హైదరాబాద్: రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో ఆదివారం అర్ధరాత్రి కొంతమంది దుండగులు సృష్టించడాన్ని మంత్రి రావెల కిశోర్ బాబు ఖండించారు. ఈ చర్యను అరాచక చర్యగా అభిప్రాయపడ్డ రావెల.. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, సోమవారం రాజధాని గ్రామాల్లో కలెక్టర్ కాంతిలాల్ దండేతో పాటు, ఎస్పీ రాజశేఖర్ బాబులు పర్యటించి పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు.
రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో ఆదివారం అర్ధరాత్రి కొంతమంది బీభీత్సం సృష్టించిన విషయం తెలిసిందే. పెనమాక, ఉండవల్లి, వెంకటపాలెం, ఉద్దండరాయుని పాలెం, మందడ గ్రామాల్లో విధ్వాంసానికి దిగారు. పొలాల్లోని షెడ్లు, అరటితోటలతో పాటు గడ్డి వాములు, కూరగాయల తోట పందిళ్లు, గుడిసెలకు నిప్పుపెట్టారు.