మంత్రి పత్తిపాటికి చేదు అనుభవం | Minister pattipati pullarao faces protest in ap capital farmers | Sakshi
Sakshi News home page

మంత్రి పత్తిపాటికి చేదు అనుభవం

Published Mon, Dec 29 2014 1:35 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

Minister pattipati pullarao faces protest in ap capital farmers

గుంటూరు : గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెనుమాకలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి పత్తిపాటి పుల్లారావుకు సోమవారం చేదు అనుభవం ఎదురైంది. ఏపీ రాజధాని గ్రామాల్లో పంటలు తగలబడిన విషయం తెలిసిందే. దాంతో మంత్రి ...పెనుమాక గ్రామంలో సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి పత్తిపాటి చేసిన వ్యాఖ్యలుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో మంత్రి తన పర్యటనను పూర్తి చేయకుండానే వెనుదిరిగారు.

మంత్రి బాధితుల మాటలు వినకుండా వేరేవారి మాటలు వింటారా? అంటూ రైతులు ఆగ్రహం చెందారు.  ఈ సందర్భంగా ఓ రైతు మాట్లాడుతూ జై జవాన్ ...జై కిసాన్ అనకుండా... ఏపీ సర్కార్ ..'జై జపాన్...కిల్ కిసాన్' అన్నచందంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement