సాక్షి, హైదరాబాద్: రైతుబంధు చెక్కుల పం పిణీ వాయిదా పడింది. ఈ విషయాన్ని వ్యవసాయశాఖ వర్గాలు ధ్రువీకరించాయి. నెలాఖరు లేదా వచ్చేనెల మొదటివారానికి వాయి దా పడొచ్చని వ్యవసాయ ఉన్నతస్థాయి వర్గా లు చెబుతున్నాయి. వాస్తవానికి ఈ నెల 19 లేదా 20వ తేదీల్లో చెక్కుల పంపిణీ ప్రారంభం కావాలి.
ఈ మేరకు మొదటి విడత చెక్కులపై 19వ తేదీని ముద్రించాయి. అయితే, చెక్కుల పంపిణీ వాయిదాపై ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి సమాచారం రాలేదని, తదుపరి తేదీపై సీఎం కార్యాలయం నుంచి ఎటువంటి సమాచారం రాలేదంటున్నారు.
పాసుబుక్‌ల ముద్రణ పూర్తికాకపోవడమే..
ఈ ఖరీఫ్ నుంచి రైతుబంధు పథకం కింద అన్నదాతలకు ఎకరానికి రూ.4 వేల చొప్పున ఇవ్వాలని సర్కారు నిర్ణయించిన సంగతి విదితమే. ఈ మేరకు రూ.6 వేల కోట్లకు వ్యవసాయశాఖ పరిపాలనా అనుమతిచ్చింది. గ్రామసభలో పెట్టుబడి చెక్కులను పంపిణీ చేయాలంటే రైతు కొత్త పట్టాదారు పాసు పుస్తకం చూపించాలి. లేదంటే కనీసం పాసు పుస్తకం మొదటి పేజీ ప్రింట్‌ను మండల రెవెన్యూ అధికారులు అందజేయాలి.
అయితే, కొత్త పాసు పుస్తకాలు ఎక్కడా ఇవ్వకపోవడం వల్ల రైతులందరికీ మొదటి పేజీ ప్రింట్‌లు ఇవ్వడం కష్టమైన పని. ఎందుకంటే రైతుఖాతాలు దాదాపు 60 లక్షలుంటే, అంత సంఖ్యలో ప్రింట్‌లివ్వడం అసాధ్యం. పాసుపుస్తకాల ముద్రణ, పంపిణీ ఆల స్యమవుతుందని భావించి రెండింటిని కలిపి పంపిణీ చేయడమే మేలని ప్రభుత్వం భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment