
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొంపల్లి గ్రామంలో నిర్వహించిన రైతుబంధు చెక్కులు, పాసుపుస్తకాల పంపిణీ సభలో పాటకు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి డ్యాన్స్ చేశారు. ఆయన స్టెప్పులేస్తూ స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీ బండా ప్రకాశ్‌ను పిలవడంతో ముగ్గురూ కలసి స్టేజీపై డ్యాన్స్ చేశారు. దీంతో రైతులు, టీఆర్‌ఎస్ నేతలు ఈలలు, చప్పట్లతో సభ మారుమోగింది.