Raitubandhu scheme
-
ఈ ఎన్నికలు.. రాహుల్ వర్సెస్ రైతన్నలు
నిజామాబాద్ నాగారం: రాష్ట్రంలో ఎన్నికలు రాహుల్‌గాంధీ వర్సెస్ రైతన్నల మధ్య జరుగుతున్నా యని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వాళ్లకు రాహుల్ గాంధీ ఉంటే... తమకు రైతన్నలు ఉన్నారన్నారు. రైతుబంధు పథకాన్ని నిలిపివేయాలని కాంగ్రెస్ ఎన్నికల సంఘాన్ని కోరడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు, దళితబంధు ఆపాలని ఆ పార్టీ నాయకులు కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ చెబుతు న్నట్లు రైతుబంధు మాత్రమే ఆపేయాలా... లేక అన్ని పథకాలను ఆపేయాలా అని ప్రశ్నించారు. గురువారం నిజామాబాద్‌లో కవిత మీడియాతో మాట్లాడుతూ... సంక్షేమ పథకాల సృష్టికర్త కేసీఆర్ అని చెప్పారు. సీఎం కేసీఆర్ ఇస్తున్న పథకాలు ఆపుకుంటూ వెళ్లాలంటే ముందు కరెంట్ కట్ చేయాలని, ఆ తర్వాత మిషన్ భగీరథ నీళ్లు ఆపాలన్నారు. ఇలా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కూడా ఆపాల్సి వస్తుందన్నారు. వీటిని ఆపడం సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. పదేళ్లుగా నడుస్తున్న ఈ పథకాలు కొత్తవని భావిస్తుంటే కాంగ్రెస్ ఎంతటి అభద్రతాభావంతో ఉందో అర్థమవుతోందన్నారు. సంక్షేమ పథకాలు నిలిపివేయాలని చూస్తే, రైతులను బాధపెడితే కాంగ్రెస్‌కే నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. సోని యాగాంధీ, ప్రియాంకాగాంధీ, రాహుల్ గాంధీలు ఏ హోదాలో గ్యారంటీలు ఇస్తున్నారని... ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గేను పక్కకు పెట్టి వారు గ్యారంటీలు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. గాంధీలకే గ్యారంటీ లేదని వారిచ్చే గ్యారంటీలను ఎలా నమ్మాలని నిలదీశారు. రేవంత్ కామారెడ్డికి వచ్చినా, ఈటల గజ్వేల్‌లో పోటీ చేసినా తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరుట్లలో ఎమ్మెల్యేగా పోటీచేస్తే ఓడించడానికి తమ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారన్నారు. బోధన్, నిజామాబాద్‌తోపాటు పార్లమెంట్ నియోజకవర్గం జగిత్యాల నుంచి బోధన్ వరకు ప్రచారం చేస్తానని కవిత చెప్పారు. ఈసారి ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టడమే కాకుండా 100కు పైగా సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
పని ఎల్ఐసీది.. పాట్లు ఏఈవోలది
సాక్షి, హైదరాబాద్: రైతులకు అందుబాటులో ఉండటం,వారికి సాగు అంశాల్లో సలహాలు సూచనలు ఇవ్వడం, ఏటా రైతు చైతన్య యాత్ర లు జరపడంలో బాధ్యత వహించాల్సిన క్షేత్రస్థాయి వ్యవసాయాధికారులు ఇప్పుడు వాటన్నింటినీ పక్కన పెట్టాల్సి వస్తోంది. రైతుబంధు, రైతుబీమా పథకాలు వచ్చాక డేటా సేకరణ, పంపిణీ వంటి వాటిలో మునిగిపోవాల్సి వచి్చంది. రైతుబీమాతో ఇతర వ్యవ సాయ సంబంధిత పనులన్నింటినీ పక్కన పెట్టాల్సి వస్తోందన్న చర్చ జరుగుతోంది. దీనిపై క్షేత్రస్థాయిలో ఉండే వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో) గగ్గోలు పెడుతున్నారు. రైతుబీమాతోనే సరి: గతేడాది ఆగస్టు 14 నుంచి రైతుబీమా పథకాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఏ కారణంతోనైనా రైతు చనిపోతే సంబంధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వడమే దీని ఉద్దేశం. ఈ పథకం అమలును ఏఈవోలపైనే పడేశారు. రైతు చని పోతే సంబంధిత వివరాలను ఎల్ఐసీ ఏజెంటు లేదా ఆ సంస్థ ప్రతినిధి తీసుకోవాలి. తదుపరి రైతు మరణ ధ్రువీకరణ పత్రం, ఇతరత్రా వివరాలన్నింటినీ వారే సేకరించి డాక్యుమెంటేషన్ చేయాలని వ్యవసాయ అధికారులు అంటున్నారు. కానీ రైతు చనిపోయిన పది రోజుల్లోనే వారి కుటుంబానికి పరిహారం అందాలంటే తామే అన్నీ భుజాన వేసుకోవాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఎల్ఐసీ ప్రతి నిధుల పనిని ఏఈవోలే చేయాల్సి వస్తోందని అంటున్నారు. -
‘ఎరువుల కొరత లేదు’
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/పెద్దపల్లి: రాష్ట్రంలో యూరియాకు ఎలాంటి కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం కరీంనగర్, పెద్దపల్లి కలెక్టరేట్లలో వ్యవసాయ అధికారులతో ఆయన సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. అన్ని జిల్లాలలో యూరియా స్టాక్ ఉందని, ప్రతిరోజు నేరుగా జిల్లాలకు యూరియా పంపుతున్నామని తెలిపారు. ప్రస్తుతం యూరియా స్టాక్ ఉన్నప్పటికీ కేంద్రం ప్రవేశపెట్టిన ‘పాయింట్ ఆఫ్ సేల్’ విధానం వల్ల పంపిణీలో ఆలస్యం జరుగుతోందని తెలిపారు. దీని వల్ల యూరియా స్టాక్ ఉన్నప్పటికీ రైతులు లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. దీనిపై ప్రజలకు అవగాహ న కలి్పంచి, యూరియా కోసం తొందర పడవద్దని వ్యవసాయాధికారులు రైతులకు భరోసా కలి్పంచా లని సూచించారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాల్లో ఎరువుల పంపిణీ జరుగుతోందని స్పష్టం చేశారు. ఐదారు చోట్ల మాత్రం ఎరువులు సకాలంలో అం దలేదని, దీన్ని రాష్ట్రవ్యాప్త కొరతగా ప్రతిపక్షాలు దు్రష్పచారం చేస్తున్నాయని మండిపడ్డారు. రైతుబంధుపై ఎలాంటి అపోహలు అవసరం లేదని.. ఎంత భూమి ఉంటే అంత రైతుబంధు స్కీం వర్తింపజేస్తామన్నారు. ఆయా సమావేశాల్లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. -
జైకిసాన్ నినాదాన్ని ఆచరణలో చూపాం
సిరిసిల్ల: జై కిసాన్.. కాంగ్రెస్, బీజేపీల నినాదమని.. కానీ దానిని ఆచరించి చూపింది కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అన్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలకేంద్రంలో టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా రైతులకు పెట్టుబడి సాయాన్ని రైతు బంధుద్వారా అందించామని, అలాగే రైతులకు రైతు బీమా పథకం ద్వారా భరోసా కల్పించామని వివరించారు. టీఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాలను ప్రధానమంత్రి కూడా పీఎం కిసాన్ సమ్మాన్ పేరుతో అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. తెలంగాణ విధానాలు దేశానికి ఆదర్శమయ్యాయని కేటీఆర్ పేర్కొన్నారు. రైతులు ఏ విధంగా మరణించినా వారి కుటుంబాలకు రూ.5 లక్షల బీమా అందిస్తున్న ప్రభుత్వం ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. రాష్ట్రంలో మరోసారి రైతులకు రూ.లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేసేందుకు రూ.24 వేల కోట్లతో ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దీనికో సం బడ్జెట్లోనూ నిధులను కేటాయించామని స్పష్టం చేశారు. రైతుబంధు పథకం కింద ఇప్పుడు ఏటా ఇ స్తున్న రూ.8 వేలు కాకుండా.. ముందు ముందు ఎకరానికి ఏటా రూ.10 వేలు పెట్టుబడి సాయాన్ని అందిస్తామని వెల్లడించారు. ‘ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి’ అనేది కేసీఆర్ లక్ష్యమని, ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు. ఇంకా అప్పటి నినాదమేనా? 40 ఏళ్ల కిందటే గరిబీ హఠావో అన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అదే నినాదాన్ని ఇస్తోందని, ‘నాయనమ్మ, తాత, ముత్తాత’ పాలన చూశామని, 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఎక్కువకాలం పాలించిందని, అయితే కాంగ్రెస్, తర్వాత బీజేపీల పాలన బాగుంటే ఇంకా దేశం అభివృద్ధి చెందని దేశంగా ఎందుకుం ద ని ప్రశ్నించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో పొరపాటున కాంగ్రెస్, బీజేపీకి ఓటువేస్తే ఆగం అవుతారన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని, ఇంకొకరికి ఓట్లు వేసి ఆగం కావద్దని ప్రజలను కోరా రు. ‘టీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు గెలిస్తే.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తుంది. మిషన్ భగీరథకు నిధులొస్తాయి. మిషన్ కాకతీయకు గ్రాంటు వస్తుంది’ అని కేటీఆర్ వివరించారు. కేంద్రంలో పనిచేసే నీతి ఆయోగ్ సంస్థ సిఫార్సులను కేంద్రం అమ లు చేయలేదని, రూ.24 వేల కోట్లు తెలంగాణకు ఇవ్వాలని ఆ సంస్థ సిఫార్సు చేస్తే.. ప్రధాని నరేంద్ర మోదీ నయాపైసా ఇవ్వలేదని విమర్శించారు. రేపు గులాబీ సైనికులు ఢిల్లీలో ఉంటే తెలంగాణకు మేలు జరుగుతుందన్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి అవసరమన్నారు. గుణాత్మక మార్పు కోసం జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ నిర్ణయాత్మక శక్తిగా మారుతుందని కేటీఆర్ అన్నారు. అయితే టీఆర్ఎస్ నుంచి 16 మంది ఎంపీలు గెలిస్తేనే ఇది సాధ్యమన్నారు. నరేంద్ర మోదీ ఏం మాట్లాడుతున్నారు? ‘తెలంగాణకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఏం మాట్లాడుతున్నారు..? కేసీఆర్‌ను తిడుతున్నారు. తెలంగాణ ప్రజానీకం ఓట్లు వేసి గెలిపిస్తేనే కేసీఆర్ సీఎం అయ్యారు. అలాంటి దమ్మున్న నాయకుడిని తిడితే ఓట్లు వస్తయా..? ఐదేళ్లు ఏం చేశారో చెప్పాలే. మరోసారి అవకాశం ఇస్తే ఏం చేస్తారో చెప్పాలే.. కానీ కేసీఆర్‌ను తిట్టిపోయిండు. ఈ చౌకీదార్.. ఈ టేకేదార్లు మనకు వద్దు. జిమ్మేదార్... ఇమాన్దార్.. నాయకుడు కేసీఆర్ వంటివారు మనకు కావాలి’అని కేటీఆర్ స్పష్టం చేశారు. దేశానికి కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని స్పష్టంచేశారు. కాగా, మైనార్టీల సంక్షేమంలో భాగంగా 120 గురుకులాలు ప్రారంభిం చి నాణ్యమైన విద్యను తెలంగాణ ప్రభుత్వం అంది స్తోందని ఆయన ఉర్దూలో ప్రసంగించారు. ఈ సభలో కరీంనగర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీఆర్ఎస్ నాయకులు బసవరాజు సారయ్య, భానుప్రసాదరావు, గూడూరి ప్రవీణ్, గడ్డం నర్సయ్య, ఆకునూరి శంకరయ్య, దయాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఏ గట్టునుంటారో తేల్చుకోవాలి పరిగి/చేవెళ్ల/మొయినాబాద్: ‘ఈ గట్టున కారు... ఆ గట్టున బేకార్‌గాళ్లు.. ఏ గట్టునుంటారో.. ఎవరి కి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుందో ఓటర్లే తేల్చుకోవాలి’ అని కేటీఆర్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పరిగి, చేవెళ్లలో రోడ్‌షో నిర్వహించారు. చేవెళ్ల రోడ్‌షోలో ఆయన మాట్లాడుతుండగా వర్షం కురవడంతో ఈ వాన మనకు ఆశీర్వాదమని.. విజయానికి సూచన అని అభివర్ణించారు. ఆయా రోడ్‌షోల్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం.. బీజేపీ ఎంపీలు గెలిస్తే మోదీకి లాభం.. టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే మొత్తం తెలంగాణ ప్రజలకు లాభమన్నారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా కృష్ణా నీళ్లివ్వాలని పరిగిలో పాదయాత్ర డ్రామా ఆడుతున్న కాంగ్రెస్ నాయకులు.. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రాకుండా కోర్టుకు ఎక్కలేదా? అని ప్రశ్నించారు. పాలమూరు ఎత్తిపోతల నీళ్లు రానీయకుండా పరిగి ప్రాంత ప్రజల నోట్లో మట్టి కొట్టారని ఆరోపించారు. రెండేళ్లలో పాలమూరు నీళ్లు తెస్తామని హామీనిచ్చారు. కరెం టు అడిగితే కాల్చి చంపిన కాంగ్రెస్‌కు.. అడగకుండానే 24 గంటలు కరెంటు ఇచ్చిన టీఆర్ఎస్కు మధ్య పోటీ జరుగుతోందన్నారు. దేశంలో కాంగ్రెస్‌కు 100 సీట్లు, బీజేపీకి 150 సీట్లు దాటవన్నారు. పాలమూరులో మీటింగ్ పెట్టిన ప్రధాని మోదీకి పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌కు 16 మంది ఎంపీలనిస్తే దేశ రాజకీయాలను శాసిస్తారన్నారు. కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి, మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, కొప్పుల మహేశ్‌రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, టీఆర్ఎస్ నేత హరీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతుబంధే శ్రీరామరక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్కు రైతు బంధు పథకం ఓట్ల వరదాయినిగా మారింది. గంపగుత్తగా ఓట్లు పడేలా ఇది ఉపయోగపడుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రైతు బంధు పథకమే టీఆర్ఎస్కు అధికారం కట్టబెట్టిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు. రైతు బంధుతో లబ్ధి పొందిన అన్నదాతలు అనేక మంది ఆ పార్టీని ఆశీర్వదించి ఊహించని విజయాన్ని కట్టబెట్టారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఈ పథకం ఓట్ల వర్షం కురిపిస్తుందని టీఆర్ఎస్ వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి. దీంతో ఈ పథకంపై పార్టీ శ్రేణులు పెద్దెత్తున ప్రచారం చేస్తున్నాయి. వచ్చే మే నెలలో మరోసారి ఖరీఫ్ పెట్టుబడి సాయం అందుతుందని చెబుతున్నాయి. వచ్చే సీజన్ నుంచి ఎకరానికి రూ.10 వేలు... రైతు బంధు పథకాన్ని ఇతర రాష్ట్రాలే కాక ఐక్యరాజ్యసమితి కూడా గుర్తించి ప్రశంసించిన సంగతి తెలిసిందే. దీంతో దేశంలోని పలు రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేసేందుకు ముందుకు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం దీని ఆధారంగా పీఎం–కిసాన్ పథకాన్ని ఇటీవల ప్రవేశపెట్టింది. సీజన్ ప్రారంభానికి ముందే సాగు ఖర్చు సహా విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి పెట్టుబడి సాయం ఇవ్వడమే దీని లక్ష్యం. ఖరీఫ్, రబీలో ఒక్కో సీజన్‌కు ఎకరాకు రూ.4 వేలు ఇచ్చేలా దీన్ని రూపొందించారు. ఈ ప్రకారం రాష్ట్రంలో 2018–19 ఖరీఫ్‌లో 50.91 లక్షల మంది రైతులకు చెక్కులిచ్చి రూ. 5,256 కోట్లు అందజేశారు. రబీ సీజన్ కింద 43.60 లక్షల మందికి రూ. 4,724 కోట్లు రైతు బంధు సొమ్ము ఇచ్చారు. రెండు సీజన్లు కలిపి దాదాపు రూ. 10 వేల కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో చేరాయి. దీంతో రైతులంతా టీఆర్ఎస్కు ఓట్ల వర్షం కురిపించారు. ఇదిలా ఉండగా వచ్చే ఖరీఫ్ నుంచి ఏడాదికి ఎకరాకు ఇచ్చే మొత్తాన్ని రూ.10 వేలకు పెంచుతూ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో రైతుల్లో మరింత ఊపు వచ్చింది. ఇది లోక్‌సభ ఎన్నికల్లోనూ తమకు లాభిస్తుందని అధికార పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. దీంతోపాటు కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం–కిసాన్ పథకం కింద ఇప్పటివరకు రాష్ట్రంలో 19.04 లక్షల రైతు కుటుంబాలకు రూ.380.80 కోట్లు బ్యాంకు ఖాతాలకు చేరాయి. ఇంకా 7.25 లక్షల మంది రైతులకు మాత్రం ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఎన్నికల తర్వాత వారికి రూ.145.04 కోట్లు వస్తాయని అంటున్నారు. రెండు విధాలా లాభం జరుగుతుండటంతో రైతులు టీఆర్ఎస్ను ఆశీర్వదిస్తారని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇది కేంద్ర పథకమైనా రాష్ట్ర అధికారుల ద్వారానే వస్తుండటంతో టీఆర్ఎస్కే ప్రయోజనం కలుగనుందన్నది వారి వాదన. ఒకేవైపు కోటి ఓట్లు... రాష్ట్రంలో తాజా లెక్కల మేరకు 2.96 కోట్ల మందికి పైగా ఓటర్లున్నారు. గత ఖరీఫ్‌లో 50.91 లక్షల మంది రైతులు పెట్టుబడి సాయం పొందారు. అంటే భార్యాభర్తలను కలిపి చూసినా రైతు బంధు సాయం అందుకున్నవారివే కోటి ఓట్లు ఉంటాయి. వారి పిల్లలు, వారికి ఓట్లు ఉంటే మరో 25 లక్షల మంది ఉంటారు. అందులో ఇతర పార్టీలకు కొన్ని పోయినా ఒక అంచనా ప్రకారం నికరంగా కోటి ఓట్లు తమకు పడతాయన్నది టీఆర్ఎస్ వర్గాల ఆశాభావం. పైగా రైతు బంధు ద్వారా లబ్ధిపొందినవారిలో 68 శాతం మంది రైతులు ఐదెకరాల్లోపు వారే. వీరిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులేనని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. పైగా గ్రామీణ ఓటర్లు దాదాపు 40 శాతంపైగా ఉంటారని అంచనా. కాబట్టి 16 లోక్‌సభ సీట్లు కచ్చితంగా తమ ఖాతాలోనే పడతాయని టీఆర్ఎస్ వర్గాలు నమ్మకంతో ఉన్నాయి. -
ఒడిశాలో ‘రైతుబంధు’
భువనేశ్వర్: రైతులకు అండగా నిలిచేందుకు ఒడిశా ప్రభుత్వం ఓ భారీ పథకాన్ని ప్రారంభించింది. రైతులకు పెట్టుబడి వ్యయం, భూముల్లేని వారికి వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రోత్సాహం, వృద్ధాప్యం, అంగవైకల్యం తదితర కారణాలతో వ్యవసాయం చేయలేని స్థితిలో ఉన్న రైతులకు ఆర్థిక సహాయం తదితరాలు ఈ పథకంలో ఉన్నాయి. కలియా (కృషక్ అసిస్టెన్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఇన్‌కం ఆగ్మెంటేషన్) పేరుతో కొత్త పథకాన్ని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శుక్రవారం మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రకటించారు. ఈ పథకం కింద 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ. 10,180 కోట్లను ఒడిశా ప్రభుత్వం ఖర్చు చేయనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న రుణమాఫీ హామీలు అర్థరహితమని నవీన్ పట్నాయక్ అన్నారు. రుణమాఫీ కన్నా తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకంతోనే రైతులకు ఎక్కువ లబ్ధి చేకూరుతుందనీ, అధిక శాతం మందికి ప్రయోజనాలు చేకూరుతాయని ఆయన తెలిపారు. ఒడిశాలో దాదాపు 32 లక్షల మంది రైతులుంటే కేవలం 20 లక్షల మందే పంటరుణాలను తీసుకున్నారనీ, రుణమాఫీ ప్రకటిస్తే మిగిలిన 12 లక్షల మందికి ప్రయోజనం ఉండదనీ, తమ కలియా పథకం మాత్రం 30 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగిస్తుందని పట్నాయక్ వివరించారు. ఇవీ పథకం ప్రయోజనాలు ► భూ విస్తీర్ణంతో నిమిత్తం లేకుండా వ్యవసాయం చేసే ప్రతీ కుటుంబానికి ఒక్కో సీజన్లో (ఖరీఫ్, రబీ) పెట్టుబడి కోసం రూ. 5,000 ఆర్థిక సాయం. కౌలు రైతులు కూడా ఈ మొత్తం పొందడానికి అర్హులే. ► గొర్రెలు, కోళ్లు, బాతులు, తేనెటీగల పెంపకం దార్లకు, చేపలు పట్టే వారికి అవసరమైన సామగ్రిని సమకూర్చుకునేందుకు రూ. 12,500 ఆర్థిక సాయం. భూమి లేని వారే ఇందుకు అర్హులు. వీటిలో ఏదో ఒక దాన్నే ఎంచుకోవాలి. ► వృద్ధాప్యం, అంగవైకల్యం, రోగాలు తదితర కారణాల వల్ల వ్యవసాయం చేయలేకపోతున్న రైతులకు ఒక్కో ఇంటికి ఏడాదికి రూ. 10 వేల ఆర్థిక సాయం. లబ్ధిదారులను గ్రామ పంచాయతీలు ఎంపిక చేస్తాయి. ► భూమి ఉన్న, లేని రైతులనే భేదం లేకుండా అందరికీ రూ. 2 లక్షల జీవిత బీమా, మరో రూ. 2 లక్షల ప్రమాద బీమా ► 50 వేల వరకు రుణాలపై వడ్డీ ఉండదు. జార్ఖండ్‌లోనూ కొత్త పథకం ఒడిశా తరహాలోనే జార్ఖండ్‌లోనూ ఓ పథకాన్ని రైతుల కోసం సీఎం రఘుబర్‌దాస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ పథకం కింద రూ. 2,250 కోట్లను ఖర్చు చేయనుండగా, 22.76 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులు లబ్ధి పొందనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు ప్రభుత్వం ఏడాదికి రూ. 5,000 ఆర్థిక సాయం అందజేయనుంది. గరిష్టంగా ఐదెకరాల వరకు భూమి ఉన్న రైతులు ఈ సాయం పొందేందుకు అర్హులు. రైతులు విత్తనాలు, ఎరువులు, తదితరాలను సమకూర్చుకునేందుకు ఈ పథకం సాయపడుతుంది. -
రూ.3 లక్షల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: ‘‘రైతులను ఆదుకోవడంలో మూడు తక్షణ పరిష్కారాలున్నాయి. ఒకటి రైతులు పండించిన పంటకు ఒకటిన్నర రెట్లు మద్దతు ధర కల్పించడం. రెండోది మధ్యప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న భవంతర్ భుగ్తాన్ యోజన (బీబీవై) పథకం కింద మద్దతు ధరకు, మార్కెట్ ధరకు తేడాను ప్రభుత్వమే రైతులకు చెల్లించడం. మూడోది తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకం కింద రైతులకు నేరుగా డబ్బులు ఇవ్వడం. ఇందులో రైతుబంధు పథకం అమలు చేయడంలో వ్యవస్థీకృతంగా ఎలాంటి లోపాలు తలెత్తవు. అక్రమాలు కూడా జరగవు. రైతుబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తే రూ.3 లక్షల కోట్ల ఖర్చు అవుతుంది’అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పేర్కొంది. ఈ మూడు పథకాలపై ఎస్బీఐ జాతీయ స్థాయిలో పరిశోధన పత్రం తయారు చేసింది. ఇటీవల విడుదల చేసిన ఆ పత్రంలోని వివరాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖలో చర్చ జరుగుతోంది. ఆ వివరాలను ‘సాక్షి’సేకరించింది. దేశంలోనే తొలిసారి.. తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా రైతుబంధు పథకాన్ని ప్రవేశ పెట్టిందని ఎస్బీఐ తన నివేదికలో తెలిపింది. తెలంగాణలో 58.33 లక్షల మంది రైతులకు ఎకరానికి రూ.4 వేల చొప్పున ఇస్తున్నట్లు తెలిపింది. ఖరీఫ్, రబీలకు కలిపి ఒక్కో ఎకరానికి రైతుకు రూ.8 వేలు ఇస్తున్నట్లు పేర్కొంది. అందుకోసం 2018–19 బడ్జెట్లో రూ.12 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపింది. ‘‘రైతులకే నేరుగా డబ్బులు ఇవ్వడం దేశంలో మొదటిసారి. ఒకటిన్నర రెట్లు మద్దతు ధర కల్పించడం, బీబీఐ పథకం అమలు చేయడం కంటే రైతుబంధు పథకానికే అధికంగా ఖర్చవుతుంది’’అని ఎస్బీఐ విశ్లేషించింది. ఈ పథకంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, ఇతర రాష్ట్రాల రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారని అధికారులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అమలుచేస్తే.. తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న రైతుబంధును దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తే రూ.3 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని ఎస్బీఐ విశ్లేషించింది. నికర వ్యవసాయ సాగు భూమిని లెక్కలోకి తీసుకుం టే ఆ స్థాయిలో ఖర్చు అవుతుందని తేల్చి చెప్పింది. రైతుబంధును దేశవ్యాప్తంగా అమలు చేయడమంటే భారీ ఖర్చుతో కూడిన వ్యవహారమని పేర్కొంది. రైతుబంధులో ప్రధాన లోపం కౌలు రైతులకు పెట్టుబడి సాయం కల్పించకపోవడమని స్పష్టంచేసింది. భూమిపై యాజమాన్య హక్కులున్న వారికే పెట్టుబడి సాయం చేస్తున్నారని చెప్పింది. రైతుబంధు పథకంతో సాగు భూమి, సాగుకాని భూమి విలువ మరింత పెరుగుతుందని వెల్లడించింది. దీర్ఘకాలిక పరిష్కారాలు చూపవు.. ఒకటిన్నర రెట్లు మద్దతు ధర కల్పించడం, బీబీఐ పథకం, రైతుబంధు పథకం.. ఈ మూడు రైతు సమస్యలకు తక్షణ పరిష్కారమే చూపుతాయని ఎస్బీఐ పేర్కొంది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను స్థాపించడం, వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తుల నిల్వ, రవాణాకు అత్యాధునిక సదుపాయాలు కల్పించడం, అత్యధిక కనీస మద్దతు ధర కల్పిస్తే దీర్ఘకాలిక పరిష్కారాలు చూపవచ్చని స్పష్టంచేసింది. అయితే కష్టాల్లో ఉన్న రైతులకు ఇతరత్రా పథకాలతోపాటు రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం కల్పించడం ఉపయోగపడుతుందని పేర్కొంది. -
‘రైతుబంధు’పై అఖిలపక్ష భేటీ
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు పథకం విధివిధానాలను నిర్ధారించేందుకుగాను అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయా లని సీఎల్పీ నేత కె.జానారెడ్డి డిమాండ్ చేశారు. వ్యవసాయానికి పెట్టుబడి సాయం కౌలుదారుడికి కూడా అందజేయాలనేది తమ విధానమన్నారు. కౌలురైతుల వివరాలను సేకరించాలని బుధవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోరారు. వ్యవసాయం చేసినవారికే రైతుబంధు నిధులివ్వాలని అన్నారు. సినీ విమర్శకుడు కత్తి మహేశ్ చేసిన వ్యాఖ్యానాలు సమాజంలో భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, ఆయనపై చట్టరీత్యా కఠినచర్యలు తీసుకోవాలన్నారు. -
అసలు కౌలు చట్టాలు తెలుసా: పల్లా
సాక్షి, హైదరాబాద్: కౌలు చట్టాలపై అవగాహన లేకుండా ప్రతిపక్ష నేతలు రైతుబంధు పథకంపై నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లా డుతూ, కౌలు రైతులపై కపట ప్రేమ ఒలకబోస్తూ, టీఆర్ఎస్ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. కౌలు రైతుల గురించి మాట్లాడుతున్న వారు 1956 టెనెన్సీ యాక్ట్ చదివితే బాగుంటుందన్నారు. మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఎప్పుడు, ఏ పార్టీలో ఉంటారో, ఎప్పుడే పార్టీలోకి మారతారో ఎవరికీ తెలి యదని పల్లా ఎద్దేవా చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై, మిషన్ భగీరథపై ఏవేవో మాట్లాడుతున్న నాగం వాదనల్లో నిజం ఉంటే కోర్టులకు ఎందుకు వెళ్లట్లేదని ప్రశ్నించారు. -
సార్వత్రికమే టార్గెట్!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో జరుగుతాయనే భ్రమలు తొలిగిపోవడంతో అధికార పార్టీ నేతలు సార్వత్రిక ఎన్నికలపై దృష్టి పెట్టారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికల దిశగా వేస్తున్న అడుగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తోడయ్యారు. ఇటీవల బహిరంగ సభలోనే ఆయన ముందస్తు ఎన్నికలు జరుగుతాయని సూచనప్రాయంగా చెప్పడంతో టీఆర్ఎస్లోని సిట్టింగ్‌లు అలర్ట్ అయ్యారు. ముందస్తు ఎన్నికలు జనవరిలోగా పూర్తవుతాయని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ఇటీవల నిర్వహించిన సర్వేలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై పూర్తి విశ్వాసం ఉంచినట్లు సమాచారం. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా, ఆయా నియోజకవర్గాల్లో పార్టీపై ప్రజల్లో 60 శాతం వరకు అనుకూలత ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో ప్రజల్లో తమపై ఉన్న వ్యక్తిగత వ్యతిరేకతను కూడా అధిగమించడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పంచాయతీ ఎన్నికల జంఝాటం తొలిగిపోవడంతో తమ ప్రతిష్టను పెంచుకునేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సిట్టింగ్ సీట్లను కేసీఆర్ మార్చరని బలంగా నమ్ముతున్న కొందరు ఎమ్మెల్యేలు పడిపోయిన బలాన్ని, జారిపోయిన బలగాన్ని తిరిగి సంపాదించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇతర పార్టీల్లో బలంగా ఉన్న నాయకులను సైతం టీఆర్ఎస్లో చేర్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. రైతుబంధు, బీమాలపై గంపెడాశ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం మొదటి దశ ముగి సింది. స్థానికంగా ఉన్న భూ వివాదాలు, ఇతర సమస్యల కారణంగా కొందరికి చెక్కులు, పాస్ పుస్తకాలు రాకపోయినా తొలిదశ విజయవంతమైందనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అర్హులైన వారందరికి త్వరలోనే చెక్కుల పంపిణీ పూర్తి చేయాలని ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంఎల్సీ ఆర్డీవోలు, తహసీల్దార్లతో మా ట్లాడుతూ చెక్కుల పంపిణీ సజావుగా పూర్తిచేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అదే సమయంలో రైతులకు రూ.5లక్షల బీమా పథకం కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధిం చి మార్గదర్శకాలు ఇప్పటికే జిల్లాలకు అందాయి. వచ్చే రెం డు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసే పనిలో జిల్లాల యంత్రాంగం ఉంది. వచ్చే నవంబర్‌లో రెండో విడత రైతుబంధు కింద చెక్కుల పంపిణీ జరుగనుంది. డిసెంబర్ లేదా జనవరిలో ముందస్తు ఎన్నికలు జరగడానికి ముం దే ఈ చెక్కుల పంపిణీ కూడా పూర్తయితే రైతుల్లో ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఏర్పడుతుందని, ఎమ్మెల్యేల తప్పులు కూడా ఇందులో తుడిచిపెట్టుకుపోతాయని వారి అంచనా. ఈ నేపథ్యంలో పూర్తి ఆత్మవిశ్వాసంతో జిల్లాకు చెందిన పది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నారు. సిట్టింగ్‌ల్లో ఎవరికి భయం..? ఉమ్మడి జిల్లాలోని పది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లపై ఒకరిద్దరికి అనుమానం ఉంది. స్థానికంగా ఉన్న పరిస్థితులకు తో డు పోటీ నాయకత్వం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ల్లో తెలియని ఆందోళన కనిపిస్తోం ది. ఇప్పుడున్న ఎమ్మెల్యేల సీట్లు మళ్లీ గెలవడం ఖాయమని తెలిసినప్పుడు అధిష్టానం ప్రయోగా లు చేయబోదనే విశ్వాసం ఉన్నప్పటికీ, పార్టీలోని బలమైన ప్రత్యర్థుల గురించే కొంత ఆందోళన. అయితే స్థానిక అంశాలు, కుల సమీకరణాలు, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల బలాన్ని పరిగణలోకి తీసుకొనే కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే టిక్కెట్ల కోసం పోటీ ఉంద ని భావించిన ఖానాపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాలలో సైతం ఎమ్మెల్యేలు తమదే పైచేయి అని నమ్ముతున్నారు. ప్రత్యర్థుల మైనస్ పాయింట్లను చాపకింది నీరులా ప్రచారంలోకి తెస్తున్నారు. అదే సమయంలో స్థాని కంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎంపీల మార్పు కూడా ఉండదేమో..? ఆదిలాబాద్ ఎంపీ జి.నగేష్ బోథ్ అసెంబ్లీ నుంచి పోటీ చేయబోతున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నగేష్‌ను కదల్చే ఉద్దేశం ముఖ్యమంత్రికి లేదని ఓ ప్రజాప్రతినిధి ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పా రు. ఆదివాసీ ఉద్యమం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో తీవ్రంగా ఉన్న నేపథ్యంలో నగేష్‌ను కదల్చే సాహసం చేయబోరని ఆయన వాదన. నగేష్ ఎం పీగానే తిరిగిపోటీ చేస్తే బోథ్ నుంచి బాపూరావుకే తిరిగి సీటు ఖాయం. ఖానాపూర్‌లో సిట్టింగ్ ఎమ్మె ల్యే రేఖానాయక్‌కు స్థానికంగా మెజారిటీ ఓట్లు ఉన్న ఓ వర్గం మద్దతు ఉంది. ఇక్కడ రమేష్రాథో డ్ పోటీ చేయనున్నట్లు చెపుతున్నా, మహిళగా ఆమె పట్లనే సానుభూతి ఉంటుందని పార్టీ అంచనాకు వచ్చినట్లు టీఆర్ఎస్ నేతలు విశ్లేషిస్తున్నారు. రేఖానాయక్ భర్త ఆర్టీఏ అధికారి శ్యాంనాయక్ ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేయాలని భావించినప్పటికీ, ప్రస్తుత ఆదివాసీ ఉద్యమ నేపథ్యంలో అది సాధ్యం కాదు. ఆసిఫాబాద్‌లో వివాదాస్పదం కావడంతో ఆయనను ఆదిలాబాద్‌కు బదిలీ చేయడంతో రాజకీయ ప్రస్థానంపై కొంత వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ను కూడా అసెంబ్లీకి పోటీ చేయిస్తారనే ప్రచారం గత కొంతకాలంగా ఉంది. మాజీ ఎంపీ వివేక్ కోసం సుమన్ సీటును ఖాళీ చేయిస్తారని భావించినప్పటికీ, స్థానిక పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఎవరిని కదిపినా పార్టీకి ఇబ్బంది కలుగుతుందని భావిస్తే ‘ఎక్కడి వారక్కడే’ అనే విధానాన్ని అవలంబించే అవకాశం ఉందని పార్టీ నేతలు చెపుతున్నారు. ఆదివాసీ ఉద్యమంపై ప్రత్యేక సర్వే ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో మెజారిటీ ఓటర్లుగా ఉన్న ఆదివాసీలు ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు వెళ్లకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికను అమలు చేయాలని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. ఆదివాసీ రాష్ట్ర నాయకులుగా ఎదిగిన మాజీ ఎమ్మెల్యేలు సోయం బాబూరావు (బోథ్), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్) కాంగ్రెస్ నుంచి పోటీ చేయ డం దాదాపు ఖాయమైన పరిస్థితుల్లో వీరి ప్ర భావం ఎన్నికల్లో ఎలా ఉంటుందనే అంశంపై పార్టీ దృష్టి పెట్టింది. ఈ మేరకు ఇప్పటికే ఓసారి సర్వే చేయించిన పార్టీ నాయకత్వం మరోసారి ఆదివాసీల పల్స్ తెలుసుకునే ప్ర యత్నంలో ఉంది. ఆసిఫాబాద్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే కోవ లక్ష్మితో పాటు ఎంపీ నగేష్ కూ డా ఆదివాసీనే కావడంతో వీరి నేతృత్వంలో ప్రత్యేక కార్యాచరణ తయారవుతోంది. -
‘పెట్టుబడి’ వదులుకున్నది కొందరే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయాన్ని వదులుకునేందుకు ధనికులెవరూ పెద్దగా ఇష్టపడలేదు. పెట్టుబడి సొమ్ము వదులుకోవాలని (గివ్ ఇట్ అప్) స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చినా స్పందన కరువైంది. ఇప్పటివరకు కేవలం దాదాపు వెయ్యి మంది మాత్రమే రూ. 1.71 కోట్ల విలువైన సొమ్మునే వదులుకున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులు కూడా పంట పెట్టుబడి సాయం వదులుకోవడానికి ముందుకు రాలేదని సమాచారం. పెట్టుబడి పథకం కింద ఈ ఖరీఫ్ సీజన్ కోసం ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ. 4 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో ఇచ్చింది. ఇప్పటివరకు 43 లక్షల మంది రైతులు దాదాపు రూ. 4 వేల కోట్ల వరకు సొమ్ము తీసుకున్నారు. అందులో దాదాపు లక్ష మందికిపైగా 20 ఎకరాలకు మించినవారున్నారని అంచనా. అందుకే స్వచ్ఛందంగా పెట్టుబడి సొమ్ము వదులుకునే వారిని ప్రోత్సహించాలని సర్కారు నిర్ణయించింది. ముందుగా ముఖ్యమంత్రే ముందుకు వచ్చారు. ఇతరులనూ ముందుకు వచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. కానీ చాలామంది పెద్దలు పెట్టుబడిపై మమకారం పెంచుకున్నారన్న ఆరోపణలున్నాయి. మనసు రావడం లేదు... రైతు బంధు పథకం కింద ఏడాదికి ఎకరాకు రూ.8 వేలు అందుతుంది. ఒక ధనిక రైతుకు 100 ఎకరాలుంటే, అతనికి ఏడాదికి ఏకంగా రూ.8 లక్షలు అందుతుంది. కొందరికి 10–15 ఎకరాలే ఉన్నా కోట్ల రూపాయల టర్నోవర్‌తో ఇతర వ్యాపారాలున్నాయి. అటువంటి వారు కూడా తమకొచ్చే డబ్బులు తీసుకున్నారు. కొందరు సినిమావాళ్లు, పారిశ్రామికవేత్తలు కూడా డబ్బులు తీసుకున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. పెట్టుబడి సొమ్మును వదులుకుంటే ఆ సొమ్మును రైతు కార్పొరేషన్‌కు అందజేస్తామని, దాన్ని రైతుల సంక్షేమానికి ఖర్చు చేస్తామని ప్రభుత్వం చెప్పినా స్పందన రాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్‌గా సురేశ్ బాబు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యానాంలకు ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్‌గా రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి సురేశ్ బాబు నియమితులయ్యారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులు జూన్ 25 నుంచి విచారణకు రానున్నట్లు ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్ కార్యాలయం డిప్యూటీ సెక్రటరీ పీఎస్ చక్రవర్తి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించి ఎలాంటి సమస్యలు, ఫిర్యాదులున్నా తమ కార్యాలయాన్ని సంప్రదించాల్సిందిగా సూచించారు. రూ.30 లక్షల వరకు క్లెయిమ్‌లకు సంబంధించి సమస్యలను పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. -
రైతు బీమాకు ప్రత్యేక యాప్
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు జీవిత బీమా కోసం ప్రత్యేక యాప్‌ను వినియోగించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) తయారు చేసిన ఈ యాప్‌ను ఇప్పటికే వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో) ట్యాబ్‌ల్లో ఇన్స్టాల్ చేశారు. నామినీ, బీమా దరఖాస్తుల నమూనా ఆధారంగా ఈ యాప్‌ను రూపొందించినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. రైతుబంధు జీవిత బీమా పథకం అమలుకు ఈ నెల 4న ఎల్ఐసీతో వ్యవసాయశాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 30 జిల్లాలకు బీమాతో పాటు నామినీ దరఖాస్తులను పంపామని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఏఈవోలు రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్నారని, మరికొన్ని జిల్లాల్లో సోమవారం నుంచి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తులోని వివరాలను యాప్‌లో నమోదు చేసి, ఆ సమాచారాన్ని ఎల్ఐసీకి పంపనున్నారు. ఇక, క్షేత్రస్థాయిలో వచ్చిన సమాచారంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్ ఎప్పటికప్పుడు పరిశీలించనున్నది. ఆధార్ కార్డు ఆధారంగా రైతుల వయసును నిర్ణయిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఆధార్‌లో కేవలం పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే జూలై మొదటి తేదీని పుట్టిన రోజుగా పరిగణించాలని ప్రభుత్వం ఆదేశించింది. యాప్‌లో రైతుల సమాచారంతో పాటు ఆధార్ నెంబర్‌ను నమోదు చేయడం వల్ల డూప్లికేషన్‌కు అస్కారం ఉండదని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం నమోదు చేస్తున్న వివరాల్లో ఏమైనా మార్పులు చేర్పులుంటే సవరించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. భూ రికార్డుల్లో చేస్తున్న మార్పులకనుగుణంగా సమాచారాన్ని నవీకరించుకునేలా ఆప్షన్లు ఇవ్వనున్నారు. -
చిచ్చు రాజేసిన సస్పెన్షన్లు
సాక్షి, వనపర్తి: ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన రైతుబంధు పథకం, భూ రికార్డుల ప్రక్షాళన విషయంలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని ముగ్గురు రెవెన్యూ ఉద్యోగులను వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి సస్పెండ్ చేయడంతో జిల్లా రెవెన్యూ ఉద్యోగులు గురువారం నిరసనకు దిగారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలు మూసివేసి జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో నిరసన తెలిపారు. తహసీల్దార్ కార్యాలయాలతో పాటు కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల ఉద్యోగులు విధులు బహిష్కరించటంతో రెవెన్యూ పాలన పూర్తిగా స్థంభించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లాలోని శ్రీరంగాపురం తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం రాత్రి కలెక్టర్ శ్వేతా మహంతి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతుబంధు పథకంలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించకపోవటం, చెక్కుల కంటే పాస్‌పుస్తకాలు తక్కువగా పంపిణీ చేయటం ఏమిటని తహసీల్దార్ శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ అనురాధ, వీఆర్ఓ వెంకటరమణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆదివారం రోజు ప్రత్యేక పనిదినంగా ఎందుకు విధులు నిర్వర్తించలేదని వీఆర్ఓ వెంకటరమణతో పాటు ముగ్గురు రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవటానికి ఆదేశించడమే కాకుండా కలెక్టర్ తమను దుర్భాషలాడినట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు ఐదు రోజుల క్రితం ఆత్మకూరు జూరాల వీఆర్ఓ, గోపాల్పేట మండలం బుద్దారం వీఆర్ఓలను కూడా సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఏకతాటిపైకి వచ్చిన రెవెన్యూ ఉద్యోగులు సస్పెన్షన్లతో ఆవేదన చెందిన రెవెన్యూ ఉద్యోగులు గురువారం ఏకతాటిపైకి వచ్చారు. విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీరంగాపురం తహసీల్దార్ మాట్లాడుతూ బుధవారం రాత్రి కలెక్టర్ శ్వేతా మహంతి తనను చిన్నపిల్లాడి మాదిరిగా దుర్భాషలాడారని చెబుతూ కంట తడి పెట్టుకున్నారు. రెవెన్యూ ఉద్యోగుల నిరసన శిబిరం వద్ద కలెక్టర్ జిందాబాద్ అంటూ వారు నినాదాలు చేయడం గమనార్హం. -
రైతుకు బంధువే
సాక్షి, హైదరాబాద్: రైతు బంధు పథకం అన్ని వర్గాలలో ఆదరణ పొందుతోంది. జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ దీనిపై చర్చ మొదలైంది. రైతులకు పెట్టుబడి సాయంకోసం ‘రైతు బంధు’పేరిట తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా రూ.12 వేల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఇటీవలే ఈ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఖరీఫ్ పెట్టుబడి సాయం పంపిణీ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఈ పథకంపై అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్ (జే–పీఎల్ఎల్) పరిశోధన సంస్థ తెలంగాణలో సర్వే నిర్వహించింది. అమెరికాలోని మసాచుసెట్స్ కేంద్రంగా, పేదరికాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ సంస్థ పరిశోధనలు సాగిస్తోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వ సహకారంతో రైతు బంధు పథకంపైనా సర్వే నిర్వహించింది. రైతుల నుంచి సమాచారం సేకరిస్తోంది. ఈ పథకం ఎలా అమలు జరుగుతుంది, ఎలా ఉపయోగపడుతుందన్న కోణాల్లో సర్వేను సునిశితంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 10 వేల మంది రైతులతో మాట్లాడారు. 5,700 మంది రైతులు పూర్తి స్థాయిలో సమాధానాలు ఇచ్చారు. రానున్న పదిరోజుల్లో సుమారు 20 వేల మంది రైతుల అభిప్రాయాలు సేకరించాలని ఆ సంస్థ భావిస్తోంది. ఐవీఆర్ఎస్ పద్ధతిలో మరో 40 వేల మంది లబ్ధిదారుల నుంచి సమాచారాన్ని సేకరించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు జరిగిన సర్వే వివరాల ప్రకారం, రైతు బంధు పథకంతో పాస్‌పుస్తకాలు, చెక్‌లు అందుకున్న రైతులు 81 శాతం మంది ఉన్నట్లు అంచనా వేశారు. మరో 12.4 శాతం మంది మాత్రం ఏమీ పొందలేదని అన్నారు. చిన్న, సన్నకారు, భూస్వాములు చెక్‌లు అందుకున్న అంశంపైనా ఆసక్తికర విషయం బయటపడింది. ఎక్కువ శాతం రైతులు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు చెక్‌లు అందుకున్నారని ఇలాంటి వారు 28 శాతం ఉన్నారని సర్వేలో వెల్లడైంది. రూ.6వేల నుంచి రూ.10 వేల చెక్‌లు అందుకున్న వారు 21.4 శాతం మంది, రూ.3 వేల నుంచి రూ.6 వేలు అందుకున్న వారు 24 శాతం రైతులు ఉన్నట్లు తేలింది. రూ.50 వేలకు పైగా చెక్‌ను అందుకున్నవారు 0.8 శాతం మంది రైతులు మాత్రమే ఉన్నట్లు సర్వే వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న రైతులు కొన్ని సూచనలు చేశారు. ఎక్కువ భూమి ఉన్న వారికి పెట్టుబడి సాయంపై కొంత నియంత్రణ ఉండాలని కోరారు. చెక్‌లు అందుకునే సమయంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కోలేదని 96 శాతం మంది రైతులు, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామని 2.5 శాతం మంది చెప్పారు. -
‘వచ్చే ఎన్నికలు ఏకపక్షమే’
సాక్షి, హైదరాబాద్: ‘వచ్చే ఎన్నికలు పూర్తిగా ఏకపక్షంగానే ఉంటాయి. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారు. మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి అవుతారు. మేం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. 2019లో సింగిల్‌గానే గెలిచి వస్తాం..’’అని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయాల్లో ఉండనని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై క్షేత్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోందని విలేకరులు ప్రస్తావించగా.. సీఎం కేసీఆర్ చేసిన మంచి పనులే తమను గెలిపిస్తాయని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘‘ఎమ్మెల్యేలకు ఓట్లు వేసేది కేసీఆర్‌ను సీఎం చేయడానికే. వచ్చే ఎన్నికల్లో మా నినాదమే సీఎం కేసీఆర్. ఆయన చేసిన మంచి పనులే టీఆర్ఎస్ను గెలిపిస్తాయి. ఎమ్మెల్యేలపై చిన్న చిన్న అసంతృప్తులున్నా ప్రజలు పట్టించుకోకుండా మాకు ఓట్లు వేస్తారు. ఎమ్మెల్యేల కదలికలపై ఏ రోజుకారోజు నివేదికలు వస్తున్నాయి. లోపాలను సరిదిద్దుకోవడానికి ఏడాది సమయం ఉంది..’’అని చెప్పారు. కేసీఆర్.. ఓ ఆధ్యాత్మిక వ్యక్తి.. బీజేపీ హిందూత్వ నినాదం తెలంగాణలో పనిచేయదని.. వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్, బీజేపీల కంటే ఎక్కువ ఆధ్మాత్మికత ఉన్న వ్యక్తి కేసీఆర్ అని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ సీఎంగా ఉండి కూడా తన ధార్మిక విశ్వాసాలను బహిరంగంగానే ప్రకటిస్తున్నారని.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్లు సైతం చేయని విధంగా ఆలయాలు నిర్మిస్తున్నారని, యాగాలు చేశారని చెప్పారు. రాష్ట్రంలో హిందూ–ముస్లిం పంచాయతీలు పెట్టే అవకాశం సైతం బీజేపీ వారికి లేదని.. అత్యంత పకడ్బందీగా శాంతి భద్రతలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. కర్ణాటకలో అధికారం చేజిక్కించుకోవడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను చూస్తుంటే.. ‘బడితె ఉన్నోడిదే బర్రె’ అన్నట్టుగా ఉందని విమర్శించారు. కర్ణాటక అసెంబ్లీలో బల నిరూపణకు అక్కడి గవర్నర్ బీజేపీకి 15 రోజులకు బదులు ఐదేళ్ల సమయమిచ్చి ఉండాల్సిందని ఎద్దేవా చేశారు. మేం ఎవరి కిందా పనిచేయడం లేదు.. బీజేపీతో టీఆర్ఎస్కు ఎలాంటి లోపాయికారీ ఒప్పందం ఉందన్న విమర్శలు అర్థరహితమని కేటీఆర్ స్పష్టం చేశారు. తమకు కేసీఆరే బాస్ అని.. నరేంద్ర మోదీయో, రాహుల్ గాంధీయో కాదని వ్యాఖ్యానించారు. ఏ ఒక్కరి కిందా ఉండాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఇక తనకు సీఎం కావాలన్న ఆశ లేదని, మరో పది పదిహేనేళ్లు కేసీఆరే సీఎంగా ఉంటారని పేర్కొన్నారు. కేసీఆర్ ఆరోగ్యాన్ని చూస్తూంటే.. తాము ఆయనకంటే ముందే రిటైరవుతామని అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రావడమే చాలని, అంతకంటే ఎక్కువ తాను కోరుకోలేదని చెప్పారు. మంత్రి పదవి రావడమే తనకు బోనస్ లాంటిదన్నారు. అసహనంతోనే అడ్డగోలు హామీలు! ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిశ్శబ్ద విప్లవం నడుస్తోందంటూ కాంగ్రెస్ చేస్తున్న విమర్శల్లో నిజముంటే.. ఆ పార్టీ నల్లగొండ, ఆలంపూర్ స్థానాల్లో ఎన్నికలకు ఎందుకు సిద్ధం కావడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఇస్తామంటూ కాంగ్రెస్ తప్పుడు హామీలిస్తోందని.. చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో నిరుద్యోగుల లెక్కలు చూపాలని సవాల్ చేశారు. నిరుద్యోగులంటే 5వ తరగతి వరకే చదివినవారా, లేక పదో తరగతి వరకే చదివినవారా అని ప్రశ్నించారు. అసహనంతోనే ఆచరణ సాధ్యం కాని హామీలిస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లలో ఏపీపీఎస్సీ ద్వారా ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తే.. తాము నాలుగేళ్లలోనే టీఎస్పీఎస్సీ ద్వారా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని.. ఇతర సంస్థల ఆధ్వర్యంలో జరిపిన నియామకాలు దీనికి అదనమని కేటీఆర్ చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. తాము నిరుద్యోగ భృతి ఇవ్వడం కాదని.. నిరుద్యోగాన్ని తగ్గించే దిశగా, ప్రైవేటు పరిశ్రమల ఏర్పాటుతో భారీగా ఉద్యోగాల కల్పన దిశగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఫార్మాసిటీ ద్వారా లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. వెల్స్పన్ పరిశ్రమకు రాయితీల మంజూరులో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను కేటీఆర్ ఖండించారు. ఉద్యోగావకాశాల కోసం అన్ని రాష్ట్రాలు భారీ పరిశ్రమలకు రాయితీలు ఇస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ జీవోలను వెబ్సైట్లో పెట్టకపోవడంపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ.. జీవోలను వెబ్సైట్లో పెట్టినా, పెట్టకపోయినా పెద్దగా వచ్చే నష్టమేమీ లేదన్నారు. ‘రైతుబంధు’తో రెండో హరిత విప్లవం రైతులకు పెట్టుబడి సాయం అందించే పథకం అసాధారణ చరిత్రాత్మక నిర్ణయమని.. ఇది దేశంలో రెండో హరిత విప్లవానికి నాంది పలకనుందని కేటీఆర్ పేర్కొన్నారు. తాను పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నానని.. ఇన్నేళ్లలో ‘రైతుబంధు’పథకం ద్వారా కలిగిన సంతృప్తి మరే కార్యక్రమం ద్వారా లభించలేదని చెప్పారు. ఈ పథకం కింద 58 లక్షల మందికి రూ.5,700 కోట్ల సాయం పంపిణీ చేస్తుండగా.. అందులో 98.3 శాతం మంది పదెకరాల్లోపు భూమి కలిగిన చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని తెలిపారు. పదెకరాలకుపైన భూమి కలిగిన రైతులు 1.7 శాతమేనని, వారికి చెల్లించేది రూ.7.13 కోట్లు మాత్రమేనని చెప్పారు. ఇంత మంచి కార్యక్రమానికి ఆటంకం కలిగించాలనే విపక్షాలు అడ్డగోలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. రైతుబంధు ద్వారా ఐదెకరాలున్న ప్రతి రైతుకు ఐదేళ్లలో రూ.2 లక్షలు అందుతాయన్నారు. కౌలు రైతులకు రైతుబంధు వర్తింపజేయడం ఆచరణలో సాధ్యం కాదని స్పష్టం చేశారు. కేంద్రం చేతులెత్తేసింది.. ఐటీఐఆర్, బయ్యారం ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని కేటీఆర్ చెప్పారు. దాంతో సీఎం కేసీఆర్ బుద్వేల్, మేడ్చెల్‌లలో ఐటీ క్లస్టర్ల ఏర్పాటును చేపట్టారని వెల్లడించారు. బయ్యారం కర్మాగారంలో సెయిల్, ఎన్ఎండీసీల నుంచి పెట్టుబడులు పెట్టేందుకు కేంద్రం నిరాకరించడంతో.. సింగరేణి నుంచి పెట్టుబడులు పెట్టాలని కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. ఇక సిర్పూర్ పేపర్ మిల్లు పునరుద్ధరణకు బ్యాంకర్ల కన్సార్షియం అంగీకరించిందని.. దానిని జేకే పేపర్ కంపెనీ త్వరలోనే పునరుద్ధరించనుందని వెల్లడించారు. -
‘రైతుబంధు’పై ఏమంటున్నారు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు పథకం అమలు తీరుతెన్నులు, క్షేత్రస్థాయిలో రైతుల అభిప్రాయాలను ఏ రోజుకారోజు ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు ఆరా తీస్తున్నారు. నేరుగా లబ్ధి పొందుతున్న రైతుల మనోగతం ఏంటని సీఎం ఆసక్తిగా అడిగి తెలుసుకుంటున్నారు. కౌలు రైతులకు ఇవ్వాలని, పెద్ద భూస్వాములకు ఎక్కువగా లబ్ధి జరుగుతోందన్న ప్రతిపక్షాల విమర్శలపై, రైతుల అభిప్రాయాలపై ఆరా తీస్తున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రులు, క్షేత్రస్థాయిలో ఎక్కువగా సంబంధాలున్న సీనియర్ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యులతో సమాచారం తెలుసుకుంటున్నారు. చెక్కులు, పాసుపుస్తకాలు అందుకున్న రైతులు చాలా ఆనందంగా ఉన్నారని ఎక్కువ మంది నుంచి సమాచారం అందుతోంది. అయితే రెవెన్యూ సిబ్బంది తప్పుల వల్ల అక్కడక్కడా ఇబ్బందులు తలెత్తుతున్న అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తెస్తున్నారు. సమస్యలపై దృష్టి పెట్టాలని ఆదేశం క్షేత్రస్థాయిలో వస్తున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు పథకం అమలు తీరు, రైతుల స్పందనపై రాజకీయంగా సత్ఫలితాలు ఇస్తుందనే విశ్వాసంతో కేసీఆర్ ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. -
కౌలురైతును భూయజమానే ఆదుకోవాలి
సాక్షి, సిరిసిల్ల: కౌలు రైతులకు సాయం చేసేందుకు రైతులే చొరవ తీసుకోవాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే.తారకరామారావు కోరారు. రైతుకు, కౌలు రైతుకు మధ్య తగువు పెట్టే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని, అందుకే వారి మధ్య జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో గురువారం రైతుబంధు కార్యక్రమం ముగింపు సభలో ఆయన మాట్లాడారు. యాదవులు కేటీఆర్‌కు గొర్రెపిల్ల, గొంగడిని బహూకరించారు. గత పదేళ్లలో ఎమ్మెల్యేగా తాను అనేక కార్యక్రమాలకు హాజరవుతున్నా రైతుకు సాయం అందించే రైతుబంధు కార్యక్రమం అత్యంత సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. రైతుల కోసం చేస్తున్న గొప్ప పథకాన్ని ఎన్నికల కోసమే అంటూ కొందరు కారుకూతలు కూస్తున్నారని, సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని 13 నెలల కిందటే ప్రకటించారని అప్పుడు ఏ ఎన్నికలు ఉన్నాయని ప్రశ్నించారు. గ్రామాల్లో ఉన్న రాజకీయ రహితమైన ప్రశాంత వాతావరణం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. రుణమాఫీని ఒక్క దఫాలోనే పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి సంకల్పానికి ఆర్బీఐ ఒప్పుకోలేదని దానిపై సంతృప్తి లేకనే ఆయన రైతుబంధును చేపట్టాలని నిర్ణయించుకున్నారని వివరించారు. ఇప్పటి వరకు ఉన్న పంటల బీమా పథకం లోపభూయిష్టమైనదని, అందుకే జూన్ 2 నుంచి రైతులకు బీమా పథకాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు. రైతుబంధు చెక్కులు పంపిణీ చేస్తూ రైతులను మంత్రి పేరుపేరున పలకరించి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, కలెక్టర్ కృష్ణభాస్కర్, జేసీ యాస్మిన్‌బాషా పాల్గొన్నారు. -
