tulluru
-
చంద్రబాబుని తరిమి తరిమి కొడతారు..!
-
అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుకు 12 నుంచి గ్రామసభలు
తాడికొండ: రాజధానిలో 22 గ్రామాలతో అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. గతంలో తుళ్ళూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని రాజధాని పూలింగ్‌కు భూములిచ్చిన 29 గ్రామాలతో అమరావతి మెట్రోపాలిటన్ సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రామసభలు నిర్వహించగా తుళ్ళూరు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటూ రాజధాని అభివృద్ధికి అడుగులు వేసింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలోని నాన్ పూలింగ్ గ్రామాల ప్రజలు తమను కూడా మున్సిపాలిటీలో చేర్చాలని కోరిన నేపథ్యంలో ఆయా గ్రామాలను కూడా మున్సిపాలిటీలో కలిపేందుకు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనల్లో భాగంగా తుళ్ళూరు మండలంలోని పూలింగ్‌కు భూములిచ్చిన 16 గ్రామాలతో పాటు నాన్ పూలింగ్ గ్రామాలైన పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రపురం గ్రామాలు, మంగళగిరి మండలంలోని మూడు గ్రామ పంచాయతీలను కలుపుతూ 22 గ్రామాలతో మున్సిపాలిటీ ఏర్పాటు దిశగా శుక్రవారం గ్రామసభల షెడ్యూల్ ప్రకటించారు. ఈ గ్రామసభల ద్వారా ఆయా గ్రామాల్లో ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు, వివరణలు సేకరించి తీర్మానం చేసి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నారు. తుళ్ళూరు ఎంపీడీవో శ్రీనివాసరావు శుక్రవారం ఈవోఆర్డీ సత్యకుమార్, పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులు సమావేశమై చర్చించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 12వ తేదీ సోమవారం నుంచి గ్రామసభలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేశారు. గ్రామసభల షెడ్యూల్ 12వ తేదీ లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, హరిశ్చంద్రపురం, 13వ తేదీ దొండపాడు, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, 14వ తేదీ వెంకటపాలెం, మందడం, ఐనవోలు, 15వ తేదీ నెక్కల్లు, అనంతవరం, వడ్డమాను, రాయపూడి, 16వ తేదీ మల్కాపురం, వెలగపూడి, పెదపరిమి, 17వ తేదీ శాఖమూరు, నేలపాడు, తుళ్ళూరు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆయా గ్రామాల ప్రజలు గ్రామసభలకు హాజరై వారి అభిప్రాయాలను తెలపాలని ఎంపీడీవో కోరారు. అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు నిర్ణయం హర్షణీయం 712వ రోజు రిలే నిరాహార దీక్షల్లో బహుజన పరిరక్షణ సమితి నాయకులు అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని బహుజన పరిరక్షణ సమితి నాయకులు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 712వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహర దీక్షల్లో శుక్రవారం పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. అమరావతి రైతులను మోసగించి మూడుపంటలు పండే 33 వేల ఎకరాలను పూలింగ్‌కు తీసుకున్న చంద్రబాబు వారికి ఏం న్యాయం చేశాడో చెప్పాలన్నారు. (క్లిక్ చేయండి: టీడీపీ నేత అనితకు బ్యాంకు నోటీసులు) రాష్ట్రంలోని 5 కోట్లమంది ప్రజల సంపదను ఒక ప్రాంతంలోనే కుమ్మరిస్తే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మహా నగరాల సరసన అమరావతిని చేరుస్తానంటూ మోసపూరిత హామీలతో చంద్రబాబు 29 గ్రామాల రైతులతో పాటు రాష్ట్ర ప్రజలను నమ్మించి భారీ అవినీతికి పాల్పడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి అమరావతి ప్రాంత అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన నిర్మాణాలు వడివడిగా కొనసాగుతున్నాయని చెప్పారు. సమితి నాయకులు మాదిగాని గురునాథం, నూతక్కి జోషి, బేతపూడి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. -
అమరావతిలో అభివృద్ధి పనులు ప్రారంభం
సాక్షి, అమరావతి: ల్యాండ్ పూలింగ్ కింద అమరావతికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం కేటాయించిన ప్లాట్ల అభివృద్ధికి ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) చర్యలు చేపట్టింది. రైతులకు కేటాయించిన స్థలాల్లో మౌలిక వసతులు కల్పించాలని ఇటీవల పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆమేరకు సీఆర్డీఏ చర్యలు చేపట్టింది. ఇక్కడ రైతులకు కేటాయించిన ప్లాట్లను 12 జోన్లుగా విభజించగా, వాటిలో జోన్–4లోని పిచ్చుకలపాలెం, తుళ్లూరు, అనంతవరం గ్రామాల్లో ఉన్న ప్లాట్లలో పనులు ప్రారంభించారు. సోమవారం పిచ్చుకలపాలెం వద్ద రహదారి నిర్మాణాన్ని సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్పీఎస్ ప్లాట్లను పూర్తి కమర్షియల్ విధానంలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. జోన్–4లో మొత్తం 1358.42 ఎకరాల్లో 4,551 ప్లాట్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రూ.192.52 కోట్లతో రహదారులు, వంతెనలు, తాగు నీటి సరఫరా వ్యవస్థ, వరద నీటి కాలువలు, మురుగునీటి వ్యవస్థ, మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు) వంటి మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. రైతులు కోరుకున్న విధంగా ప్లాట్లను తీర్చిదిద్దుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఆర్డీఏ అదనపు కమిషనర్ షేక్ అలీంబాషా, చీఫ్ ఇంజినీర్లు టి.ఆంజనేయులు, సీహెచ్ ధనుంజయ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శరవేగంగా అభివృద్ధి పనులు ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఆర్డీఏ అమరావతిలో దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టింది. రైతులకు ఇచ్చిన ప్లాట్లతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను శరవేగంగా చేపడుతోంది. అసెంబ్లీ, సచివాలయాలకు వెళ్లేందుకు ప్రధాన మార్గమైన కృష్ణా నది కరకట్ట రోడ్డును రూ.150 కోట్లతో విస్తరిస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు అధికారులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది నివాస సముదాయాల పనులు దాదాపు పూర్తయ్యాయి. నవంబర్ నాటికి వీటిని అందుబాటులోకి తెచ్చేలా పనులు చేస్తున్నారు. అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల సమీకరణకు చర్యలు చేపట్టామని వివేక్ యాదవ్ తెలిపారు. నిబంధనలకు లోబడి అమరావతి ప్రాంతంలో టౌన్‌షిప్‌లను అన్ని వసతులతో అభివృద్ధి చేసి ప్లాట్లను ఆన్లైన్ వేలం ద్వారా విక్రయిస్తున్నట్టు చెప్పారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టి పూర్తిచేస్తామన్నారు. రైతులకు కౌలు డబ్బును కూడా సకాలంలో చెల్లిస్తున్నట్టు వివరించారు. -
రాజధాని రైతులకు ఏం న్యాయం చేశావు చంద్రబాబూ?
తాడికొండ: రాజధాని పేరిట రైతుల నుంచి 32 వేల ఎకరాలను సేకరించిన చంద్రబాబు.. ఆ రైతులకు ఏం న్యాయం చేశారో చెప్పాలని బహుజన పరిరక్షణ సమితి నాయకులు ప్రశ్నించారు. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 53వ రోజు రిలే దీక్షలు కొనసాగాయి. దీక్షలలో పాల్గొన్న పలువురు దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ.. మూడు రాజధానులతోనే అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ జరిగి అన్ని ప్రాంతాలు సమంగా ఎదుగుతాయన్నారు. అమరావతిలో చంద్రబాబు తాత్కాలికం పేరిట కోట్లాది రూపాయలను నిర్మాణ కంపెనీలకు దోచిపెట్టడంతో పాటు, కార్పొరేట్ కంపెనీలకు కారు చౌకగా భూములను దోచిపెట్టారని విమర్శించారు. అమరావతి ఉద్యమం పేరిట చంద్రబాబు వర్గానికి చెందిన 10 మంది రైతులు కూడా లేని శిబిరాల్లో వందల మంది పాల్గొంటున్నట్లు ఎల్లో మీడియాలో చూపిస్తూ ఈ ప్రాంత రైతులను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితికి చెందిన వివిధ సంఘాల నాయకులు చెట్టే రాజు, జేటీ రామారావు, మాధగాని గురునాధం, ఆకుమర్తి చిన్నా, నత్తా యోనరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ: ‘రాజధాని’ దీక్షా శిబిరాలకు నోటీసులు
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో చేస్తున్న దీక్షలను విరమించాలని అధికారులు కోరారు. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాపించకుండా చేపడుతున్న ముందస్తు జాగ్రత చర్యల్లో భాగంగా వైద్య శాఖ అధికారులు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. దీక్షా శిబిరాలను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. రైతుల జేఏసీ పేరుతో జరుగుతున్న ఎర్రపాలెం, కృష్ణాయపాలెం, మందడం, రాయపూడి, వెలగపూడి పెదపరిమి, తుళ్లూరు దీక్షా శిబిరాలను ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ఖాళీ చేయాలని నోటీసుల్లో సూచించారు. పాలన వికేంద్రీకరణకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ బహుజన పరిరక్షణ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సెస్ రహదారి డి–జంక్షన్ వద్ద చేపట్టిన దీక్షా శిబిరాలను కూడా ఖాళీ చేయాలని వైద్య శాఖ అధికారులు కోరారు. కాగా, వికేంద్రీకరణకు మద్దతుగా చేపట్టిన దీక్షలు శనివారానికి 13వ రోజుకు చేరాయి. (కరోనా వైరస్: ప్రతి ఇంటిని సర్వే చేస్తున్నాం) కరోనా మహమ్మారి విజృంభించకుండా దేశంలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలెవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. జనతా కర్ఫ్యూ సందర్భంగా రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తున్నామని రవాణాశాఖ మంత్రి పేర్ని నాని శనివారం తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను ఈరోజు (శనివారం) రాత్రి నుంచే నిలిపివేస్తున్నామని ప్రకటించారు. (జనతా కర్ఫ్యూకు ఇలా సిద్ధమవుదాం) -
భద్రతలేని బతుకులు!
సాక్షి, అమరావతి : గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో ప్రజాప్రతినిధుల కోసం 12 అంతస్తుల భవన నిర్మాణ పనుల వద్ద నిర్మాణ సంస్థ ఎన్సీసీ నిర్లక్ష్యంతో సోమవారం ముగ్గురు కూలీల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అక్కడ సాగుతున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల వద్ద భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో లిఫ్ట్ జారి పడి అందులో ఉన్న ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. 12 అంతస్తుల టవర్స్ నిర్మాణం చేస్తున్న సమయంలో ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన కనీస బాధ్యతను నిర్మాణ సంస్థలు విస్మరించాయి. గత అనుభవాలున్నా.. పట్టదు ప్రజాప్రతినిధుల క్వార్టర్స్ వద్దే ఈ ఏడాది మే నెలలో విషాహారం భుజించిన 30 మంది కూలీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. పరిస్థితి విషమించడంతో పశ్చిమబెంగాల్‌కు చెందిన ఇద్దరు కూలీలు మృతి చెందారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే మరో ముగ్గురు కూలీలు మరణించడంతో కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకఘటన జరిగిన తర్వాత కూడా ఎన్సీసీ సంస్థ పాఠాలు నేర్వడం లేదు. కనీసం కూలీలకు పరిహారం అందజేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తుళ్లూరు మండలం నేలపాడు వద్ద తాత్కాలిక హైకోర్టు నిర్మాణం వద్ద టిప్పర్ కింద పడి ఒక కూలీ మృతి చెందారు. ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని వస్తున్న కూలీలపై నిర్మాణ సంస్థలు కనికరం చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నా పట్టించుకున్న పాపానపోవడం లేదు. సంఘటన జరిగిన తర్వాత అధికారులు హడావుడి చేసి ఆ తర్వాత చేతులు దులుపుకొంటున్నారనే విమర్శలు లేకపోలేదు. గుంతల్లో పడి ఆరుగురు మృతి రాజధాని పరిధిలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏడీసీ) అంతర్గత రహదారుల నిర్మాణాలను చేపట్టింది. రోడ్ల పక్కన డ్రెయినేజీ కోసం పది అడుగుల మేర గుంతలు తవ్వారు. గతేడాది అక్టోబర్‌లో కురిసిన వర్షాల వల్ల గుంతల్లో పది అడుగుల మేర వర్షపు నీరు నిలిచింది. శాఖమూరు వద్ద అర్ధరాత్రి వేళ ఇద్దరు యువకులు బైక్‌పై వెళుతూ గుంతలో పడి ప్రాణాలు వదిలారు. రోడ్డు కోసం గుంత తవ్విన చోట నిర్మాణ సంస్థ హెచ్చరిక బోర్డు పెట్టకపోవడంతోనే ఆ ప్రమాదం జరిగిందని మృతుల బంధువులు ఆరోపించారు. అలాగే గతేడాది ఆగస్టులో తుళ్లూరు మండలం దొండపాడు వద్ద ఆడుకోవడానికి వెళ్లి ముగ్గురు విద్యార్థులు గుంతల్లో పడి ప్రాణాలు వదిలారు. అలాగే తుళ్లూరు మండల కేంద్ర సమీపంలో ఓ వ్యక్తి చనిపోయారు. తుళ్లూరు(తాడికొండ): లిఫ్ట్ ప్రమాదం జరిగిన స్థలాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ మంగళవారం పరిశీలించారు. తుళ్లూరు డీఎస్పీ కేశప్ప ప్రమాదం జరిగిన తీరును కలెక్టర్‌కు వివరించారు. అనంతరం నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలెక్టర్ మాట్లాడారు. కనీస జాగ్రత్త చర్యలు తీసుకోపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రాయపూడి నుంచి అమరావతి మండలం ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న కార్మికుల మృతదేహాలను పరిశీలించి, మృతుల బంధువులను పరామర్శించారు. కలెక్టర్‌తోపాటు జేసీ దినేష్, అడిషనల్ ఎస్పీ ప్రసాద్, తుళ్లూరు తహసీల్దార్ సంజీవకుమారి, తుళ్లూరు సీఐ విజయకృష్ణ ఉన్నారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారమివ్వాలి.. కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తూ, కనీస భద్రతా ప్రమాణాలను పాటించకుండా వ్యవహరిస్తున్న ఎన్సీసీ నిర్మాణ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతి చెందిన ముగ్గురు కార్మికుల ప్రతి కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని అందించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. మంగళవారం తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో ఎన్సీసీ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవన సముదాయాన్ని సీఐటీయూ నాయకుల బృందం పరిశీలించింది. నిర్మాణాల వద్ద అంబులెన్స్‌లు ఎక్కడ..? రాజధానిలో నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో అనుకోని ప్రమాదాలు సంభవిస్తే అత్యవసర వైద్యం కూడా అందుబాటులో లేకుండా పోయింది. చాలా నిర్మాణ సంస్థలు అంబులెన్స్‌లను నిర్మాణాలు జరుగుతున్న చోట అందుబాటులో ఉంచడం లేదు. ఫలితంగా ప్రమాదం జరిగిన వెంటనే ప్రాథమిక వైద్యం అందకపోవడంతోనే కూలీలు తనువు చాలిస్తున్నారు. నిర్మాణ కంపెనీలు నిబంధనలు పాటించకున్నా సంబం ధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. -
చంద్రబాబు, లోకేశ్ ఫొటోలతో కుచ్చుటోపీ!
సాక్షి, అమరావతి : అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. లక్షలు ముట్టజెప్పితే ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి, ఒక ముఠాగా ఏర్పడి నిరుద్యోగ యువతను అడ్డంగా మోసగించారు. మోసపోయిన ఒక అభ్యర్థి ధైర్యం చేసి తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నంద్యాలకు చెందిన నరాల శివనాగార్జునరెడ్డి కర్నూలు జిల్లా శిరువెళ్ల మండలానికి చెందిన చాకలి మనోహర్‌కు ఉద్యోగం ఇప్పిస్తానని రూ.3.80 లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆఫీస్ సబార్డినేట్‌గా నకిలీ అపాయింట్మెంట్ లెటర్‌ను సృష్టించారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రూ.30 వేలు అడ్వాన్స్‌గా తీసుకున్నారు. లెటర్ అందజేసి మిగిలిన మొత్తాన్ని తీసుకోవాలని పథకం రచించారు. ఈ లెటర్‌పై అనుమానం రావడంతో మనోహర్ ఈ నెల 16న విషయాన్ని సచివాలయ అధికారుల దృష్టికి తేసుకెళ్లాడు. వారు దాన్ని నకిలీ అపాయింట్మెంట్ లెటర్‌గా ధృవీకరించడంతో మోసపోయానని గ్రహించి తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రధాన నిందితుడు మాజీ మంత్రి మనవడు గుంటూరు జిల్లా మంగళగిరిలో నలుగురు నిందితులను గురువారం ఉదయం తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రధాన నిందితుడు రెడ్డి గౌతమ్ టీడీపీకి చెందిన మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మనవడు. మిగిలిన ముగ్గురు నరాల శివనాగార్జునరెడ్డి, సతీష్, మిథున్ చక్రవర్తి టీడీపీ నాయకులు. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి లోకేశ్‌తో తీసుకున్న ఫొటోలను ఎరగా వేసి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఏడుగురు అభ్యర్థుల నుంచి రూ.14 లక్షలు వసూలు మొత్తం ఏడుగురు నిందితుల్లో నలుగురిని పోలీసులు అరెస్టు చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తుళ్లూరు ఎస్ఐ వెంకటప్రసాద్ తెలిపారు. అరెస్ట్ చేసిన వారిని విచారించగా ఏడుగురు అభ్యర్థుల నుంచి రూ.14 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగాల పేరుతో కూడా డబ్బులు వసూలు చేసినట్లు చెప్పారు. గతేడాది నవంబర్ నుంచి వీరు దందా మొదలు పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
తుళ్లూరులో 150 కోట్లతో శ్రీవారి ఆలయం
సాక్షి, తిరుమల : అమరావతిలోని తుళ్లూరులో రూ.150 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది. అలాగే రూ.79 కోట్లతో తిరుమల గోవర్ధన అతిథి గృహం వద్ద నూతన యాత్రికుల వసతి సముదాయ నిర్మాణానికి కూడా పచ్చజెండా ఊపింది. అంతేకాకుండా 2015లో సవరించిన పీఆర్సీ ప్రకారం టీటీడీ రవాణా విభాగంలో పని చేస్తున్న 65 మంది డ్రైవర్లు, 15 మంది ఫిట్టర్లకు రూ. 15 వేల నుంచి 24 వేలకు వేతనం పెంచుతూ మంగళవారమిక్కడ సమావేశమైన టీటీడీ పాలకమండలి సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. అలాగే తిరుమలలోని హోటల్లలో ధరల నియంత్రణకు ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఒంటిమిట్టలోని యాత్రికుల వసతి గృహాన్ని ఏపీ టూరిజంకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కల్యాణమండపాల అభివృద్ధి పనులకు రూ.37 కోట్లు కేటాయించారు. -
చెల్లెళ్లపై అన్న ఉన్మాదం
► కత్తితో విచక్షణారహితంగా దాడి ► ఒక చెల్లెలు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు కంటికి రెప్పలా కాపాడాల్సిన అన్నే కాలయముడయ్యాడు. మూఢాచారాలపై ఉన్న నమ్మకాన్ని తోబుట్టువులపై చూపలేకపోయాడు. రక్తం పంచుకు పుట్టిన చిట్టి చెల్లెళ్లపై పైశాచికంగా దాడి చేశాడు. నిట్టనిలువునా ఒకరి ప్రాణాలను తోడేసి.. మరొకరిని తీవ్రంగా గాయపరిచాడు. అనుబంధాలను సమాధి చేసిన ఈ ఘటన తుళ్లూరుతో పాటు రాజధాని గ్రామాలను ఉలికిపాటుకు గురి చేసింది. తుళ్లూరు: రాజధాని నడిబొడ్డున తుళ్లూరులోని కొత్తూరులో గురువారం రాత్రి ఘోరం చోటు చేసుకుంది. ఓ అన్న విచక్షణారహితంగా కత్తితో దాడి చేయడంతో పెద్ద చెల్లి అక్కడికక్కడే మృతి చెందగా, చిన్న చెల్లి మృత్యువుతో పోరాడుతోంది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న రంజాన్‌బీ తెలిపిన కథనం ప్రకారం...కొత్తూరుకు చెందిన మొగలా, అనీషాలకు నాగూల్‌మీరా, లాల్‌బీ, రంజాన్‌బీ కన్న బిడ్డలు. లాల్‌బీకి మతి స్థిమితం లేదు. దీంతో బిడ్డలను భర్తను వదిలి కొన్నేళ్లుగా పుట్టింట్లోనే ఉంటుంది. రంజాన్‌బీ కూడా అక్కడే ఉంటుంది. ఈ నేపథ్యంలో మతి స్థిమితం లేని చెల్లి లాల్‌బీకి చేతబడి శక్తులు ఉన్నాయని ఇరుగు, పొరుగు చెబుతుండడంతో అన్న నాగుల్‌మీరా నమ్మాడు. తరచూ పద్ధతి మార్చుకోవాలని లాల్‌బీని హెచ్చరిస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడూ చేయి కూడా చేసుకునేవాడు. ఇటీవల నాగుల్‌మీరాకు ఆరోగ్యం బాగోకపోవడంతో లాల్‌బీ చేతబడి చేసి ఉంటుందని అనుమానించాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఇంటికి రావడంతోనే కత్తితో దాడి చేసి లాల్‌బీని నరికేశాడు. అడ్డు వెళ్లిన రంజాన్బీపై కూడా కత్తితో దాడి చేశాడు. నాన్న మొగలాను కూడా ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. అంతా స్పృహ కోల్పోయాక, చనిపోయారని భావించి వెళ్లిపోయాడు. కొత్తూరులో జరిగిన హత్యకు సంబంధించి తుళ్లూరు సీఐ సుధాకరరావు, ఎస్ఐ షేక్ షఫీ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతురాలి తల్లి షేక్ అనీషాను వివరాలు అడిగి కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాలను అమరావతి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
రాళ్లుతున్నాయి
జక్కన్నక్కూడా అంతుబట్టేది కాదేమో! డాక్టర్లు, సైంటిస్టులైతే బోల్తా కొట్టేశారు. రాళ్లలో నీళ్లు, రాళ్లలో కప్పల్దాకా విన్నాం. ఇదిగో ఇప్పుడు నీళ్లలో రాళ్లు. కన్నీళ్లు... ‘రాళ్లు’తున్నాయి. మాయ చేయడానికి ఏ రాయి అయితేనేం?! ఏడాదిగా అందరి దృష్టిలో పడిన తుళ్లూరుకు పొరుగున ఉంది రాయపూడి గ్రామం. కృష్ణాతీరం. రేగడి నేలలు. పంట వేస్తే బ్యాంకులో డబ్బు వేసుకున్నట్లే. రైతుకు మినిమమ్ గ్యారంటీ. రాయపూడి జామతోటలూ అలాంటివే. అందులో ఓ జామతోటలో కోటయ్య కుటుంబం నివసిస్తోంది. కోటయ్యకు భార్య సులోచనమ్మ, ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి నవనీతకు పద్నాలుగేళ్లు. ఊళ్లో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి వరకు చదువుకున్న నవనీత అంతటితో బడి మానేసి ఇంటి పనులు అలవాటు చేసుకుంది. చిన్న పిల్లలు బడికి పోతున్నారు. అత్యంత సాధారణమైన జీవితం వారిది. అలాంటి కుటుంబం ఒక్కసారిగా ఊరందరి దృష్టిలో పడింది. ‘‘లక్ష్మక్కా! మనసేం బాగా లేదే. ఓ సారి జామతోటకెళ్లొద్దాం. రారాదూ!’’ బతిమాలుతోంది పుష్పలత. ‘‘జామతోటకెందుకే’’ లక్ష్మి గొంతులో భయం. ‘‘ప్రశ్న చెప్పించుకుందామని’’ నసిగింది పుష్ప.‘‘ప్రశ్న చెప్తారా! ఎవరు చెప్తున్నారు?’’ లక్ష్మికి అయోమయం వీడ లేదు. ‘‘ఆ... నిజమే... నీకు తెలీదులే... నువ్వీమధ్య ఊళ్లో లేకపోతివి మరి. జామతోటల్లో ఉండే కోటయ్య కూతురు నవనీతకు అమ్మోరు పూనుతోందట. మన కష్టం ఏంటో మన ముఖం చూసి చెప్పేస్తోందట. చేతబడి చేసినా, దెయ్యం పట్టినా ఇట్టే కనిపెట్టేస్తోంది. పౌర్ణమి నాడు చాలా మంది వెళ్లారు. మా ఆయన... ‘దెయ్యం లేదు, చేతబడి లేదు... నోర్మూసుకో’ అని కసురుకున్నాడు’’ అన్నది పుష్పలత బుంగమూతి పెట్టి. ‘‘సర్లే... సర్లే... ముఖం అలా పెట్టకు. రేపొద్దున పోదాం’’ అనునయించింది లక్ష్మి. నవనీత పరధ్యానంగా కూర్చుని ఉంది. పక్కనే పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, కర్పూరం, తమలపాకులు, అరటికాయలు. కళ్లు మూసుకుంటోంది. కొద్ది క్షణాల్లోనే కళ్లను విప్పార్చి తెరిచి చేత్తో తడుముకుంటోంది. వెంటనే నిస్సత్తువగా తలను పక్కకు వాలుస్తోంది.‘‘పుష్పా! ఏమైందా అమ్మాయికి’’ తల పక్కకు వాల్చి పుష్పలత చెవిలో గుసగుసగా అడిగింది లక్ష్మి. ‘‘ష్! అరవకక్కా, ఆ అమ్మాయికి కళ్లు గిర్రున తిరుగుతాయి... అప్పుడు కళ్ల నుంచి రాళ్లు వస్తాయి. వెంటనే పూనకం వస్తుంది. మనం చప్పుడు చేయకూడదు’’ నోటి మీద వేలినుంచి లోగొంతుకతో చెప్పింది పుష్పలత. ఆమె అన్నట్లే పది నిమిషాలకు నవనీత ఒక్కసారిగా ‘‘అమ్మా!’’ అంటూ కంటి మీద చేయి పెట్టుకుంది నవనీత. కొద్దిక్షణాల పెనుగులాట తర్వాత ఆమె కంటి మీద నుంచి చేతిని తీసి, అరచేతిలో చూసుకున్నది. రెండు మిల్లీమీటర్ల వ్యాసంతో చిన్న రాయి. బియ్యంలో ఉండే రాళ్లలాగ ఉందా రాయి. కోటయ్య వచ్చి ఆ రాయిని తీసుకుని జాగ్రత్తగా పక్కనే ఉన్న పళ్లెంలో పెట్టాడు. ఆ పళ్లెంలో అప్పటికే ఆరు రాళ్లున్నాయి. ‘‘కళ్లు మూసుకుని ధ్యానం చేసుకోమ్మా’’ అని నవనీతను సరిగా కూర్చోబెట్టి, భార్యను పిలిచాడు. సులోచన వచ్చి నవనీత పక్కనే ఆమెకు ఆసరాగా కూర్చుంది. పుష్పలత ఇక ఆగలేకపోయింది. ‘‘ఇక ప్రశ్న అడగొచ్చా’’ అన్నది ఉద్వేగంగా. కళ్లతోనే బదులిచ్చింది సులోచన. నవనీత ఎదురుగా కూర్చుంది పుష్పలత. ‘‘పూజ వస్తువులు పెట్టి పూజించుకో’’ సులోచన మెల్లగానే అన్నప్పటికీ గొంతులో ఆదేశమే ధ్వనిస్తోంది. పుష్పలత ఉత్సాహంగా తాను తెచ్చిన పూజ సామగ్రితో పళ్లెంలో ఉన్న ఒక సాలగ్రామ రూపానికి పూజ చేసింది. కొబ్బరికాయ కొట్టడానికి రాయి వంటిది ఉందేమోనని చుట్టూ చూసింది. ‘‘ఆ గోడ పక్కన రాయి ఉంది. అక్కడ కొట్టి తీసుకురా’’ అంటూ కొబ్బరికాయ కొట్టాల్సిన ప్రదేశాన్ని చూపించింది సులోచన పుష్ప వెళ్లి ఆ రాయి మీద కొబ్బరికాయ కొట్టి తెచ్చి పళ్లెంలో పెట్టి భక్తిగా కళ్లు మూసుకుంది. అప్పుడు నోరు విప్పింది నవనీత. ‘‘నీకు ఇంట్లో శాంతి లేదు. సంతోషం లేదు. ఇల్లు ఉంది. పొలం ఉంది. డబ్బు ఉంది. అయినా సంతోషం అనేదే లేని జీవితం గడుపుతున్నావు’’ ఏదో లోకంలో ఉండి మాట్లాడుతున్నట్లు ఉంది నవనీత గొంతు. ఆ మాటలు వినగానే పుష్పలత కళ్లలో నీళ్లు గిర్రున తిరిగాయి. ఏమి అడగాలో కూడా తెలియని అయోమయంతో బేలగా మారిపోయింది. లక్ష్మి పుష్ప భుజం చుట్టూ చేయి వేసి... ‘‘ఎందుకలా అవుతోంది’’ అన్నది మెల్లగా నవనీతతో. ‘‘అంతా ఇంట్లో వాళ్లే... ’’ అంటూ పూనకంలోనే పక్కకు వాలిపోయింది నవనీత. ‘‘నిన్ను చానా గట్టి పీడ తగులుకుంది. ఐదు వారాలు పూజలో కూర్చోమ్మా. అమ్మోరు దారి చూపకపోదు’’ అన్నది సులోచన. అలాగేనన్నట్లు తలూపి అక్కడి నుంచి లేచింది పుష్పలత. ‘‘అక్కా... మనూర్లో కొత్తగా హాస్పిటల్ పెట్టిన డాక్టర్ వచ్చి అదేమైనా జబ్బేమోనని చూసాట్ట. ఎంత పరీక్ష చేసినా ఆయనకేమీ పాలుపోక సైన్స్‌లో ఇలాంటిది చూడనేలేదన్నాట్ట. అంతా మహిమ కాకపోతే మరేంటి’’ తన నమ్మకాన్ని తానే బలపరుచుకుంటోంది పుష్పలత. ‘‘అక్కా నిజంగానే నా పీడ వదులుతుందంటావా? ఇక్కడికి వచ్చిన వాళ్లందరికీ రెండు- మూడు వారాల్లోనే అమ్మోరు పలుకుతోంది. నాకు నాలుగు వారాలైనా ఏమీ చెప్పలేదు’’ బేలగా లక్ష్మిని అడిగింది పుష్పలత. ఆమె కళ్లు నీటి కుండల్లా ఉన్నాయి. ‘‘ఇంకెంత ఒక్క వారమే కదా! ఓపిక పట్టు. అయినా నీకొచ్చిన కష్టమేంటే. మనశ్శాంతి లేదని బాధపడతావు. తిండికి కరువా, బట్టకు కరువా? పొలం పోయి నడుం విరిగేలా పనులు చేస్తే కానీ జరగని పరిస్థితి ఉందా? అసలు నిన్ను ఇంట్లో ఎవరు కష్టపెడుతున్నారు చెప్పు’’ మందలింపుగా అన్నది లక్ష్మి.‘‘మా ఆయన నన్ను ఇంట్లో నోరెత్తనివ్వడు తెలుసా?’’ నిష్టూరంగా అన్నది పుష్పలత.‘‘...’’ ఏదో మాట్టాడబోయి అంతలోని విరమించున్నది లక్ష్మి. ‘‘సర్లే! ఒక్కవారం ఓపిక పట్టు. నాకు ఇంట్లో పనుంది వెళ్తా’’ అని లేచింది లక్ష్మి. లక్ష్మి ఇంటికి పుష్పలీల ఆదుర్దాగా వచ్చింది. ‘‘అక్కా! ఏం జరిగిందో తెలుసా?’’ అంటూ వరండాలో స్తంభానికి ఆనుకుని కూలబడింది.వంట చేసుకుంటున్న లక్ష్మి కంగారుగా బయటకొచ్చి ‘‘ఏమైందే పుష్పా! అలా ఒగరుస్తున్నావ్’’ అడిగింది ఆందోళనగా.‘‘ఆ కోటయ్య కూతురు నవనీత లేదూ... అదేనక్కా... పూనకం వచ్చే నవనీత... దెయ్యాలు పోగొట్టే నవనీత... మనం వెళ్లట్లేదూ... జామతోటలో... అంతా ఒట్టి మోసమేనట... ’’ వాక్యమంతా పలికే స్థిమితం లేక అంతా ఒక్కసారే చెప్పేయాలని పదాలకు పొంతన లేకుండా చెప్తోంది పుష్పలత. ‘‘నిన్న తోటకి దెయ్యాల్లేవని చెప్పే టీచర్లొచ్చార్ట. వాళ్ల ముందు అంతా బయటపడిపోయింది. మనం మొద్దుల్లాగ వాళ్లేం చెబితే అదే నమ్మాం’’ చెప్పుకుపోతోంది.‘‘ముందీ నీళ్లు తాగు. నీ ఆదుర్దా నువ్వూను’’ అంటూ కసురుతూ నీళ్లిచ్చింది లక్ష్మి. మంచినీళ్లు తాగి, ‘‘నిన్న ఏమైందంటే...’’ అంటూ అంతా పూస గుచ్చింది. ‘‘నిన్న మధ్యాహ్నం టీచర్లు నవనీత ఎదురుగా కూర్చుని రాళ్లెలా వస్తాయో చూపించమన్నారు. ‘చూస్తూ కూర్చుంటే రాళ్లు బయటకు రావు. అమ్మాయి తన పనిలో తానున్నప్పుడు వస్తాయి’ - అన్నాట్ట కోటయ్య. కొంతసేపటికి నవనీత ముఖం కడుక్కుని, పౌడర్ రాసుకుని, బొట్టు, కాటుక పెట్టుకుని... తల దువ్వుకుంటూ ‘అబ్బా!’ అంటూ రాళ్లను చూపించింది. అప్పుడు టీచర్లు... ఆ అమ్మాయి చేతిని తెరిచి చూపించమన్నార్ట. మోసం బయటపడింది. ఎంత మోసం’’ గుండెల మీద చేయి వేసుకుంటూ అన్నది పుష్పలత. ‘‘నాకు ముందు నుంచి అనుమానమే. నీ ఏడుపు చూళ్లేక వచ్చా. అయినా అంతటితో వదిలేశారా వాళ్లను. పోలీసులకు పట్టిస్తే పోయేది. ఊరందరినీ ఎంతగా మోసం చేశారు?’’ ఆవేశపడుతోంది లక్ష్మి. ‘‘ఇలా మోసం చేయడం తప్పని, ఇంకా ఇలాగే చేస్తే పోలీసులకు పట్టిస్తామని, ఈ పనులు మానుకోమని కోటయ్యకు, సులోచనకు గడ్డి పెట్టారు. ఇంకో సంగతక్కా... నవనీత ఏం చెప్పాలో కూడా సులోచనే చెవిలో చెప్పేదట. ఊళ్లో ఎవరికే కష్టం ఉందో తెలిసే ఉంటుంది కదా’’ అంటూ ఆలోచనలో పడింది పుష్పలత. మోసపోయాననే ఉడుకుమోత్తనంతోపాటు, మోసం బట్టబయలైనందుకు సంతోషంగానూ ఉంది ఆమె ముఖం. గమనిక: పేర్లు మార్చడమైంది గంటల్లోనే ఛేదించాం! నేనప్పుడు అదే గ్రామంలోని గురుకుల పాఠశాలలో పని చేస్తున్నాను. స్కూలు పిల్లల ద్వారా విషయం తెలిసింది. పిల్లల మాటల మీద కేసు టేకప్ చేయలేం. మూడు వారాలపాటు గమనించాను. అదే గ్రామంలో ఫ్యాన్సీ షాప్ నడిపే మిత్రుడు రామ్మూర్తిని, మరికొందరిని అడిగి నిర్ధారించుకున్నాను. తర్వాత ఓ రోజు స్నేహితులం నలుగురం కోటయ్య ఉండే జామతోటకు వెళ్లాం. అదే రోజు నాలుగైదు గంటల్లోనే ఏం జరుగుతోందో, ఎలా జరుగుతోందో మాకు అవగాహనకు వచ్చింది. ఆ రోజుతోనే ఆ మోసానికి అడ్డుకట్ట పడింది. - బి. సాంబశివరావు, కోశాధికారి, మానవ వికాస వేదిక రాళ్లెలా వచ్చాయి! కళ్ల నుంచి రాళ్లు రావడం అనేది పూర్తిగా అబద్ధం. నవనీత గోళ్లలో, చేతి వేళ్ల మధ్య రాళ్లను దాచి ఉంచేది. ఉన్నట్లుంది కన్ను పట్టుకుని బాధ నటిస్తూ రాయిని తీసేది. కోటయ్య ఇదంతా దైవత్వమేననే ప్రచారం చేశాడు. గట్టిగా నిలదీసే సరికి తండ్రే అలా చేయమన్నాడని నవనీత ఒప్పుకుంది. ఇలా ఎందుకు చేశావని అడిగితే కోటయ్య నీళ్లు నమిలాడు. సులోచన మాత్రం ‘ఆడపిల్ల పెళ్లికొచ్చింది. మేమిక్కడ తోటల్లో ఉంటాం. పిల్ల మీద ఎవరి కన్ను పడినా బతుకు బుగ్గిపాల్చేస్తారు...’ అంటూ నసిగింది. మొదట విశ్వాసాన్ని రక్షణ కవచం కోసం ఏర్పరుచుకున్నారు. క్రమంగా పాపులారిటీ పెరగడం, డబ్బు రావడంతో వారిలో స్వార్థం చోటుచేసుకున్నది. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
రాజధాని అంశాలకు చట్టబద్ధత కల్పించాలి
ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దాం.. తుళ్లూరులో రైతుల సమావేశం తుళ్లూరు రూరల్: ఐకమత్యంతోనేహక్కులను సాధించుకోగలమని, రాజధానికి సంబంధించిన అంశాలకు చట్టబద్ధత కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని రాజధాని ప్రాంత రైతులు అభిప్రాయపడ్డారు. గుంటూరు జిల్లా తుళ్లూరులోని రాయల సుబ్బారావు ప్రాంగణంలో రాజధాని ప్రాంత 29 గ్రామాల రైతులు ఆదివారం సమావేశమయ్యారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు, గ్రామకంఠాల వ్యవహారంపై చర్చించారు. అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు కేటాయించాలని, గ్రామకంఠాల నిర్ధారణలో సమన్యాయం పాటించాలని పలువురు రైతులు ప్రభుత్వానికి సూచించారు. సర్పంచ్ మేకల రాజేశ్ మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలోని భూమిలేని నిరుపేదలకు కేవలం 10 ఏళ్లు మాత్రమే రూ. 2,500 పింఛన్ ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని, ఆ తరువాత వారు జీవనం ఎలా సాగించాలని ్రప్రశ్నించారు. భూమిలేని ప్రతి నిరుపేద కుటుంబానికి 200-250 గజాల ఇళ్ల స్థలం ఇస్తే బాగుంటుందని సూచించారు. ప్రభుత్వానికీ, రైతు, రైతుకూలీలకు మధ్య వారధిలా రాజధాని ప్రాంత రైతు కూలీ సంఘం ఏర్పాటు ఉపయుక్తంగా ఉంటుందని పలువురు రైతులు అభిప్రాయపడ్డారు. సంఘం ఏర్పాటుకు గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించారు. సమావేశంలో బెల్లంకొండ నరసింహారావు, పువ్వాడ సుధాకర్, తదితరులు, రైతులు పాల్గొన్నారు. -
భూప్రకంపనలు
⇒ సంచలనం సృష్టిస్త్తున్న ‘సాక్షి’ కథనాలు ⇒ ఎక్కడ చూసినా ‘రాజధాని దురాక్రమణ’పైనే చర్చ ⇒ రాజకీయ, అధికారవర్గాల్లోనూ కలకలం ⇒ ఎవరి బండారం బయటపడుతుందోనని గుబులు ⇒ మంత్రులు, టీడీపీ నేతల భూ బాగోతంపై జనాగ్రహం ⇒ కడుపులు కొట్టి భూములు మింగారని ఆందోళన ⇒ అన్యాయం చేసిన వారి పాపం ఊరికే పోదని శాపనార్థాలు ఊళ్లల్లో తిరుగుతూ హడావుడి చేసిన మంత్రి నారాయణ మూడు వేల ఎకరాలు కొనేశాడా..! ఓ రైతు ఆశ్చర్యం ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని చెప్పి ప్రపంచ స్థాయి భూ కుంభకోణానికి తెరతీశారా..! మరొకరి అనుమానం ‘సాక్షి’లో సాక్ష్యాధారాలతో సహా వచ్చాయిగా ఇంకా సందేహమెందుకు..? ఇంకొకరి సమర్థన రాజధాని ప్రాంతంలో ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా టీడీపీ దురాక్రమణ’పైనే చర్చ మంగళగిరి, తుళ్లూరు, అమరావతి మండలాల్లో ఈ కథనాలు ప్రకంపనలు సృష్టించాయి. దురాక్రమణలో టీడీపీ నేతల నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండడంతో రేపటి కథనాల్లో ఎవరి బండారం బయటపడుతుందోనని అధికార పార్టీ నేతలు గుబులు చెందుతున్నారు. భూముల క్రయ విక్రయాల్లో అధికార పార్టీ నేతలకు సహకరించిన రియల్ఎస్టేట్ వ్యాపారులు, దళారులు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో నేతలకు సహకరించిన రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. పక్కా సాక్ష్యాధారాలతో ప్రచురితం అవుతున్న కథనాలపై పోలీస్, ఇంటిలిజెన్స్ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తంచేస్తూ విచారణకు దిగారు. కడుపు కొట్టారంటూ కూలీల ఆవేదన.. రాజధాని పేరుతో రాజకీయ వ్యాపారం చేస్తున్నారని రైతులు, కూలీలు ప్రభుత్వ తీరును ఎండగడుతు న్నారు. ముఖ్యమంత్రి కుటుంబం, మంత్రులు, టీడీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ భూములు లాక్కుని రాజధాని కడతారనుకుంటే వాటిని స్వాధీనం చేసుకుని వ్యాపారం చేసుకుంటున్నారని మండిపడుతున్నారు. వ్యవసాయం లేకుండా పోయి నానా బాధలు పడుతున్నామని రైతులు, పనులు లేకుండా రోడ్డున పడ్డామని కూలీలు ఆందోళన చెందుతున్నారు. భూములు లాక్కుని తమ కడుపులు కొట్టారని వెంకటపాలెం రైతు పి.శేఖర్ ఆవేదనగా చెప్పాడు. రాజధాని పేరుతో తమ ప్రాంతాన్ని సర్వ నాశనం చేశారని, టీడీపీ తమను నట్టేట ముంచిందని తాళ్లాయపాలెంలో ఏసోబు అనే కార్మికుడు ఆవేదనగా చెప్పాడు. ఉంచుకుంటే ఏమీ మిగలదని చెప్పడంతో చాలా తక్కువ రేటుకు తన భూమి అమ్మేశానని మందడం గ్రామానికి చెందిన రైతు నాగేశ్వరరావు తెలిపాడు. తమకు అన్యాయం చేసిన వాళ్ల పాపం ఊరికే పోదని శాపనార్ధాలు పెడుతున్నారు. కొమ్మాలపాటి కుచ్చుటోపీపై తీవ్ర చర్చ... పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ నిర్వహిస్తున్న అభినందన హౌసింగ్ సంస్థ రాజధాని గ్రామమైన యర్రబాలెంలో 42 ఎకరాలు కొనుగోలు చేసి వాయిదాల పద్ధతిలో ప్లాట్లు విక్రయించింది. రాజధాని ప్రకటన తర్వాత కొందరు ఖాతాదారులకు ఇక్కడ కాకుండా వేరేవెంచర్లలో ప్లాట్లు కేటాయించింది. మరి కొందరికి నగదు తిరిగి చెల్లించింది. ఇంకా 500కు పైగా ఖాతాదారులు తమకు అక్కడే ప్లాట్లు కేటాయించాలని తిరుగుతుండగా అనుమతులు రావంటూ భయపెట్టి, ఆ భూములను భూ సమీకరణకు కూడా ఇవ్వకుండా మెగా సిటీ నిర్మాణం కోసం ప్లాన్ చేస్తున్నారని వచ్చిన కథనం ఖాతాదారు ల్లో ఆగ్రహాన్ని రగిల్చినట్లు సమాచారం. దీంతో కొందరు ఖాతాదారులు కలిసి సంఘంగా ఏర్పడి తమకు ప్లాట్లు అక్కడే కేటాయించే విధంగా సంస్థపై ఒత్తిడి తేవాలని నిర్ణయించినట్టు ఓ ఖాతాదారుడు తెలిపారు. ఖాతాదారుల్లో ఉలికిపాటు.. రాజధాని భూ దురాక్రమణ కథనాల్లో భాగంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలోని రామ కృష్ణా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వెంచర్లో 194 ఎకరాల్లో 54 ఎకరాలు అసైన్డు భూములున్నాయని రావడం యాజమాన్యంతో పాటు అధికార వర్గాల్లోనూ ఆందోళన రేకెత్తించింది. కొందరు ఖాతాదారులు తాము కొనుగోలు చేసిన ప్లాట్లలో ఏవైనా అసైన్డు భూములు ఉన్నాయా.. అని ఆరాలు తీయడం ప్రారంభించారు. దీనిపై యాజమాన్యం ముందు జాగ్రత్తగా వచ్చిన వినియోగదారులను విజయవాడ కార్యాలయానికి పిలిపించి, ఆందోళన చెందాల్సిన పనిలేదని నచ్చజెప్పి పంపినట్లు సమాచారం. -
అమరావతికి ప్రపంచ బ్యాంక్ బృందం
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ బ్యాంక్ బృందం బుధవారం సందర్శించింది. కొండవీటి వాగును పరిశీలించేందుకు వచ్చినట్లు సమాచారం. ఈ వాగు వల్ల దాదాపు 13 వేల ఎకరాలు ముంపుకు గురవుతున్నాయి. దీనిపై అధ్యయనం చేసేందుకు రాజధాని గ్రామాల్లో ఈ బృందం పర్యటిస్తున్నది. తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయంలో కొంత సమయం గడిపారు. అనంతరం ఉద్రండాయినిపాలెం, కృష్టాయపాలెం, మందడంలలో పర్యటించారు. -
జగన్ రాకతో పులకించిన పల్లెలు
వైఎస్ జగన్‌ను చూసేందుకు పోటీ పడ్డ అభిమానుల దారి పొడవునా సందడి చేసినకార్యకర్తలు నూతన వధూవరులను ఆశీర్వదించిన జగన్ తుళ్ళూరు : రాజధాని అమరావతి ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం రాకతో పల్లెలు పులకించాయి. ఉద్దండ్రాయునిపాలెం దళితవాడలో కాబోయే నూతన వధూవరులు నాగేంద్రబాబు, ఝాన్సీలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. తొలుత వైఎస్సార్ యూత్ అధ్యక్షుడు నందిగం సురేష్ ఆధ్వర్యంలో వెంకటపాలెం నుంచి పూలతో దారిపొడవునా స్వాగతం పలికారు. జగన్ రాయపూడి దళితవాడ వద్ద ఆగి మహిళలు, యువకులతో కరచాలనం చేశారు. అనంతరం తుళ్ళూరు అంబేడ్కర్ బొమ్మ వద్ద మహిళలను పలకరించి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. వడ్డమానులో జగన్‌కు ఘనస్వాగతం లభించింది. ఊరంతా పార్టీ ఫ్లెక్సీలతో నిండిపోయింది. గ్రామంలో కాబోయే వధూవరులు చంద్రశేఖర్ రెడ్డి, అనూరాధలను జగన్ దీవించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి అయోధ్య రామిరెడ్డి, తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి హెనీ క్రిస్టీనా, నాయకుడు కత్తెర సురేష్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు బత్తుల కిషోర్ పాల్గొన్నారు. -
తుళ్ళూరులో తొలగని ట్రా‘ఫికర్’
తుళ్ళూరు రూరల్: రాజధాని ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు ఇప్పట్లో తొలగేటట్లు కన్పించడంలేదు. తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలను రాజధాని ప్రాంతాలుగా ప్రకటన వెలువడడంతో ట్రాఫిక్ సమస్య తెరపైకి వచ్చింది. రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పెరగడం, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రముఖుల రాకపోకల తాకిడి అధికం కావడంతో రద్దీ ఎక్కువైంది. తుళ్ళూరులోని లైబ్రరీ సెంటర్, మందడం, తాడేపల్లిలోని ఉండవల్లి సెంటర్లలో రోడ్డు దాటాలంటే పడే అవస్థ అంతాఇంతా కాదు. ఈ నేపథ్యంలో అక్టోబరు 22న జరిగిన రాజధాని శంకుస్థాపన సందర్భంగా రోడ్ల విస్తరణ పనులు ప్రభుత్వం చేపట్టింది. ట్రాఫిక్ కష్టాల నివారించేందుకు కొత్తగా రోడ్ల నిర్మాణం జరిపింది. ఇందులో భాగంగా రాయపూడి-తుళ్ళూరు మధ్య వడ్డగిరి దగ్గరి నుంచి అమరావతి వైపుకు వెళ్ళేందుకు వీలుగా కొత్తగా ైబె పాస్ రోడ్డు నిర్మించారు. దీంతో వాహనాల మళ్ళింపుతో తుళ్ళూరులో ట్రాఫిక్ కష్టాలు తొలుగుతాయని అందరూ భావించారు. కానీ అలా జరగక పోగా, తీవ్రతరమయ్యాయని ప్రయాణికులతో పాటు స్థానికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ,అమరావతి వైపు నుంచి రాకపోకలు సాగించే లారీలను, వాహనాలను తుళ్ళూరు వద్ద నుంచి దారి మళ్లీంచాలని స్థానికులు కోరుతున్నారు. -
ప్రభుత్వ తీరుతో బడుగు రైతులు బలి
-
రాజధాని భూసేకరణకు వారంలో నోటిఫికేషన్
తొలిసారి ఆగస్టులో యత్నించిన ప్రభుత్వం తీవ్రంగా ప్రతిఘటించిన రైతులు విజయవాడలో ధర్నా నిర్వహించిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అప్పట్లో వెనక్కి తగ్గిన రాష్ట్ర సర్కారు రాజధానికి శంకుస్థాపన నేపథ్యంలో మళ్లీ సీఎం ఆదేశాలు! సాక్షి, విజయవాడ బ్యూరో/ సాక్షి ప్రతినిధి గుంటూరు: రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ కింద ఇవ్వని భూములను త్వరలో భూసేకరణ ద్వారా తీసుకుంటామని వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలోని మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. మొదటి దశలో తుళ్లూరు మండలంలో 30 కుటుంబాలకు చెందిన 300 ఎకరాలను సేకరిస్తామన్నారు. ఇందుకు వారంరోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. రాజధాని మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా ఇంకా 1,500 ఎకరాలను సేకరించాల్సి ఉందని తొలి విడతలో 300 ఎకరాలు సేకరించగా మిగిలిన భూములను మలి విడతలో సేకరిస్తామని చెప్పారు. ఇప్పటివరకు 33 వేల ఎకరాలకు పైగా భూమిని సమీకరణ కింద తీసుకున్నామన్నారు. సమీకరణ కింద రైతులు ఇప్పుడు ముందుకు వచ్చినా భూములు తీసుకుంటామన్నారు. భూ సమీకరణ విధానం కింద ప్రభుత్వం తుళ్లూరు మండలంలో 26,746 ఎకరాలను రైతుల నుంచి తీసుకుంది. ఇక్కడే మరో 300 ఎకరాలు సమీకరించాల్సి ఉండ గా.. పాలకులు, అధికారులు ఎన్ని విధాలుగా మభ్యపెట్టినా, బెదిరింపులకు గురిచేసినా ఆ భూములిచ్చేందుకు రైతులు అంగీకరించలేదు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, జిల్లాకు చెందిన ఇతర టీడీపీ నాయకులు భూములు ఇవ్వని రైతులతో భేటీ అయ్యారు. మంతనాలు జరిపారు. నానా రకాలుగా ప్రలోభపెట్టినా 300 ఎకరాలను సమీకరించలేక పోయారు. రైతులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నప్పటికీ భూములను తీసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం భూసేకరణ అస్త్రం ప్రయోగించాలని నిర్ణయించింది. మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలోని రైతులు భూములు ఇచ్చేందుకు తొలినుంచీ నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రెండు నెలల క్రితం భూసేకరణ చట్టం ప్రయోగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆగస్టు 21న ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదట తుళ్లూరు మండలంలోని తుళ్లూరు-2, బోరుపాలెం, అబ్బురాజుపాలెం, పిచుకలపాలెం, అనంతవరం గ్రామాల పరిధిలో 11.14 ఎకరాలు సేకరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీనిపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భూ సేకరణకు వ్యతిరేకంగా ఆగస్టు 26న విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భూసేకరణ యత్నాలను తాత్కాలికంగా విరమించుకుంది. సేకరించాల్సిందేనన్న చంద్రబాబు అమరావతికి శంకుస్థాపన జరిగిన తర్వాత తుళ్లూరుతో పాటు తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని భూములపై చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. మంగళగిరి, తాడేపల్లి మండలాల రైతులు సమీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే న్యాయస్థానాలను ఆశ్రయించడంతో.. వారి భూములు తీసుకునే అవకాశం లేదని అధికారులు తేల్పిచెప్పారు. మల్కాపురంలోని చెరుకుతోట దహనంతో ఉద్రిక్తత నెలకొందనీ, రైతులు తిరగబడే అవకాశం ఉందని వివరించారు. అయినా ఆ భూములు తీసుకోవాల్సిందేనన్న చంద్రబాబు భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేయాల్సిందిగా ఆదేశించినట్టు సమాచారం. -
రాజధాని ప్రాంతంలో మళ్లీ భూసేకరణ
-
తుళ్లూరు.. తుళ్లింత
ఇప్పటి వరకూ నాలుగు వేడుకలకు నెలవైన తుళ్లూరు రేపు ఐదో పండుగకు ముస్తాబు సంతోషం వ్యక్తం చేస్తున్న ఆ ప్రాంతవాసులు ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ప్రకటించినప్పటి నుంచి తుళ్లూరు ప్రాంతం నిత్య పండుగలతో తుళ్లిపడుతోంది. ప్రభుత్వ వేడుకలన్నీ తన ముంగిట్లో జరుగుతుండడంతో మురిసిపోతోంది..ఈ ప్రాంత ప్రజల లోగిళ్లను.. సంబరాల్లో ముంచెత్తుతోంది..ఇలా నాలుగు వేడుకలకు నెలవైన తుళ్లూరు.. ఐదో వేడుకకు ముస్తాబయింది..శంకుస్థాపన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నానని మరోసారి గర్వంతో.. చిరుదరహాసం చిందిస్తోంది.. తాడికొండ: అమరావతి రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలం వేడుకలు నిర్వహించుకునేందుకు పుట్టినిల్లుగా మారింది. 2015 తొలి నుంచి రాష్ట్ర స్థాయి వేడుకలన్నీ ఈ ప్రాంతంలోనే చేపట్టారు. ఇప్పటి వరకు నాలుగు భారీ స్థాయి కార్యక్రమాలు నిర్వహించారు. రేపు శంకుస్థాపన పర్వదినాన్నీ ఈ మండలంలోనే చేపట్టారు. రుద్రమదేవి నడయాడిన నేల క్రీస్తుశకం 1000 సంవత్సరం నుంచి కాకతీ యులు ఓరుగల్లును రాజధానిగా చేసుకొని పాలించారు. వారి పాలనలోనే 1199 నుంచి 1289సంవత్సరం వరకు గణపతిదేవుని కుమా ర్తె రుద్రమదేవి తుళ్లూరు మండలంలోని మల్కాపురం, మందడం, తాళ్లాయిపాలెం ప్రాంతాలను పరిపాలించి ఆలయాలు, శిలాశాసనాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు 2015 నుం చి నవ్యాంధ్ర రాష్ట్రంలోని 13 జిల్లాలకు సంబంధించిన ఉమ్మడి కార్యక్రమాలను ఈ ప్రాంతంలోనే చేపడుతున్నారు. రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా జనవరి 1న నూతన సంవత్సర వేడుకలను తుళ్లూరులో సీఎం చంద్రబాబు వైభవంగా నిర్వహించారు. జనవరి 14న ఇదే తుళ్లూరులో ప్రభుత్వం తరఫున సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. మార్చి 21న తెలుగు సంవత్సరం ఉగాది వేడుకలను అనంతవరం వెంకన్న సన్నిధిలో భక్తిభావంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కొన్నాళ్ల వి రామం తరువాత జూన్ 6న ప్రతిష్టాత్మకమైన అమరావతి రాజధాని నిర్మాణానికి భూమిపూ జ కార్యక్రమాన్ని ఇదే మండలంలోని మంద డం, తాళ్లాయిపాలెం గ్రామాల మధ్య పొలాల్లో వేద మంత్రాల నడుమ చేపట్టారు. గురువారం రాజధాని శంకుస్థాపన దేశ ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా నిర్వహించనున్నారు. -
తుళ్లూరులో ఏపీ తాత్కాలిక అసెంబ్లీ
గుంటూరు: గుంటూరు జిల్లా తుళ్లూరులో ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక అసెంబ్లీని నిర్మించనున్నట్టు స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. అసెంబ్లీ నిర్మాణ కోసం వెంటనే టెండర్లు పిలవాలని నిర్ణయించారు. యుద్ధప్రాతిపదికను నిర్మాణం పనులు చేపట్టాలని, 5 రోజుల పాటు తుళ్లూరులోనే సమావేశాలు జరపనున్నట్టు కోడెల చెప్పారు. రాజధాని శంకుస్థాపన ప్రాంతానికి సమీపంలో తాత్కాలిక అసెంబ్లీ భవనాన్ని నిర్మించనున్నారు. ఏపీ శాసనమండలి సమావేశాలు కూడా తుళ్లూరులోనే జరపాలని నిర్ణయించారు. -
ఇదే ఆంధ్రప్రదేశ్ రాజధాని
కీలక ప్రభుత్వ నిర్మాణాలన్నీ తుళ్లూరు పరిసరాల్లోనే..! ఐదు దశల్లో పీపీపీ విధానంలో రాజధాని నిర్మాణం 2050 నాటికి పూర్తిస్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి హైదరాబాద్: ఆంధ్రుల రాజధాని అమరావతి కీలక ప్రాంతమంతా (కోర్ ఏరియా) తుళ్లూరు పరిసరాల్లోనే కేంద్రీకృతమైంది. ప్రభుత్వ కీలక నిర్మాణాలన్నీ తుళ్లూరు, రాయపూడి గ్రామాల్లోనే నిర్మితం కానున్నాయి. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, రాష్ట్ర మంత్రుల నివాస గృహాలు, సిటీ గ్యాలరీ తదితర నిర్మాణాలు తుళ్లూరు పరిసరాల్లోనే నిర్మిస్తారని ‘సాక్షి’ ముందుగానే వెల్లడించింది. ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించకముందే తుళ్లూరు ప్రాంతంలో రాజధాని ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. తుళ్లూరు కేంద్రంగానే భూ సమీకరణను ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో అప్పట్లో ఇక్కడే ప్రభుత్వ కీలక నిర్మాణాలు ఉంటాయని భావించారు. ప్రస్తుతం సింగపూర్ ప్రభుత్వం అందించిన చివరి విడత ప్రధాన రాజధాని ప్రణాళిక (సీడ్ కేపిటల్ ప్లాన్) ప్రకారం అమరావతి గవర్నమెంట్ కోర్ ప్రాంతం మొత్తం లింగాయపాలెం, రాయపూడి, బోరుపాలెం, తుళ్లూరులలో ఉంటుందని రూఢీ అయ్యింది. నాలుగు భాగాలుగా విభజన.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి అందించిన సీడ్ కేపిటల్ ప్రణాళికలో నాలుగు భాగాలుగా విభజించారు. అమరావతి గేట్ వే, అమరావతి వాటర్ ఫ్రంట్, అమరావతి డౌన్ టౌన్, అమరావతి గవర్నమెంట్ కోర్ పేరుతో అభివృద్ధి చేయనున్నారు. ఓ మెగా సిటీతో పాటు ఏడు ప్రాంతీయ కేంద్రాలను ఏడు రంగాల్లో హబ్‌లుగా అభివృద్ధి చేసేందుకు సింగపూర్ ప్రభుత్వం బృహత్తర ప్రణాళికను ఏపీ ప్రభుత్వానికి అందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్‌ను సోమవారం రాజమండ్రిలో అందజేశారు. ఈ సీడ్ కేపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ పరిధి 16.9 చదరపు కి.మీ. ఉంటుంది. సింగపూర్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న దశలో కేపిటల్ సీడ్ మాస్టర్ ప్లాన్ 8 చ.కి.మీ. మాత్రమే ప్రతిపాదించారు. తాజాగా అందించిన ప్రణాళికలో మాత్రం దాన్ని రెండింతలు పెంచి 16.9 చ.కి.మీ. మేరకు చూపించారు. ఐదు దశల్లో సీడ్ కేపిటల్ ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మించనున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టీకరించింది. 2050 నాటికి అమరావతి రాజధాని పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని ప్రణాళికలో పొందుపరిచారు. అమరావతి గేట్ వే భాగం తాళ్లాయపాలెం పరిధిలో ఉంటుంది. ఇక్కడే గత నెల 6నముఖ్యమంత్రి రాజధాని నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ గ్రామం మందడం రెవెన్యూ గ్రామం కింద ఉంది. ఇక్కడ సిటీ గ్యాలరీ, వెట్‌ల్యాండ్ పార్క్, కల్చరల్ సెంటర్, అమరావతి ప్లాజా, యూనివర్సిటీ ఏర్పాటు చేస్తారు. అమరావతి డౌన్ టౌన్ భాగంలో ఉద్దండరాయునిపాలెం, లంక గ్రామాలున్నాయి. ఈ గ్రామాలను ఆనుకుని అమరావతి వాటర్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తారు. ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం నడుమ స్పోర్ట్స్ సౌకర్యాలు, బొటానికల్ గార్డెన్స్, ప్రాంతీయ ఆసుపత్రి, కెనాల్ పార్కులు, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. లింగాయపాలెం నుంచి తుళ్లూరు వరకు సెమీ ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు, ప్రభుత్వ కీలక నిర్మాణాలన్నీ ఉండాలని ప్రణాళికలో సూచించారు. రాజధాని ప్రాంత అభివృద్ధి మొత్తం గుంటూరు జిల్లాలోనే.. రాజధాని ప్రాంత అభివృద్ధి మొత్తం గుంటూరు జిల్లాలోనే ఉండేలా ప్లాన్ రూపొందించారు. అమరావతి మెగా సిటీతో పాటు ఏడు ప్రాంతీయ కేంద్రాలను గుంటూరు, కృష్ణా జిల్లాల్లో హబ్‌ల పేరుతో అభివృద్ధి చేసేలా ప్రణాళిక తయారు చేశారు. ఈ రెండు జిల్లాల్లో గుంటూరులో ఆగ్రో ప్రాసెసింగ్ హబ్, తెనాలిలో లైట్ ఇండస్ట్రియల్ సపోర్ట్ హబ్, సత్తెనపల్లిలో హెవీ ఇండస్ట్రీ, నందిగామలో టూరిజం, నూజివీడులో ఫుడ్ ప్రాసెసింగ్, గన్నవరంలో ఫ్యూచర్ ఏరోట్రోపోలీస్ (విమానయాన సంబంధిత), గుడివాడలో వాల్యూయాడెడ్ ఎకనమిక్ హబ్‌లను అభివృద్ధి చేస్తారు. అమరావతి వారసత్వ నగరంగా ఉంటుంది. కృష్ణా జిల్లాలో పామర్రు-మచిలీపట్నం నడుమ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు ఉంటుందని ప్లాన్‌లో పేర్కొన్నారు. ఐదు గ్రామాలు ఖాళీ కావాల్సిందే! సింగపూర్ ప్రభుత్వం రూపొందించే మాస్టర్ ప్లాన్ గ్రామాలను తాకకుండా ఉంటుంది.. ఆ విధంగానే ప్లాన్ రూపొందించాలనిచెప్పామని పలు దఫాలుగా రాష్ట్ర మంత్రులు ప్రకటించారు. అందుకు భిన్నంగా ఐదు గ్రామాలు కచ్చితంగా ఖాళీ చేయక తప్పదని సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్ ప్రకారం తెలుస్తోంది. గ్రామాల వెలుపలి నుంచి మాత్రమే ప్రణాళిక రూపొందుతుందని ఏపీ మంత్రి నారాయణ సైతం ప్రకటించిన సంగతి తెలిసిందే. సీడ్ కేపిటల్ ప్లాన్ ప్రకారం కీలక నిర్మాణాలన్నీ తుళ్లూరు పరిసరాల్లోనే ఉండటంతో ఎంతో చరిత్ర ఉన్న కృష్ణా పరివాహక గ్రామాలు ఆనవాళ్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడనుంది. మాస్టర్ ప్లాన్‌లో సూచించిన మేరకు తాళ్లాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, ప్రభుత్వ కీలక నిర్మాణాలు నిర్మించే వెలగపూడి, రాయపూడి గ్రామాలు ఖాళీ చేయక తప్పదని అధికారవర్గాలు చెబుతున్నాయి. తుళ్లూరు పరిసర గ్రామాలపైనా పాక్షికంగా ప్రభావం ఉంటుంది. ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ -
చంద్రబాబు పచ్చి మోసగాడు: మధు
తుళ్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పచ్చి మోసగాడని, ఓటుకు నోటు వ్యవహారంలో అతడిపై కేసు నమోదు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. తుళ్లూరులో సీఆర్డీఏ కార్యాలయం వద్ద రాజధాని ప్రాంత వ్యవసాయ కార్మికులు, భూమి లేని, కౌలురైతులకు నెలవారీ పింఛన్ రూ.9 వేలు చెల్లించాలని తదితర డిమాండ్లతో సీపీఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో భూమిపై ఆధారపడి జీవించే వ్యవసాయకూలీలు, కౌలురైతులు, డ్వాక్రా మహిళలు, వృత్తిదారులను చంద్రబాబు నమ్మించి మోసగించారని దుయ్యబట్టారు. నెలవారీ పింఛన్, కౌలు పరిహారం పంపిణీలో జాప్యం ఎందుకని నిలదీశారు. వ్యవసాయశాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జిన్నింగ్ మిల్లుకు సంబంధించి కోట్ల రుపాయల బకాయిలను రద్దు చేశారని ఆరోపించారు. పేదలకు మాత్రం మొండిచేయి చూపుతున్నారని, ఇది దగాకోరు ప్రభుత్వమని అభివర్ణించారు. రాజధాని ప్రజల సమస్యలపై ఈ నెల 9న అన్ని వామపక్షాలు విజయవాడలో సమావేశం అవుతున్నట్లు తెలిపారు. సమావేశంలో చర్చించిన అనంతరం లక్షమంది మహిళలతో మహోద్యమం చేపడతామని, చంద్రబాబు సంగతి తేలుస్తామని హెచ్చరించారు. రాజధాని ప్రాంత సీపీఎం సమన్వయకమిటీ కన్వీనర్ సిహెచ్.బాబురావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాజధాని ప్రాంత వ్యవసాయ కార్మికులు, ఇతర వర్గాలకు న్యాయం చేయకపోతే చంద్రబాబు సహా మంత్రులను గ్రామాల్లో తిరగనీయబోమని చెప్పారు. వ్యవసాయకార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.రవి, సీపీఎం మంగళగిరి డివిజన్ కార్యదర్శి జె.వి.రాఘవులు, చేనేత కార్మికసంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ, సీపీఎం నాయకులు జొన్నకూటి వీర్లంకయ్య, జె.నవీన్‌ప్రకాష్, ఈమని అప్పారావు, జయప్రకాష్ పాల్గొన్నారు. -
నామమాత్రంగానే భూమి పూజ
అక్టోబర్‌లో శంకుస్థాపన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తుళ్లూరు: నూతన రాజధాని భూమి పూజ వచ్చే నెల 6వ తేదీన నామమాత్రంగానే జరగనున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పురపాలక శాఖ మంత్రి పి.నారాయణతో కలిసి మంత్రి గురువారం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో భూమి పూజ నిర్వహించే స్థలాన్ని పరిశీలించారు. అనంతరం తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ పూజా కార్యక్రమం కేవలం పదివేల మందితో నామమాత్రంగానే జరగనున్నదని తెలిపారు. అక్టోబరులో రాజధాని శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని, దీనికి ప్రధాన మంత్రి హాజరయ్యే అవకాశం ఉందన్నారు. లక్షలాది మందితో శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందన్నారు. సీఎం చంద్రబాబు వచ్చే నెల 5, 6, 8 తేదీల్లో జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొం టారన్నారు. 5వ తేదీన గుంటూరు సమీపంలోని లాం వ్యవసాయ విశ్వవిద్యాలయం భూమి పూజ, 6న తుళ్లూరు మండలం మందడంలో జరిగే రాజధాని నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రి చెప్పారు. జూన్ 8వ తేదీనటీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మంగళగిరి సమీప ప్రాంతంలో జరిగే కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారని పుల్లారావు వివరించారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ రైతులు గురువారం నాటికి 17,840 ఎకరాలకు భూస్వాధీన ఒప్పంద పత్రాలు అందజేశారన్నారు. -
రాజధాని ప్రాంతంలో సింగపూర్ బృందం పర్యటన
తుళ్ళూరు/తాడేపల్లి రూరల్: రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలంలోని కృష్ణానది తీర ప్రాంతాన్ని మంగళవారం ఏడుగురు ప్రతినిధులతో కూడిన సింగపూర్ బృందం పరిశీలించింది. నూతన రాజధానికి మాస్టర్ ప్లాన్ ఇచ్చిన మర్నాడే ఈ బృందం రాజధాని ప్రాంతంలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. విజయవాడ నుంచి బయలుదేరిన ఈ బృందం ప్రకాశం బ్యారేజి మీదుగా గుంటూరు జిల్లా సీతానగరం చేరుకుని అక్కడ నుంచి ఉండవల్లి కరకట్ట మీదుగా తూళ్లూరు మండలం వెంకటపాలెం చేరుకున్నారు. అక్కడి నుంచి మందడం మీదుగా తాళాయపాలెంలోని శ్రీశైవక్షేత్రానికి వెళ్లారు. అక్కడ ఐదు నిమిషాల పాటు మ్యాప్‌ల ఆధారంగా కృష్ణానదిని పరిశీలించారు. ఈప్రాంతాన్ని పర్యాటక రంగంగా తీర్చిదిద్దాలని రాజధాని మాస్టార్ ప్లాన్‌లో పొందు పరిచిన నేపథ్యంలో సింగపూర్ బృందం శ్రీశైవక్షేత్రంకు ఉత్తరంగా కనిపించే కృష్ణానది గురించి ఆసక్తి కనబరిచింది. పరిసర ప్రాంతాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ బృందం విజయవాడ తిరుగు ప్రయాణమయ్యింది. -
తుళ్లూరులో సింగపూర్ బృందం రహస్య పర్యటన
గుంటూరు:ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం తుళ్లూరులో ఆదివారం సింగపూర్ బృందం రహస్య పర్యటన చేపట్టింది. ఈ మేరకు 17 మంది సింగపూర్ ప్రతినిధులు పర్యటనలో పాల్గొన్నారు. అనంతరం ఆ బృంద సభ్యులు సీఆర్డీఏ కార్యాలయంలో కమిషనర్ శ్రీకాంత్ తో సమావేశమయ్యారు. దీనిపై ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే వీరి పర్యటన కొనసాగుతోంది. రాజభవన్ భవన నిర్మాణం, హైకోర్టు తదితర అంశాలకు సంబంధించి ఈ బృందం తుళ్లురులో పర్యటన చేపట్టింది. దీనికి సంబంధించి మే 15 లోగా సింగపూర్ బృందం ఒక మాస్టర్ ప్లాన్ ఇవ్వనున్నట్లు ఏపీ మంత్రులు స్పష్టం చేస్తున్నారు. -
మీ సేవకు మా సెల్యూట్
చరిత్రపుటల్లోకి కమిషనరేట్ కష్టాల్లో ఉన్నవారి కన్నీళ్లు తుడిచింది.. కరడుగట్టిన నేరస్తుల ఆట కట్టించింది.. ప్రేమికులను ఒక్కటి చేసింది.. ప్రాణాలు తీసేవారిని శిక్షించింది.. వంద లాదిమంది పోలీసుల దేవాలయంగా నిలిచి, బాధితుల పాలిట దైవంగా మారిన మన పోలీస్ కమిషనరేట్ త్వరలో తెరమరుగు కానుంది. నగర పోలీస్ కమిషనరేట్ స్థానంలో తుళ్లూరు కేంద్రంగా గ్రేటర్ అమరావతి కమిషనరేట్ ఆవిష్కృతం కానుంది. ఈ విషయాన్ని కొద్దిరోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారు. -
కృష్ణానదిపై ఐదు వంతెనలు
గుడివాడలో వ్యవసాయ ఆధారిత కారిడార్ గన్నవరంలో ఐటీ, నందిగామలో ఫార్మా, బయోటెక్ కారిడార్లు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం విజయవాడ : తుళ్లూరు ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న రాజధానికి అమరావతి పేరును రాష్ట్ర మంత్రివర్గం బుధవారం ఖరారు చేసింది. ప్రపంచ స్థాయి కొత్త రాజధాని ఏర్పాటుతో పాటు దానికి అనుబంధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పటి నుంచో చెబుతున్నవే అయినప్పటికీ వీటిని సత్వరం పూర్తి చేస్తే కృష్ణాజిల్లా రూపు రేఖలే మారిపోతాయి. నూతన రాజధాని నగరానికి కూతవేటు దూరంలో ఉంటుంది. కృష్ణమ్మపై ఐదు వంతెలు కృష్ణానదిపై ఐదువంతెనలు నిర్మాణానికి క్యాబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఐదు వంతెలను విజయవాడకు గుంటూరుకు మధ్యలో వచ్చే అవకాశం ఉంది. గుంటుపల్లి, ఫెర్రి, చెవిటిక ల్లు, రామన్నపేట, ముత్యాల తదితర ప్రాంతాల్లో వంతెనలు నిర్మిస్తారని భావిస్తున్నారు. ఈ ఐదు వంతెనల నిర్మాణాలను పూర్తయితే నూతన రాజధాని, గుంటూరు జిల్లాలు నగరానికి బాగా దగ్గరగా మారిపోతాయి. రాజధాని నిర్మాణంతో పాటు ఈ వంతెనల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తారని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో కారిడార్ల జోరు.. గుడివాడలో వ్యవసాయ ఆధారిత కారిడార్, గన్నవరంలో ఐటీ కారిడార్, నందిగామలో ఫార్మా, బయోటెక్ కారిడార్, మచిలీపట్నం- కాకినాడ అభివృద్ధి కారిడార్ ఏర్పాటుకు క్యాబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రపంచస్థాయి రాజధాని నిర్మించనున్న నేపథ్యంలో ఇక్కడకు కొత్త కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిశ్రమలను జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావడంతో రాబోయే రోజుల్లో జిల్లా రూపురేఖలే మారిపోయే అవకాశం ఉంది. మంగళగిరిలో మరో ఎయిర్‌పోర్టు నగరానికి సమీపంలోని మంగళగిరిలో మరొక ఎయిర్ పోర్టు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. గన్నవరం ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేస్తే మంగళగిరి విమానాశ్రయాన్ని డొమెస్టిక్ ఎయిర్ పోర్టుగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. మంగళగిరి విమానాశ్రయం వల్ల కొత్త రాజధానితో పాటు విజయవాడ ప్రజలకు విమానాశ్రయం మరింత దగ్గరవుతుంది. గన్నవరం ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ హోదా గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించేందుకు కావాల్సిన 490 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. రైతులకు చెల్లించే పరిహారం విషయంలో స్పష్టత లేకపోవడంతో భూ సేకరణకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అంతర్జాతీయ హోదా కల్పించేందుకు క్యాబినేట్ ఆమోదం తెలిపినందున భూ సేకరణ వేగవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈలోగా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రస్తుతం ఉన్న పాత టెర్నినల్ బిల్డింగ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. త్వరలోనే రూ.150 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో కొత్త టెర్మినల్ భవనం నిర్మించేందుకు కసరత్తు జరుగుతోంది. -
నేడు టీడీపీ 34వ ఆవిర్భావ దినోత్సవం
తుళ్లూరు, హైదరాబాద్‌లలో పాల్గొననున్న చంద్రబాబు హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ 34వ ఆవిర్భావ దినోత్సవాన్ని గుంటూరు జిల్లా తుళ్లూరుతోపాటు హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేసినట్లు పార్టీ రాష్ట్ర కార్యాలయ సమన్వయ కార్యదర్శి టీడీ జనార్దనరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం ఎనిమిది గంటలకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్లో పార్టీ జెండాను ఎగురవేస్తారు. అనంతరం జిల్లాకు ఇద్దరు చొప్పున పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను సన్మానిస్తారు. అక్కడినుంచి నెక్లెస్‌రోడ్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం గుంటూరు జిల్లా తుళ్లూరులో జరిగే పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు, అక్కడ కూడా జిల్లాకు ఇద్దరు చొప్పున పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలకు సన్మానం చేస్తారు. ఏప్రిల్ 11 నుంచి సంస్థాగత ఎన్నికలు టీడీపీ రాష్ట్ర శాఖ సంస్థాగత ఎన్నికలను వచ్చే నెల 11 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ సంస్థాగత ఎన్నికల కమిటీ నిర్ణయించిందని కన్వీనర్ కిమిడి కళా వెంకట్రావు శనివారం ఓప్రకటనలో తెలిపారు. ఆరు, ఏడు తేదీల్లో మండల, పట్టణ, డివిజన్, అనుబంధ కమిటీల ఎన్నికల అధికారులకు ఎన్టీఆర్ భవన్లో ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇస్తారు. 11 నుంచి 21 వరకూ ఆయా కమిటీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. మే ఆరు నుంచి ఎనిమిది వరకూ జిల్లా పార్టీ, అనుబంధ కమిటీల ఎన్నికలు జరుపుతారు. మే 11 నుంచి 24 వరకూ అన్ని జిల్లాల్లో మినీ మహానాడులు జరుగుతాయి. మే 27 నుంచి 29 వరకూ మహానాడు నిర్వహిస్తారు. -
ఏపీ రాజధానికి అమరావతి పేరు ఖరారు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి అమరావతి పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. దీనిపై త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయనుంది. ఏపీ రాజధాని ప్రతిపాదిన ప్రాంతమైన తుళ్లూరుకు అమరావతి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరుకు గత కొద్దికాలంగా పలు రకాల పేర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కాగా రెండువేల సంవత్సరాల సంస్కృతికి, భవిష్యత్తుకు అద్దంపట్టే ‘అమరావతి’ అనే పేరు అయితే చారిత్రకంగా బాగుంటుందని చివరకు రాష్ట్ర ప్రభుత్వం అమరావతి అనే పేరుకే మొగ్గు చూపింది. -
తుళ్లూరులో రాజధానిపై సుప్రీంకోర్టులో పిల్
ఢిల్లీ: తుళ్లూరులో చేపట్టనున్నఏపీ రాజధానికి వ్యతిరేకంగా తాజాగా సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. పచ్చటి పొలాల భూములను రాజధాని భూసేకరణ కింద తీసుకోవడం మానవహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని విజయవాడ వాసి శ్రీమన్నారాయణ సుప్రీంలో పిల్ దాఖలు చేశారు. కృష్ణా తీరంలో రాజధాని నిర్మాణం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. వరదలు వచ్చే ప్రాంతంలో రాజధాని సరికాదని తెలిపారు. దీనిపై ఈనెల 20 వ తేదీన విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా పిల్ కు సంబంధించిన వివరాలను ఏపీ ప్రభుత్వం సేకరిస్తోంది. -
మెగా మెట్రో
విస్తరిస్తున్న మెట్రో ప్రాజెక్టు తొలిదశలోనే రాజధానికి అనుసంధానం మలి దశలో కుమ్మరిపాలెం వరకూ.. ఇంద్రకీలాద్రిని తొలచి సొరంగమార్గం విజయవాడ బ్యూరో : నగరంలోని బందరు, ఏలూరు రోడ్లకే పరిమితమనుకున్న మెట్రో రైలు ప్రాజెక్టు అంతకంతకూ విస్తరిస్తోంది. తొలి దశలోనే రాజధాని నగరానికి మెట్రో రైలు వెళ్లనుంది. విజయవాడ మెట్రో ప్రాజెక్టును తుళ్లూరు వరకూ పొడిగించాలని నిర్ణయించారు. ఇందుకోసం బస్టాండ్ సమీపంలో కృష్ణలంక వైపు నుంచి తాడేపల్లి వరకూ కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మించడానికి డిజైన్ కూడా రూపొందించారు. తాడేపల్లి సీతానగరం కొండ మీదుగా తుళ్లూరుకు మెట్రో కారిడార్‌ను నిర్మించనున్నారు. రాజధాని మాస్టర్‌ప్లాన్ వచ్చిన వెంటనే ఈ కారిడార్‌కు రూపకల్పన చేసేందుకు రాష్ట్ర మెట్రో ప్రాజెక్టులకు డీపీఆర్‌లు తయారుస్తున్న ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సిద్ధంగా ఉంది. అసెంబ్లీ, సచివాలయం, రాజ్‌భవన్ తదితర ముఖ్య కార్యాలయాలు ఎక్కడెక్కడ ఏర్పాటవుతాయనే విషయం తెలియజేసే కాన్సెప్ట్ ప్లాన్ వచ్చినా, తుళ్లూరు మెట్రో కారిడార్‌కు రూపకల్పన చేసే అవకాశం ఉంటుందని డీఎంఆర్సీ అధికారులు చెబుతున్నారు. విజయవాడ నుంచి నేరుగా తుళ్లూరు వెళ్లేలా ఈ మెట్రో రైలు మార్గాన్ని రూపొందించనున్నారు. ఈ కారిడార్ 20 నుంచి 25 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం ఉంది. దీంతో తొలి దశలోనే మూడు కారిడార్లు కలిపి 40 కిలోమీటర్లకుపైగా మెట్రో ప్రాజెక్టు ఏర్పడనుంది. రెండో దశ ఇలా... రెండో దశలో మెట్రో ప్రాజెక్టును హైదరాబాద్ రూటుకు అనుసంధానం చేయడానికి ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి కుమ్మరిపాలెం సెంటర్ వరకు ఏలూరు రోడ్డు కారిడార్‌ను పొడిగించనున్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్డు ఇరుకుగా ఉండడం, కనకదుర్గమ్మ గుడి వద్ద రోడ్డు ఇంకా సన్నగా ఉండడంతో ఈ కారిడార్‌ను అటువైపు నుంచి నిర్మించే అవకాశం లేదు. దీంతో ఈ ప్రాంతంలో ఇంద్రకీలాద్రిని తొలచి సొరంగం మార్గంలో కారిడార్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రాథమిక నివేదికను కూడా తయారుచేశారు. నిడమానూరు సమీపంలో బెస్ట్‌ప్రైస్ షోరూమ్ వరకు ఉన్న ఏలూరు రోడ్డు కారిడార్‌ను గన్నవరం ఎయిర్‌పోర్టు వరకు పొడిగించాలని భావిస్తున్నారు. దీనివల్ల ఎయిర్‌పోర్టు నుంచి రాజధాని నగరాన్ని అనుసంధానించాలని భావిస్తున్నారు. ఈ పొడిగింపును తొలి దశలో చేపట్టాలా.. మలి దశలో చేపట్టాలా.. అనే విషయంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఈ మొత్తం ప్రాజెక్టును సీఆర్డీఏ పరిధిలోని కీలక ప్రాంతాలైన గుంటూరు, తెనాలి, మంగళగిరికి హైస్పీడ్ సబర్బన్ రైల్ నెట్‌వర్క్‌కు అనుసంధానం చేయాలని భావిస్తున్నారు. తద్వారా రాజధాని రీజియన్‌లోని కీలక ప్రాంతాలను మెట్రో, సబర్బన్ రైల్ నెట్వర్క్ పరిధిలోకి తీసుకువచ్చి రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని యోచిస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ శుక్రవారం నగరానికి వచ్చిన రాష్ట్ర మెట్రో ప్రాజెక్టుల సలహదారు శ్రీధరన్ సమీక్షించారు. -
తుళ్లూరుపై కెమెరా కన్ను
విస్తృతంగా షూటింగ్‌లు కెమెరాలతో వీడియో, ఫొటోగ్రాఫర్ల హడావుడి తుళ్లూరు అందాలు, స్థల పురాణాల చిత్రీకరణలు డాక్యుమెంటరీ తీస్తున్న జర్నలిజం విద్యార్థులు తుళ్లూరు అందాలు కెమెరా కళ్లలో బందీ అవుతున్నారుు. నిజమే.. భవిష్యత్తులో ఇక్కడి పచ్చటి పొలాలు, సెలయేటి పరవళ్లు, వాగులు, వంకలు కనుమరుగై కాంక్రీట్ జంగిల్ ప్రత్యక్షం కానున్న నేపథ్యంలో అనేక సినీ సంస్థలు, విద్యార్థులు ఇప్పటి అందాలను చిత్రీకరించి భద్రపరుస్తున్నారు. ఇందులో భాగంగానే చాలామంది వీడియో, ఫొటోగ్రాఫర్లు కెమెరాలు చేతపట్టుకుని తుళ్లూరులో పర్యటిస్తున్నారు. గతంలో మాజీమంత్రి, తాడికొండ మాజీ ఎమ్మెల్యే డొక్కా మాణిక్యవరప్రసాద్ తుళ్లూరు మండలంలోని ప్రతి గ్రామంపై డాక్యుమెంటరీలు తీసి భావితరాలకు అందిస్తామని ప్రకటించారు. తాజాగా మద్రాసుకు చెందిన ఏషియన్ స్కూల్ ఆఫ్ జర్నలిజం విద్యార్థులు పది రోజులుగా మండలంలోని ప్రతి గ్రామాన్ని వీడియోలో చిత్రీకరిస్తున్నారు. అలాగే, అనేక టీవీ చానళ్లు, పత్రికల ఫొటోగ్రాఫర్లు కూడా తుళ్లూరు మండలంలోని అనేక ప్రాంతాలను ఫొటోలు తీస్తున్నారు. ఇటీవల వారాహి చలనచిత్ర సంస్థ కూడా తుళ్లూరు అందాలను వీడియో తీసింది. నవజన జాగృతి సేవాసంస్థ ఆధ్వర్యంలో ఇక్కడి స్థల పురాణాలు, ప్రత్యేకతలు చిత్రీకరించే ప్రయత్నంలో ఉన్నారు. - తుళ్లూరు -
ప్రశ్నించే హక్కు ప్రాణప్రదం
త్రికాలమ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలలోని లోపాలను ఎత్తి చూపించడానికీ, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికీ, నిలదీయడానికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ విద్యావంతుల వేదిక వంటి ఒక బలమైన సంస్థ అవసరం. అధికారంలో ఉన్నవారిని సహజంగానే అంధకారం ఆవరిస్తుంది. బధిరత్వం ఆవహిస్తుంది. అప్రియమైనవి కనిపించవు. వినిపించవు. స్వీయానురాగం శ్రుతిమించు తుంది. రాచరికమైనా, నియంతృత్వమైనా, ప్రజాస్వా మ్యమైనా ఈ ప్రమాదం అనివార్యం. అధికారం లక్షణం అది. తెలివైన పాలకులు ఈ ప్రమాదంలో పడకుండా తమను తాము కాపాడుకోవడం కోసం ప్రయత్నిస్తారు. క్షేత్రవాస్తవికతను తెలుసుకునేందుకు రాజులు మారు వేషాలలో సంచరించేవారు. ఆధునిక యుగంలో పాలకులు వేగులమీదనో, పార్టీ కార్యకర్తలమీదనో, మీడియామీదనో ఆధారపడ తారు. నిజాలు చేదుగా ఉన్నప్పటికీ సహిస్తారు. తెలివిలేనివారు వాస్తవాలు తెలుసుకోవడానికి నిరాకరిస్తూ ఊహాలోకంలోనే విహరించాలని కోరుకుంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకసారి ఎన్నికలలో గెలుపొంది అధికారంలోకి వచ్చిన పార్టీకీ, పార్టీ అధినేతకూ తిరిగి ఎన్నికలు జరిగే వరకూ అపరిమితమైన స్వేచ్ఛ. రాజ్యాంగం నిర్దేశిస్తున్నది కనుక మంత్రివర్గం నిర్మించాలి. శాసనసభ సమావేశాలు నిర్వహించాలి. మంత్రివర్గంలోనూ, శాసనసభలోనూ తమ మాటకు ఎదురు లేకుండా నయానో భయానో చేసుకోగలిగితే పాలకుల పని నల్లేరుమీద బండి చందమే. తెలంగాణ విద్యావంతుల వేదిక (తెవివే) ఐదవ మహాసభలో మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శనరెడ్డి చెప్పినట్టు రాజ్యాంగం ఏ ప్రభుత్వానికీ అధికారాలు ఇవ్వలేదు. అధికారాలు ప్రజలకు ఇచ్చింది. ప్రభుత్వాలకు కేవలం బాధ్యతలు అప్పగించింది. ప్రశ్నించే హక్కు ప్రతిపౌరుడికీ ఇచ్చింది. అభివృద్ధి చెందడానికి ఎటువంటి నమూనాను అనుసరించాలో, జాతీయ వనరులను ఏ విధంగా వినియోగించుకోవాలో కూడా రాజ్యాంగం స్పష్టం చేసింది. ఈ వాస్తవం సాధారణ ప్రజలకు పెద్దగా తెలియదు కనుక వారి తరఫున ప్రభుత్వాలను ప్రశ్నించవలసిన బాధ్యతను మేధావులు నిర్వహించాలి. ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకే పదేళ్ళ కిందట ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విద్యావంతుల వేదికను నెలకొల్పారు. ముందు తెలంగాణ మేధావుల వేదిక అని పేరు పెట్టాలని కొందరు అన్నప్పుడు మేధావులు అనడంలో స్వాతిశయం ధ్వనిస్తుందంటూ విద్యావంతుల వేదికగా జయశంకర్ మార్పించారు. తెలంగాణ ఉద్యమానికి దిశానిర్దేశం చేయడమే కాకుండా ఉద్యమం అహింసాత్మకంగా జరగడానికీ, ఉద్యమలక్ష్యాల గురించి ప్రజలలో అవగాహన పెంపొందించడానికీ ఆయన అహరహం కృషి చేశారు. ఇటువంటి వేదిక ఇన్ని సంవత్సరాలు ప్రయోజనకరమైన పాత్ర పోషించడం విశేషమని మహాసభను ప్రారంభించిన స్వామి అగ్నివేశ్ ప్రశంసించారు. ఇటువంటి సంస్థలు అన్ని రాష్ట్రాలలోనూ నెలకొల్పాలని ప్రతిపాదించారు. జయశంకర్ అనంతరం ఈ వేదికకు అధ్యక్షులుగా పని చేసిన ప్రొఫెసర్ కోదండరాం, మల్లెపల్లి లక్ష్మయ్య ప్రజాస్వామ్య సంప్రదాయాలనూ, ఉద్యమ స్ఫూర్తినీ, నైతిక విలువలనూ కొనసాగించి తెలంగాణ సమాజానికి మార్గదర్శనం సమర్థంగా చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సంకోచించబోమనీ, ప్రజల పక్షానే కొనసాగుతామనీ, ప్రజలతోనే కలసి నడుస్తామనీ ఈ సందర్భంగా తెవివే నాయకత్వం పునరుద్ఘాటించింది. ప్రత్యేక రాష్ట్రంకోసం పుష్కరంపాటు ఉద్యమం చేసి లక్ష్యం సాధించిన తర్వాత ఎన్నికలలోనూ విజయం సాధించి 29వ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రిగా పరిపాలన సాగిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేపట్టిన మంచి పనులను ప్రోత్సహించాలనీ, ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే వాటిని వ్యతిరేకించాలనీ నిర్ణయం. చెరువుల పునరుద్ధరణ, అన్ని గ్రామాలకూ తాగు నీరు సరఫరాకు వాటర్‌గ్రిడ్ వ్యవస్థ నిర్మాణం, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలు చేయాలన్న సంకల్పం, దళితులకు మూడెకరాలకు తగ్గకుండా వ్యవసాయ భూమి ఇవ్వాలన్న నిర్ణయం, రెండు పడగ్గదులున్న ఇళ్ళను పేదవారికి కట్టించి ఇవ్వాలన్న ఆలోచన స్వాగతించదగినవే. వాటిని అమలు చేసే క్రమంలో తెవివే సంపూర్ణ సహకారం అదించాలి. ప్రజలకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఫిలింసిటీ నిర్మించడం వల్ల రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయా అంటూ అగ్నివేశ్ ప్రశ్నించడం ఈ ధోరణిలోనే. నవ తెలంగాణలో తెవివే కీలకపాత్ర తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో తెవివే ముఖ్యమైన పాత్ర పోషించింది. తెవివే నాయకత్వం, టీజాక్ నాయకత్వం దాదాపుగా ఒక్కటే. రెండు నాయకత్వాలకు స్ఫూర్తి ప్రొఫెసర్ జయశంకర్దే. ఇటువంటి పౌరసంస్థ ఆవశ్యకత ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మరింత పెరిగింది. నవతెలంగాణ నిర్మాణంలో ప్రభుత్వం అనుసరిస్తున్న అభివృద్ధి నమూనాను జాగ్రత్తగా పరిశీలించి ఆమోదించ వలసిన అవసరం ఉంది. కీలకమైన ఈ పాత్ర పోషించడానికి తెవివే నాయకత్వం సమాయత్తం కావాలి. ప్రజల పక్షాన నిలిచి పాలకులతో కరచాలనానికీ, అవసరమైతే పాలకులపై కరవాలచాలనానికీ సిద్ధం కావాలి. కరచాలనమా, కరవాలచాలనమా అన్నది ప్రజల ప్రయోజనాలపైనా, వాటి పట్ల ప్రభుత్వ వైఖరిపైనా ఆధారపడి ఉండాలి. వ్యక్తుల ప్రయోజనాలపైన కాదు. దేశంలోని తక్కిన రాష్ట్రాలలో కూడా ఇటువంటి వ్యవస్థను నెలకొల్పడం అవసరమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అత్యవసరం. రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఎదురు చెప్పేవారు ఎవ్వరూ లేరు. రాజధాని నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయాలను మంత్రివర్గం వివరంగా చర్చించిన దాఖలా లేదు. శాసనసభలోనూ చర్చ జరగడం లేదు. పైగా ‘ప్రతిపక్షమే లేదు మనమే జాగ్రత్తగా చూసుకోవాలి’ అంటూ తెలుగుదేశం పార్టీ బాధ్యులకు ముఖ్యమంత్రి ఉద్బోధిస్తున్నారు. అంటే ప్రతిపక్షం మాట వినే పనిలేదు. స్వపక్షంలో ఎదురు చెప్పే వారు లేరు. ముఖ్యమంత్రికి ఎంతటి తెలివితేటలు ఉన్నా చర్చ లేకుండా తమ నిర్ణయాలను అమలు చేసినప్పుడు పొరబాట్లు జరిగే అవకాశం ఉంటుంది. పొరబాటు జరిగినట్టు గ్రహించేందుకు మార్గం ఏదైనా ఉండాలి. లేకపోతే తప్పుదారిలోనే ప్రయాణం సాగుతుంది. రాజధాని నిర్మాణంకోసం వేల ఎకరాల భూమిని సేకరించి, దానిలో కొంతభాగం సింగపూర్ ప్రభుత్వానికో, ఆ ప్రభుత్వం నియమించిన కొర్పొరేట్ సంస్థలకో అప్పగించి, రాజధానికి అవసరమైన భవనాలనూ, ఇతర సదుపాయాలనూ నిర్మించాలన్నది ముఖ్యమంత్రి వ్యూహంలాగా కనిపిస్తున్నది. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. కేంద్ర ప్రభుత్వం 50 వేల ఎకరాల భూమి కొనుగోలుకు అవసరమైన సొమ్ము ఇవ్వజాలదు. అందుకని ఉత్తరోత్తరా అభివృద్ధి చేసిన భూములు ఇస్తామనీ, ఎకరానికి మూడు కోట్లు వచ్చేవిధంగా చేస్తామనీ చెప్పి రైతులను నమ్మించి భూములు సమీకరించేందుకు ప్రయత్నం జరుగుతోంది. అధికారం ఉన్నది కాబట్టి భూసేకరణలో విజయం సాధించినప్పటికీ రాజధాని నిర్మాణం సింగపూర్ ప్రభుత్వానికి అప్పగించడంలో ఔచిత్యం ఏమిటో, ఇందుకు ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసిన ఆవశ్యకత ఏమిటో. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్(పీపీపీ) పేరుమీద మన దేశంలో ఉన్న కార్పొరేట్ సంస్థలను కాదని విదేశాలలోని కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చడం వెనుక వ్యూహం ఏమిటో కృష్ణా, గుంటూరు జిల్లా ప్రజలకు తెలియదు. తుళ్లూరు గ్రామం (ఫైల్ ఫొటో) రాయలసీమ మౌనంగా ఉంటుందా? ‘అభివృద్ధి’ అంతా తుళ్ళూరు చుట్టుపక్కలే కేంద్రీకృతం అవుతే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల ప్రజల మనోభావాలు ఎట్లా ఉంటాయో అంచనా వేసే ప్రయత్నం జరగడం లేదు. ఉపముఖ్యమంత్రి కే ఇ కృష్ణమూర్తి మౌనంగా ఉన్నంత మాత్రాన రాయలసీమ అంతా మౌనంగా ఉంటుందని అనుకోవడం పొరబాటు. విశాఖపట్టణం అభివృద్ధి ఉత్తరాంధ్రకు ఊరట కలిగిస్తుందేమో కానీ అటువంటి అవకాశం రాయలసీమకు లేదు. అభివృద్ధిని వికేంద్రీకరించాలంటూ శివరామకృష్ణన్ కమిటీ చేసిన సిఫార్సులను తుంగలో తొక్కి తనకు తోచిన విధంగా, తన స్వప్న సాకారం కోసం, గొప్ప రాజధాని నిర్మించారనే ఖ్యాతి గడించడంకోసం ఇంత హంగామా చేయాలా? స్వీయ, సన్నిహితుల ప్రయోజనాల గురించి ప్రస్తావించడం లేదు. రాజధాని నిర్మాణం కానీ, బాక్సైట్ ఖనిజం తవ్వకాలు కానీ, ఇతర ‘అభివృద్ధి’ కార్యక్రమాలు కానీ చర్చ లేకుండా, సమీక్ష లేకుండా అమలు జరిగితే అందమైన, ఖరీదైన రాజధాని నిర్మాణం జరగవచ్చు, ఆర్థికాభివృద్ధి కూడా సాధ్యం కావచ్చు. కానీ ఈ క్రమంలో జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. ప్రభుత్వం ఆడుతున్న జూదం ప్రజల జీవితాలను ఛిద్రం చేసే ప్రమాదం ఉన్నది. ఈ హెచ్చరిక చేయడానికీ, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలలోని లోపాలను ఎత్తి చూపించడానికీ, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికీ, నిలదీయడానికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెవివే వంటి ఒక బలమైన సంస్థ అవసరం. రాష్ట్రంలో విద్యావంతులకు కొదవ లేదు. బ్రిటిష్ పాలన కారణంగా స్వాతంత్య సిద్ధికి పూర్వమే అనేక తరాల విద్యావంతులు ఉన్న ప్రాంతం అది. త్యాగ నిరతికి కొదవ లేదు. తెలివితేటలు అపారం. వారిని ఒక వేదికపైకి తెచ్చి సామూహిక శక్తిని ఆవిష్కరించే ప్రయత్నం ఇంతవరకూ ఏ కారణంగానో జరగలేదు. ఆంధ్ర మేధావుల వేదిక పేరుతో వెలసిన సంస్థలకు తెవివేకి ఉన్నటువంటి విస్తృత ప్రజామోదం లేదు. పోరాట స్వభావం లేదు. ఇఎఎస్ శర్మ, రాణిశర్మ, కృష్ణ వంటి సామాజిక ఉద్యమకారులు పర్యావరణ పరిరక్షణకూ, హానికరమైన అభివృద్ధి నమూనాలను వ్యతిరేకించేందుకూ అంకిత భావంతో చాలా గొప్ప కృషి చేస్తున్నారు. వారి వ్యాప్తి పరిమితమైనది. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ప్రతినిధులను ఒకే తాటిమీదికి తీసుకొని వచ్చి నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం ఎట్లా జరగాలో సమాలోచన జరపవలసిన అవసరం ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడానికి ముందే కొత్త రాష్ట్రం వివిధ రంగాలలో ప్రగతి సాధించాలంటే ఎటువంటి విధానాలు అమలు చేయాలో సూచించేందుకు తెవివే నాగార్జునసాగర్‌లో రెండు రోజుల మేధోమథనం నిర్వహించింది. పుస్తకం ప్రచురించింది. అటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యావంతులు చేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభుత్వానికి అడ్డుపడటంకోసం కాదు ప్రభుత్వానికి వాస్తవాలు తెలియజెప్పడానికీ, ప్రజల ప్రయోజనాలు పరిరక్షించడానికి ఇటువంటి వేదిక ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో తక్షణావసరం. murthykondubhatla@gmail.com -
సింగపూర్ బృందం రహస్య పర్యటన!
-
సింగపూర్ బృందం రహస్య పర్యటన!
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో సింగపూర్ బృందం రహస్యంగా పర్యటిస్తోంది. ఈ బృందం నిన్న అమరావతితో పాటు తుళ్లూరులో పర్యటించింది. శనివారం సింగపూర్ సభ్యులు గుంటూరులో పర్యటిస్తున్నారు. ఆర్డీవో భాస్కరనాయుడు దగ్గరుండి సింగపూర్ బృందాన్ని గ్రామాల్లో తిప్పుతున్నారు. కాగా ఏపీ రాజధాని పరిధిలోని భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్రామాల ప్రజలు.... సింగపూర్ బృందాన్ని అడ్డుకుంటారని వారిని ఏపీ సర్కార్ రహస్యంగా తిప్పుతోంది. -
పంట పొలాల్లో మంటలు.. నిందితులెవరో?!
