వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి వివేకానందరెడ్డి మరణంపై మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు దారుణమని ఆ పార్టీ నాయకులు పార్థసారథి అన్నారు. సోమవారం విజయవాడలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ వివేకానందరెడ్డి మరణంతో తాము బాధలో ఉంటే.. సీఎం చంద్రబాబు నాయుడు వెటకారపు నవ్వులతో మాట్లాడారని గుర్తు చేశారు. చంద్రబాబుది నీచ మనస్తత్వం అని ఆయన విమర్శించారు.