Parthasarathy
-
క్షమాపణలు చెప్పించిన లోకేష్.. బీసీ నేతలకు ఘోర అవమానం
సాక్షి, విజయవాడ: టీడీపీలో బీసీ నేతలకు ఘోర పరాభవం ఎదురైంది. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ చేసినందుకు మంత్రి, ఎమ్మెల్యే ఘోర అవమానానికి గురయ్యారు. బీసీ మంత్రి, ఎమ్మెల్యేతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ క్షమాపణలు చెప్పించారు. గౌతులచ్చన్న విగ్రహావిష్కరణలో పాల్గొన్న మంత్రి పార్థసారథి, గౌతు శిరీష పాల్గొనగా, అన్ని పార్టీల నేతలతో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నుంచి మాజీమంత్రి జోగి రమేష్ హాజరయ్యారు. విగ్రహావిష్కరణకు జోగి రమేష్ హాజరు కావడంపై పార్థసారథి, గౌతు శిరీషపై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. బీసీ మంత్రి పార్థసారథి, గౌతు లచ్చన్న మనవరాలు శిరీషతో మంత్రి లోకేష్ క్షమాపణలు చెప్పించారు. లోకేష్ ఆదేశంతో పార్థసారథి, గౌతు శిరీష బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు చెప్పించడంపై టీడీపీ బీసీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే టీడీపీ సీనియర్ లీడర్ యనమల రామకృష్ణుడిని టార్గెట్ చేసి అవమానించిన టీడీపీ.. తాజాగా పార్థసారథి, గౌతు శిరీషలను అవమానించడంపై బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: విజన్-2020 పోయే... స్వర్ణాంధ్ర-2047 వచ్చే ఢాం.. ఢాం.. ఢాం! -
మంత్రి వర్సెస్ ఎంపీ
పెనుకొండ: మంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారథి మధ్య వర్గపోరు తీవ్ర రూపం దాల్చుతోంది. సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందే ప్రారంభమైన ఈ వర్గపోరు ప్రస్తుతం ముదిరి పాకాన పడుతోంది. పెనుకొండ నియోజకవర్గంలో అన్నింటా ఆధిపత్యం చాటుకోవాలని మంత్రి ప్రయత్నిస్తుండగా.. పట్టు నిలుపుకోవాలని బీకే వ్యూహాలు పన్నుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కేడర్ రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఇదివరకే ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడిగానూ ఉన్న బీకే పార్థసారథిని కాదని సవిత ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని గెలిచారు. మంత్రి పదవినీ దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆమె నియోజకవర్గంలో తన వర్గాన్ని బలోపేతం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. చౌక దుకాణాల డీలర్íÙప్పులు, మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, వివిధ పనులకు సంబంధించిన కాంట్రాక్టులు, పోలీసుస్టేషన్లో పంచాయితీలు ..ఇలా ప్రతి దాంట్లోనూ తన వర్గీయులకే పెద్దపీట వేస్తున్నారు. చివరకు ఉద్యోగుల బదిలీల్లోనూ తన మాటే నెగ్గేలా చూసుకున్నారు. ప్రస్తుతం మద్యం షాపుల టెండర్లలో సైతం ఎంపీ వర్గీయులు పాల్గొనకూడదంటూ మంత్రి వర్గీయులు అడ్డుపడుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం పెనుకొండ ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఘర్షణ వాతావరణ తలెత్తింది. పట్టు కోసం బీకే ప్రయత్నాలు అన్నింటా తన పెత్తనమే సాగేలా మంత్రి సవిత వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీ బీకేతో పాటు ఆయన వర్గీయులు రగిలిపోతున్నారు. నియోజకవర్గంలో ఎలాగైనా తన పట్టు నిలుపుకోవాలని బీకే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మద్యం టెండర్లలో తన వర్గీయులను మంత్రి అనుచరులు అడ్డుకోవడాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆయన.. పెనుకొండలోని తన స్వగృహంలో మకాం వేసి పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడి తన వర్గీయులూ దరఖాస్తులు వేసేలా చొరవ తీసుకున్నారు. అన్ని షాపులూ తమకే దక్కుతాయని అప్పటి వరకు సంతోషంగా ఉన్న మంత్రి వర్గీయులు.. పోలీసుల సహకారంతో బీకే వర్గీయులు కూడా పోటీగా దరఖాస్తులు వేయడంతో కంగుతిన్నారు. ఈ వ్యవహారం మద్యం షాపులు కేటాయించేనాటికి ఎటు వెళుతుందోనని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. సామాజిక వర్గాలపై కన్ను హిందూపురం ఎంపీగా గెలిచినప్పటికీ సొంత ఇలాకా పెనుకొండలో తన మార్కు రాజకీయం కొనసాగించడానికి బీకే పార్థసారథి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ఎంపీ ల్యాడ్స్ నిధులనే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తీసుకువచ్చి పనులు చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. అలాగే బలమైన సామాజిక వర్గాల వారికి అవసరమైన పనులు చేసిపెట్టి.. వారి అండ కోసమూ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పరిగిలో వాల్మీకి కల్యాణ మండపానికి రూ. కోటి, సోమందేపల్లిలో ఉప్పర (సగర) కులస్తుల కల్యాణ మండపానికి రూ.కోటి మంజూరు చేయించినట్లు చర్చ సాగుతోంది. ఈ విషయాన్ని గ్రహించిన మంత్రి సవిత అనుచరులు సోమందేపల్లిలో స్థల వివాదం ముందుకు తీసుకురావడంతో శంకుస్థాపన ఆగిపోయింది. అనంతరం సగర కులస్తులు ఎంపీని కలసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. నోరు మెదపని పార్టీ పెద్దలు పెనుకొండ నియోజకవర్గంలో ఎంపీ బీకే, మంత్రి సవిత మధ్య వర్గ పోరు విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, ఇతర ముఖ్య నేతల దృష్టికి వెళ్లినా ఎవరూ నోరు మెదపడం లేదన్న చర్చ పార్టీ నాయకుల్లో సాగుతోంది. అయితే..ఇక్కడి పరిణామాలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. -
అసెంబ్లీ ఓటర్ల జాబితానే ప్రామాణికం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితాను యథావిధిగా పరిగణనలోకి తీసుకొని వార్డులు, గ్రామపంచాయతీల వారీగా ముసా యిదా ఓటరులిస్టు తయారు చేయాలని అధికారు లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి ఆదే శించారు. ముసాయిదా జాబితాలను వచ్చేనెల 6న గ్రామ పంచాయతీల్లో ప్రచురించాలని సూచించా రు. త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్ని కల నిర్వహణకు వార్డులు, గ్రామపంచాయతీల వారీగా ఓటరు జాబితాల తయారీ, ప్రచురణ పురో గతిపై గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ ఈసీ) కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్థసారథి సమీక్షించారు. జిల్లా కలెక్టర్లు (హైదరాబాద్ మినహా) అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), డీపీవో, డీఎల్పీవోలు, అసెంబ్లీ నియో జకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ ముసాయిదా ఓటర్ల జాబి తాల ప్రచురణ తర్వాత మండల, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై వారి సలహాలు, సూచనలు తీసుకోవాల న్నారు. ఈ ముసాయిదా జాబితాలో ఏవైనా పొరపాట్లు జరిగితే వచ్చేనెల 13వ తేదీ వరకు సంబంధిత ఎంపీడీవోలు, డీపీవోలకు రాత పూర్వకంగా తెలియజేయాలని చెప్పారు. సవరించిన తుది ఓటర్ల జాబితాను వచ్చేనెల 21న ప్రచు రించాలని ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా అర్హులైన ఓటర్లు తమ పేర్లు జీపీ ఓటర్ల జాబితాలో చేర్చు కోవాలన్నా, ఎవరైనా ఓటరును జీపీ ఓటరు లిస్టులో కొనసాగించడానికి ఆక్షేపణలున్నా, వారు నిర్దేశించిన ఫారాలలో సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజి స్ట్రేషన్ అధికారికి దరఖాస్తు చేసుకో వాలన్నారు. ఓటరు జాబితా తయారీ తర్వాత, వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, పోలింగ్ సిబ్బంది వివరాల సేకరణ, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకం, పోలింగ్ సిబ్బంది శిక్షణ తదితరాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో ఎస్ఈసీ తయారు చేసిన గ్రీవెన్స్ మాడ్యూల్‌ను పార్థసారథి ఆవిష్కరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పీఆర్ శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్, పీఆర్ ఆర్డీ కమిషనర్ అనితా రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు. -
టీచర్ పోస్టుల భర్తీపై మంత్రి గారి అబద్దాలు
-
మీనాక్షినాయుడు చెవిలో ‘పువ్వు’ !
సాక్షి ప్రతినిధి కర్నూలు: ఆదోని అసెంబ్లీ సీటుపై టీడీపీ, బీజేపీ బేరసారాలు ఫలించలేదు. రూ.3 కోట్లు ఇస్తే ఆదోని సీటు వదులుకుంటామని బీజేపీ చేసిన ప్రతిపాదనకు టీడీపీ నేతలు అంగీకరించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఆదోని నుంచి బీజేపీనే పోటీ చేయాల్సిన అనివార్య పరిస్థితి తలెత్తింది. దీంతో ఆ పార్టీ పార్థసారథిని అభ్యర్థిగా ప్రకటించింది. వాస్తవానికి 15 రోజుల ముందే ఆదోని స్థానం బీజేపీ ఖాతాలోకి చేరిందనే విషయం మీనాక్షినాయుడుకు తెలుసు. దీంతో ఆయన అనుచరులు టీడీపీ ఫ్లెక్సీలు తొలగించారు. ఈ క్రమంలో బీజేపీకీ అభ్యర్థి దొరకకపోవడంతో ఆ పార్టీ నేతలు మీనాక్షి నాయుడు మేనల్లుడు మారుతి నాయుడుకు ఫోన్ చేసి రూ.3 కోట్లు ఇస్తే ఆదోని సీటు వదులుకుని, ఆలూరు కావాలనే ప్రతిపాదనను పార్టీ అధిష్టానం ముందు ఉంచుతామని ఆఫర్ ఇచ్చారు. అయితే అంత డబ్బులు ఇవ్వలేమని మీనాక్షినాయుడు చెప్పడంతో బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. మీనాక్షినాయుడు రాజకీయ భవితవ్యం ఎటు? కర్నూలు జిల్లా రాజకీయాల్లో మీనాక్షినాయుడు సీనియర్ నాయకుడు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. ఆదోని నుంచి మూడు దఫాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994, 1999, 2009లో వైఎస్సార్ ప్రభంజనంలోనూ ఆదోనిలో ఆయన విజయం సాధించారు. 1999లో కోట్ల సూర్యప్రకాశ్రెడ్డిపైనా గెలుపొందారు. టీడీపీ మినహా ఇతర పార్టీల్లోకి వెళ్లాలనే ఆలోచన కూడా చేయలేదు. టీడీపీని అంటిపెట్టుకుని ఆదోనిలో పార్టీ ఉన్నతికి తోడ్పడ్డారు. చివరిసారిగా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని లేదా తన తనయుడిని బరిలో నిలపాలని ఆయన అభిలషించారు. అలాంటి వ్యక్తిని కాదని పోటీ చేసేందుకు శక్తి లేక రూ.3 కోట్లకు సీటు వదలుకునేందుకు సిద్ధమైన పార్టీకి టీడీపీ అసెంబ్లీ సీటు ఇవ్వడాన్ని మీనాక్షినాయుడు జీర్ణించుకోలేకపోతున్నారని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఆయనకు టీడీపీ గౌరవం ఇవ్వలేనప్పుడు ఆయన పార్టీలో ఎందుకు కొనసాగాలనే చర్చ కూడా నడుస్తోంది. -
టీడీపీలో తిరుగుబావుటా
డోన్/పెనుకొండ/అనకాపల్లి/రాజమహేంద్రవరం రూరల్: టికెట్ల ప్రకటనపై టీడీపీలో నిరసన సెగలు ఎగసిపడుతున్నాయి. అసంతృప్త నేతలు తిరుగుబావుటా ఎగరవేస్తున్నారు. చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తుతున్నారు. చంద్రబాబు తనను నమ్మించి గొంతు కోశారని టీడీపీ నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ ఇన్చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత శుక్రవారం టీడీపీ డోన్ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వర్గీయులు డోన్‌లో పోటాపోటీ బలప్రదర్శన నిర్వహించగా, సీటు దక్కని ధర్మవరం సుబ్బారెడ్డి శనివారం భవిష్యత్ కార్యచరణ పేరుతో వేలాదిమందితో ప్రదర్శన నిర్వహించారు. ఆయన మా ట్లాడుతూ మూడేళ్ల పాటు పార్టీ బలోపేతానికి కష్టపడ్డానని వివరించారు. 40 ఏళ్లుగా కోట్ల, కేఈ వర్గా లకు విధేయునిగా ఉన్నానే తప్ప వారికి ఏనాడూ వెన్నుపోటు పొడవలేదని పేర్కొన్నారు. ఆ రెండు కుటుంబాలు పార్టీ ఇన్చార్జిగా ఉండేందుకు ఇష్టపడకపోవడంతోనే బాబు తనకు బాధ్యత అప్పగించారని గుర్తుచేశారు. ఇప్పుడు మూడేళ్ల తర్వాత తనతో మాట మాత్రమైనా చెప్పకుండా అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్రెడ్డిని ప్రకటించడం దారుణమ న్నారు. బాబు తన గొంతు కోశారని కన్నీటి పర్యంతమయ్యారు. తన రెక్కల కష్టంతో పార్టీని బతికించానని, ఇప్పుడు ఎవరో వచ్చి ఫలాలు పొందాలనుకుంటే తాను చూస్తూ ఊరుకోబోనన్నారు. బీకే ఇంటి వద్ద ఉద్రిక్తత శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ టీడీపీ మాజీ ఎమ్మె ల్యే బీకే పార్థసారథి ఇంటి వద్ద శనివారం ఉద్రిక్తత నెలకొంది. బీకేకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆగ్రహంగా ఉన్న ఆయన వర్గీయులు పార్టీపరిశీలకుడితోపాటు ఇతర నేతలను ఘెరావ్ చే శారు. పార్థసారథికి సర్దిచెప్పేందుకు శనివారం ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ పరిశీలకుడు కోవెలపూడి రవీంద్ర, మరికొందరు నాయకులు పెనుకొండలోని బీకే ఇంటికి వచ్చారు. అప్పటికే అక్కడికి చేరుకున్న బీకే మద్దతుదారులు తమ నేతకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంపీ టికెట్ ఇచ్చే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని వారు సర్దిచెప్పబోగా.. ఎంపీ టికెట్‌కు ఒప్పుకోబోమని, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తీరాలని పట్టుబట్టారు. రవీంద్రతోపాటు ఇతర నాయకులను చుట్టుముట్టారు. దీంతో రవీంద్ర, ఇతర నాయకులు వెనుదిరిగేందుకు యత్నించారు. అయినా వదలని బీకే వర్గీయులు వారి వెంట పడ్డారు. వాహనాలను చుట్టుముట్టి ముందుకు వెళ్లనీయకుండా ఘెరావ్ చేశారు. లోకేష్, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రవీంద్ర, ఇతరులు అక్కడి నుంచి జారుకున్నారు. దిలీప్‌చక్రవర్తి అభ్యర్థిత్వాన్ని అంగీకరించబోం టీడీపీ అనకాపల్లి ఎంపీ టికెట్‌ను స్థానికులకే ఇవ్వాలని, బైరా దిలీప్ చక్రవర్తి అభ్యర్థిత్వాన్ని తాము అంగీకరించబోమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, çసమైక్య ఉద్యమ నేత ఆడారి కిషోర్ కుమార్ స్పష్టం చేశారు. అనకాపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ అధిష్టానం స్థానికులకే టికెట్ ఇవ్వాలి, లేకుంటే తాను తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్ సభలకు, పాదయాత్రలకు వారు ఇక్కడికి వచ్చినప్పుడు తన సొంత డబ్బులతో మూడు బస్సులు తిప్పానని, ప్రస్తుతం జరుగుతున్న టీడీపీ సమావేశాలకూ బస్సులు తిప్పుతున్నానని చెప్పారు. ఆరు నెలల క్రితం చంద్రబాబుతో అనకాపల్లి ఎంపీ టిక్కెట్ కోసం చర్చించానని, ఈసారి టికెట్ తనకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు శొంఠ్యాన అప్పలరాజు, దాడి అప్పలనాయుడు, ఎ.నాగేశ్వరరావు పాల్గొన్నారు. ప్రకటించే వరకూ వేచి చూస్తా: గోరంట్ల టీడీపీ, జనసేన కలిసి ప్రయాణం చేస్తేనే రాష్ట్రం మళ్లీ బాగు పడుతుందని ప్రజలు భావిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. నగరంలోని తన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019లో ఏం జరిగింది, ఇప్పుడు తన బలమేమిటనే విషయాలను పవన్ కళ్యాణ్ జెండా సభలో వివరించారని, పవన్ తన పార్టీని నెమ్మదిగా బలోపేతం చేసుకుందామని చెప్పారని, ముద్రగడ, జోగయ్యల గురించి తానేమీ చెప్పలేనని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ సీటుపై అధినేతలు ప్రకటించే వరకూ వేచి చూస్తానని చెప్పారు. చంద్రబాబు, పవన్‌లను విడదీసేందుకు కొందరు తీవ్ర ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. -
పార్థసారథికి టికెటిస్తే ఓడిస్తాం!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా నూజివీడు టీడీపీలో రాజకీయ ప్రకంపనలు తారాస్థాయికి చేరాయి. తాజా పరిణామాలు ఆ పార్టీ ఆశావహ అభ్యర్థి పార్థసారథికి గట్టి షాక్ ఇస్తున్నాయి. స్థానికేతరుడికి టికెట్ ఇవ్వడంతో నియోజకవర్గంలో టీడీపీ టికెట్ ఆశిస్తున్న కాపా శ్రీనివాస్ ఇప్పటికే పార్టీ కి రాజీనామా చేయగా.. రెండు రోజుల్లో టికెట్ విషయం తేల్చకపోతే తన దారి తాను చూసుకుంటానని ముద్దరబోయిన అల్టిమేటం ఇచ్చారు. స్థానికేతరుడికి టికెటిస్తే ఓడించి తీరతామని అల్టిమేటం జారీచేశారు. టీడీపీ కేడర్‌తో శనివారం జరిగిన సమావేశంలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్థసారథికి టీడీపీ కేడర్ ఝలక్ పార్థసారథి టీడీపీలో చేరడం ఇప్పటికే ఖరారైంది. చంద్రబాబు చింతలపూడిలో నిర్వహించిన సభకు పార్థసారథి వాహనాలు ఏర్పాటు చేసి జనాలను తరలించారు. దీంతో పాటు నియోజకవర్గంలోనూ స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. గత మూడు రోజులుగా టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వే పేరుతో పార్టీ కేడర్‌కు ఫోన్లు చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం గోగులంపాడులో టీడీపీ మండల నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో పార్థసారథి పాల్గొన్నారు. చంద్రబాబు సొంత సామాజికవర్గ నాయకులు మినహా మిగిలినవారు ఎవరూ హాజరుకాలేదు. నూజివీడు టికెట్ ఆశిస్తున్న కాపా శ్రీనివాస్ టికెట్ పోరాటంలో అలసిపోయి పార్టీ కి రాజీనామా చేశారు. టికెట్ కోసం ముద్దరబోయినపై కాపా గట్టి పోరాటం చేశారు. పోటీ కార్యక్రమాలు, పార్టీ కార్యాలయాలకు వెళ్లి ఇన్చార్జిపై ఫిర్యాదు కూడా చేశారు. చివరకు పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. అయితే నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మాత్రం అందుకు సిద్ధంగా లేరు. మూటలతో వస్తే మద్దతివ్వం: ముద్దరబోయిన శనివారం సాయంత్రం ముద్దరబోయిన తన అనుచరులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి జనసేన నేతలను కూడా ఆహ్వానించగా వారు సభకు దూరంగా ఉన్నారు. రెండు రోజుల క్రితం చంద్రబాబునాయుడిని కలిస్తే మీకు సర్వేలన్నీ బాగున్నా.. టికెట్ సర్దుబా టు చేయలేకపోతున్నామని తనకు చెప్పారని కేడర్ ముందు ఆయన వాపోయారు. పదేళ్ల నుంచి ఓడిపోతున్నా పార్టీ కోసం నియోజకవర్గంలో పనిచేస్తుంటే ఇప్పుడు టికెట్ లేదనడం కరెక్ట్ కాదని, రెండు మూడు రోజుల్లో టికెట్ విషయం తేల్చి చెప్పాలని అల్టిమేటం జారీ చేశారు. టికెట్ ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని, తన దారి తాను చూసుకుంటానని అధిష్టానానికి ముద్దరబోయిన స్పష్టం చేసినట్లు సమాచారం. పార్థసారథి వస్తే ఓడించి తీరుతామని, పార్టీ కోసం పనిచేసేవారికి కాకుండా మూటలతో వచ్చిన వారిని సమరి్ధంచమని సమావేశంలో బహిరంగంగానే ప్రకటనలు చేశారు. -
కొత్త గ్రూపులకు ‘సారథి’!
నూజివీడు: ఇంకా టీడీపీలో చేరనేలేదు... ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించలేదు... టికెట్ ఇస్తామని ప్రకటించలేదు... కానీ, అప్పుడే కొలుసు పార్థసారథి నూజివీడులో గ్రూపు రాజకీయాలు మొదలు పెట్టారు. దీంతో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వర్గం మండిపడుతోంది. ఇప్పటికే ఇక్కడ టీడీపీలో ఉన్న గ్రూపుల గోల సరిపోదన్నట్లు... పార్థసారథి రాకముందే మరో కొత్త గ్రూపును తయారు చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మొదట ప్రగల్బాలు.. చివరకు సొంత సామాజికవర్గ నేతకు ఎసరు గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పెనమలూరు నియోజకవర్గం నుంచి కొలుసు పార్థసారథి పోటీ చేసి విజయం సాధించారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ పెనమలూరు నుంచి సీటు ఇవ్వడం సాధ్యం కాదని, ప్రత్యామ్నాయం ఆలోచిద్దామని వైఎస్సార్సీపీ అధిష్టానం పార్థసారథికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. ఇందుకు ఆయన అంగీకరించకుండా తాను పెనమలూరు నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. అదే సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును రహస్యంగా కలిసి ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. కానీ, అక్కడ టీడీపీ ఇన్చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అడ్డం తిరగడంతో చంద్రబాబు వెనక్కి తగ్గారు. పెనమలూరు తనకు కావాల్సిందేనని బోడే ప్రసాద్ గట్టిగా పట్టుపట్టారని, బీసీ నేత ముద్దరబోయిన అయితే మౌనంగా వెళ్లిపోతారని పార్థసారథిని నూజివీడు నుంచి పోటీ చేయాలని చంద్రబాబు సూచించినట్లు ప్రచారం సాగుతోంది. చివరకు తాను పెనమలూరు నుంచే పోటీ చేసి గెలుస్తానని ప్రగల్బాలు పలికిన పార్థసారథి కూడా అస్త్రసన్యాసం చేశారు. పెనమలూరులో బోడే ప్రసాద్‌ను తప్పించి తనకు సీటు ఇవ్వాలని చంద్రబాబును అడిగే ధైర్యం చేయలేక నూజివీడు వచ్చి పదేళ్లుగా టీడీపీని నమ్ముకుని ఉన్న తన సొంత సామాజికవర్గ నేతకు అన్యాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ముద్దరబోయిన ఫొటోల తొలగింపు నూజివీడు మండలం రావిచర్లలోని ఓ టీడీపీ నాయకుడి ఇంట్లో బుధవారం జరిగే శుభకార్యానికి పార్థసారథి హాజరుకానున్నట్లు తెలిసింది. ఆయనకు స్వాగతం పలుకుతూ మంగళవారం నూజివీడు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. వాటిలో ప్రస్తుత టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఫొటో కూడా ఉంది. పార్థసారథి కనీసం టీడీపీలో చేరకుండానే ఆయనకు స్వాగతం పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ముద్దరబోయిన వర్గం కంగుతింది. దీనిపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వ్యక్తిని వారు నిలదీయగా.. తనకు ఇద్దరు నాయకులు కావాలని, అందుకే ఇద్దరి ఫొటోలు వేశానని అతను చెప్పినట్టు సమాచారం. ఇద్దరి ఫొటోలు ఉండటానికి వీల్లేదని ముద్దరబోయిన వర్గం స్పష్టం చేసింది. ముద్దరబోయిన ఫొటోను తీసేయాలని, లేకపోతే తామే తమ నాయకుడి ఫొటోను తొలగిస్తామని హెచ్చరించింది. ఆ తర్వాత ఫ్లెక్సీలపై ఉన్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఫొటోను వారే కట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం నూజివీడులో హాట్ టాపిక్‌గా మారింది. పార్థసారథి అధికారికంగా టీడీపీలోకి రాకముందే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఈ గ్రూపుల గోల మరింత పెరిగే అవకాశం ఉందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పదేళ్ల నుంచి పార్టీ ఇన్చార్జిగా ఉన్న నేతను అధిష్టానం విస్మరించడం, మరోసారి వలస నేతను తీసుకురావడం, ఆయన మరో కొత్త వర్గాన్ని తయారు చేసుకునే పని ప్రారంభించడంపై నియోజకవర్గంలోని టీడీపీ సీనియర్ నాయకులు సైతం మండిపడుతున్నారు. నియోజకవర్గంలో గ్రూపుల గోల వల్ల ఇప్పటికే వరుసగా రెండుసార్లు ఓడిపోయామని, తాజా పరిణామాలు కూడా రానున్న ఎన్నికల్లో తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
ఎంపీగానా.. వద్దుబాబోయ్! అనంతపురం టీడీపీలో అభ్యర్థుల వెనకడుగు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తాము చెప్పిందే వేదం... చేసిందే చట్టం... అన్నరీతిలో సాగుతోంది టీడీపీలో అభ్యర్థుల ఎంపిక విధానం. తండ్రీకొడుకులు వేర్వేరు జాబితాలు సిద్ధం చేసుకోవడంతో వారి మధ్య సయోధ్య నడవక... మరోవైపు ఎక్కడ జాబితా ప్రకటించేస్తే అసమ్మతి నేతలు బయటకు వెళ్లిపోతారోనన్న భయంతో ఎక్కడా అభ్యర్థులను ఖరారు చేయకుండా సాగదీత ధోరణి అవలంబిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అయితే పరిస్థితి రోజు రోజుకూ దయనీయంగా తయారవుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షులకే తాము కోరుకున్న చోట టికెట్ దొరికే అవకాశం లేకపోవడంతో అయోమయ పరిస్థితి నెలకొంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అధిష్టానం అనుసరిస్తున్న వైఖరి వారిలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఎంపీగానే వెళ్లాలని అధిష్టానం హుకుం అనంతపురం జిల్లాకు కాలవ శ్రీనివాసులు, శ్రీసత్యసాయి జిల్లాకు బి.కె.పార్థసారథి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరికీ అసెంబ్లీ టికెట్లు లేవని పరోక్షంగా పార్టీ అధిష్టానం సంకేతాలిచ్చింది. ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశం లేనందున ఎంపీలుగా పోటీ చేయాలని వారికి సూచించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఇద్దరూ ససేమిరా అంటున్నారు. రెండు రోజుల క్రితం కాలవ శ్రీనివాసులు తాను రాయదుర్గం నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తానని కార్యకర్తల సమావేశంలో బహిరంగంగా ప్రకటించారు. అయితే ఆయన ఎట్టిపరిస్థితుల్లోనూ ఎంపీగానే వెళ్లాలని నారా లోకేశ్ తన సన్నిహితుల వద్ద తెగేసి చెప్పినట్టు తెలిసింది. బీకే పార్థసారథి కూడా ఎంపీగా వెళ్లడానికి సుముఖంగా లేరు. మూడు దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉంటే ఇప్పుడు పెనుకొండ టికెట్ ఇవ్వకుండా ఎంపీగా వెళ్లమనడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఉరవకొండకు చంద్రబాబు వచ్చినప్పుడు కూడా టికెట్ గురించి ప్రస్తావించగా.. ఆయన దాటవేసినట్టు తెలుస్తోంది. టికెట్లు ప్రకటించేస్తే వెళ్లిపోతారేమో.. ఇప్పటికిప్పుడు టికెట్లు ఖరారు చేసేస్తే అసమ్మతి నేతలంతా పార్టీని వదిలి వెళ్లిపోతారేమోననే ఆందోళనతోనే అధినేత చంద్రబాబు సాగదీత ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు దాదాపు ఖరారై... ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తుండగా ఇప్పటికీ టీడీపీలో అభ్యర్థులెవరో తేలకపోవడం విశేషం. తాడిపత్రి, హిందూపురం, ఉరవకొండ మినహా.. మిగతా 11 సెగ్మెంట్లలోనూ అభ్యర్థి ఎవరన్నది తెలియని పరిస్థితి నెలకొంది. అనంతపురం అర్బన్ టికెట్ పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వొచ్చుననే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు ఎన్నికల వ్యయం కోసం ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రులకు చంద్రబాబు, లోకేశ్‌లు గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది. -
ఏ కారణంతో చనిపోయినా చంద్రబాబు అకౌంటే..
