Checks distribution program
-
డయేరియా బాధితులకు అండగా YSRCP
-
గుర్ల బాధిత కుటుంబాలకు అండగా వైఎస్సార్సీపీ.. చెక్కులు అందజేత
సాక్షి, విజయనగరం: ఏపీలో కూటమి ప్రభుత్వ నేతల్లో ప్రజల పట్ల బాధ్యత లేదన్నారు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. చంద్రబాబు సర్కార్ డయేరియా బాధితులను పట్టించుకోలేదన్నారు. డయేరియా మరణాలు ఎంతో బాధాకరమని చెప్పారు.విజయనగరంలోని గుర్ల మండలంలో డయేరియాతో మృతి చెందిన 13 కుటుంబాలకు వైఎస్సార్సీపీ తరఫున ఒక్కొక్కరికి రెండు లక్షలు ఆర్ధిక సాయం అందించారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ..‘డయేరియాతో మరణించడం బాధాకరం. అసెంబ్లీలో ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా సమాధానం చెప్పింది. ప్రభుత్వాన్ని ఎన్ని అడిగినా వాళ్లు సక్రమంగా సమాధానం చెప్పలేదు. సీఎం చంద్రబాబు.. ఎనిమిది మంది అని, డిప్యూటీ సీఎం పది మంది మృతి చెందారని చెప్పారు. ప్రభుత్వం ఒక్కరే అని చెప్పిందని మండిపడ్డారు.గతంలో నేను ఎప్పుడూ విజయనగరంలో ఇంత మంది డయేరియాతో చనిపోవడం చూడలేదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్లు బాధ్యతగా వ్యవహరించడం లేదు. డయేరియా బాధితుల విషయంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ వెంటనే స్పందించారు. ప్రజల పట్ల బాధ్యత వహించారు. బాధితులకు అండగా నిలిచారు. వైఎస్సార్సీపీ తరఫున ఒక్కో కుటుంబానికి రెండు లక్షలు ఆర్ధిక సాయం అందించారు. గుర్ల మండలానికి మేము వచ్చి చూసే వరకు ప్రభుత్వం బాధితులను పట్టించుకోలేదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
మహిళలకు అండగా వైఎస్సార్ ఆసరా
-
ఆత్మకూరులో వైఎస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ
-
చంద్రబాబును నమ్మితే నట్టేటా మునిగినట్టే..
-
బీజేపీ-టిఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం
-
ఆత్మహత్యలు చేసుకున్న.. రైతు కుటుంబాలకు చెక్కుల పంపిణీ
సాక్షి, అమరావతి: ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కాకుండా గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు సైతం ఆర్థిక సాయం ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న 2014 నుంచి 2019 మే వరకు ఆత్మహత్యలు చేసుకున్న 417 మంది రైతు కుటుంబాలకు రూ.5.లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించే కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. వ్యవసాయ శాఖ అందించిన జాబితా ప్రకారం ఆయా జిల్లాల కలెక్టర్లు ఈ చెక్కులు పంపిణీ చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూ.7 లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లిస్తానని మాట ఇచ్చారు. దాని ప్రకారం 210 మంది కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున సాయం అందిస్తున్నారు. బలవన్మరణాలకు పాల్పడ్డ రైతు కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.వంద కోట్లు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల రూ.35.55 కోట్లను విడుదల చేసింది. సంక్షేమ పథకాలతో తగ్గనున్న ఆత్మహత్యలు వైఎస్ జగన్ సర్కారు ప్రవేశపెట్టిన వైఎస్సార్ రైతు భరోసా, పంటల ఉచిత బీమా, ధరల స్థిరీకరణ నిధి వంటి సంక్షేమ పథకాలతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగి ఆత్మహత్యలు తగ్గవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అభిప్రాయపడ్డారు. రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని, ఇప్పటికే దాని ఫలితాలు కనిపిస్తున్నాయని ‘సాక్షి’కి వివరించారు. రైతుభరోసా పథకం రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచిందన్నారు. ఇంకా అర్హత ఉన్న బాధిత కేసులు ఏమైనా ఉంటే వారికీ సాయం అందిస్తామని చెప్పారు. -
కళ్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
-
చేనేతల పెద్ద కొడుకు!
విశ్వసనీయత.. విలువలతో కూడిన రాజకీయం.. ఇచ్చిన మాటకు కట్టుబడటం.. వైఎస్ జగన్మోహన్రెడ్డి నైజం ఇది. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికార పీఠంపై కూర్చున్నా.. ఆయన ప్రజల మనిషే. జనం సమస్యలపై స్పందించే తీరు కూడా అలాగే ఉంటుంది. ఎవరైనా కష్టాలు చెబితే చలించిపోతారు. బాధితులకు ఆప్తుడై ఆపన్న హస్తం అందిస్తారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపిన ఆయన.. తాజాగా ఇంటిపెద్దను కోల్పోయిన చేనేత కుటుంబాలకు అండగా నిలిచారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆత్మహత్య చేసుకున్న ఒక్కో చేనేత కుటుంబానికి రూ.5 లక్షల సాయం మంజూరు చేశారు. అనంతపురం, ధర్మవరం టౌన్: గత టీడీపీ పాలకులు పట్టించుకోక.. కుటుంబాన్ని పోషించే దారి తెలీక.. దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం విడుదల చేశారు. ధర్మవరం పట్టణంలో మొత్తం 52 మంది చేనేత కుటుంబాలకు మంజూరైన చెక్కులను బుధవారం స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పంపిణీ చేయనున్నారు. చేనేతలను విస్మరించిన చంద్రబాబు ధర్మవరం.. పట్టుచీరకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఇక్కడి నేతల పనితనం అంతర్జాతీయంగా వినుతికెక్కింది. వారిని మరింతగా ప్రోత్సహించాల్సిన గత టీడీపీ పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు దక్కించుకున్న నేతన్నలు పస్తులుండాల్సిన పరిస్థితి తలెత్తింది. రోజంతా మగ్గంపై పనిచేసినా పొట్టనిండని పరిస్థితుల్లో చేనేతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా గిట్టుబాటు ధరలు లేక, ప్రభుత్వ తోడ్పాటు లేక దాదాపు 60 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం వాటిని ఆత్మహత్యలుగా గుర్తించకుండా తాత్సారం చేసింది. ఒకరిద్దరికి పరిహారం మంజూరు చేసి చేతులు దులుపుకుంది. ఈ నేపథ్యంలో అప్పటి ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ జగన్మోహనరెడ్డి 2018 జనవరి 6, 7, 8వ తేదీల్లో ధర్మవరం పట్టణంలో పర్యటించి బాధిత కుటంబాలను పరామర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందరినీ ఆదుకుంటామని ఆనాడు చేనేతలకు మాట ఇచ్చారు. చేనేతల కోసం జోలె పట్టిన కేతిరెడ్డి చేనేతల కష్టాలను చూసి చలించిన కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాల కోసం రాజీలేని పోరాటం చేశారు. చేనేతలకు సాయం అందించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని కోరారు. అయినా చంద్రబాబు సర్కార్ పట్టించుకోకపోవడంతో చేనేతలకు అండగా నిలిచారు. కుటుంబ పెద్దదిక్కును కోల్పోయిన చేనేత కుటుంబాలను ఆదుకునేందుకు 2018 నవంబర్ 19, 20వ తేదీల్లో పట్టణంలో జోలెపట్టి చేనేతల కోసం యాచించారు. కేతిరెడ్డి పిలుపుకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. చిన్న, పెద్దా, వ్యాపారులు, రైతులు, ప్రజలు తమవంతు సాయంగా అందించారు. భిక్షాటన ద్వారా వచ్చిన మొత్తాన్ని 37 మంది చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి రూ.65 వేలు చొప్పున అందజేశారు. మరోవైపు ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ధర్మవరం పట్టణంలో చేనేత ఓదార్పు యాత్ర నిర్వహించి బాధిత కుటుంబాలకు సాయం అందించి భరోసానిచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత ఆత్మహత్యల బాధిత కుటుంబాలకు సాయం అందిస్తానని వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ‘నేతన్న నేస్తం’ సభలో హామీ..ఆ వెంటనే మంజూరు ఈ నెల 21న ‘నేతన్న నేస్తం’ పథకం ప్రారంభించేందుకు ధర్మవరం వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలకు పరిహారం అందజేస్తామని సభాముఖంగా ప్రకటించారు. ఎవరూ అధైర్య పడవద్దని.. అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇంటి తలుపుతట్టి పరిహారం అందజేస్తామని భరోసానిచ్చారు. సభ ముగియగానే నిధులు మంజూరు చేశారు. నేడు చెక్కులను అందజేయనున్న ఎమ్మెల్యే ఆత్మహత్య చేసుకున్న 52 మంది చేనేత కుటుంబాలకు మంజూరైన మొత్తాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అందజేయనున్నారు. నేరుగా బాధిత చేనేతల కుటుంబాల వద్దకే వెళ్లి చెక్కులు వారికి ఇవ్వనున్నారు. చేనేతలకు అండగా నిలుస్తూ వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వివిధ చేనేత సంఘాలు, కార్మికులు స్వాగతిస్తున్నాయి. ఇచ్చిన హామీని అనతికాలంలోనే నిలబెట్టుకున్న సీఎం జగన్మోహన్రెడ్డి తీరును అందరూ కొనియాడుతున్నారు. తలుపుతట్టి సాయం చేస్తా చేనేతలు ఆత్మహత్యలు చేసుకుంటే గత టీడీపీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. బాధిత కుటుంబాలకు నయాపైసా ఇవ్వకుండా మోసం చేసింది. ఆ కుటుంబాలను ఆదుకునేందుకు మీ సోదరుడున్నాడని మరవకండి. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున మీ ఇంటికి వచ్చి తలుపుతట్టి నేరుగా చెక్కును అందజేయబోతున్నాం.- ఈ నెల 21న ధర్మవరం ‘నేతన్న నేస్తం’ సభలో సీఎం జగన్మోహన్రెడ్డి -
‘చంద్రబాబు ఏనాడు ఆలోచించలేదు’
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని చూసి టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సిగ్గుపడాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర్ నారాయణ మండిపడ్డారు. గురువారం జిల్లాలోని అంబేద్కర్ భవన్లో అగ్రిగోల్డ్ బాధితులకు ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి మంత్రి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మానవతా దృక్పథంతో స్పందించి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేశారని అన్నారు. 40 సంవత్సరాల పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు.. ఏనాడూ అగ్రిగోల్డ్ బాధితుల గురించి ఆలోచించలేదని విమర్శించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసేందుకు చంద్రబాబు శతవిధాల కుట్ర చేశారని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితుల అకౌంట్లలోకి నేరుగా డబ్బు జమ చేస్తున్నామని అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ వివరించారు. ఏపీ వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితుల కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.1150 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. అనంతపురం జిల్లాకు రూ.20.65 కోట్లు వచ్చిందని.. 24000 మంది అగ్రిగోల్డ్ బాధితుల అకౌంట్లలో వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అనంతవెంకట్రామిరెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, ఎంపీ గోరంట్ల మాధవ్ పాల్గొన్నారు. -
వైఎస్సార్ రైతు భరోసా నేడు ప్రారంభం
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్’ పథకాన్ని నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి నెల్లూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం అక్కడి బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతులు, కౌలుదారుల కుటుంబాల పేరిట బ్యాంకు అకౌంట్లలో నేరుగా పెట్టుబడి సాయాన్ని మంగళవారం జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 40 లక్షల మంది రైతులు, కౌలు రైతుల కుటుంబాలు ఇందుకు అర్హమైనవిగా అధికారులు తేల్చారు. సరళీకరించిన నిబంధనల ప్రకారం మరో 14 లక్షల మంది వరకు లబ్ధిదారుల జాబితాలో చేరే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఈ పథకం కింద చెక్కులు పంపిణీ చేస్తారు. ► ‘వైఎస్సార్ రైతు భరోసా’ ప్రకటించిన తేదీ, ప్రాంతం: జులై 8వ తేదీ 2017 – గుంటూరు (పార్టీ ప్లీనరీలో) ► తొలుత అర్హత : ఐదు ఎకరాలలోపు సన్న, చిన్నకారు రైతులు ► తర్వాత మారిన అర్హత : అన్నదాతలందరికీ వర్తింపు ► తొలుత ప్రకటించిన సాయం : ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50,000 ► తాజాగా ప్రకటించిన సాయం : ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలలో రూ.67,500 ► జగన్ ప్లీనరీలో ప్రకటన తర్వాత ఇదే తరహా పథకాన్ని (రైతు బంధు) అమలు చేసిన రాష్ట్రం : తెలంగాణ ► కేంద్రం ఇటీవల అమల్లోకి తెచ్చిన పథకం : పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి సాక్షి ప్రతినిధి, నెల్లూరు : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం కాకుటూరు గ్రామంలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగే రైతుభరోసా ప్రారంభోత్సవ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ శాఖలకు చెందిన స్టాళ్లను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 11 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. స్టాళ్లను పరిశీలించిన తర్వాత రైతుభరోసా చెక్కులు పంపిణీ చేసి అన్నదాతలతో మాట్లాడతారు. సభ ముగిశాక రేణిగుంట చేరుకుని విమానంలో గన్నవరం వెళ్తారు. -
చెక్కు తీసుకోండి.. ఓట్లేయండి!
ఎన్నికల్లో ఓటర్లకు అభ్యర్థులు డబ్బులివ్వడం మామూలే. ఓటర్లకు డబ్బులు పంచడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం కాబట్టి, బయటకు పొక్కితే అభ్యర్థికి ఇబ్బందులొస్తాయి కాబట్టి మూడో కంటికి తెలియకుండా సొమ్ములిస్తుంటారు. అయితే, పశ్చిమబెంగాల్లో తృణమూల్ పార్టీకి చెందిన నాయకుడొకరు ఏకంగా ఓటర్లకు (రైతులకు) చెక్కులు పంపిణీ చేశారు. దాదాపు వంద మందికి రూ.2 వేలు, రూ.5 వేల చెక్కులు ఇచ్చారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఓ పంచాయతీ ప్రధాన్ (సర్పంచ్) మదసుర్ హుస్సేన్ ఇలా చెక్కులు పంచుతూ దొరికిపోయారు. అయినా ఆయనేం భయపడలేదు. చెక్కులిస్తే తప్పేమిటని ఎదురు నిలదీశారు. ‘అవును మేం చెక్కులు ఇచ్చాం. అయితే ఏంటి.. చెక్కులిచ్చాం కాబట్టి లోక్‌సభ ఎన్నికల్లో మా పార్టీకి ఓటేయమని అడుగుతాం. చెక్కు తీసుకున్నారు కాబట్టి వారు తప్పకుండా మాకే ఓటేసి తీరుతారు. ఇందులో తప్పేముంది?’ అని ప్రశ్నించారాయన. అంతేకాకుండా ఆ చెక్కులు దీదీ (మమతా బెనర్జీ) ఇచ్చారని కూడా చెబుతున్నారు. మొత్తం 600 మంది రైతులకు చెక్కులు ఇవ్వనున్నట్టు తెలిపారు. చెక్కులిచ్చి ఓట్లు అడగడంతో ఊరుకోకుండా.. ‘ఈ చెక్కులు దీదీ ఇచ్చిందన్న సంగతి గుర్తుంచుకోండి. చెక్కుకు బదులుగా మీరు మీ ఓటు మాకివ్వాలి. ఒకవేళ చెక్కు తీసుకుని ఓటేయకపోతే మీపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెబుతున్నా.. మీ ఓటరు కార్డు నకళ్లు మా దగ్గరున్నాయన్న సంగతి మరిచిపోవద్దు’ అంటూ బహిరంగంగానే బెదిరిస్తున్నారు. తమ పార్టీకి ఓటెయ్యకపోతే ప్రభుత్వ పథకాల కింద రైతుకు రావలసిన రూ.2 లక్షలు రాకుండా చేస్తామని కూడా హుస్సేన్ హెచ్చరిస్తున్నారు. -
అన్నీ ఉత్తుత్తి హామీలే..!
సాక్షి, ఆచంట (పశ్చిమ గోదావరి): రేషన్ డీలర్లు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. హామీలు అమలు చేస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు గాలికి వదిలి వేయడంతో వారు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. కమీషన్ పెంపు, నగదు ప్రోత్సాహకాలు, డిమాండ్ల పరిష్కారానికి ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో డీలర్లు ఆందోళన చెందుతున్నారు. చాలీచాలనీ కమీషన్‌తో కుటుంబాలను భారంగా నెట్టుకొస్తున్న రేషన్ డీలర్లకు ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హామీలు అమలు చేయకపోతే రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. హామీలు గాలికొదిలేసిన ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 2186 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఆయా దుకాణాల ద్వారా బియ్యం, చక్కెర, కందిపప్పు, రాగులు, జొన్నలు వంటి నిత్యవసరాల పంపిణీ జరుగుతోంది. రేషన్ దుకాణాలలో ఈ పోస్ యంత్రాలు ప్రవేశపెట్టడంతో రేషన్ పంపిణీలో పారదర్శకత ఏర్పడింది. నాటి నుంచి డీలర్లు వేతనాలు అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. గత ఏడాది డిసెంబరులో రేషన్ డీలర్ల జేఏసీ 11 డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచింది. అనేక తర్జన భర్జనల అనంతరం వీటిలో ఐదు డిమాండ్లు నెరవేర్చడానికి రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అంగీకరించారు. వాటిలో రేషన్ సరుకులు ఆయా దుకాణాలకు చేర్చే క్రమంలో హమాలీల ఖర్చులు ప్రభుత్వమే భరించడానికి, డీలరు ఆకస్మికంగా చనిపోతే వారి కుటుంబాల వారికి మట్టి ఖర్చుల నిమిత్తం రూ.20 వేలు చెల్లించడానికి అంగీకరించింది. చంద్రన్న బీమాలో రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లింపునకు, రేషన్ దుకాణాలకు విద్యుత్ సరఫరా, ఇంటి పన్నులు జనరల్ కేటగిరీలోనే ఉంచే విధంగా చర్యలు తీసుకుంటామని హామీలు ఇచ్చింది. ఆయా హామీలను జనవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయానా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పడంతో ఆశలు పెట్టుకున్న డీలర్లకు రోజులు గడుసున్న కొద్దీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేక జీవోలు విడుదల కాకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమలుకు నోచుకోని కమీషన్ పెంపు జీవో డీలర్ల డిమాండ్లలో వేతనం అమలు ప్రధానమైంది. అయితే ఇది ఇప్పటికిప్పుడు అమలు సాధ్యం కాదని దీనిపై అధ్యయానికి ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక వచ్చే సరికి పుణ్యకాలం గడిచిపోతుందన్న డీలర్ల వేదనతో స్పందించిన ప్రభుత్వం ప్రస్తుతం క్వింటాలుకు ఇస్తున్న కమీషన్ రూ.70 కు అందనంగా మరో 30 రూపాయలు పెంచుతామని హామీ ఇచ్చింది. ఫిబ్రవరి రెండవ వారంలో ఈమేరకు ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. కానీ నేటి వరకూ అది అమలుకు నోచుకోలేదు. విడుదల చేసిన జీవో కూడా అస్పష్టంగా ఉందని, ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందో జీవోలో పొందుపర్చకపోవడాన్ని డీలర్లు దుయ్యబడుతున్నారు. కంటి తుడుపు చర్యలో భాగంగానే జీవో జారీ చేశారని డీలర్లు వాపోతున్నారు. చెల్లుబాటు కాని చెక్కులు రేషన్ డీలర్ల పనితీరు.. పంపిణీ సంతృప్తికరంగా ఉంటే నగదు పోత్సాహకాలు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. 85 శాతం సరుకులు పంపిణీ చేసిన డీలరుకు రూ.2 వేలు నగదు ప్రోత్సాహకంగా ఇస్తామని ప్రకటించింది. నగదుకు జనవరిలో జిల్లా వ్యాప్తంగా 461 మంది డీలర్లు ఎంపికయ్యారు. గత నెలలో తూతూ మంత్రంగా ఓ 50 మంది డీలర్లకు చెక్కులు పంపిణీ చేసి చేతులు దులుపుకుంది. ఫిబ్రవరి నెలకు సంబంధించి ఆ ఊసే లేదు. ప్రోత్సాహక చెక్కులు పట్టుకుని బ్యాంకులకు వెళ్లిన డీలర్లకు చుక్కెదురైంది. బ్యాంకులో జమ చేసిన డీలర్ల చేతికి నేటికీ సొమ్ములు చేతికందలేదు. ఆరా తీస్తే ఖజానాలో సొమ్ములు లేవంటూ అధికారులు చెప్పుకొస్తున్నారని డీలర్లు వాపోతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వం తాజాగా రేషన్ పంపిణీ శాతం 85 నుంచి 90 శాతం ఉంటే రూ.5 వేలు నగదు ప్రోత్సాహకం ఇస్తామంటూ మరో ప్రకటన చేయడాన్ని డీలర్లు ఆక్షేపిస్తున్నారు. ఇచ్చిన చెక్కులకు దిక్కులేదు మరో ఐదు వేలా అంటూ నిట్టూరుస్తున్నారు. గంపెడాశతో అమరావతి వెళ్లి ముఖ్యమంత్రిని సన్మానించిన డీలర్లకు చివరికు మొండి చేయి చూపడంపై డీలర్లు మండిపడుతున్నారు. ఈ ప్రభుత్వం డీలర్లను నమ్మక ద్రోహం చేసిందని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే రాబోయే సార్వత్రిక ఎన్నికలలో తగిన గుణపాఠం తప్పదనే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలి ప్రభుత్వం డీలర్ల సమస్యల పరిష్కారానికి హామీలు ఇచ్చింది. ఎన్నికలు సమీపిస్తున్నా హామీలు నెరవేరకపోవడంతో డీలర్లు ఆందోళనతో ఉన్నారు. ప్రభుత్వం కమీషన్ పెంచుతూ జారీ చేసిన జీవో నేటికీ అమలు కాలేదు. మరో నాలుగు డిమాండ్ల పెంపునకు అంగీకరించి నేటికీ జీవో జారీ చేయలేదు. తక్షణమే ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. – రాజులపాటి గంగాధరావు, రేషన్ డీలర్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు -
పింఛన్‌పై వంచన
టీడీపీ ప్రభుత్వం చేపట్టిన పసుపు, కుంకుమ పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఎన్నికల ప్రచారాన్ని తలపించింది. లబ్ధిదారులకు చెక్కులు, పింఛన్లు పంపిణీ చేసే సమయంలో టీడీపీ నేతలు ఈసారి ఓటు ఎవరికి వేస్తావు? అంటూ ప్రశ్నించడం కనిపించింది. టీడీపీకి వేస్తానంటే ఓకే.. తటపటాయిస్తే ఒత్తిడి తేవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. జిల్లా ఉన్నతాధికారులు కూడా టీడీపీ కార్యకర్తల్లా పనిచేయడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రచార ఆర్భాటాల కోసం ప్రజాధనానికి తూట్లుపొడవడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. సాక్షి, తిరుపతి: ఎన్నికలు సమీపిస్తుండడంతో ఓట్ల కోసం టీడీపీ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. పసుపు, కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలకు పోస్ట్‌డేటెడ్ చెక్కులు, వృద్ధులు, వికలాంగులకు పెంచిన పింఛన్లను శనివారం పంపిణీ చేసింది. సాధారణంగా పింఛన్లను అధికారులే లబ్ధిదారులకు పంపిణీ చేసేవారు. శనివారం చేపట్టిన కార్యక్రమాన్ని అందుకు భిన్నంగా ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పంచాయతీలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఏర్పాటు చేసిన వేదికలను పూర్తిగా పార్టీ జెండాలు, పసుపు బ్యానర్లు, పార్టీ నాయకుల ఫ్లెక్సీలతో నింపేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వారి బంధువులు, లబ్ధిదారులందర్నీ పసుపురంగు దుస్తులతో కార్యక్రమానికి హాజరు కావాలని హుకుం జారీచేశారు. తప్పని పరిస్థితుల్లో అనేకమంది పసుపు రంగు దస్తులతో రావడం కనిపించింది. పెన్షన్‌దారులు, డ్వాక్రా సభ్యులకు చేతిలో డబ్బు, చెక్కులతో పాటు పార్టీ ప్రచార పత్రాన్ని పెట్టి టీడీపీకి ఓటెయ్యండి అని అడగడం కనిపించింది. చంద్రబాబు గురించి చెప్పిందే చెప్పి లబ్ధిదారులను ఉక్కిరిబిక్కిరి చేశారు. లబ్ధిదారులకు తిప్పలు వృద్ధులు, వితంతువులు, మహిళలపై టీడీపీ నేతలు దౌర్జన్యం, దబాయింపుల తీరు స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. పింఛన్లు, చెక్కుల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు, వృద్ధులకు టీడీపీ నాయకులు, అధికారులు చుక్కలు చూపించారు. లబ్ధిదారులను ఉదయం 9 గంటలకు రమ్మని చెప్పి టీడీపీ నేతలు ఆలస్యంగా రావడం కనిపించింది. దాదాపు జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన కార్యక్రమాలు అన్నీ ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. అధికార పార్టీ నేతలు రాకపోవడంతో సభలను సకాలంలో నిర్వహించలేదు. వృద్ధులు, వికలాంగులు, చంటి బిడ్డల తల్లులు గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో వృద్ధులకు కుర్చీలు లేకపోవడంతో నిలబడే కనిపించారు. తిరుపతిలో జరిగిన కార్యక్రమాలు సాయంత్రం వరకు సాగాయి. అనేక చోట్ల లబ్ధిదారులు సాయంత్రం వరకు అక్కడే ఉన్నా పట్టించుకునేవారు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదిలాఉంటే టీడీపీ నేతలు పోటీపడి ఒకరు డబ్బులు, మరొకరు పెన్షన్ బుక్కు, ఇంకొకరు స్వీటు, ప్రచార పత్రాలను పంచారు. కార్పొరేషన్ ఉద్యోగులను పక్కకు నెట్టి టీడీపీ నేతలు పంపిణీ చేపట్టడంతో చేసేదిలేక ఉద్యోగులు మిన్న కుండిపోయారు. జిల్లాలో అనేక ప్రాం తాల్లో లబ్ధిదారులు ఆకలితో అలమటిం చాల్సి వచ్చింది. కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభం కావడం, టీడీపీ నేతలు చెప్పిందే చెప్పి సమయాన్ని వృథా చేయడం వచ్చినవారి సహనాన్ని పరీక్షించింది. కార్యక్రమం ఆలస్యం అవుతుందని తెలిసి కూడా లబ్ధిదారులకు కొన్ని ప్రాంతాల్లో భోజనాలు ఏర్పాటు చేయకపోవడంతో వృద్ధులు, వికలాంగులు ఆకలితో అలమటించారు. సాయంత్రం వరకు కడుపు మాడ్చుకుని వేచి ఉన్నా కొందరికి చెక్కులు, పింఛన్లు ఇవ్వకుండా మరుసటి రోజు రండి అని చెప్పి తిప్పి పంపడం గమనార్హం. పింఛన్ పాట్లు ఎన్నో బంగారుపాళ్యం మండలంలో జరిగిన పసుపు, కుంకుమ చెక్కుల పంపిణీలో ఎంపీపీ, ఏపీఎం, సంఘమిత్రలు వివాదాస్పద వాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ సానుభూతి గ్రూప్ సభ్యులకు చెక్కులు, పింఛన్లు నిలిపివేయమని ఆదేశించారు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన పసుపు, కుంకుమ పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే చెవిరెడ్డిని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో నిర్వహించే కార్యక్రమానికి హాజరయ్యేవారందరికీ పింఛన్లు, చెక్కులు ఇస్తామని చెప్పి టీడీపీ నాయకులు పిలి పించుకున్నారు. సమావేశం అయ్యాక కొందరికి మాత్రం ఇచ్చి మిగిలిన వారిని తిప్పి పంపేశారు. పాలసముద్రం మండలంలో పింఛన్‌దారుల వద్ద వేలిముద్రలు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా వెనక్కు పంపించారు. పెనుమూరు, కార్వేటినగరం మండలాల్లో పింఛన్ల కోసం వచ్చిన లబ్ధిదారులకు భోజనాలు లేకపోవడంతో ఆకలితో అలమటించాల్సి వచ్చింది. చంద్రగిరి, పీలేరు, చిత్తూరు నియోజకవర్గాల్లో కార్యక్రమానికి హాజరైన వారంతా పస్తులతో అలమటించారు. మదనపల్లెలో భోజనాలు వడ్డించేవారు లేక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలమనేరు నియోకవర్గంలో మాత్రం లబ్ధిదారులకు బిర్యానీ అన్నం, కోడిగుడ్లు పెట్టారు. కుప్పంలో వృద్ధులు, మహిళలు గంటల తరబడి నిరీక్షించి వెనుదిరిగి వెళ్లారు. మరికొందరు చాలీచాలని భోజనాలతో తిప్పలు పడ్డారు. -
రైతుబంధు నగదు జమపై తకరారు
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు పథకం కింద చెక్కులు పంపిణీ చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బును ఎలా జమ చేయాలనే దానిపై వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. శనివారం ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసార«థి, కమిషనర్ రాహుల్ బొజ్జా పలు బ్యాంకుల అధికారులతో సమావేశమయ్యారు. దాదాపు 50 లక్షల మంది రైతులు యాసంగి పెట్టుబడికి అర్హులు కానున్నారు. అయితే వీరందరి బ్యాంకు ఖాతాలు వ్యవసాయ శాఖ దగ్గర లేవు. కాకపోతే రైతు సమగ్ర సర్వేలో, ధరణి వెబ్సైట్ ఆధారంగా 50 శాతానికిపైగా రైతుల బ్యాంకు ఖాతాలున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఇవి సరైనవేనా అనేది తెలియదు. ప్రతి గ్రామ రైతు బంధు లబ్ధిదారుల వివరాలు వ్యవసాయ విస్తరణ అధికారులకు రెవెన్యూ సిబ్బంది అందించనున్నారు. ధరణికి అందుబాటులో ఉన్న రైతుల అకౌంట్ నం బర్లు కూడా అందులో ఉంచనున్నారు. ఏఈవోలు ప్రతి రైతును సంప్రదించి అకౌంట్ నంబర్ సరైందో కాదో నిర్ధారించుకొని, లబ్ధిదారుడైన రైతు బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకోని వాటిని రాష్ట్ర వ్యవసాయ శాఖకు పంపేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. నేరుగా రైతుల అకౌంట్లో జమ చేస్తే సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధికారులతో పాటు బ్యాంకర్లు పేర్కొంటున్నారు. రైతు ఖాతాకు నగదు చేరకుండా మళ్లీ వెనక్కి వస్తే ఏ రైతుకు రైతుబంధు అందలేదో గుర్తించడం సాధ్యం కాదని బ్యాంకు అధికారులు వెల్లడించినట్లు తెలిసింది. -
నేటినుంచి రైతుబంధు చెక్కులు
సాక్షి, హైదరాబాద్: యాసంగి రైతుబంధు చెక్కుల పంపిణీకి సర్వం సిద్ధమైంది. శుక్రవారం నుంచే వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల వ్యవసాయాధికారులు గ్రామ సభల్లో చెక్కులను అందించనున్నా రు. ఇప్పటికే 11 లక్షల చెక్కులను బ్యాంకులు ము ద్రించగా వ్యవసాయశాఖ వాటిని పరిశీలించుకుని పంపింది. ఈనెల 5 నుంచే చెక్కులు పంపిణీ చేయా లని నిర్ణయించామన్నారు. శుక్రవారం కనీసం పది జిల్లాల్లో కార్యక్రమం ప్రారంభమయ్యేలా సన్నాహా లు చేస్తున్నామని వ్యవసాయ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ధరణి నుంచి వచ్చిన సమాచారం ప్రకారం మొత్తం 52.15 లక్షల మంది పట్టాదారులు ఉన్నారు. మొత్తంగా రూ.5, 511 కోట్లు యాసంగి పెట్టుబడి కింద ఇవ్వనున్నారు. చీరల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేయడంతో చెక్కుల పంపిణీపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. రైతుబంధు ఇప్పటికే కొనసాగుతున్న పథకమని, అక్టోబర్‌లో చెక్కులు ఇవ్వనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి కేంద్ర ఎన్నికల సంఘానికి, సీఈవో రజత్‌కుమార్‌కు సమాచారం ఇచ్చారు. -
రబీ ‘బంధు’కు రెడీ..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రైతాంగానికి శుభవార్త. మరో మూడు రోజుల్లో ‘రైతుబంధు’ రెండో విడత సాయం చేతికందనుంది. పంట పెట్టుబడి కింద ఏటా ఎకరాకు రూ.8వేల నగదు ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. రబీ సీజన్‌కు సంబంధించిన చెక్కులను 5వ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు చెక్కులను ముద్రించేందుకు సన్నాహాలు చేస్తోంది. రైతుబంధు పథకానికి మే నెలలో శ్రీకారం చుట్టిన సర్కారు.. ఖరీఫ్‌కు సంబంధించిన చెక్కులను అందజేసిన సంగతి తెలిసిందే. తాజాగా రబీ సీజన్ సాయాన్ని పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. జిల్లావ్యాప్తంగా తొలి విడతలో 2.87 లక్షల మందికి పెట్టుబడి ప్రోత్సాహకాన్ని అందించాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకోగా ఇందులో 2.42 లక్షల మందికి మాత్రమే పంపిణీ చేసింది. వివిధ కారణాలతో మిగతావారికి సంబంధించిన చెక్కులను పెండింగ్‌లో పెట్టింది. ఈ సారి మాత్రం దాదాపు 3లక్షల మంది రైతులకు చెక్కులు జారీ కానున్నాయని వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేస్తోంది. అభ్యంతరాలతో గతంలో పక్కనపెట్టిన భూములకు సంబంధించి కొత్తగా పట్టాదార్ పాస్‌పుస్తకాలను జారీ చేసినందున సుమారు 15వేల మంది రైతులు అదనంగా చేరినట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌లో రూ.283.28 కోట్లు పంపిణీ చేసిన యంత్రాంగం తాజాగా రూ.300 కోట్ల మేర రైతులకు అందజేయడానికి సన్నద్ధమవుతోంది. మండల కేంద్రాలతో షురూ.. రైతుబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా భావించిన సర్కారు.. పట్టాదార్పాస్పుస్తకాలు, చెక్కులను ఏకకాలంలో పంపిణీ చేసింది. దీంతోపాటు చెక్కుల్లో ముద్రణా లోపాలు తలెత్తకుండా జాగ్రత్తపడింది. ఈ మేరకు రైతుకిచ్చే ప్రతి చెక్కు(లీఫ్)ను సునిశితంగా పరిశీలించింది. ఈ మేరకు నిర్దేశిత బ్యాంకు ప్రధాన కార్యాలయాల్లో వ్యవసాయశాఖాధికారులను అందుబాటులో ఉంచింది. దీంతో నిర్ధిష్ట సమయానికి రైతుల చేతికి సాయం అందింది. ఈ సారి మాత్రం ఈ ఇబ్బందుల నుంచి అధికారులకు విముక్తి కలుగనుంది. ధరణి వెబ్సైట్ నుంచే సమాచారాన్ని సేకరిస్తుండడం.. గతంలో ఒకసారి తప్పులను సరిదిద్దినందున చెక్కులను పరిశీలించే అవకాశంలేకుండా పోయింది. దీంతో వ్యవసాయశాఖాధికారులకు చెక్కుల పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు జిల్లాలోని రైతుల చెక్కుల పంపిణీ సాధ్యపడదు గనుక.. మండల కేంద్రాల్లోని రైతులకు తొలుత చెక్కులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా మండల కేంద్రాల రైతుల చెక్కుల ముద్రణపై దృష్టి సారించింది. ఈ మేరకు వ్యవసాయశాఖకు కూడా సమాచారం అందజేసింది. మండల కేంద్రంలో మొదలుపెట్టి దశలవారీగా గ్రామాలకు విస్తరించాలని నిర్ణయించింది. -
అక్టోబర్ తొలివారంలోనే చెక్కుల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: రబీ సీజన్‌కు సంబంధించిన రైతుబంధు చెక్కులను అక్టోబర్ మొదటి వారం లో రైతులకు పంపిణీ చేస్తామని వ్యవసాయ శాఖ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తెలిపింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి శనివారం లేఖ రాశారు. రబీ సాగు అక్టోబర్ తొలి వారం నుం చి ప్రారంభమవుతున్నందున చెక్కుల పంపిణీ కూడా అప్పట్నుంచే ప్రారంభించాలని నిర్ణయిం చినట్లు ఆయన పేర్కొన్నారు. రైతుబంధు పథకం ఇంతకుముందు నుంచీ కొనసాగుతున్న కార్యక్రమం కాబట్టి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ పెట్టుబడి చెక్కులు పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర బడ్జెట్లో రైతుబంధు కోసం రూ.12 వేల కోట్లను కేటా యించినట్లు తెలిపారు. అక్టోబర్ 2 నుంచి క్రిషి కల్యాణ్ అభియాన్ పథకాన్ని కూడా అమలు చేస్తామని మరో లేఖలో తెలిపారు. -
చెక్కులు పంపిణీ చేసేదెవరో?
సాక్షి, హైదరాబాద్: రబీలో రైతుబంధు పెట్టుబడి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి రైతు సమన్వయ సమితులను దూరం పెట్టాలని వ్యవసాయశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రభుత్వం రద్దు కావడం, త్వరలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండనున్నందున రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆపద్ధర్మ మంత్రులు, రైతు సమితి సభ్యులు ఎవరూ చెక్కుల పంపిణీలో పాల్గొనడం సాధ్యంకాదని అధికారులు అంటున్నారు. రైతు సమన్వయ సమితి సభ్యులు, సమన్వయకర్తలను మంత్రులు నామినేట్ చేసినం దున వారు చెక్కుల పంపిణీలో పాల్గొనడం కోడ్ నిబంధనలకు విరుద్ధమని చెబుతున్నారు. అయితే దీనిపై ఎన్నికల కమిషన్‌ను వివరణ కోరాలని వ్యవసాయశాఖ వర్గాలు భావిస్తున్నాయి. గత ఖరీఫ్‌లో ప్రభుత్వం పెట్టుబడి చెక్కుల పంపిణీని పండుగలా నిర్వహించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు గ్రామసభల్లో హల్చల్ చేశారు. 1.60 లక్షల మంది ఉన్న రైతు సమితి సభ్యుల పాత్ర కీలకంగా ఉండింది. ఈసారి వారి భాగస్వామ్యం ఉండదు. అధికారులే అంతా... రబీలో పెట్టుబడి సొమ్ము పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. రైతులకు అందజేసేందుకు రూ.5,925 కోట్లకు జూలైలోనే పరిపాలనా అనుమతి కూడా ఇచ్చింది. నవంబర్‌లో పెట్టుబడి చెక్కులను అందజేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఇప్పటికే బ్యాంకులతో సమావేశమై చెక్కుల ముద్రణకు సర్కారు ఆదేశాలు ఇచ్చింది. వచ్చే నెలలోనే చెక్కుల ముద్రణ ప్రారంభం కానుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈసారి పెట్టుబడి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత సాదాసీదాగా నిర్వహించనున్నారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతు సమితి సభ్యులు పాల్గొనే అవకాశం లేకపోవడంతో కేవలం వ్యవసాయ, రెవెన్యూ అధికారులే ఈ తంతు పూర్తి చేస్తారు. గ్రామసభలోనే అందజేస్తారు. అయితే ఎన్నికల సమయంలో కీలకమైన ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలన్న ఆందోళన అధికారులను పట్టిపీడిస్తుంది. అసలు ఈసీ అంగీకరిస్తుందా? నవంబర్ నెల అంటే ప్రస్తుత అంచనా ప్రకారం ఎన్నికలకు సంబంధించిన హడావుడి నడుస్తుంటుంది. పైగా ఒకేసారి వేలాది కోట్లు రైతులకు చెక్కుల రూపేణా చెల్లించడంపై ఎన్నికల కమిషన్ ఏమంటుందోనన్న ఆందోళన ప్రభుత్వాన్ని పట్టిపీడిస్తుంది. చెక్కుల పంపిణీ ఓటర్లపై ప్రభావం చూపిస్తుందన్న అభ్యంత రాలు వచ్చే అవకాశాలున్నాయని అనుమానిస్తున్నారు. 58 లక్షల చెక్కుల పంపిణీ అంటే దాదాపు అదే సంఖ్యలో కుటుంబాలను ప్రభావితం చేసినట్లే. ఖరీఫ్‌లో 50 లక్షల మంది చెక్కులు తీసుకున్నారు. అంటే దాదాపు కోటి మందికి పైగా ఓటర్లను ప్రభావితం చేసినట్లుగా భావిస్తున్నారు. అయితే ఇది ఖరీఫ్ లో ప్రారంభమైన పథకం. బడ్జెట్లోనూ నిధులు కేటాయించారు. కాబట్టి దీనికి ఎన్నికల కమిషన్ అభ్యంతరాలు వ్యక్తం చేయదన్న భరోసాలో ప్రభుత్వ వర్గాలున్నాయి. ‘మీ పని మీరు చేసుకోండి. చెక్కుల ముద్ర ణ, పంపిణీకి ఏర్పాట్లు వంటివన్నీ ఎక్కడా నిలిచిపోకూడదు’ అని రద్దు కాకముందు ప్రభుత్వం వ్యవ సాయశాఖను ఆదేశించింది. దీంతో ఆ శాఖ అధికారు లు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. -
జూన్ 20కల్లా చెక్కుల పంపిణీ పూర్తవ్వాలి: సీఎస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జూన్ 20కల్లా పట్టాదారు పాస్‌పుస్తకాలు, రైతుబంధు చెక్కుల పంపిణీ పూర్తి కావాలని సీఎస్ ఎస్కే జోషి స్పెషలాఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో సీఎస్.. పాస్‌బుక్కులు, చెక్కుల పంపిణీ పర్యవేక్షణకు నియమించిన స్పెషలాఫీసర్లతో సమావేశమయ్యారు. జిల్లాల్లో పర్యటించి పాస్‌పుస్తకాలు, చెక్కుల పంపిణీ సజావుగా జరిగేలా చూడాలని.. ఈ మేరకు కలెక్టర్లకు మార్గనిర్దేశనం చేయాలని సూచించారు. మండల అధికారుల టీంలు ప్రతీ గ్రామంలో పర్యటించేలా చూడాలని చెప్పారు. పాస్‌పుస్తకాల్లోని తప్పులపై దృష్టి సారించి, వాటిని సరిదిద్దేందుకు దృష్టి సారించాలన్నారు. మంత్రులతో సమన్వయం చేసుకొని స్పెషల్ డ్రైవ్ తరహాలో చేపట్టాలన్నారు. ఇప్పటివరకు దాదాపు 40 లక్షల పాస్‌పుస్తకాలు పంపిణీ చేశామని.. మిగిలిన వాటి పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. ఆధార్ అనుసంధానించిన ఖాతాలకు డిజిటల్ సిగ్నేచర్లను సత్వరం పూర్తి చేయాలన్నారు. సమావేశంలో స్పెషలాఫీసర్లు అజయ్ మిశ్రా, చిత్రా రామచంద్రన్, అధర్ సిన్హా, సునీల్ శర్మ, రామకృష్ణారావు, సోమేశ్ కు మార్, వికాస్‌రాజ్, జయేశ్‌రంజన్, శివశంకర్, శశాంక్ గోయల్ తదితరులు పాల్గొన్నారు. -
స్టెప్పులేసిన స్పీకర్, మంత్రి, ఎంపీ
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొంపల్లి గ్రామంలో నిర్వహించిన రైతుబంధు చెక్కులు, పాసుపుస్తకాల పంపిణీ సభలో పాటకు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి డ్యాన్స్ చేశారు. ఆయన స్టెప్పులేస్తూ స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీ బండా ప్రకాశ్‌ను పిలవడంతో ముగ్గురూ కలసి స్టేజీపై డ్యాన్స్ చేశారు. దీంతో రైతులు, టీఆర్ఎస్ నేతలు ఈలలు, చప్పట్లతో సభ మారుమోగింది. -
దేశానికే ఆదర్శం తెలంగాణ
సాక్షి, సిద్దిపేట: రైతును రాజుగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లాలోని నారాయణరావుపేటలో వారు రైతుబంధు పథకం చెక్కుల పంపిణీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ భూ రికార్డులను ప్రక్షాళన చేసి రైతులకు పాస్‌పుస్తకాలు అందచేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. అన్నదాతలు పండించిన ప్రతి గింజను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తామన్నారు. రాష్ట్రం లో ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా జరుగుతోందని కొద్ది రోజుల్లో గోదావరి, కృష్ణా జలాలతో చెరువులు నింపుతామని స్పష్టం చేశారు. పోచారం మాట్లాడుతూ.. రైతు అయిన కేసీఆర్ సీఎం కావడం రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు. రైతుకు కావాల్సిన ఉచిత విద్యుత్, సకాలంలో ఎరువులు, పండిన పంటకు మద్దతు ధర, పెట్టుబడి సహాయం అందించడం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే సాధ్యం అయిందని అన్నారు. రైతులు సమావేశమయ్యేం దుకు ప్రతి గ్రామంలో రూ.12 లక్షలతో సమన్వయ సమితి భవన నిర్మాణాలు చేపడుతున్నామని వివరించారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ ఏర్పాటే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం రైతుల సంక్షేమానికి అత్యధిక నిధులు కేటాయిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బి.వెంకటేశ్వర్లు, సుధాకర్‌రెడ్డి, ఫారూక్ హుస్సేన్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ్‌కు మతిమరుపు వ్యాధి చిన్నకోడూరు(సిద్దిపేట): సీఎం కేసీఆర్‌ను జాక్‌పాట్ ముఖ్యమంత్రిగా అభివర్ణించిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీల్డ్ కవర్లద్వారా పదవులు పొందే జాక్‌పాట్ నాయకులు కాంగ్రేస్ వాళ్లేనని ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్‌లో గురువారం రాత్రి ఆయన రైతుబంధు చెక్కుల పంపిణీలో పాల్గొన్నారు. కేసీఆర్ ఉద్యమంలో పాల్గొనలేదని ఉత్తమ్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఆయనకు మతిమరుపు వ్యాధి వచ్చిందన్నారు. ఆకట్టుకున్న పోచారం పిట్టకథ కాంగ్రెస్ బస్సు యాత్రపై మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభలో చెప్పిన పిట్టకథ అందరినీ నవ్వించింది. గాంధీభవన్ నుంచి బయలుదేరిన 50 మంది కాంగ్రెస్ నాయకుల బృందంలో బస్సు యాత్ర సిద్దిపేటకు రాగానే మంత్రి హరీశ్‌రావు పంపిణీ చేసే రైతుబంధు చెక్కులు తీసుకునేందుకు 10 మంది దిగిపోయారని, అక్కడి నుంచి సిరిసిల్లకు వెళ్లగానే మంత్రి కేటీఆర్ చెక్కులు పంచుతుండగా మరో పది మంది, తర్వాత కరీంనగర్లో ఈటల చెక్కుల పంపిణీ చూసిన మరో పది మంది, కామారెడ్డిలో మరో పదిమంది దిగిపోయారని, నిజామాబాద్ రాగానే డ్రైవర్ కూడా దిగిపోవడంతో బస్సు నడిపేవారు లేక ఉత్తమ్, జానాఒకరి ముఖం మరొకరు చూసుకోవాల్సి వచ్చింద న్నారు. ఇలా కాంగ్రెస్ వారంతా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. -
కాంగ్రెస్ నేతలు పరిగలు ఏరుకోవాల్సిందే
సాక్షి, సిద్దిపేట: ‘సీఎం కేసీఆర్ స్వయానా రైతు బిడ్డ. అందుకోసమే రైతును రాజుగా చూడాలని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వం వర్షాకాలానికి ముందుగా ఎకరానికి రూ.4 వేల పెట్టుబడి సహాయం అందిస్తోంది. దీంతో రైతులు ఎరువులు, విత్తనాల కోసం వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసే దుస్థితి తప్పింది. ఇంత మంచి పని చేసిన కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు సమర్థి స్తున్నారు. ప్రతిచోట బ్రహ్మరథం పడుతున్నారు. ఇక కాంగ్రెస్ నాయకులు వచ్చే ఎన్నికల్లో పరిగలు ఏరుకోవడం మినహా.. చేసేది ఏమీ లేదు’అని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బుధవారం సిద్దిపేట నియోజకవర్గం రంగధాంపల్లి, గజ్వేల్ నియోజకవర్గం బూరుగుపల్లిలో రైతుబంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రైతుబంధు పథకంతో ప్రజలు గ్రామగ్రామాన పండగ జరుపుకుంటున్నారని, సాగుకు ముందే సహాయం అందడంతో రైతు లు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రభు త్వం మద్దతు ధర, నిరంతర విద్యుత్, పెట్టుబడి సహాయం అందించడంతో పాటు సాగునీరిచ్చేందుకు కష్టపడుతోందని చెప్పారు. -
రైతులు ప్రశ్నిస్తారనే ప్రతిపక్షాల భయం
సిరిసిల్ల: దేశవ్యాప్తంగా రైతులు పెట్టుబడి సాయం గురించి అడుగుతారని ప్రతిపక్షాలు భయపడుతున్నాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట, రుద్రంగి, తంగళ్లపల్లి మండల కేంద్రాల్లో ఆదివారం లబ్ధిదారులకు రైతుబంధు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుబంధు పథకంపై దేశవ్యాప్తంగా ప్రకటనలు ఇస్తే.. ప్రతిపక్షాలకు భయం పట్టుకుంది. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇస్తున్నప్పుడు మీరు ఎందుకు ఇవ్వరని అక్కడి రైతులు ప్రశ్నిస్తారనే భయంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు వణికిపోతున్నారు’అని పేర్కొన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని 70 ఏళ్లుగా మీరు ఎందుకు చేయలేదని కేటీఆర్ ప్రశ్నించారు. రైతులకు డబ్బులిస్తే.. వాళ్లు తిరిగి ఎలా చెల్లించాలని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రశ్నించారని, అయితే ఆ డబ్బులను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని చెబితే బిత్తరపోయారన్నారు. గల్ఫ్‌లో ఉన్న రైతులకూ చెక్కులు: గల్ఫ్‌లో ఉన్న రైతులకు 17వ తేదీ తరువాత చెక్కులు ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు. పాస్‌పోర్టు తరహాలో పట్టాదారుపాస్ బుక్కులు ఇస్తున్నామని కేటీఆర్ వివరించారు. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే సరిచేసేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధంగా ఉన్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సి పనిలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, కలెక్టర్ కృష్ణభాస్కర్, డీఆర్వో జీవీ.శ్యామ్‌ప్రసాద్‌లాల్, జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ గడ్డం నర్సయ్య, కరీంనగర్ డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
రెండో రోజు 4.48 లక్షల చెక్కులు
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు పథకం కింద రెండోరోజు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 1,372 గ్రామాల్లో 4.48 లక్షల చెక్కులను పంపిణీ చేసినట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. శుక్రవారం సాయంత్రానికి రూ.227 కోట్ల విలువైన చెక్కులను రైతులు నగదుగా మార్చుకున్నారని వెల్లడించింది. శుక్ర వారం వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి రైతుబంధు పథకం కింద చెక్కుల పంపిణీ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. అన్ని గ్రామాలలో నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే చెక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ జరుగుతున్నట్టు వ్యవసాయ శాఖ తెలిపింది. ఎండ తీవ్రత దృష్ట్యా కౌంటర్ల వద్ద తాగునీరు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్లతోపాటు ఫిర్యాదు కౌంటర్లను కూడా ఏర్పాటు చేసినట్లు వివరించింది. కొన్నిచోట్ల రైతులకు పాస్ బుక్కులు లేకుండానే చెక్కులు ఇచ్చారని తెలిపింది. ఆ చెక్కులను నగదుగా మార్చుకునే అంశంపై పార్థసారథి ఎస్ఎల్బీసీ అధికారుతో మాట్లాడారని వివరించింది.