Cranes
-
చింతపల్లికి వందేళ్లుగా వస్తున్న ఆ అతిధుల జాడేది..!
చింతపల్లిలో ఈ ఏడాది కూడా సైబీరియా పక్షుల సందడి లేకుండాపోయింది...వందేళ్ల నుంచి వేసవి విడిదిగా వస్తున్న పక్షులు మూడేళ్ల నుంచి రావటంలేదు..ప్రతీ ఏటా వేసవి ప్రారంభంకన్న ముందు వచ్చి వర్షాకాలం సీజన్ ప్రారంభమయ్యే సమయంలో తిరిగి వెళ్తుంటాయి. అయితే చింతపల్లి గ్రామానికి విదేశీ అతిథిలు రాకపోవడానికి కారణాలేంటి..గ్రామస్తులు చెప్పుతున్న కారణం ఏమిటి. ఖమ్మం జిల్లాలోని చింతపల్లి ప్రాంతం విదేశీ సైబీరియా పక్షులకు అడ్డగా మారిన విషయం తెలిసిందే..ప్రతి ఏటా జనవరి నెలలో ఇక్కడి వస్తాయి...చింతపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున చింతచెట్లు,వేపచెట్లు ఉంటాయి....ప్రతీ ఇంటికి ఒక చింత చెట్టు....రెండు ఇళ్లకు ఒక వేప చెట్టు ఉంటుంది. దీంతో వాటి అవాసంకు ఇది అనుకులమైన ప్రాంతమైంది. వేసవికాలం రాగానే ఈ చింతచెట్లపైన మొదట గూళ్లు కట్టుకుంటాయి.. ఆరు నెలల పాటు ఇక్కడే ఉంటాయి..ఇక్కడే పొదిగి పిల్లలను తీసుకోని జూలై నెల చివరి వారంలో తిరిగి ప్రయాణమవుతాయి. ప్రతీ ఏడాది జనవరి వచ్చిదంటే చాలు తమ అతిథిల కోసం చింతపల్లి గ్రామస్తులు ఎదురుచూస్తు ఉంటారు... అయితే ఈ ఏడాది కూడా విదేశీ అతిధి రాలేదు..ఈ ఒక్క ఏడాదే కాదు వరుసగా పక్షులు రాక ఇది మూడవ ఏడాది...అయితే పక్షులు రాకపోవడానికి కారణం కోతుల బెడద ప్రదాన కారణమంటున్నారు ఇక్కడి గ్రామస్తులు. తమ గ్రామంలో ప్రతి ఏటా జనవరిలో పక్షలు ఇక్కడికి వచ్చి చక్కర్లు కొడుతు కనువిందు చేస్తు ఉంటాయని వరుసగా మూడేళ్ల నుంచి రాకపోవడంతో కొంత భాద కలిగిస్తుందని చెబుతున్నారు గ్రామస్తులు. వాటిని అలా చూస్తుండిపోతామని, అంతలా ఆ పక్షులకు మాకు తెలియని ఓ అవినాభవ సంబంధం ఏర్పడిందంటున్నారు. రంగు రంగుల ఆకారంలో ఉండే ఈ పక్షులంటే ఇక్కడి గ్రామస్తులకే కాదు పర్యాటకులను కూడ ఎంతగానో ఆకర్షిస్తాయని చెబుతున్నారు. సైబీరియా పక్షులు చింతపల్లి గ్రామానికి మా తాతల కాలం నుంచే వస్తున్నయని చెబుతున్నారు గ్రామస్తులు. ప్రతీ ఏటా సైబీరియా అతిథిలు వచ్చి ఇక్కడ ఉంటేనే పంటలు బాగా పండి తమకు లాభం జరుగుతుందనేది తమ నమ్మకం అని కూడా చెబుతున్నారు గ్రామస్తులు. అయితే ఈసారి కూడా అవి రాకపోవడంతో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతుతన్నామంటున్నారు గ్రామస్తులు. ఒక్కో సైబీరియా కొంగ దాదాపు మూడు కేజిల పైనే బరువు ఉంటుంది. దీంతో బయట నుంచి వచ్చినవారు ఎవ్వరైనా వాటిని వెంటాడి చంపే ప్రయత్నం చేస్తే అస్సలు ఊరుకోరు. జరిమాన విధిస్తారు. గతంలో వెటాడిన సందర్బాలు సైతం ఉండటంతో ఆరు నెలల పాటు పక్షులకు ఫుల్ సెక్యూరిటిగా ఉండి మరీ దగ్గరుండి చూసుకుంటామని చెబుతున్నారు గ్రామస్తులు. అందువల్లే వీటిని ఎవ్వరూ వేటాడే ప్రయత్నం చేయరని ధీమాగా చెబుతున్నారు. అలాగే నిరంతరం గ్రామస్తుల నిఘా ఉంటుంది. ఇంత ఇష్టంగా వీటిని గ్రామస్తులు చూసుకుంటున్నా.. కోతుల బెడదతో ఈసారి రాకపోవడంతో వారు భాదపడుతున్నారు. "ఆకాశ మార్గన వేల కీలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ సరిగ్గా వేసవి కాలం వచ్చే ముందు ఇక్కడకు చేరుకుంటాయి...