సాక్షి, హైదరాబాద్: రబీ సీజన్‌కు సంబంధించిన రైతుబంధు చెక్కులను అక్టోబర్ మొదటి వారం లో రైతులకు పంపిణీ చేస్తామని వ్యవసాయ శాఖ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తెలిపింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి శనివారం లేఖ రాశారు.
రబీ సాగు అక్టోబర్ తొలి వారం నుం చి ప్రారంభమవుతున్నందున చెక్కుల పంపిణీ కూడా అప్పట్నుంచే ప్రారంభించాలని నిర్ణయిం చినట్లు ఆయన పేర్కొన్నారు. రైతుబంధు పథకం ఇంతకుముందు నుంచీ కొనసాగుతున్న కార్యక్రమం కాబట్టి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ పెట్టుబడి చెక్కులు పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర బడ్జెట్లో రైతుబంధు కోసం రూ.12 వేల కోట్లను కేటా యించినట్లు తెలిపారు. అక్టోబర్ 2 నుంచి క్రిషి కల్యాణ్ అభియాన్ పథకాన్ని కూడా అమలు చేస్తామని మరో లేఖలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment