పేదల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటం
- వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి ధ్వజం
- ఆరోగ్యశ్రీపై నిర్లక్ష్యానికి నిరసనగా 9న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ అమలుపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నెల9న అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేపడుతున్నట్లు వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి తెలిపారు. పేదలకు వైద్యం అందిస్తున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు..
పేద ప్రజలకు కార్పోరేట్ వైద్యం అందాలని వైఎస్సార్ చేపట్టిన ఆరోగ్యశ్రీని చంద్రబాబు ప్రభుత్వం నీరుగారుస్తోందని పార్థసారథి మండిపడ్డారు. పేదల వైద్య పథకం ఆరోగ్యశ్రీలో కూడా ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందన్నారు. రోగులకు చేసే దాదాపు 60 రకాల పరీక్షలను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించి అవసరం లేకపోయినా ఆ పరీక్షలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీకి సంవత్సరానికి దాదాపు రూ.వెయ్యి కోట్లు కేటారుుంచాల్సిన అవసరం ఉందని తీర్మానం చేసినా కేవలం రూ. 520 కోట్లు కేటారుుంచా రని, అయినా.. ఆ సొమ్ము విడుదల చేయకుండా ఆసుపత్రుల యాజమాన్యాన్ని, రోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీకి నిధులు విడుదల చేయాలని ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాసే వరకు ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. ఈ నెల 3న వైఎస్ జగన్.. ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖతో ప్రభుత్వం రూ. 575 కోట్లు కేటాయిస్తూ జీవో ఇచ్చిం దన్నారు. పేదల కోసం లేఖ రాసి ప్రభుత్వంలో చలనం తీసుకువచ్చి నిధులు విడుదల చేరుుంచినందుకు వైఎస్ జగన్‌కు పార్థసారథి ధన్యవాదాలు తెలిపారు.
చంద్రబాబు చేతగాని తనం..
ముఖ్యమంత్రి చంద్రబాబు చేతగానితనంతో కృష్ణా జలాల మీద హక్కులు కోల్పోవడం వాస్తవం కాదా అని పార్థసారథి ప్రశ్నించారు. ప్రస్తుతం కృష్ణా డెల్టా ఎదుర్కొంటున్న సమస్యలకు టీడీపీ కారణమన్నారు. వాస్తవాలు తప్పుదోవపట్టిస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై పిచ్చిగా మాట్లాడితే ప్రజలే దేవినేని ఉమను చెప్పు తీసుకొని కొడతారని హెచ్చరించారు.