
నువ్వైనా.. నేనైనా.. బతుకు పోరాటమే బ్రదర్
ఆకలి దప్పికలు సృష్టిలో ప్రతి జీవికీ సాధారణమే. విశాల ప్రపంచంలో ప్రతి ఒక్కరి పరుగు ఆకలి తీరానికే. ఈ చిత్రంలో చూడండి.. పంట పండించి నాలుగు రాళ్లు సంపాదించి.. పట్టెడన్నంతో పొట్ట నింపుకొనేందుకు రైతన్న దమ్ము చేస్తుంటే.. ఆ దమ్ములోనే ఆహారం వెతుక్కుంటూ పొట్టపోసుకుంటున్నారుు కొంగలు. రాజధాని ప్రభావంతో త్వరలో ఈ భూములన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లనుండటంతో భవిష్యత్తులో రైతన్నకు ఆధారమేమిటో..? భూమినే నమ్ముకుని జీవిస్తున్న ఈ పక్షుల పరిస్థితేమిటో..?
(తుళ్లూరు మండలం ఐనవోలులో కనిపించిన దృశ్యమిది..)