా మధ్యాహ్నమే నిమజ్జనం కావడంతో ట్యాంక్‌బండ్‌పై జనం సందడి గతంతో పొల్చుకుంటే కొంత తగ్గింది.
► పలు ప్రైవేటు ఆస్పత్రులు భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు.
► పోలీసు కంట్రోల్ రూమ్ నుంచి గాంధీనగర్ ఇన్స్ పె క్టర్ ఎ. సంజీవరావు నిమజ్జనోత్సవం సందర్భంగా ఇటు పోలీసులకు భక్తులకు పలు సూచనలు చేయడం కనిపించింది..
► వరంగల్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి తదితర జిల్లాల నుంచి పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు.
► ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6 వరకు అప్పర్ ట్యాంక్‌బండ్‌లో సుమారు 844 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు.
► గణేష్ నిమజ్జనానికి తరలి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ అధికారులు ఎన్టీఆర్ స్టేడియం వద్ద నుంచి నగరం నలుమూలలకు గణేష్ నిమజ్జనం స్పెషల్ బస్సులను నడిపారు.
► భక్తుల కోసం జలమండలి అధికారులు ఎన్టీఆర్ స్టేడియం, అశోక్‌నగర్ మెయిన్ రోడ్డులో ప్రత్యేకంగా ఉచిత వాటర్ ప్యాకెట్లు, మంచినీరు అందించే ఏర్పాట్లు చేశారు. – బన్సీలాల్‌పేట్
Advertisement
Advertisement