-
రెండో రోజు 629 ఎకరాలు
తుళ్ళూరు : నవ్యాంధ్ర రాజధాని కోసం భూ సమీకరణ ప్రక్రియ రెండోరోజు శనివారం కూడా కొనసాగింది. తుళ్లూరు మండలం నేలపాడు గ్రాంలో శుక్రవారం ల్యాండ్‌పూలింగ్ ప్రారంభం కాగా శనివారం ఆ గ్రామంతో పాటు నెక్కల్లు, అనంతవరం గ్రామాల్లోనూ భూములు సమీకరించారు. నెక్కల్లు, అనంతవరం గ్రామాల్లో నిర్వహించిన సభలకు మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణతోపాటు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ హాజరై రైతుల నుంచి అంగీకార పత్రాలు స్వీకరించారు. స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండేతో పాటు జేసీ చెరుకూరి శ్రీధర్, ఆర్డీవో భాస్కరనాయుడు తదితరులు పాల్గొని రైతుల నుంచి ఫారం 9(1) లను తీసుకున్నారు. ఫారం9(2) లో అభ్యంతరాలను కూడా ఇవ్వవచ్చని ప్రజలను కోరారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు అంగీకరించిన రైతులు ఫారం 9(1) ఇవ్వగా వారికి అధికారులు భూ సమీకృత అధికారి ధ్రువీకరించిన రసీదు ఫారం 9(7)ను అందజేశారు. తొలుత స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ ల్యాండ్ పూలింగ్‌లో ధ్రువపత్రాల గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఎవరికి ఏవిధమైన సమస్యలు వచ్చినా తాను దగ్గరుండి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ఈ ప్రాంతంలో యువకులు, విద్యావంతులు వృత్తి నైపుణ్యం సాధించాలని చెప్పారు. మాస్టర్‌ప్లాన్ వచ్చాక అమర్‌రాజా కంపెనీని ఈ ప్రాంతంలో స్థాపిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ మేలు చేయాలని, రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సీఎం చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ విధానాన్ని తీసుకువచ్చార ని పేర్కొన్నారు. భూములు ఇచ్చి ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్న రైతులకు ఆయన పేరుపేరున అభినందనలు తెలిపారు. జూన్ కల్లా సింగపూర్ కంపెనీ రాజధాని మ్యాప్‌ను ఇస్తారని వెను వెంటనే పనులు ప్రారంభమవుతాయన్నారు. శనివారం జరిగిన కార్యక్రమంలో అనంతవరం గ్రామానికి చెందిన 20 మంది రైతులు 150 ఎకరాలకు, నెక్కల్లులో మొత్తం రైతులు 920 మంది ఉండగా 32 మంది రైతులు 419 ఎకరాలకు అంగీకార పత్రాలను మంత్రి నారాయణ, ఎంపీ జయదేవ్‌లకు అందజేశారు. రెండో రోజు నేలపాడులో 25 మంది రైతులు 60 ఎకరాల అంగీకార పత్రాలు అందజేశారు. అనంతవరం భూముల వివరాలు.. భూమి రకం ఎకరాల్లో మొత్తం భూమి 2544.22 పట్టాభూమి 1968.54 ఎండోమెంట్ భూమి 81.22 చెరువులు 15.05 కొండలు 285.89 ఎస్సైన్డ్ 41.10 గ్రామ కంఠం 15.64 డొంకలు, రోడ్లు 137.78 మొత్తం రైతులు 1047 మంది నెక్కల్లు గ్రామ భూముల వివరాలు భూమి రకం ఎకరాల్లో మొత్తం భూమి 1411.41 పట్టాభూమి 1205 ఎండోమెంట్ 31 చెరువులు 30.5 అస్సైన్డ్ 28.82 డొంకలు 93.62 కొండలు 22 -
'రైతులపై చేయి వేస్తే ఊరుకునేది లేదు'
హైదరాబాద్: రాజధాని గ్రామాల్లో రైతులను భయభ్రాంతులకు గురి చేసి భూములు లాక్కోవాలని ప్రభుత్వం చూస్తోందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. స్వచ్ఛందంగా భూములు ఇస్తే తీసుకోవాలని.. ఇవ్వని రైతులను వదిలేయాలని అంబటి తెలిపారు. ఈ క్రమంలో రైతులపై చేయి వేస్తే ఊరుకునేది లేదని అంబటి హెచ్చరించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజధాని గ్రామాల్లో దుశ్చర్యపై సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బురదజల్లే యత్నం చేస్తున్నారన్నారు. రాజధాని రైతులకు పార్టీ అండగా ఉంటుందన్నారు. చంద్రబాబు పార్టీకి చెందిన వ్యక్తులే ఈ ఘటన పాల్పడి ఉంటారని అనుమానాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇది ప్రజాస్వామ్యమా?రాక్షస పాలనా? అన్న అనుమానం ప్రజలకు కలుగుతోందన్నారు. -
మంత్రి పత్తిపాటికి చేదు అనుభవం
గుంటూరు : గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెనుమాకలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి పత్తిపాటి పుల్లారావుకు సోమవారం చేదు అనుభవం ఎదురైంది. ఏపీ రాజధాని గ్రామాల్లో పంటలు తగలబడిన విషయం తెలిసిందే. దాంతో మంత్రి ...పెనుమాక గ్రామంలో సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి పత్తిపాటి చేసిన వ్యాఖ్యలుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో మంత్రి తన పర్యటనను పూర్తి చేయకుండానే వెనుదిరిగారు. మంత్రి బాధితుల మాటలు వినకుండా వేరేవారి మాటలు వింటారా? అంటూ రైతులు ఆగ్రహం చెందారు. ఈ సందర్భంగా ఓ రైతు మాట్లాడుతూ జై జవాన్ ...జై కిసాన్ అనకుండా... ఏపీ సర్కార్ ..'జై జపాన్...కిల్ కిసాన్' అన్నచందంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. -
'రైతులపై చేయి వేస్తే ఊరుకునేది లేదు'
-
రాజధాని గ్రామాల్లో ఘటనను ఖండించిన మంత్రి రావెల
హైదరాబాద్: రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో ఆదివారం అర్ధరాత్రి కొంతమంది దుండగులు సృష్టించడాన్ని మంత్రి రావెల కిశోర్ బాబు ఖండించారు. ఈ చర్యను అరాచక చర్యగా అభిప్రాయపడ్డ రావెల.. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, సోమవారం రాజధాని గ్రామాల్లో కలెక్టర్ కాంతిలాల్ దండేతో పాటు, ఎస్పీ రాజశేఖర్ బాబులు పర్యటించి పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో ఆదివారం అర్ధరాత్రి కొంతమంది బీభీత్సం సృష్టించిన విషయం తెలిసిందే. పెనమాక, ఉండవల్లి, వెంకటపాలెం, ఉద్దండరాయుని పాలెం, మందడ గ్రామాల్లో విధ్వాంసానికి దిగారు. పొలాల్లోని షెడ్లు, అరటితోటలతో పాటు గడ్డి వాములు, కూరగాయల తోట పందిళ్లు, గుడిసెలకు నిప్పుపెట్టారు. -
'రైతులను ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోంది'
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పేరుతో రైతులను ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.ప్రస్తుతం రైతులు దయనీయ పరిస్థితులో ఉన్నారని ఆయన అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన రామకృష్ణ.. అగ్ని ప్రమాద ఘటనలపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలన్నారు. ఈ ఘటనకు సంబంధించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో ఆదివారం అర్ధరాత్రి కొంతమంది బీభీత్సం సృష్టించిన విషయం తెలిసిందే. పెనమాక, ఉండవల్లి, వెంకటపాలెం, ఉద్దండరాయుని పాలెం, మందడ గ్రామాల్లో విధ్వాంసానికి దిగారు. పొలాల్లోని షెడ్లు, అరటితోటలతో పాటు గడ్డి వాములు, కూరగాయల తోట పందిళ్లు, గుడిసెలకు నిప్పుపెట్టారు. దీంతో చంద్రబాబు సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
' చంద్రబాబే ఈ సంఘటన వెనుక ఉన్నారా?'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో అరాచకంపై సీబీఐతో విచారణ జరపాలని వైఎస్ఆర్ సీపీ నేతలు పార్థసారధి, మేరుగ నాగార్జున సోమవారమిక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తుళ్లూరు మండలంలో పలు గ్రామాల్లో దుండగులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ సీపీ నేతలు ఈరోజు ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఈ కుట్ర వెనుక రాష్ట్ర ప్రభుత్వమే ఉందని ప్రజలు అనుమానిస్తున్నారని విమర్శించారు. పంటలు పండే భూములను లాక్కోవాలని చూడటం... రైతులు ఎదురు తిరిగితే సర్కార్ రాక్షసంగా వ్యవహరిస్తోందన్నారు. చంద్రబాబే ఈ సంఘటన వెనుక ఉన్నారా? అని ప్రజలు అనుమానిస్తున్నారని పార్థసారధి ఆరోపించారు. ఈ ఘటనపై గవర్నర్ వెంటనే స్పందించి కేంద్రానికి నివేదిక పంపాలని డిమాండ్ చేశారు. తమకు పోలీసులపై నమ్మకం లేదన్నారు. కండితుడుపు చర్యగా విచారణ జరిపితే సహించేది లేదని అన్నారు. అందరూ సంతోషంగా ఏర్పాటు చేసుకోవాల్సిన రాజధానిని ...బలవంతంగా,అమానుషంగా వ్యవహరించటం సరికాదన్నారు. ఈ సంఘటన వెనుక ఉన్న శక్తులపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ సీపీ నేతలు కోరారు. -
మేం భూములు ఇచ్చేది లేదు: రైతులు
-
గ్రామాల్లో ఎవ్వరూ నిద్రపోవటం లేదు..
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రకటన చేసిన తర్వాత రైతులు ఎవ్వరూ గ్రామాల్లో నిద్రపోవడం లేదని మంగళగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. గ్రామాలు వదిలిపెట్టి...పొలాల్లో నిద్రపోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని రైతులను లక్ష్యంగా చేసుకుని బీభత్సం సృష్టించారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. సుమారు 8నుంచి 10మంది వరకూ ఈ దారుణానికి పాల్పడ్డారని రైతులు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. దుండగులను గుర్తించి కేకలు వేసేలోపే వాళ్లు పారిపోయారని ఎమ్మెల్యే చెప్పారు. కాగా తుళ్లూరు మండలంలోని రాజధాని గ్రామాల్లోని దుండగులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. వరిగడ్డి వాములు, అరటి తోటలు, కూరగాయల తోటల పందిళ్లు, గుడిసెలకు నిప్పు పెట్టారు. -
మేం భూములు ఇచ్చేది లేదు: రైతులు
గుంటూరు: తాము ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు మరోసారి స్పష్టం చేశారు. రైతు పక్షపాతిని అని చెప్పుకున్న ప్రభుత్వం.. ఇవాళ ఏం చేస్తోందని వారు ప్రశ్నించారు. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో ఆదివారం అర్ధరాత్రి కొంతమంది బీభీత్సం సృష్టించిన విషయం తెలిసిందే. పెనమాక, ఉండవల్లి, వెంకటపాలెం, ఉద్దండరాయుని పాలెం, మందడ గ్రామాల్లో విధ్వాంసానికి దిగారు. పొలాల్లోని షెడ్లు, అరటితోటలతో పాటు గడ్డి వాములు, కూరగాయల తోట పందిళ్లు, గుడిసెలకు నిప్పుపెట్టారు. దీంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురైయ్యారు. ల్యాండ్ పూలింగ్ కు భూములు ఇవ్వని వారిని లక్ష్యంగా చేసుకుని ఈ తరహా దాడులకు పాల్పడుతున్నారని రైతులు మండిపడుతున్నారు. నిస్వార్ధంగా ఉన్న వారి ఆస్తులను తగులబెట్టారని రైతులు ఏకరువు పెట్టారు. రైతులను, ఆస్తులను తగులబెట్టి.. రైతుల ప్రాణాల మీద చంద్రబాబు రాజధాని కట్టాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఒక్క ఉండవల్లి గ్రామంలోనే రూ. 4 లక్షల ఆస్తి నష్టం జరిగిందని వారు తెలిపారు. రైతు పక్షపాతిని అని చెప్పుకుంటున్న ప్రభుత్వం..ఇవాళ చోద్యం చూస్తోందన్నారు. భూములను ఇవ్వనన్న రైతులకు నష్టం చేయడం చాలా దారుణమని రైతులు కరాఖండిగా చెప్పారు. -
రాజధాని గ్రామాల ఘటనపై చంద్రబాబు దిగ్ర్భాంతి
గుంటూరు : గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని రాజధాని గ్రామాల్లో... దుండగుల దుశ్చర్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ఆయన సోమవారం ఉదయం గుంటూరు జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. పంటలు తగులబెట్టిన ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని చంద్రబాబు సందర్భంగా కలెక్టర్‌ను సూచించారు. అలాగే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు జిల్లా కలెక్టర్‌తో పాటు ఎస్పీ కూడా సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిపై సమీక్షించనున్నారు. కాగా రాజధానికి భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్న గ్రామాల్లో దుండగులు అరాచకం సృష్టించిన విషయం తెలిసిందే. గడ్డివాములు, కూరగాయల తోటల పందిళ్లు, గుడిసెలకు నిప్పు పెట్టారు. పెనుమాక, ఉండవల్లి, వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెం, మందడంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. -
తుళ్లూరు వధూవరులకు భలే డిమాండ్
*ఫొటోలతో తిరుగుతున్న మ్యారేజ్ బ్యూరోలు *చదువు లేకపోయినా.. ఆస్తి ఉంటే చాలు.. విజయవాడ : రాజధాని తుళ్లూరు అంటే మాటలా.. ఎన్నో వింతలు, విశేషాలు ఒకవైపు.. రియల్టర్లు, భూ యజమానులు, రైతుల హడావుడి మరోవైపైతే.. తాజాగా మ్యారేజ్ బ్రోకర్ల హవా కూడా ఇక్కడ నడుస్తోంది. ఒకప్పుడు తుళ్లూరులో పెళ్లి సంబంధమంటేనే.. ‘ఆ.. పెద్దగా చదువుకోరు ఏం అవసరం లేదులే..’ అనుకున్న పెళ్లి పెద్దలు ఇప్పుడు ఎగిరి గంతేసి మరీ ఒప్పుకొంటున్నారు. బ్రోకర్లకు ఫొటోలిచ్చి సంబంధం చూడమంటున్నారు. చదువు లేకపోయినా.. ఆస్తి తప్పనిసరి.. ఒకప్పుడు తుళ్లూరు సంబంధం అంటేనే వెనక్కి తగ్గేవారని, రాజధాని ప్రభావంతో ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని గుంటూరులోని మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు చెబుతున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచే కాకుండా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా సంబంధాల కోసం వస్తున్నారంటున్నారు. నాలుగైదు ఎకరాల భూమి ఉన్న కుర్రాడికి చదువు లేకపోయినా చాలు తమ కుమార్తెను ఇవ్వడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. విజయవాడ, గుంటూరులో ఐదారు ఇళ్లు ఉన్న యజమానుల కంటే.. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో రెండు మూడు ఎకరాల భూమి ఉన్న వారికి సంబంధం చూడటం సులభంగా ఉందని గుంటూరు పండరీపురం ఏరియాలోని ఒక మ్యారేజ్ లింక్స్ నిర్వాహకురాలు చెబుతున్నారు. బీటెక్ సంబంధాలున్నాయా..? రాజధాని ప్రభావం తుళ్లూరు రైతులపై బాగానే పడింది. గతంలో తమ కుమారుడికి మధ్య తరగతి ఆడపిల్లను ఇచ్చి పెళ్లి చేసేందుకు ఇష్టపడేవారు. ఇప్పుడు వరుడికి చదువు లేకపోయినా.. వధువు మాత్రం తప్పనిసరిగా బీటెక్ చదివి ఉండాలని ఆంక్షలు పెట్టడం విశేషం. ఇక ఇటీవల ముగిసిన మ్యారేజ్ సీజన్లో తుళ్లూరులో జరిగిన వివాహాలు చూస్తే ఔరా..! అనక మానరు. ఒకప్పుడు సాదాసీదాగా ఉన్న రైతులు లక్షలు ఖర్చుపెట్టి వివాహాలు జరిపించారు. ఆడపిల్లల తండ్రులు పెద్ద మొత్తంలో కట్నాలు సమర్పించడమే కాకుండా భారీగా, హుందాగా వివాహాలు చేస్తున్నారు. -
మందడంలో రౌండ్‌టేబుల్ సమావేశం రసాభాస
గుంటూరు : గుంటూరు జిల్లా తుళ్లురు మండలం మందడంలో శుక్రవారం రౌండ్‌టేబుల్ సమావేశం రసాభాసగా మారింది. జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతుండగా టీడీపీ నేత అనుమోలు హరి అడ్డుకున్నారు. దాంతో రైతులు ఎదురు తిరిగారు. ఈ సందర్భంగా టీడీపీ నేత వర్గీయులు, రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దాంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. -
నేడు రాజధాని ప్రాంత రైతులకు పరిహారం ప్రకటన
-
నేడు రాజధాని ప్రాంత రైతులకు పరిహారం ప్రకటన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపట్లో రాజధాని భూసేకరణ ప్రాంత రైతులతో సమావేశంకానున్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న రైతులకు ఎంత పరిహారం ఇవ్వాలన్న విషయాన్ని చంద్రబాబు ప్రకటించనున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఇటీవల తుళ్లూరు మండలం రైతులతో సమావేశమయ్యారు. మంత్రి వర్గం ఉపసంఘంలోనూ ఈ విషయంపై చర్చించారు. తాజాగా మరోసారి రైతులతో సమావేశమై పరిహారం ప్రకటించనున్నారు. -
నువ్వైనా.. నేనైనా.. బతుకు పోరాటమే బ్రదర్
ఆకలి దప్పికలు సృష్టిలో ప్రతి జీవికీ సాధారణమే. విశాల ప్రపంచంలో ప్రతి ఒక్కరి పరుగు ఆకలి తీరానికే. ఈ చిత్రంలో చూడండి.. పంట పండించి నాలుగు రాళ్లు సంపాదించి.. పట్టెడన్నంతో పొట్ట నింపుకొనేందుకు రైతన్న దమ్ము చేస్తుంటే.. ఆ దమ్ములోనే ఆహారం వెతుక్కుంటూ పొట్టపోసుకుంటున్నారుు కొంగలు. రాజధాని ప్రభావంతో త్వరలో ఈ భూములన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లనుండటంతో భవిష్యత్తులో రైతన్నకు ఆధారమేమిటో..? భూమినే నమ్ముకుని జీవిస్తున్న ఈ పక్షుల పరిస్థితేమిటో..? (తుళ్లూరు మండలం ఐనవోలులో కనిపించిన దృశ్యమిది..) -
రిజిస్ట్రేషన్లు డల్
జిల్లాలో తగ్గిన జోరు ‘తుళ్లూరు’ ప్రకటనతో క్రయవిక్రయాలు తగ్గుముఖం విజయవాడ : జిల్లాలో రిజిస్ట్రేషన్ల జోరు తగ్గుతోంది. గత కొద్దిరోజులుగా విజయవాడ నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ల హడావిడి పెద్దగా కనిపించడం లేదు. రాజధాని గుంటూరు జిల్లా తుళ్లూరుకు వెళ్లిపోవడంతో స్థలాలు, భూముల క్రయ విక్రయాలు తగ్గినట్లు తెలుస్తోంది. అన్‌సీజన్ కావడం వల్ల కూడా కొంతమేరకు రిజిస్ట్రేషన్లు తగ్గినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఏటా ఈ సీజన్లో రిజిస్ట్రేషన్స్ తక్కువగా ఉంటాయని, పంటలు చేతికొచ్చాక ఆదాయం మళ్లీ పుంజుకుంటుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల ఆదాయ లక్ష్యం రూ.616.78 కోట్లు కాగా, అక్టోబర్ నాటికి రూ.351.06 కోట్ల మేర ఆదాయం లభించింది. డీఆర్ కార్యాలయాల వారీగా చూస్తే.. మచిలీపట్నం పరిధిలో రూ.106.67 కోట్లు లక్ష్యం కాగా రూ.66.89 కోట్లు, విజయవాడ పశ్చిమ పరిధిలో రూ.254.64 కోట్లు లక్ష్యం కాగా రూ.141.07 కోట్లు, విజయవాడ తూర్పు పరిధిలో రూ.255.47 కోట్లు లక్ష్యం కాగా రూ.143.10 కోట్ల ఆదాయం రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి సమకూరింది. ఈ విధంగా ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గినట్లు గుర్తించారు. తుళ్లూరులో రాజధాని ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతుండటంతో అక్టోబర్‌లో రిజిస్ట్రేషన్ల సంఖ్య సుమారు 10 శాతం తగ్గినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. తుళ్లూరు ప్రాంతంలో రాజధాని నిర్మాణం విషయం ప్రకటించగానే జిల్లాలో రియల్టర్లు, బ్రోకర్ల హడావిడి తగ్గిపోయింది. భూముల ధరలు కూడా నిలకడగా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మాత్రం నెమ్మదిగా సాగుతోంది. -
తుళ్లూరులో రియల్ మాయ
* రూ కోట్లు లెక్కపెట్టేందుకు దుకాణాల్లోనే నోట్ల లెక్కింపు యంత్రాలు * రోడ్ల మీదే ఖరీదైన కార్లు, సెకండ్ హ్యాండ్ వాహనాల ప్రదర్శనలు * భూ లావాదేవీల ఘర్షణల నివారణకు పోలీస్ బృందం గస్తీ సాక్షి, విజయవాడ బ్యూరో: తుళ్లూరు... గుంటూరు జిల్లాలోని ఓ మండలకేంద్రం. రెండునెలల కిందటి వరకు ఈ ఊరు ఎక్కడుందో కూడా చాలామందికి తెలియదు. రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ జరిపే ప్రాంతంగా ఈ గ్రామం ఎంపిక కావడంతో ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. వచ్చిపోతున్న వాహనాలతో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రధాన రహదారులు కిటకిటలాడుతున్నాయి. ఇటీవల వరకు రోజుకు రూ 200 వ్యాపారం జరిగితే గొప్ప అనుకున్న జిరాక్స్ సెంటర్లు మొదలుకుని కాకా హోటళ్లు, టీ అంగళ్లు, బిజీబిజీగా మారిపోయాయి. రాజధాని జోన్లో 29 గ్రామాల్లో భూ సమీకరణకు బాబు సర్కార్ కసరత్తు చేస్తుండటంతో భూ క్రయవిక్రయాలు ఊపందుకున్నా యి. ల్యాండ్ ఫూలింగ్‌తో తమ భూములు కో ల్పోతామని కలవరపడుతున్న అన్నదాతలు భూములు అమ్ముకునేందుకు సిద్ధమవుతున్నారు. గత పది రోజుల్లోనే ఈ 29 గ్రామాలకు చెందిన రైతులు సుమారు 3,500 ఎకరాల భూములను అమ్ముకున్నట్లు అనధికారిక సమాచారం. మూడు నుంచి నాలుగు చేతులు మారడంతో ప్రతీ రిజిస్ట్రేషన్లోనూ ధరలు పెరుగుతూపోయాయి. దీంతో పది రోజుల క్రితం రూ.90లక్షలు పలికిన ఎకరం ఇప్పుడు నుంచి కోటిన్నర నుంచి రెండు కోట్లపైమాటే. రూ.కోట్లను కమిషన్‌పై లెక్కించేందుకు నోట్ల లెక్కింపు యంత్రాలతో దుకాణాలు కూడా వెలిశాయి. బ్రోకర్లు కోటిు లెక్కిస్తే రూ. వెయ్యి కమిషన్ తీసుకుంటున్నారు. మరోవైపు కారు, బైక్ మేళాలు మొదలయ్యాయి. శనివారం నుంచి గుంటూరుకు చెందిన ఆటో కన్సల్టెన్సీ వాళ్లు పాత కార్లు తెచ్చి అమ్మేందుకు మేళా పెట్టారు. ఏడు రెవెన్యూ బృందాల ఏర్పాటు.. భూముల కొనుగోళ్లు అమ్మకాలకు రిజిస్ట్రేషన్ కావాలంటే పట్టాదార్ పాస్‌పుస్తకాలు, అడంగళ్లు తప్పనిసరి కావడంతో రెవెన్యూ శాఖకు చేతినిండా పనిదొరికింది. తుళ్ళూరు తహశీల్దార్ కార్యాలయంలో పట్టాదార్ పాస్‌పుస్తకాలు, అడంగళ్ దస్త్రాల కోసం శనివారం వందల సంఖ్యలో రైతులు, బ్రోకర్లుతో కిక్కిరిసిపోయింది. భూముల కొనుగోళ్లు, అమ్మకాలతో పాస్బుక్ల కోసం రైతులనుంచి వందలాది దరఖాస్తులు వస్తున్నాయని, వాటిని పరిశీలించేందుకు ఏడు బృందాలను ఏర్పాటు చేసినట్టు తహశీల్దార్ ఎ.సుధీర్‌బాబు ‘సాక్షి’కి చెప్పారు. ఫోర్జరీలకు, వివాదాలకు తావులేకుండా భూముల రికార్డులు, వాస్తవంగా భూములు ఎవరి పేరుతో ఉన్నాయనే విషయాలను రెవెన్యూ బృందాలు పూర్తిస్థాయి పరిశీలన చేసిన తరువాతే దరఖాస్తుదారులకు ధ్రువపత్రాలు జారీచేస్తామని తెలిపారు. తుళ్లూరులో వందలాది రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేరుకోవడంతో భూలావాదేవీల్లో ఘర్షణలు తలెత్తకుండా ప్రత్యేక పోలీస్ టీం గస్తీ తిరుగుతోంది. -
పాలనలో గుంటూరే కీలకం!
రాజధానిగా ప్రకటించడంతో పెరిగిన జిల్లా ప్రాధాన్యం రానున్న రోజుల్లో ఇక్కడి నుంచే పరిపాలన! వచ్చే నెలలోనే ఇక్కడ మంత్రుల క్యాంపు కార్యాలయాలు సాక్షి, విజయవాడ బ్యూరో : విద్య, వ్యవసాయం, రాజకీయ రంగాల్లో పురోగతి సాధించిన గుంటూరు జిల్లా రాష్ట్ర పాలనలో కీలకం కానుంది. పరిపాలన, రాష్ట్ర ఆర్థిక ప్రగతి, ఉన్నతాధికారులు, న్యాయశాస్త్ర కోవిదులకు కేంద్ర బిందువు కానుంది. రాష్ట్రానికి నూతన రాజధాని ప్రాంతంగా తుళ్లూరు, మంగళగిరి ప్రాంతాలను ఎంపిక చేయడంతో జిల్లా ప్రాధాన్యత పెరిగింది. దీనికితోడు వచ్చే నెలలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నాగార్జున యూనివర్శిటీలో జరిగే అవకాశముందని శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. దీంతో రానున్న రోజుల్లో ఇక్కడి నుంచే పరిపాలన సాగించే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. వచ్చే నెలలో అసెంబ్లీ సమవేశాలు మొదలయ్యేలోగానే బెజవాడ, గుంటూరుల్లో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవాలని పలువురు మంత్రులు అభిప్రాయపడుతున్నారు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, కొల్లు రవీంద్ర, పైడికొండల మాణిక్యాలరావు, శిద్ధా రాఘవరావు, పరిటాల సునీత, పీతల సుజాత తదితరులు ఈ రెండు నగరాల్లో అనువైన చోట క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకునే యోచనలో ఉన్నారు. ప్రధాన శాఖలు కూడా గుంటూరు జిల్లాకు తరలివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎయిమ్స్, విపత్తుల నివారణ సంస్థ, డీజీపీ కార్యాలయం ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రకటన చేసింది. నాగార్జున యూనివర్శిటీలో అసెంబ్లీ సమావేశాలు జరిగేట్లయితే, అన్ని జిల్లాల మంత్రులు, శాసనసభ్యులు, వివిధ ప్రభుత్వ శాఖల కమిషనర్లు, ప్రిన్సిపల్ కార్యదర్శులు, ఇతర ముఖ్య అధికారులు ఇక్కడికొస్తారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులూ ఇక్కడే ఉంటారు. వీరందరికీ తాత్కాలికంగా వసతి సదుపాయాలు కల్పించనున్నారు. ఇందుకోసం గుంటూరు, విజయవాడ నగరాల్లోని ప్రభుత్వ అతిథి గృహాలు, ప్రైవేటు హాటళ్లులోనూ గదులు బుక్ చేయాల్సి ఉంటుంది. విశ్వవిద్యాలయానికి ఎదురుగా ఉన్న ఓ ప్రైవేటు బహుళ అంతస్తుల భవనాల్లోని ఖాళీ ఫ్లాట్లను కూడా అద్దెకు తీసుకునే వీలుంది. 1953లోనే గుంటూరులో అసెంబ్లీపై చర్చ కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు 1953 - 56 మధ్య కాలంలో గుంటూరు జిల్లాకు చెందిన నల్లపాటి వెంకట్రామయ్యచౌదరి శాసనసభకు మొదటి స్పీకర్‌గా పనిచేశారు. ఆయన హయాంలోనే గుంటూరు కేంద్రంగా అసెంబ్లీ నడపాలన్న చర్చ వచ్చిందని సీనియర్లు చెబుతున్నారు. -
బోరుపాలెంలో పరిరక్షణ కమిటీ పర్యటన
-
'తుళ్లురు వద్ద ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం'
విజయవాడ: విజయవాడ - గుంటూరు నగరాల మధ్యలోని తుళ్లురు వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచస్థాయి రాజధానిని నిర్మిస్తున్నామని ఆ రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి దేవినేని ఉమా వెల్లడించారు. మంగళవారం విజయవాడలో దేవినేని ఉమా విలేకర్లతో మాట్లాడుతూ... ప్రపంచస్థాయి రాజధానిని సీఎం చంద్రబాబు నిర్మాణం చేయనున్నారని రైతులంతా భావిస్తున్నారని తెలిపారు. రాజధాని నిర్మాణానికి రైతులు ఆనందంగా భూములు ఇస్తున్నారని చెప్పారు. కానీ రాజధాని అంశంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణంపై రైతుల నుంచి పలురకాల సూచనలు, సలహాలు వస్తున్నాయని దేవినేని ఉమా అన్నారు. రాజధాని అభివృద్ధిలో కృష్ణా - గుంటూరు జిల్లాల ప్రజలు భాగస్వాములవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలోని రైతులకు గల అన్ని రకాల సమస్యలను పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు వివరించారు. జన్మభూమి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులపై పనులు ప్రారంభిస్తామని తెలిపారు. నీటి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుచూపుతో వ్యవహరిస్తున్నారని దేవినేని ఉమా వెల్లడించారు. రాయలసీమలోని తుంగభద్ర కాలువల పనుల ఆధునీకరణపై కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా ఉందని పేర్కొన్నారు. కాలువల అధునీకరణ వల్ల రాయలసీమలో నీటి ఎద్దడిని నివారించ వచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సుబాబుల్ రైతులను కాపాడటానికి మార్కెటింగ్ చట్టాలను కఠినంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మార్కెటింగ్ యార్డ్ల ద్వారానే అమ్మకాలు జరపాలని పత్తి రైతులందరికి దేవినేని ఉమా విజ్ఞప్తి చేశారు. బందరు పోర్టు పనులు వేగవంతం చేస్తున్నామని విశదీకరించారు. ఆ పోర్టుకు రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. -
చావనైనా చస్తాం..
సాక్షిప్రతినిధి, గుంటూరు చావనైనా చస్తాం కాని రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సెంటు భూమి కూడా కోల్పోయేందుకు సిద్ధంగా లేం. ఇదీ రాజధాని ప్రతిపాదిత తుళ్లూరు మండలంలోని గ్రామాల రైతుల ఆవేదన.. నూతన రాజధాని నిర్మాణానికి ప్రతిపాదించిన 18 గ్రామాల్లో 30వేల ఎకరాల భూములు సమీకరించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తొలిదశలో తుళ్లూరు మండలంలో 15 గ్రామాలు(వెంకటపాలెంతో కలిపి), మంగళగిరి రూరల్ మండలంలో 3 గ్రామాల్లో భూముల సమీకరణకు ప్రభుత్వం ఇప్పటికే రంగం సిద్ధం చేయడంతో రెతులంతా సంఘటితమవుతున్నారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్నారు. పచ్చని పొలాల్లో రాజధాని నిర్మాణం ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతుల భూములతో రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తారా అంటూ విరుచుకుపడుతున్నారు. మూడు పంటలు పండే భూములను ఇచ్చి తామేం చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ భూములపై రైతులు, రైతుకూలీలు ఆధారపడి ఉన్నారని, వారికి జీవనోపాధి ఎలా కల్పిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్‌కు చట్టబద్ధత ఏదీ...? ఇదిలా ఉంటే మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన ల్యాండ్‌పూలింగ్ విధానానికి చట్టబద్ధత లేదు. పంటలు పండే భూమూలను సమీకరించకూడదని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను రైతు నాయకులు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. భూ సమీకరణపై ప్రభుత్వం ఎలాంటి జీవోలు జారీ చేయలేదు. కేవలం ఎకరా భూమి ఇస్తే వెయ్యిగజాల స్థలాన్ని అభివృద్ధి చేసి ఇస్తామని మాత్రమే ప్రభుత్వం ప్రకటించింది. ఆ భూమి ఎక్కడ ఇస్తారు, ఎలా ఇస్తారు వంటి ప్రశ్నలకు అధికారుల వద్ద కూడా స్పష్టత లేదు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబును నమ్మేదెలా..? రైతు, డ్వాక్రా,చేనేత రుణాలను మాఫీ చేస్తానని ఎన్నికల్లో హామీలిచ్చి ఓ ట్లు దండుకున్న చంద్రబాబు అధికారం చేపట్టి ఐదునెలలైంది. ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకూ రుణ మాఫీ చేయలేకపోయారు.ఇలాంటి వ్యక్తిని ఎలా నమ్మాలని రాజధాని ప్రతిపాదిత గ్రామాల రైతులు ప్రశ్నిస్తున్నారు. భూ సమీకరణపై రైతులు అడిగే ప్రశ్నలకు తెలుగుదేశం ప్రజాప్రతినిధులు సైతం సమాధానం చెప్పలేకపోతున్నారు. రాజధాని కమిటీ సభ్యులకు సైతం పూర్తిస్థాయిలో ఇందులో అవగాహన లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అంతా గోప్యంగా ఉంచి కేవలం ల్యాండ్ పూలింగ్ అన్న ఒక్క విధానాన్ని మాత్రమే ప్రభుత్వం ప్రకటించిందని ఆరోపిస్తున్నారు. భూములు ఇచ్చేస్తే భవిష్యత్‌లో ఎలా బతకాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ ‘దేశం' నేతల బెదిరింపు రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రానిపక్షంలో ఆయా గ్రామాలను గ్రీన్‌బెల్ట్ కిందకు తెస్తామ ని తెలుగుదేశం నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. ఇలాంటి బెదిరిం పులకు భయపడేది లేదని ఆ గ్రామా ల రైతులు తేల్చిచెబుతున్నారు. ఈ ప్రశ్నలకు బదులేది? 1. తుళ్లూరు, మంగళగిరి రూరల్ మండలాల పరిధిలో 17 గ్రామాల్లో రాజధాని నిర్మాణానికి తొలివిడతలో భాగంగా 30 వేల ఎకరాలు సమీకరించాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఏఏ అంశాల ఆధారంగా సమీకరిస్తారు? దీనికి ప్రాతిపదిక ఏమిటి? ఈ మండలాలనే ఎందుకు ఎంపిక చేశారు? 2. సమీకరణ నిర్ణయానికి ముందు రైతులను ప్రభుత్వం ఎం దుకు సంప్రదించ లేదు? వారితో ఎందుకు చర్చించలేదు? 3. వీటిన్నిటికంటే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులను ప్రభుత్వం ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? ప్రజల చేత, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను ఎందుకు విస్మరించింది? 4. అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశంలో ప్రభుత్వం ఎటు పయనిస్తోంది? 5. రైతుల భూములను పూర్తిగా లాగేసుకున్నాక భిక్షమేసినట్టు వెయ్యి గజాలు ఇవ్వడం మేంటి ? లాక్కున్న భూములను అభివృద్ధి నిమిత్తం రియల్టర్లకు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఎలా వచ్చింది? దీనికి ముందు సమీకరణ పేరిట లాక్కునే హక్కు ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారు? 6. సారవంతమైన భూముల్లో భవనాలు కట్టి పంటలు ఎక్కడ పండిస్తారు? ఎలా పండిస్తారు? నాణ్యమైన వ్యవసాయ భూములను ఎందుకు నాశనం చేస్తున్నట్టు? 7. భూములు లాక్కున్నాక అక్కడి రైతుల మానసిక పరిస్థితి ఏమిటి? ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఆ భూములపై ఆధారపడి బతుకుతున్న కూలీల పరిస్థితి ఏమిటి? వారికి తిండిపెట్టేదెవరు? 8. భూములనే నమ్ముకుని చదువుతున్న ఆయా గ్రామాల విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి? వ్యవసాయాన్నే నమ్ముకుని కాయకష్టం చేస్తున్న యువత పరిస్థితి ఏమిటి? 9. వ్యవసాయంలో భాగమైన పాడిపశువులు, యంత్రపరికరాల మాటేమిటి? 10. వెయ్యి రూపాయల పింఛన్ ఇచ్చేందుకు సవాలక్ష ఆంక్షలు పెట్టిన తెలుగు దేశం ప్రభుత్వం కోట్లాదిరూపాయల విలువైన భూములను కాయకష్టం చేసి సంపాదించుకున్న రైతుల నుంచిలాక్కోమని ఏ ధర్మశాస్త్రం చెబుతోంది? -
'రాజధానికి సెంటు పొలం కూడా ఇచ్చేది లేదు'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం పచ్చని పొలాల జోలికి వస్తే ఊరుకోమని అన్నదాతలు తేల్చిచెప్పుతున్నారు. తమ పొలాలు ఇచ్చేది లేదని గుంటూరు జిల్లా తుళ్లురు మండలం రాయపూడి రైతులు స్పష్టం చేశారు. బుధవారమిక్కడ జరిగిన జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు. రాజధానికి సెంటు పొలం కూడా ఇచ్చేది లేదని ఎమ్మెల్యేతో చెప్పారు. రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఎలా చెబుతున్నారని ఎమ్మెల్యేను నిలదీశారు. సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.