
ఏపీ రాజధానికి అమరావతి పేరు ఖరారు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి అమరావతి పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. దీనిపై త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయనుంది. ఏపీ రాజధాని ప్రతిపాదిన ప్రాంతమైన తుళ్లూరుకు అమరావతి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరుకు గత కొద్దికాలంగా పలు రకాల పేర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కాగా రెండువేల సంవత్సరాల సంస్కృతికి, భవిష్యత్తుకు అద్దంపట్టే ‘అమరావతి’ అనే పేరు అయితే చారిత్రకంగా బాగుంటుందని చివరకు రాష్ట్ర ప్రభుత్వం అమరావతి అనే పేరుకే మొగ్గు చూపింది.