ప్రతీ ఏటా అనుకున్న సమయం కల్లా కచ్చితంగా ఇక్కడికి చేరుకుంటాయి...అందుకే ఈ పక్షులకు అంతటి ప్రత్యేకత....ఆడ, మగ కొంగలు గూళ్ళు ఏర్పాటు చేసుకుని పిల్లలను కంటాయి..ఈ సమయంలో ఆడ కొంగ పిల్లలకు తోడుగా ఉంటే మగ కొంగ ఆహరం తీసుకు వస్తుంది..అయితే ప్రతి ఏటా కోతుల బెడద అతిథి విహాంగాలకు ముప్పుగా మారింది. దీంతో పక్షులు వచ్చిన సమయంలో గ్రామస్తులు వాటికి ఇబ్బందులు కలగకుండా కోతులను బెదర కొడుతుంటారు. ప్రతీ ఏటా వేసవికాలం ప్రారంభంకన్నా ముందు అతిథిలుగా వచ్చి వర్షకాలం ప్రారంభమవుతున్న సమయంలో తిరిగి వెళ్తాయి. గత మూడేళ్ల నుంచి కోతుల భయంతో మొత్తానికి రావడం మానేశాయి సైబీరియా పక్షులు. ఆరు నెలల పాటు చింతపల్లి గ్రామంలో సందడి చేసే ఈ సైబీరియా కొంగలను చూడటానికి పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి వస్తువుంటారు...తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వస్తారు. ఎక్కువగా హైదరాబాద్ నుంచి వస్తారు.. అయితే వరుసగా మూడేళ్ల నుంచి పక్షులు రాకపోవడంతో అటు పర్యాటకులు ఇటు గ్రామస్తులు తీవ్ర నిరాశ చెందుతున్నారు". (చదవండి: పట్టుచీర! ఏది అసలు? ఏది నకిలీ?..ఇలా గుర్తించండి!) -
వార్‌జోన్‌ను తలపించిన ప్రమాద స్థలం..
బాలాసోర్/హౌరా: మూడు రైలు ప్రమాదాల బాధితుల సహాయార్థం 200 అంబులెన్సులు, పదుల సంఖ్యలో రాష్ట్ర ప్రభుత్వ బస్సులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన మొబైల్ హెల్త్ యూనిట్స్ మోహరించారు. 1,200 మంది అగ్నిమాపక, విపత్తుల నిర్వహణ సిబ్బంది అలుపు లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. ఒకబోగీపై మరో బోగీ పడటంతో భూమిలోకి కూరుకుపోయిన బోగీలను తీసేందుకు క్రేన్స్, బుల్డోజర్స్ ఏర్పాటు చేశారు. కానీ ఆ భారీ కోచ్‌లను తొలగించడానికి అవి పనికి రాలేదు. కోల్‌కతా నుంచి ప్రత్యేక క్రేన్లు తెప్పిస్తే తప్ప.. పైన పడ్డ బోగీలను తీయలేమని, అప్పుడే కింది వాగన్లను తొలగించడానికి వీలవుతుందని సిబ్బంది తెలిపారు. ‘బోగీలు నేలకు అతుక్కుపోయాయి. ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి గుర్తించలేనంత వికృతంగా శవాలు మారిపోయాయి. వర్ణించలేనంత భయంకరంగా అక్కడి దృశ్యాలున్నాయి’ అని ప్రయాణికుల్లో ఒకరు మీడియాతో పంచుకున్నారు. కంపార్ట్మెంట్ నుంచి విసిరేసినట్టుగా.. ‘రైల్వే ట్రాక్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. నుజ్జునుజ్జయిన బోగీలు చెల్లా చెదురుగా పడిపోయాయి. కొన్ని ఒకదాని మీదకు ఒకటి ఎక్కాయి. కొన్నయితే.. తాబేలు తరహాలో నేలకు అతుక్కుపోయాయి’ అని పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ముర్షీదాబాద్ జిల్లాకు చెందిన బ్రెహంపూర్ వాసి పీయూష్ పోద్దార్ వివరించారు. ఆయన ఉద్యోగం కోసం కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో తమిళనాడు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ‘ఉన్నట్టుండి రైలు పట్టాలు తప్పడంతో బోగీ ఒకవైపు పడిపోయింది. చాలామందిమి కంపార్టుమెంట్ బయట విసిరేసినట్టుగా పడ్డాం. ప్రమాదం నుంచి ఎలాగోలా పాక్కుంటూ బయటికి వచ్చేసరికే ఎక్కడ చూసినా శవాలే కనిపించాయి’ అని పోద్దార్ తెలిపారు. అదృష్టవశాత్తూ పోద్దార్ ఫోన్ సురక్షితంగా ఉండటంతో బంధువులకు ఫోన్ చేశాడు. చిన్న చిన్న గాయాలతో బయటపడ్డ ఆయన.. ముందు ఇంటికి చేరుకుని, ఆ తరువాతే చికిత్స చేయించుకుంటానంటున్నాడు. స్థానికుల సహాయం.. ‘‘పెద్దపెద్దగా అరుపులు వినిపించడంతో ఘటన జరిగిన స్థలానికి చేరుకున్నాం. రైలు పట్టాలు తప్పి, బోగీలు పక్కకు పడి కనిపించాయి. బోగీలు నుజ్జయిపోయి ఇనుము కుప్పగా కనబడింది’’ అని ఆ పక్కనే నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు తెలిపారు. వెంటనే.. బాధితులను బయటికి లాగడం, మంచి నీటిని అందించడం, రక్తం కారుతున్నవారికి బ్యాండేజ్ కట్టడం వంటి సాయం చేశామని కన్స్ట్రక్షన్ సైట్లో పనిచేస్తున్న 45 ఏళ్ల ఫోర్‌మెన్ దీపక్ బేరా తెలిపారు. యుద్ధ వాతావరణం.. క్షతగాత్రులను బాలాసోర్, సోరో, భద్రక్, జాజ్‌పూర్, కటక్‌లోని ఎస్సీబీ మెడికల్‌కాలేజీ ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద జరిగిన చోట సహాయక చర్యల్లో పాల్గొనేందుకు భువనేశ్వర్ ఎయిమ్స్ డాక్టర్ల బృందాలను బాలాసోర్, కటక్ ఆస్పత్రులకు పంపించామని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. బాధితుల విలువైన ప్రాణాలను కాపాడేందుకు వైద్య సిబ్బంది కృషి చేస్తున్నారని, అందుకు అవసరమైన సహాయ సహకారాలను తాము అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. బెడ్లు, స్ట్రెచర్లు, ఆస్పత్రి కారిడార్లు.. ఎక్కడ చూసినా గాయాలతో రక్తమోడుతున్న బాధితులతో బాలాసోర్ జిల్లా ఆస్పత్రి మొత్తం వార్‌జోన్‌ను తలపించింది. ఈ ఒక్క ఆస్పత్రిలోనే 526 మందిని చేర్చారు. బాధితులంతా పలు రాష్ట్రాలకు చెందినవారు కావడంతో భాషాపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతూనే వైద్య సిబ్బంది చికిత్స అందించారు. శవాల గుట్టలతో... ప్రమాదం కారణంగా అనేక రైళ్లు రద్దవ్వడం, కొన్ని రైళ్లు దారి మళ్లించడంతో బాధితుల బంధువులు ఘటనా స్థలానికి చేరుకోవడానికి ఆలస్యమవుతోంది. దీంతో మృతదేహాల గుర్తింపు ఇంకా పూర్తి కాలేదు. తెల్లటి వస్త్రాలు చుట్టిన శవాల గుట్టలతో ఆస్పత్రి ఆవరణ నిండిపోయింది. ఒక్కసారిగా భారీ శబ్దం.. ఆపై చీకటి! రైలు ప్రమాద బాధితుల అనుభవాలు కోల్‌కతా: మరికొద్ది సేపట్లో తమ రైలు బాలాసోర్‌కు చేరుకుంటుందనగా రాత్రి 7 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించిందనీ, బెర్త్‌లపై నుంచి తాము కిందపడిపోవడం, బోగీలో అంధకారం అలుముకుందని బెంగళూరు–హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుప్రయాణికులు కొందరు తాము ఎదుర్కొన్న భయానక అనుభవాలను వివరించారు. ఒడిశాలో ప్రమాద ఘటనలో బెంగళూరు–హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు కూడా చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే, పట్టాలు తప్పని 17 బోగీలతో 635 ప్రయాణికులతో ఈ రైలు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హౌరాకు చేరుకుంది. అందులో క్షతగాత్రులైన సుమారు 50 మంది ప్రయాణికులకు సహాయక సిబ్బంది వైద్య చికిత్సలు అందించారు. క్షతగాత్రుల్లో అయిదుగురిని