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నాలుగు రోజుల క్రితం మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పుట్టపర్తి మండలం నిడిమామిడి నుంచి గంట్ల మారెమ్మ ఆలయం వరకు సంఘీభావ యాత్ర నిర్వహించారు. ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో మద్యం, డబ్బులు ఎరగా వేశారు. ఈ క్రమంలోనే గాజులపల్లికి చెందిన ఓ వ్యక్తి పూటుగా మద్యం తాగి ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయాడు. కానీ చంద్రబాబు అరెస్టును తట్టుకోలేకే అతను గుండె ఆగి చనిపోయినట్లు టీడీపీ నేతలు ప్రచారం చేశారు. ఎల్లో మీడియాలోనూ వార్తలు వచ్చాయి. ఇలాంటి ఘటనలు ప్రతి నియోజకవర్గంలోనూ ఉన్నాయి. వారం రోజుల క్రితం పెనుకొండలో బీకే పార్థసారథి ఆధ్వర్యంలో 40 కుటుంబాలు టీడీపీలో చేరినట్లు టీడీపీ అనుకూల పత్రికల్లో వార్తలు వచ్చాయి. అయితే వారందరూ ఆరంభం నుంచి టీడీపీ వెంట నడిచిన వారేనని తేలింది. అయితే కొంతకాలంగా సవితమ్మ వర్గంలో ఉన్న వారంతా ఇప్పుడు బీకే పార్థసారథి వైపు వచ్చారని తెలిసింది. అలాగే నాలుగు కుటుంబాలు మాత్రమే టీడీపీలో చేరగా.. 40 కుటుంబాలు చేరినట్లు ప్రచారం చేశారు. ఫొటోల్లో జనం భారీగా కనిపించాలన్న ఉద్దేశంతో టీడీపీ కార్యాలయంలోని వారందరికీ కండువాలు వేసి ఫొటోలకు ఫోజులివ్వడం గమనార్హం. సాక్షి, పుట్టపర్తి: అధినేత అవినీతి కేసులో జైలు పాలయ్యాడు.. ప్రజలు పట్టించుకోవడం మానేశారు. నిరసన, ధర్నాలకు పిలుపునిచ్చినా కార్యకర్తలు కన్నెత్తి చూడటం లేదు. ఏం చేయాలో తెలియని పచ్చ తమ్ముళ్లు ఉనికి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పార్టీ కార్యకర్తలకే మళ్లీ కండువాలు వేసి టీడీపీలో చేరినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఎల్లో మీడియాలోనూ అవే వార్తలు కనిపిస్తుండటంతో జనం నవ్వుకుంటున్నారు. వాపును బలుపుగా ప్రచారం.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కుల, మత, రాజకీయాలకు అతీతంగా పథకాలు అమలు చేయడంతో చాలా మంది టీడీపీ నేతలూ లబ్ధి పొందుతున్నారు. దీంతో వారంతా ఒక్కొక్కరుగా ఫ్యాన్ కిందకు చేరుతున్నారు. ఈ క్రమంలోనే హిందూపురం, పెనుకొండ, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి, మడకశిర, రాప్తాడు నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి భారీగా వలసలు మొదలయ్యాయి. గ్రామాల వారీగా టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వస్తున్నారు. దీంతో ‘తమ్ముళ్ల’కు వణుకు పట్టుకుంది. అవినీతి కేసులో చంద్రబాబు జైలు వెళ్లడం...టీడీపీ ముఖ్య నేతలు కూడా తలోదారి చూసుకుంటున్నట్లు వార్తలు వస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవడం కష్టమనే భావన కార్యకర్తల్లోకి వెళ్లిపోయింది. అందువల్లే మండల స్థాయి నేతలంతా వైఎస్సార్ సీపీ వైపు చూస్తున్నారు. కానీ కొందరు టీడీపీ నేతలు మాత్రం వాపును బలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ‘తెలుగు తమ్ముళ్ల’కే మళ్లీ కండువాలు కప్పుతూ కొత్తగా టీడీపీలో చేరారంటూ గొప్పలు పోతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవం తెలిసిన జనం మాత్రం వీరి చర్యలు చూసి నవ్వుకుంటున్నారు. ఏ కారణంతో చనిపోయినా చంద్రబాబు అకౌంటే.. కిందపడినా మాదే పైచేయి అన్నట్లుగా ఉంది టీడీపీ నేతల పరిస్థితి. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును సీఐడీ అరెస్టు చేయగా.. కోర్టు సైతం ఆయనకు రిమాండ్ విధించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపింది. దీన్ని చూపి సానుభూతి పొంది ఓట్లు రాబట్టుకోవాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఏ కారణంతో ఎవరు మరణించినా.. వెంటనే ‘చంద్రబాబు అరెస్టు’ ఖాతాలో వేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు జిల్లాలో నాలుగైదు వెలుగు చూశాయి. ఓట్ల వేటలో టీడీపీ నేతల కక్కుర్తి వ్యవహారాలు నచ్చక చాలా మంది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. ఉనికి కోసమే చంద్రబాబు జైలుకెళ్లాడు.. లోకేష్ పారిపోయాడు. వ్యవస్థలను మేనేజ్ చేయడం జగనన్న ప్రభుత్వంలో కుదరదు. ఇక ఆ అవినీతి పరుడు జైల్లో ఉండాల్సిందే. టీడీపీ జీరో అయింది. అందువల్లే ఉనికి చాటుకునేందుకు ఆ పార్టీ నేతలు ఉత్తుత్తి ప్రచారం చేస్తున్నారు. కానీ విజ్ఞులైన జనం అంతా గమనిస్తున్నారు. – గోరంట్ల మాధవ్, ఎంపీ, హిందూపురం నలుగురు కూడా చేరలేదు మా గ్రామం నుంచి 25 కుటుంబాలు టీడీపీలో చేరినట్లు ఆ పార్టీ నేతలు ప్రచారం చేశారు. కానీ వారందరూ టీడీపీలో ఉన్నవాళ్లే. అయితే అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారన్న భయంతో వారికి కండువాలు కప్పి కొత్తగా టీడీపీలో చేరినట్లు బీకే పార్థసారథి ప్రచారం చేశారు. కనీసం నలుగురు కూడా టీడీపీలో చేరలేదు. – రామాంజనేయులు, కురుబవాండ్లపల్లి -
టీడీపీ బస్సుయాత్రలో బాహాబాహీ
పెనుకొండ: శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో టీడీపీ నాయకుల వర్గపోరు తారస్థాయికి చేరింది. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరిట చేపట్టిన బస్సుయాత్ర సందర్భంగా ఆదివారం మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, పార్టీ నాయకురాలు సవితమ్మ వర్గీయులు పెనుకొండ పట్టణంలో బాహాబాహీకి దిగారు. నడిరోడ్డుపైనే తన్నుకున్నారు. బస్సుయాత్ర ఆదివారం శెట్టిపల్లి నుంచి వివిధ గ్రామాల మీదుగా పెనుకొండకు చేరుకుంది. స్థానిక మడకశిర సర్కిల్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేయడానికి ముందు సమీపంలోని టీడీపీ కార్యాలయం వద్ద సవితమ్మ వర్గీయులు బాణాసంచా కాలుస్తూ కేకలు వేశారు. దీంతో ఆగ్రహానికి లోనైన బీకే పార్థసారథి.. సవితమ్మ వర్గీయులను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ‘పోటు పొడిచారు.. మీ కథ చూస్తా..’ అంటూ హెచ్చరించారు. బస్సుయాత్రలో వెనుకనే ఉండి డ్రామాలాడుతోందంటూ సవితమ్మపై పరోక్షంగా మండిపడ్డారు. అనంతరం పార్టీ జిల్లా నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేయడానికి పైకి వెళ్లగానే.. బస్సు ముందు నిలబడి ఉన్న ఇరువర్గాలు కేకలు వేస్తూ బాహాబాహీకి దిగారు. గందరగోళం నెలకొంది. ఏం జరుగుతోందో అర్థంగాక కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. అక్కడి నుంచి బస్సుయాత్ర అంబేడ్కర్ సర్కిల్‌కు వెళ్లగా సవితమ్మ వర్గీయులు మాత్రం కార్యాలయం వద్దే ఉండిపోయారు. -
కేఎస్‌బీఎల్, ప్రమోటర్లపై ఏడేళ్ల నిషేధం..
న్యూఢిల్లీ: క్లయింట్ల నిధులను దుర్వినియోగం చేసిన కేసులో కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్), దాని ప్రమోటర్ కొమండూర్ పార్థసారథి ఏడేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లో లావాదేవీలు జరపకుండా సెబీ నిషేధించింది. కేఎస్‌బీఎల్‌కు రూ. 13 కోట్లు, పార్థసారథికి రూ. 8 కోట్లు జరిమానా కూడా విధించింది. అలాగే పార్థసారథి ఏ లిస్టెడ్ కంపెనీలోనూ కీలక మేనేజర్ హోదాల్లో పని చేయకుండా పదేళ్ల పాటు నిషేధించింది. కేఎస్‌బీఎల్‌కు చెందిన మరో ఇద్దరు డైరెక్టర్లయిన భగవాన్ దాస్ నారంగ్, జ్యోతి ప్రసాద్‌లకు ఇది రెండేళ్ల పాటు వర్తిస్తుంది. అటు కేఎస్‌బీఎల్ నుంచి తీసుకున్న రూ. 1,443 కోట్ల మొత్తాన్ని మూడు నెలల్లోగా వాపసు చేయాలంటూ కార్వీ రియల్టీ, కార్వీ క్యాపిటల్‌ను సెబీ ఆదేశించింది. లేని పక్షంలో ఆ మొత్తాన్ని రాబట్టేందుకు రెండు సంస్థల ఆస్తులను ఎన్ఎస్ఈ తన అధీనంలోకి తీసుకుంటుందని సెబీ స్పష్టం చేసింది. క్లయింట్లు ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీలను దుర్వినియోగం చేసి వారి షేర్లను తనఖా పెట్టి, కార్వీ సొంత అవసరాల కోసం నిధులను సమీకరించిందని ఆరోపణలు ఉన్నాయి. కేఐఎస్ఎల్పై ఆంక్షలు: నిబంధనల ఉల్లంఘన కేసులో కొత్త క్లయింట్లను చేర్చుకోకుండా కార్వీ ఇన్వెస్టర్ సర్వీసెస్ (కేఐఎస్‌ఎల్)పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వర్తిస్తుందని పేర్కొంది. 2021–22 మధ్య కాలంలో డెట్ సెక్యూరిటీల పబ్లిక్ ఇష్యూలకు సంబంధించి కంపెనీ పలు నిబధనలను ఉల్లంఘించినట్లు సెబీ విచారణలో తేలింది. మర్చంట్ బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించేందుకు ఉద్యోగులు గానీ, భౌతిక మౌలిక సదుపాయాలు గానీ కేఐఎస్ఎల్కు లేవని కూడా వెల్లడైంది. పైగా 2022 డిసెంబర్ నుంచి 2025 డిసెంబర్ వరకూ చెల్లుబాటయ్యేలా రెన్యువల్ ఫీజును కూడా కంపెనీ కట్టలేదని 13 పేజీల ఎక్స్‌పార్టీ మధ్యంతర ఉత్తర్వుల్లో సెబీ పేర్కొంది. ఇలాంటి సంస్థల కార్యకలాపాల వల్ల సెక్యూరిటీల మార్కెట్ సమగ్రత, ఇన్వెస్టర్ల ప్రయోజనాలు దెబ్బతింటాయని వ్యాఖ్యానించింది. -
శివ ధ్యానం జన్మజన్మల పుణ్యఫలం
-
స్వరార్చన
-
రూ.110 కోట్ల కార్వీ ఆస్తుల జప్తు
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ ఎండీ పార్థసారథికి చెందిన రూ.110 కోట్ల విలువైన భూములు, బంగారు ఆభరణాలు, విదేశీ నగదు, షేర్లను జప్తు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. పార్థసారథితోపాటు సీఎఫ్‌వో జి.హరికృష్ణను గతంలో అరెస్ట్ చేయగా, ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నట్టు ఈడీ వెల్లడించింది. హైదరాబాద్ నగర కమిషనరేట్‌లోని సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న ఈడీ కార్వీ సంస్థతోపాటు చైర్మన్, ఎండీ, తదితరులకు చెందిన రూ.1,984 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటికే జప్తు చేసినట్టు ఈడీ వెల్లడించింది. తాజాగా చేసిన రూ.110 కోట్ల ఆస్తులతో కలిపి మొత్తంగా రూ.2,095 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్టు స్పష్టం చేసింది. కార్వీ సంస్థలో షేర్ హోల్డర్లను మోసం చేసి వారి షేర్ల మీద రూ.2,800 కోట్ల మేర రుణం పొంది ఎగొట్టిన కేసుల్లో పార్థసారథిపై దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో కేసులు నమోదయ్యాయి. ఆ రుణాలను రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి మళ్లించడంతోపాటు పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి వాటి పేర్ల మీద సైతం రుణం పొందినట్టు ఈడీ గుర్తించింది. షేర్ హోల్డర్లు ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీని దుర్వినియోగం చేసి రుణం పొందడంతోపాటు కేడీఎంఎస్‌ఎల్, కేఆర్‌ఐఎల్ కంపెనీలకు మళ్లించి వాటిని లాభాల్లో చూపించే ప్రయత్నం చేసినట్టు గుర్తించింది. రుణాల్లో కొంత భాగాన్ని కుమారులు రజత్ పార్థసారథి, అధిరాజ్ పార్థసారథికి జీతభత్యాలు, రీయింబర్స్మెంట్ పేరుతో దోచిపెట్టినట్టు ఈడీ గుర్తించింది. కార్వీ అనుబంధ సంస్థగా ఉన్న కేడీఎంఎస్‌ఎల్ ఎండీ వి.మహేశ్‌తోపాటు మరికొంత మంది కలిసి పార్థసారథి డైరెక్షన్లో మనీలాండరింగ్‌లో కీలకపాత్ర పోషించినట్టు ఈడీ వెల్లడించింది. -
‘స్థానిక’ ఖాళీల భర్తీకి 8న ముసాయిదా ఓటర్ల జాబితా
సాక్షి, హైదరాబాద్: వివిధ పంచాయతీరాజ్, పురపాలక సంస్థల్లోని వివిధ స్థానాలకు ఏర్పడిన ఖాళీల భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా ఈ నెల 8న ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రచురించి, వాటిపై అభ్యంతరాలుంటే స్వీకరించాలని సంబంధిత పీఆర్, మున్సిపాలిటీ శాఖల అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఆదేశించారు. ఈ జాబితాలపై రాజకీయ పార్టీలప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారి సలహాలు, అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించాలన్నారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి పొరబాట్లు లేకుండా పక్కాగా తయారు చేస్తే ఎన్నికల్లో ఎలాంటి తప్పిదాలు జరిగే అవకాశాలు ఉండవని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులు, కౌన్సిలర్ల స్థానాల భర్తీకి సంబంధించిన ఓటర్ల జాబితాల తయారీపై సోమవారం వివిధ జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, మున్సిపల్ కమిషనర్లతో ఎస్ఈసీ పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనవరి 1వ తేదీ ప్రాతిపదికగా ఓటర్ల జాబితా పార్థసారథి మాట్లాడుతూ 2022 జనవరి 1వ తేదీని ప్రాతిపదికగా తీసుకొని అదే నెల 6న ఈసీ అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ప్రచురించిన ఓటర్ల జాబితాల ఆధారంగా స్థానిక సంస్థల ఓటర్ల జాబితాలను ఈ నెల 21న ప్రచురించాలని సూచించారు. వీటి తయారీలో సాధారణ ఎన్నికల్లో ఏర్పరిచిన వార్డు సరిహద్దులను తప్పక పాటించాలని స్పష్టం చేశారు. ఈ ఓటర్ల జాబితాలు సిద్ధమయ్యాక ఎస్ఈసీ పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, పబ్లికేషన్‌కు నోటిఫికేషన్ జారీ చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన తర్వాత ఎస్ఈసీ ఎన్నికల నిర్వహణకు తేదీలను ఖరారు చేస్తుందని పార్థసారథి వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, పంచాయతీరాజ్ కమిషనర్ డాక్టర్ శరత్, వివిధ జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు పాల్గొన్నారు. -
నష్టాలు చూపించి.. కోట్లు కొల్లగొట్టి..
సాక్షి, హైదరాబాద్: కస్టమర్ల పేరిట ఉన్న షేర్లను తనఖా పెట్టి మూడు వేల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిన కార్వీ ఎండీ పార్థసారథి వ్యవహారంపై ఈడీ లోతుగా దర్యాప్తు చేపట్టింది. నాలుగు రోజుల క్రితం అరెస్ట్‌చేసిన పార్థసారథితోపాటు కంపెనీ సీఎఫ్ఓ కృష్ణ హరిని విచారిస్తోంది. గురువారం కోర్టు అనుమతితో నాలుగు రోజుల కస్టడీలోకి తీసుకున్న ఈడీ మొదటి రోజు.. షేర్ల పేరిట రుణాలు తీసుకున్న డబ్బును ఎక్కడికి తరలించారన్న దానిపై ప్రశ్నల వర్షం కురిపించింది. షెల్ కంపెనీలపై వేల కోట్ల రుణం కార్వీ స్టాక్ బ్రోకింగ్ షేర్లు కొనుగోలు చేసిన క్లయింట్ షేర్లను పవర్ ఆఫ్ అటార్నీతో బదలాయించుకున్న పార్థసార«థి.. కృష్ణ హరితో కలిసి కార్వీ రియల్టీతోపాటు 14 షెల్ కంపెనీలకు మళ్లించినట్టు ఈడీ విచారణలో బయటపడింది. కస్టమర్ల షేర్లను సైతం షెల్ కంపెనీలకు మళ్లించినట్టు వెలుగులోకి వచ్చింది. ఇలా మళ్లించిన షేర్లను 5 షెల్ కంపెనీల పేరిట తనఖా పెట్టి హెచ్డీఎఫ్సీ బ్యాంకులో రూ.400 కోట్ల రుణం పొందినట్టు ఈడీ గుర్తించింది. ఈ డబ్బును కార్వీ సంస్థల అప్పుల చెల్లింపునకు ఉపయోగించినట్టు పార్థసారథి, కృష్ణ హరి విచారణలో చెప్పిననట్టు దర్యాప్తు వర్గాల ద్వారా తెలిసింది. కార్వీ రియల్టీతోపాటు మరో 9 కంపెనీల పేరు మీదకు మళ్లించిన షేర్లతో నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల ద్వారా రుణాలు పొందేందుకు యత్నించారని, ఆ తర్వాత రెండు ప్రైవేట్ బ్యాంకుల ద్వారా రూ.రెండువేల కోట్లకు పైగా రుణం పొందినట్టు గుర్తించారు. ఆ డబ్బు సంగతేంటి? స్టాక్ బ్రోకింగ్ కంపెనీ నుంచి మళ్లించిన షేర్లను తన వ్యక్తిగత ఖాతాతోపాటు కుటుంబీకుల పేర్ల మీద ఉన్న కంపెనీలకు తరలించినట్టు గుర్తించిన ఈడీ.. అక్కడి నుంచి ఎక్కడికి మళ్లించారన్న అంశాలపై లోతుగా విచారిస్తోంది. కుటుంబీకుల పేర్ల మీద ఉన్న కంపెనీలోకి దాదాపు రూ.2వేల కోట్లు మళ్లించినట్టు గుర్తించింది. తర్వాత ఈ డబ్బును ఎక్కడికి మళ్లించారు, షేర్ల బదలాయింపునకు ముందే కంపెనీని భారీ నష్టాల్లో ఎందుకు చూపించాల్సి వచ్చిందన్న దానిపై పార్థసారథిని ప్రశ్నిస్తోంది. ఇద్దరూ కంపెనీ ఉద్యోగులను పూర్తిస్థాయిలో కుంభకోణంలో పాలుపంచుకునేలా చేసినట్టు ఈడీ భావిస్తోంది. ఈ వ్యవహారంపై కస్టడీలో పూర్తి వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. -
రూ.700 కోట్ల ‘కార్వీ’ షేర్లు ఫ్రీజ్
సాక్షి, హైదరాబాద్: కార్వీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరింత దూకుడు పెంచింది. కార్వీతోపాటు ఇతర 8 కంపెనీలకు చెందిన రూ.700 కోట్ల విలువైన షేర్లను ఫ్రీజ్ చేసింది. మూడు రోజుల క్రితం కార్వీ సీఎండీతోపాటు ఇతర నిందితుల ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా కీలకమైన డాక్యుమెంట్లు, డైరీలు, డిలీట్ చేసిన మెయిల్స్, పెన్‌డ్రైవ్‌లు ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నాయి. తదుపరి చర్యల్లో భాగంగా షేర్లను ఫ్రీజ్ చేసినట్టు తెలిసింది. 2019–20 ఆర్థిక సంవత్సరం ప్రకారం వాటి విలువను రూ.700 కోట్లుగా నిర్ధారించినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. రుణాలు తీసుకుని షెల్ కంపెనీలకు.. హైదరాబాద్ సీసీఎస్‌లో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. పార్థసారథి అక్రమ పద్ధతిలో బ్యాంకుల నుంచి రుణాలు పొంది తిరిగి కట్టకుండా డిఫాల్టర్ అయ్యారు. దీంతో హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ తదితర బ్యాంకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కార్వీ స్కాం వెలుగులోకి వచ్చింది. హెచ్డీఎఫ్సీ నుంచి రూ.329 కోట్లు, ఇండస్ఇండ్ బ్యాంక్ నుంచి రూ.137 కోట్లు, ఐసీఐసీఐ నుంచి రూ.562.5 కోట్లు రుణాలు పొందినట్లు ఆయా బ్యాంకులు ఫిర్యాదులో పేర్కొన్నాయి. వీటితోపాటు మరికొన్ని బ్యాంకుల్లో రుణాలు పొంది షెల్ కంపెనీలకు బదలాయించాడని, మొత్తం స్కాం విలువ రూ. 2,873 కోట్లు అని ఈడీ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఎక్సే్ఛంజ్ బోర్డులకు చెప్పకుండానే.. షేర్ల వ్యవహారంలో కార్వీ సంస్థ రెండు డీపీ (డిపాజిటరీ పార్టిసిపేటరీ) అకౌంట్ల ద్వారా జనవరి 2019 నుంచి ఆగస్టు 2019 వరకు జరిగిన ట్రేడింగ్ వివరాలను బీఎస్ఈ (బాంబే స్టాక్ ఎక్సే్ఛంజ్) ఫైలింగ్‌లో ఎక్సే్ఛంజ్ బోర్డులకు చూపకుండా దాచిపెట్టినట్టు ఈడీ దర్యాప్తులోకి వెలుగులోకి వచ్చింది. ఆ బోర్డులకు సమాచారమివ్వకుండా మదుపరుల షేర్లను తన వ్యక్తిగత డీమాట్ అకౌంట్లోకి బదలాయించినట్టు కూడా గుర్తించింది. సెబీకి సమాచారం లేకుండా ఏప్రిల్ 2016 నుంచి అక్టోబర్ 2019 వరకు రూ.1,096 కోట్లను పార్థసారథి కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్) నుంచి కార్వీ రియాలిటీ ఇండియా (కేఆర్‌ఐఎల్)లోకి బదలాయించారు. అదేవిధంగా కేఎస్‌బీఎల్ నుంచి కార్వీ కన్సల్టెంట్స్ లిమిటెడ్ (కేసీఎల్)తో పాటు 8 షెల్ కంపెనీలకు నిధులు బదలాయించినట్లు ఈడీ గుర్తించింది. కార్వీ రియల్ ఇండియా పేరుతో బదలాయించిన సొమ్ములో కొంత మొత్తాన్ని అదే కంపెనీ పేరిట భూములు కొనుగోలు చేసినట్టు ఉన్న డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు దొరక్కుండా కంప్యూటర్లలో ఫైల్స్, మెయిల్స్‌ను డిలీట్ చేసినట్టు గుర్తించిన ఈడీ వాటిని తిరిగి చేజిక్కించుకున్నట్లు దర్యాప్తు అధికారుల ద్వారా తెలిసింది. -
కార్వీ పార్థసారథిపై బిగుస్తున్న ఉచ్చు
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి.పార్థసారథి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఇప్పటికే ఈయనపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదుకాగా, తాజాగా రూ.350 కోట్ల స్కామ్‌కు సంబంధించి బెంగళూరులోని వివిధ ఠాణాల్లో నలుగురు బాధితులు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. ఆ ప్రాంతానికి చెందిన మదుపరుల డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లు, బ్యాంకు ఖాతాల్లోని నగదును కార్వీ సంస్థ దుర్వినియోగం చేసిందంటూ వాటిలో పేర్కొన్నారు. ఈ కేసులను అక్కడి క్రైమ్ వింగ్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్ చేరుకున్న అధికారులు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులతో భేటీ అయ్యారు. ఇప్పటివరకు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలను తెలుసుకున్నారు. మరోపక్క హరియాణా సహా ఇతర రాష్ట్రాల్లోనూ కార్వీపై కేసులు నమోదవుతున్నా యి. తక్కువ మొత్తాలతో ముడిపడి ఉన్న కేసులను పార్థసారథి సంబంధీకులు సెటిల్ చేస్తున్నారు. -
పంజాబ్‌కు ‘కార్వీ’ పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి.పార్థసారథిని పంజాబ్ పోలీసులు ఆ రాష్ట్రానికి తరలించారు. అక్కడి బర్నాలా పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో విచారించనున్నారు. బర్నాలాకు చెందిన ఓ వ్యక్తిని రూ.25 లక్షల మేర మోసం చేసినట్లు గతేడాది కేసు నమోదైంది. అయితే అక్కడి పోలీసులు ఇప్పటిదాకా ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదు. గత నెల్లో హైదరాబాద్‌లో నమోదైన కేసుకు సంబంధించి పార్థసారథిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయా కేసుల్లో ఇతడి కస్టడీ, విచారణలు సైతం పూర్తి చేశారు. దీనిపై సమాచారం అందుకున్న బర్నాలా అధికారులు తమ వద్ద ఉన్న కేసుకు సంబంధించి పార్థసారథిని తీసుకురావడానికి ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ జారీ చేయాలని అక్కడి కోర్టును కోరారు. ఇది జారీ కావడంతో బర్నాలా ఠాణాకు చెందిన ఏఎస్సై కమల్జీత్ సింగ్ నగరానికి చేరుకున్నారు. మంగళవారం నాంపల్లి కోర్టులో ఈ పిటిషన్‌ను దాఖలు చేసి నిందితుడి తరలింపునకు అనుమతి కోరారు. దీన్ని పరిశీలించిన న్యాయస్థానం పార్థసారథిని పంజాబ్ పోలీసులకు అప్పగించాల్సిందిగా చంచల్‌గూడ జైలు అధికారులను ఆదేశించింది. దీని ఆధారంగా ఆయనను పంజాబ్ పోలీసులు బర్నాలాకు తరలిస్తున్నారు. ఈ కేసులో మిగిలిన నిందితులను భవిష్యత్తులో అక్కడకు తీసుకెళ్లనున్నారు. మరోవైపు, కార్వీపై ముంబైకి చెందిన మరో బాధితుడు లలిత్ బండారీ ఇటీవల హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. లలిత్ బండారీకి డీమ్యాట్ ఖాతా ఓపెన్ చేస్తామని, ట్రేడింగ్ కూడా చేస్తామమంటూ రూ.1.13 కోట్లు తీసుకుని కార్వీ మోసం చేసింది. ఆ డబ్బునూ ఇతర సంస్థల్లోకి మళ్లించేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దాన్ని అక్కడకు బదిలీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
ఆడిట్ రిపోర్ట్ ముందుంచి పార్థసారథిని ప్రశ్నించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: కార్వి ఎండి పార్థసారధికి రెండు రోజుల కస్టడీ ముగిసింది. కస్టడీలో ఉండగా అతన్ని పలు అంశాల్లో సీసీఎస్ పోలీసులు విచారించారు. అందులో భాగంగా.. కార్వి సంస్థకు చెందిన బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఎక్కడికి తరలించారన్న దానిపై ప్రశ్నించారు. పలు బ్యాంక్ లాకార్ల పై కూపీ కూడా లాగారు. కాగా ఆడిట్ రిపోర్ట్ అతని మందుంది విచారించినట్లు తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం న్యాయమూర్తి ముందు పార్థసారథిని పోలీసులు హాజరుపరిచారు. అనంతరం అతన్ని చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా బ్యాంకు రుణాల ఎగవేత, నిధుల మళ్లింపుపై కార్వీ ఎండీ పార్ధసారథి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పోలీసుల విచారణలో పార్ధసారథి 6 బ్యాంక్‌ల నుంచి కార్వీ వేల కోట్లలో రుణాలు పొందినట్లు గుర్తించారు. చదవండి: బంగారాన్ని పేస్ట్‌గా మార్చి ప్యాంట్లో దాచాడు! -
రెండోరోజు ముగిసిన కార్వీ ఎండీ పార్థసారథి పోలీసుల కస్టడి
-
ముగిసిన కార్వీ ఎండీ పార్థసారథి పోలీసుల కస్టడి
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు రుణాల ఎగవేత, నిధుల మళ్లింపుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ ఎండీ పార్ధసారథి పోలీసుల కస్టడీ ముగిసింది. రెండు రోజులు పాటు పార్థసారథిని విచారించిన సీసీఎస్ పోలీసులు అతని నుంచి కీలక సమాచారం సేకరించారు. కంపెనీ ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా విచారించిన పోలీసులు.. కార్వీ సంస్థకు చెందిన బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించారు. వీటి ద్వారా 6 బ్యాంక్‌ల నుంచి కార్వీ వేల కోట్లలో రుణాలు పొందినట్లు గుర్తించారు. కార్వీకి చెందిన 6 బ్యాంక్ అకౌంట్లను అధికారులు ఫ్రీజ్ చేశారు. అలాగే కార్వీ కుంభకోణంలో ఇతరుల పాత్రపై పార్ధసారథిని పోలీసులు ప్రశ్నించారు. ఇతర నిందితులపై త్వరలో చర్యలకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. మరి కాసేపట్లో పార్థసారథిని వైద్య పరీక్షలు నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి న్యాయమూర్తి ముందు హాజరు పర్చనున్నారు. కాగా రుణాల ఎగవేత కేసులో అరెస్ట్ అయిన పార్ధసారథిని రెండు రోజుల పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ మంగళవారం నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు ఆయన్ను విచారించిన సీసీఎస్ పోలీసులు నేడు కోర్టులో హజరుపర్చనున్నారు. -
వందల మంది షేర్లు మాయం!
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్) సంస్థలో డీమ్యాట్ ఖాతాలు కలిగిన మదుపరుల షేర్లు భారీ సంఖ్యలో గల్లంతయ్యాయి. దీంతోపాటు డీమ్యాట్ ఖాతాలకు లింకై ఉన్న బ్యాంకు ఖాతాల్లోని నగదు కూడా మాయమైంది. కేఎస్‌బీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి.పార్థసారథిని హైదరాబాద్ సెంట్రల్ క్రైం స్టేషన్ (సీసీఎస్) పోలీసులు గత గురువారం అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న బాధితులు అనేక మంది అధికారులను సంప్రదిస్తున్నారు. సోమవారం నాటికి 25 మంది వచ్చారని సమాచారం. నిబంధనల ప్రకారం ఈ ఠాణా అధికారులు రూ.75 లక్షల కంటే ఎక్కువ మొత్తంతో ముడిపడిన ఆర్థిక నేరాల కేసుల్నే నమోదు చేయాలి. అందుకే స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించినట్లు ఓ అధికారి తెలిపారు. రెండు బ్యాంకులకు రూ.484 కోట్లు ఎగవేసిన ఆరోపణలపై సీసీఎస్‌లో వేర్వేరుగా మూడు కేసులు నమోదయ్యాయి. రూ.137 కోట్లకు సంబంధించి ఇండస్ ఇండ్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో పార్థసారథిని అరెస్టు చేసిన విషయంతెలిసిందే. తదుపరి విచారణ నిమిత్తం ఆయనను తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ సీసీఎస్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం వాదనలు ముగిశాయి. దీనిపై న్యాయస్థానం మంగళవారం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. సంస్థలోకి మళ్లించుకుని రుణాలు.. కేఎస్‌బీఎల్ సంస్థ ఏళ్లుగా అనేక మంది మదుపర్ల డీమ్యాట్ ఖాతాలను పర్యవేక్షించింది. ఆయా ఖాతాల్లో వినియోగదారులకు సంబంధించిన షేర్లతో పాటు దానికి లింకైన బ్యాంకు ఖాతాల్లో నగదు కూడా ఉండేది. ప్రతి మదుపరుడు తన షేర్లను బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టడం ద్వారా వాటి విలువలో 80 శాతం వరకు రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని అనువుగా మార్చుకున్న పార్థసారథి మదుపరుల అనుమతి లేకుండా వారి డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లను తన సంస్థ ఖాతాల్లోకి మార్చుకున్నారు. ఆపై బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను సంప్రదించి రుణాలు తీసుకున్నారు. మరికొందరి షేర్లను విక్రయించడంతో పాటు వారి బ్యాంకు ఖాతాల్లోని నగదునూ స్వాహా చేశాడు. ఇలా కేఎస్‌బీఎల్, కార్వీ కమోడిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు దాదాపు 2 లక్షల మంది మదుపరుల ఖాతాల్లోని షేర్లు, నగదు మళ్లించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాంకు ఫిర్యాదుతో నమోదైన కేసుల్ని దర్యాప్తు చేస్తున్నామని, అంగీకరించిన మదుపరులను ఈ కేసుల్లో సాక్షులుగా చేరుస్తామని సీసీఎస్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. -
పోలీసుల అదుపులో కార్వీ పార్ధ సారధి