ఆస్పత్రికి తరలించారు. రైల్వే అధికారులు అందరికీ ఆహారం అందించారు. ఈ సందర్భంగా కొందరు ప్రయాణికులు పీటీఐతో తమ అనుభవాలను పంచుకున్నారు. షెడూŠయ్ల్కు మూడుగంటలు ఆలస్యంగా బెంగళూరు–హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరినట్లు మిజాన్ ఉల్ హక్ చెప్పారు. ‘బాలాసోర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉందనగా రైలు వేగంగా వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించింది. బోగీ అటూఇటూ కదలడం మొదలైంది. అప్పర్ బెర్త్ నుంచి కిందపడిపోయా. కంపార్ట్మెంట్లో లైట్లన్నీ ఆరిపోయాయి. చీకట్లు అలుముకున్నాయి’అని హక్ చెప్పారు. బర్దమాన్‌కు చెందిన హక్ కర్ణాటకలో జీవనోపాధి నిమిత్తం వెళ్లారు. దెబ్బతిన్న కోచ్ నుంచి అతికష్టమ్మీద బయటపడ గలిగినట్లు హక్ చెప్పారు. అప్పటికే చాలా మంది తీవ్ర గాయాలతో ప్రయాణికులు ధ్వంసమైన బోగీల్లో పడి ఉన్నారని చెప్పారు. బెంగళూరుకు చెందిన రేఖ కోల్‌కతా సందర్శనకు ఇదే రైలులో వస్తున్నారు. ‘ప్రమాదం కారణంగా అంతటా గందరగోళంగా మారింది. మా బోగీ నుంచి దిగి బయటకు వచ్చాము. ఆ చీకట్లోనే పక్కనే ఉన్న పొలాల్లో కూర్చున్నాం. హౌరా ఎక్స్‌ప్రెస్ ఉదయం తిరిగి బయలుదేరే వరకు అక్కడే ఉండిపోయాం’అని రేఖ చెప్పారు. బర్దమాన్‌కు చెందిన మరో ప్రయాణికుడు కూడా బెంగళూరు నుంచి వస్తున్నారు. ఈయనకు చాతీ, కాలు, తల భాగాలకు గాయాలయ్యాయి. కంపార్టుమెంట్ అద్దాలు పగులగొట్టుకుని బయటకు దూకామని ఆయన అన్నారు. -
అనంతలో ఘోర ప్రమాదం.. వాగులో దూసుకెళ్లిన కారు
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విడపనల్ మండలం డోనేకల్ వద్ద కారు అదుపుతప్పి వాగులో దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న వ్యక్తులు గల్లంతయ్యారు. గుంతకల్లు నుంచి బళ్లారి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రోడ్డు పనులు చేసే కాంట్రాక్టర్ తీసిన గుంతలో కారు చిక్కుకుంది. కారులో ఐదుగురు ఉన్నట్లు భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో అధికారులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహయంతో కారును బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చదవండి: వీడొక్కడే సినిమాలో లాగా.. మహిళ కడుపులో.. అధికారులు షాక్.. -
రెండు క్రేన్ల ఢీ: ఆపరేటర్ మృతి
సాక్షి, గచ్చిబౌలి: రోడ్డుపై రెండు క్రేన్లు వేగంగా వెళ్తున్నాయి.. ఒక క్రేన్ అదుపుతప్పి ముందు వెళుతున్న క్రేన్‌ను ఢీకొట్టింది. తర్వాత ఫుట్‌పాత్‌ను ఢీకొట్టి బోల్తా పడటంతో క్రేన్ ఆపరేటర్ మృతి చెందాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సీఐ గోనె సురేష్ తెలిపిన వివరాల ప్రకారం... ఉత్తరప్రదేశ్‌కు చెందిన సునీల్ అలియాస్ అనిల్ యాదవ్(26) బాలానగర్ ఫిరోజ్‌గూడలో ఉంటూ క్రేన్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి 12 గంటలకు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని అమెజాన్‌లో మెటీరియల్ ఎత్తేందుకు రెండు క్రేన్లు వెళ్లాయి. రాత్రి ఒంటి గంట సమయంలో విప్రో జంక్షన్ సమీపంలో వెనుక వస్తున్న క్రేన్ న్యూట్రల్ కావడం, జంక్షన్లో రోడ్డు డౌన్‌గా ఉండటంతో వేగంగా దూసుకెళ్లి ముందు వెళ్తున్న క్రేన్‌ను ఢీకొట్టి ఫుట్‌పాత్‌ను తాకి బోల్తా కొట్టింది. ఆపరేటర్ అనిల్ యాదవ్ క్రేన్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, ముందు వెళుతున్న క్రేన్ అదుపుతప్పి ఫుట్‌పాత్‌ను ఢీకొట్టడంతో ముందు చక్రాలు ఊడిపడ్డాయి. ఆ క్రేన్‌పై ఉన్న ఆపరేటర్ షఫీకి అదృష్టవశాత్తు ఎలాంటి గాయాలు కాలేదు. ఫుట్‌పాత్ వెంట టీఎస్ఐఐసీ అధికారులు ఏర్పాటు చేసిన గ్రిల్స్, ఇనుప స్తంభాలు నేలమట్టమయ్యాయి. సోమవారం ఉదయం మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్, గచ్చిబౌలి సీఐ సురేష్ , ట్రాఫిక్ సీఐ నర్సింహారావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహా గణపతికి జర్మన్ క్రేన్
ఖైరతాబాద్: శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతిని నిమజ్జనం చేసేందుకు జర్మన్ టెక్నాలజీ.. తడానో కంపెనీకి చెందిన ఆధనిక క్రేన్‌ను వినియోగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే రిమోట్ కంట్రోల్ టెక్నాలజీ క్రేన్ ఇదొక్కటే కావడం విశేషం. ఈ క్రేన్ 400 టన్నుల బరువును 60 మీటర్లు పైకి ఎత్తుతుంది. 14 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు ఉండే క్రేన్‌కు ఒక్కో టైరు టన్ను బరువు గల 12 టైర్లు ఉన్నాయి. క్రేన్ సామర్థ్యం 72 టన్నులు కాగా 50 టన్నుల బరువున్న ఖైరతాబాద్ మహాగణపతిని క్రేన్ సాయంతో నిమజ్జన మహత్కార్యాన్ని పూర్తి చేయనున్నారు. ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం చేసే భాగ్యం రెండోసారి కలగినందుకు సంతోషంగా ఉందని క్రేన్ ఆపరేటర్, పంజాబ్‌కు చెందిన దేవేందర్ సింగ్ పేర్కొన్నారు. తనకు క్రేన్ ఆపరేటింగ్‌లో 11 సంవత్సరాల అనుభవం ఉందని, ఆధునిక టెక్నాలజీ హైడ్రాలిక్ క్రేన్‌ను రెండేళ్లుగా ఆపరేట్ చేస్తున్నానని తెలిపారు. -
కుప్పకూలిన భారీ క్రేన్లు,ఒకరు మృతి
-
కుప్పకూలిన భారీ క్రేన్లు
సాక్షి, తూర్పుగోదావరి : కాకినాడ సీపోర్టు లిమిటెడ్ (కేఎస్పీఎల్)లో ఘోర ప్రమాదం సంభవించింది. ఆరో నెంబర్ బెర్త్‌లో రెండు భారీ క్రేన్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, తొమ్మిది మంది కార్మీకులు తీవ్రంగా గాయపడ్డారు. మరి కొంత మంది క్రేన్ల కింద చిక్కుకున్నారు. సమాచారం ఆందుకున్న పోర్టు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తిని కొవ్వూరువాసిగా గుర్తించారు. పాత క్రేయిన్ రిపేరు చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్రేన్ల కింద చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. సహాయక చర్యలు మరింత ముమ్మరం చేసింది. -
నిమజ్జనం ఇక ఈజీ
సాక్షి, సిటీబ్యూరో: వినాయక చవితి నేపథ్యంలో విగ్రహాల నిమజ్జనాన్ని మరింత వేగవంతం చేసేందుకు పోలీసుశాఖ అధునాతన క్రేన్ హుక్కులను అందుబాటులోకి తెచ్చింది. నగరంలో ఏర్పాటు చేస్తున్న గణేష్ మండపాల సంఖ్య ఏటేటా పెరుగుతున్న నేపథ్యంలో విగ్రహాలను నిర్ణీత సమయంలో నిమజ్జనం చేయాలనే ఉద్దేశంతో కొంత వరకుక్రేన్ల సంఖ్య పెంచుకుంటూపోయారు. అయితే వీటి సంఖ్యను పెంచడం కంటే ఉన్న క్రేన్లతోనే వీలైనన్ని ఎక్కువ విగ్రహాలు నిమజ్జనం చేయించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గతేడాది ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటు చేసిన వాటిలో కొన్ని క్రేన్లకు ప్రత్యేక డిజైన్‌తో కూడిన కొండీలను (హుక్స్) ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఈసారి మరింత అడ్వాన్డŠస్ హుక్స్ అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటిని రెండురోజుల క్రితం ట్యాంక్‌బండ్ వద్ద పరీక్షించిన నగర పోలీసు ఉన్నతాధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీచక్ర ఇంజినీరింగ్ సంస్థ నిర్వాహకుడు టి.మురళీధర్ రూపొందించిన ఈ ‘క్విక్ రిలీజ్ డివైజ్’ (క్యూఆర్డీ) హుక్స్ ఈసారి ట్యాంక్‌బండ్ మీద ఉండే అన్ని క్రేన్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిమజ్జనాకి వినియోగించే అవకాశం ఉంది. తొలిసారిగా ఈ క్యూఆర్డీ హుక్స్ను గతేడాది వినియోగించారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ ఉన్న 36 క్రేన్లలో 20 క్రేన్లను వీటిని వాడారు. క్రేన్ కొండీ ఉండే ప్రాంతంలో ఈ హుక్స్ నాలుగింటిని ఏర్పాటు చేశారు. విగ్రహానికి కింది భాగంలో నలుమూలలా వీటిని ఫిక్స్ చేశారు. పైకి ఎత్తినప్పుడు విగ్రహం బరువుకు గట్టిగా పట్టి ఉండే ఈ హుక్స్... అది నీటిని తాకిక వెంటనే బరువు తగ్గడంతో వాటంతట అవే విడిపోతాయి. గరిష్టంగా 25 సెకన్లలో నిమజ్జనం పూర్తయింది. గతంలో విగ్రహాన్ని నీటిలోకి తీసుకువెళ్లిన తర్వాత క్రేన్‌పై ఉండే వ్యక్తులు కొండీలను డీలింక్ చేయాల్సి వచ్చేది. దీనివల్ల కాలయాపనతో పాటు ప్రమాదాలు సైతం జరిగేవి. పాత కొండీలతో గంటకు ఒక క్రేన్ గరిష్టంగా 12 విగ్రహాలను నిమజ్జనం చేస్తే.. క్యూఆర్డీ హుక్స్ వినియోగించిన క్రేన్ ఇదే సమయంలో 25 నుంచి 30 విగ్రహాలను నిమజ్జనం చేసింది. ఈసారి వీటినిపై మరింత రీసెర్చ్ చేసిన మురళీధర్.. ‘అడ్వాన్డŠస్ వెర్షన్’ను అందుబాటులోకి తీసుకువచ్చారు. పాత హుక్ 15 కేజీల వరకు బరువు ఉండి, నిర్వహణ కష్టంగా ఉండేది. దీంతో దీని బరువును గరిష్టంగా 5 కేజీలకు తగ్గించారు. ఇవి ఉన్న క్రేన్ ఓ విగ్రహాన్ని గరిష్టంగా 15 సెకన్లతో నిమజ్జనం చేస్తుంది. నాలుగు హుక్స్ పెట్టాల్సిన అవసరం లేదు. రెండింటితోనూ నిమజ్జనం పూర్తి చేయవచ్చు. -
23 క్రేన్ల ఏర్పాటు
► నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌పై 23 క్రేన్ల ఏర్పాటు. ► పోలీసు నిఘా నీడలో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు....హుస్సేన్ర్ పరిసర ప్రాంతాల్లో సుమారు 800 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు నిమజ్జనోత్సవాన్ని సమీక్షించడం కనిపించింది. ► షీటీమ్‌లు మఫ్టీ డ్రెస్‌లో ట్యాంక్‌బండ్‌పై సంచరించారు. ► ఖైరతాబాద్ గణనాథుడు గతంలో ఎన్నడూలేని విధంగా మధ్యాహ్నమే నిమజ్జనం కావడంతో ట్యాంక్‌బండ్‌పై జనం సందడి గతంతో పొల్చుకుంటే కొంత తగ్గింది. ► పలు ప్రైవేటు ఆస్పత్రులు భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. ► పోలీసు కంట్రోల్ రూమ్ నుంచి గాంధీనగర్ ఇన్స్ పె క్టర్ ఎ. సంజీవరావు నిమజ్జనోత్సవం సందర్భంగా ఇటు పోలీసులకు భక్తులకు పలు సూచనలు చేయడం కనిపించింది.. ► వరంగల్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి తదితర జిల్లాల నుంచి పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. ► ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6 వరకు అప్పర్ ట్యాంక్‌బండ్‌లో సుమారు 844 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. ► గణేష్ నిమజ్జనానికి తరలి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ అధికారులు ఎన్టీఆర్ స్టేడియం వద్ద నుంచి నగరం నలుమూలలకు గణేష్ నిమజ్జనం స్పెషల్ బస్సులను నడిపారు. ► భక్తుల కోసం జలమండలి అధికారులు ఎన్టీఆర్ స్టేడియం, అశోక్‌నగర్ మెయిన్ రోడ్డులో ప్రత్యేకంగా ఉచిత వాటర్ ప్యాకెట్లు, మంచినీరు అందించే ఏర్పాట్లు చేశారు. – బన్సీలాల్‌పేట్ -
కిలకిలలు విలవిల
సాక్షి, విజయవాడ బ్యూరో: అరకల వెనకాల పురుగులను పట్టుకోవడానికి కొంగల ఆపసోపాలు. చీడ పీడలను తిని రైతులకు మేలు చేసే గోరింకలు. మావి చిగురుతిని కమ్మగా కూసే కోయిలలు, పెరిటి జామ చెట్టుమీద రామచిలుకలు. వరి కుచ్చులపై వాలే పిచ్చుకలు.. ఇవన్నీ రాజధాని ప్రాంతంలో గత స్మృతులుగానే మిగలనున్నాయి. రాజధాని ప్రాంతంలోని వేలాది ఎకరాల్లో వేసే పంటలపై ఆధారపడి జీవించే ఆ జీవజాలానికి ఇప్పుడు పెనుముప్పు వచ్చిపడింది. కార్తెలు మారుతున్నా పొలాల్లో పనులు ఎందుకు లేవో ఆ మూగ జీవాలకు తెలియక.. ఎటు పోవాలో అర్థంకాక తల్లడిల్లుతున్నాయి. ఆ ఇంద్రుడే ‘చంద్రుడి’ రూపంలో వచ్చి అమరావతిని నేలకు తీసుకువస్తాడని మనుషుల భాషలో నేతలు చేస్తున్న ప్రచారం పాపం ఆ పక్షులకు ఏమి అర్థమవుతుంది. కానీ, ప్రకృతికి విరుద్ధంగా నడుస్తూ తమ ప్రాణాలకే ఎసరు పెట్టబోతున్నారని అర్థం చేసుకున్న ఆ పక్షుల్లో కొన్ని వలసబాటపట్టగా.. మరికొన్ని ఏం చేయాలో అర్థంకాక బిక్కచూపులు చూస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో ప్రకృతి సమతుల్యత పూర్తిగా దెబ్బతిని, ఆహార గొలుసు తెగిపోవడంతో జీవజాతులు ఆకలితో అలమటించి‘పోతున్నాయి’. వ్యవ‘సాయం’పైనే రాజధాని ప్రాంతంలో 26 రకాల పక్షులు తరతరాలుగా ఆవాసం ఉంటున్నాయి. ఇక్కడి గ్రామాల్లో పలురకాలైన కూరగాయలతో పాటు పండ్లతోటలే వాటికి వడ్డించిన విస్తళ్లుగా ఉండేవి. కృష్ణా నదీ పరివాహక గ్రామాలైన వెంకటపాలెం, తాళ్లాయపాలెం, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, బోరుపాలెం, రాయపూడి గ్రామాలకు సమీపంలోని గుబురు చెట్లల్లో గూళ్లు పెట్టుకుని తమ సంతతి వృద్ధి చేసుకునేవి. పత్తి పంటకు మేలు చేసే పోలీసు పిట్ట (డ్రాంగో), పాలపిట్టలు, పిచ్చుకలు, కముజు పిట్టలు, తీతువుపిట్టలు, చెకుముకి పిట్టలు ఎక్కడబడితే అక్కడ కనబడేవి. ఇప్పుడు వాటి జాడలేక ప్రకృతి ప్రేమికులు కలత చెందుతున్నారు. పచ్చదనం తగ్గిపోతుండటంతో వాతావరణంలో వేడి పెరిగి పోతోంది. ఈ ప్రభావం పలు రకాల పక్షలపై పడుతోంది. అదృష్టం తెస్తుందని భావించే పాలపిట్ట (బ్లూ జే) కానరాని దూరాలకు ఎగిపోతోంది. పావురాళ్లతో పాటు పంట పొలాల్లో కనిపించే తెల్లకొంగలు, బురకలు కూడా మాయమవుతున్నాయి. -
కొంగలు నీటిలో ఎందుకు నిలబడతాయంటే...
జంతు ప్రపంచం ఒకప్పుడు కొన్ని వందల రకాల జాతుల కొంగలు ఉండేవి. కానీ క్రమంగా అంతరించిపోయి ఇప్పుడు పదిహేను జాతులు మాత్రమే మిగిలాయి!వీటికి ఇవే తినాలన్న నియమం ఏమీ ఉండదు. ఎప్పుడేది దొరికితే అది తినేసి కడుపు నింపుకుంటాయి. చేపలు, పురుగులు, పండ్లు, గింజలు, మొక్కలు... ఏవైనా సరే! ఇవి మూడు నుంచి ఐదేళ్ల వయసు వచ్చేవరకూ జతకట్టవు. ఒక్కసారి జతకట్టాక జీవితాంతం దానితోనే ఉంటాయి. అది చనిపోయినా సరే... మరోదానికి దగ్గర కావు! కొంగలలో ఐకమత్యం చాలా ఎక్కువ. ఒక కొంగకి ఏదైనా ప్రమాదం వాటిల్లితే... అది ఒక రకమైన శబ్దం చేస్తుంది. ఈ శబ్దం దాదాపు రెండు కిలోమీటర్ల వరకూ వినిపిస్తుంది. దాన్ని గుర్తుపట్టిన ఇతర కొంగలన్నీ వచ్చేస్తాయి. కలసికట్టుగా శత్రువుతో పోరాటం జరుపుతాయి! కొంగలు గంటలపాటు చల్లటి నీటిలో నిలబడి ఎందుకు ఉంటాయో తెలుసా? శరీర ఉష్ణోగ్రతను సమన్వయం చేసుకోవడానికి ఇవి రక్తప్రసరణ వేగాన్ని నియంత్రించుకునే ప్రయత్నం చేస్తుంటాయి. అందుకోసం కాళ్లలో ఉండే రక్తనాళాలను బిగబడతాయి. దానికోసమే గడ్డకట్టించేంత చల్లటి నీటిలో గంటలసేపు నిలబడిపోతాయి! వీటి కాళ్లు చాలా బలంగా ఉంటాయి. శత్రువులు దాడి చేసినప్పుడు తమ కాళ్లతోనే ప్రతిఘటిస్తాయి! కొంగలు ప్రపంచమంతా ఉన్నాయి. కానీ అంటార్కిటికా, దక్షిణ అమెరికాల్లో మాత్రం ఎక్కడా ఒక్క కొంగ కూడా కనిపించదు. -
నువ్వైనా.. నేనైనా.. బతుకు పోరాటమే బ్రదర్
ఆకలి దప్పికలు సృష్టిలో ప్రతి జీవికీ సాధారణమే. విశాల ప్రపంచంలో ప్రతి ఒక్కరి పరుగు ఆకలి తీరానికే. ఈ చిత్రంలో చూడండి.. పంట పండించి నాలుగు రాళ్లు సంపాదించి.. పట్టెడన్నంతో పొట్ట నింపుకొనేందుకు రైతన్న దమ్ము చేస్తుంటే.. ఆ దమ్ములోనే ఆహారం వెతుక్కుంటూ పొట్టపోసుకుంటున్నారుు కొంగలు. రాజధాని ప్రభావంతో త్వరలో ఈ భూములన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లనుండటంతో భవిష్యత్తులో రైతన్నకు ఆధారమేమిటో..? భూమినే నమ్ముకుని జీవిస్తున్న ఈ పక్షుల పరిస్థితేమిటో..? (తుళ్లూరు మండలం ఐనవోలులో కనిపించిన దృశ్యమిది..)