స్టెప్పులేసిన స్పీకర్, మంత్రి, ఎంపీ
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొంపల్లి గ్రామంలో నిర్వహించిన రైతుబంధు చెక్కులు, పాసుపుస్తకాల పంపిణీ సభలో పాటకు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి డ్యాన్స్ చేశారు. ఆయన స్టెప్పులేస్తూ స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీ బండా ప్రకాశ్‌ను పిలవడంతో ముగ్గురూ కలసి స్టేజీపై డ్యాన్స్ చేశారు. దీంతో రైతులు, టీఆర్ఎస్ నేతలు ఈలలు, చప్పట్లతో సభ మారుమోగింది. -
దేశానికే ఆదర్శం తెలంగాణ
సాక్షి, సిద్దిపేట: రైతును రాజుగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లాలోని నారాయణరావుపేటలో వారు రైతుబంధు పథకం చెక్కుల పంపిణీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ భూ రికార్డులను ప్రక్షాళన చేసి రైతులకు పాస్‌పుస్తకాలు అందచేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. అన్నదాతలు పండించిన ప్రతి గింజను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తామన్నారు. రాష్ట్రం లో ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా జరుగుతోందని కొద్ది రోజుల్లో గోదావరి, కృష్ణా జలాలతో చెరువులు నింపుతామని స్పష్టం చేశారు. పోచారం మాట్లాడుతూ.. రైతు అయిన కేసీఆర్ సీఎం కావడం రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు. రైతుకు కావాల్సిన ఉచిత విద్యుత్, సకాలంలో ఎరువులు, పండిన పంటకు మద్దతు ధర, పెట్టుబడి సహాయం అందించడం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే సాధ్యం అయిందని అన్నారు. రైతులు సమావేశమయ్యేం దుకు ప్రతి గ్రామంలో రూ.12 లక్షలతో సమన్వయ సమితి భవన నిర్మాణాలు చేపడుతున్నామని వివరించారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ ఏర్పాటే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం రైతుల సంక్షేమానికి అత్యధిక నిధులు కేటాయిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బి.వెంకటేశ్వర్లు, సుధాకర్‌రెడ్డి, ఫారూక్ హుస్సేన్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ్‌కు మతిమరుపు వ్యాధి చిన్నకోడూరు(సిద్దిపేట): సీఎం కేసీఆర్‌ను జాక్‌పాట్ ముఖ్యమంత్రిగా అభివర్ణించిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీల్డ్ కవర్లద్వారా పదవులు పొందే జాక్‌పాట్ నాయకులు కాంగ్రేస్ వాళ్లేనని ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్‌లో గురువారం రాత్రి ఆయన రైతుబంధు చెక్కుల పంపిణీలో పాల్గొన్నారు. కేసీఆర్ ఉద్యమంలో పాల్గొనలేదని ఉత్తమ్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఆయనకు మతిమరుపు వ్యాధి వచ్చిందన్నారు. ఆకట్టుకున్న పోచారం పిట్టకథ కాంగ్రెస్ బస్సు యాత్రపై మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభలో చెప్పిన పిట్టకథ అందరినీ నవ్వించింది. గాంధీభవన్ నుంచి బయలుదేరిన 50 మంది కాంగ్రెస్ నాయకుల బృందంలో బస్సు యాత్ర సిద్దిపేటకు రాగానే మంత్రి హరీశ్‌రావు పంపిణీ చేసే రైతుబంధు చెక్కులు తీసుకునేందుకు 10 మంది దిగిపోయారని, అక్కడి నుంచి సిరిసిల్లకు వెళ్లగానే మంత్రి కేటీఆర్ చెక్కులు పంచుతుండగా మరో పది మంది, తర్వాత కరీంనగర్లో ఈటల చెక్కుల పంపిణీ చూసిన మరో పది మంది, కామారెడ్డిలో మరో పదిమంది దిగిపోయారని, నిజామాబాద్ రాగానే డ్రైవర్ కూడా దిగిపోవడంతో బస్సు నడిపేవారు లేక ఉత్తమ్, జానాఒకరి ముఖం మరొకరు చూసుకోవాల్సి వచ్చింద న్నారు. ఇలా కాంగ్రెస్ వారంతా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. -
కౌలు, పోడు రైతులకు వర్తింపజేయాలి
హైదరాబాద్: ప్రభుత్వానికి నిజంగా రైతులను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ఉంటే కౌలు, పోడు రైతులకు రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి నాలుగు వేలు అందించాలని తెలంగాణ ప్రజల పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. కౌలు, పోడు రైతులకు రైతుబంధు పథకం వర్తింపచేయాలనే డిమాండ్‌తో వచ్చే నెల రెండవ తేదీన∙అన్ని సంఘాలతో కలసి పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. మరునాడు రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. గురువారం ఇక్కడ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడారు. వ్యవసాయాన్ని లాభసాటి వ్యవహారంగా చేయాలంటే ముందుగా గిట్టుబాటు ధర నిర్ణయించాలని, ప్రతి క్వింటా పంటకు వెయ్యి రూపాయల బోనస్ ఇవ్వాలని సూచించారు. వీటిని పట్టించుకోకుండా ఎన్ని జిమ్మిక్కులు చేసినా రైతులకు లబ్ధి చేకూరదని అభిప్రాయపడ్డారు. వందలాది ఎకరాల భూములున్న అనేకమంది వ్యాపారులు, భూస్వాములు, ఉన్నతాధికారులకు రైతుబంధు ద్వారా లక్షలాది రూపాయలు అందిస్తూ కౌలురైతులను విస్మరించిందని అన్నారు. ఈ పథకం వల్ల సామాన్య రైతులకు లబ్ధి చేకూరడంలేదని, ప్రభుత్వం ఆర్భాటంగా ఇతర భాషల్లో కూడా ప్రచారం చేసి వంద కోట్లు ఖర్చుపెట్టిందని విమర్శించారు. ప్రచారానికి వెచ్చించిన ఆ డబ్బును ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇవ్వొచ్చుకదా? అని ప్రశ్నించారు. రైతుబంధు పథకాన్ని పునఃపరిశీలించి కౌలు, పోడు రైతులకు వర్తింపచేయాలని, రైతులందరికీ వడ్డీలేని రుణాలివ్వాలని, కల్తీలేని విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అవసరం మేర రైతులకు అందించాలని, ప్రతి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి డాక్టర్ సాంబశివ గౌడ్, ఓట్ నీడ్ గ్యారెంటీ వ్యవస్థాపకురాలు సోగరా బేగం, మోహన్‌రాజ్, వేదవికాస్, సలీం, నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రెండో రోజు 4.48 లక్షల చెక్కులు
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు పథకం కింద రెండోరోజు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 1,372 గ్రామాల్లో 4.48 లక్షల చెక్కులను పంపిణీ చేసినట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. శుక్రవారం సాయంత్రానికి రూ.227 కోట్ల విలువైన చెక్కులను రైతులు నగదుగా మార్చుకున్నారని వెల్లడించింది. శుక్ర వారం వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి రైతుబంధు పథకం కింద చెక్కుల పంపిణీ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. అన్ని గ్రామాలలో నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే చెక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ జరుగుతున్నట్టు వ్యవసాయ శాఖ తెలిపింది. ఎండ తీవ్రత దృష్ట్యా కౌంటర్ల వద్ద తాగునీరు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్లతోపాటు ఫిర్యాదు కౌంటర్లను కూడా ఏర్పాటు చేసినట్లు వివరించింది. కొన్నిచోట్ల రైతులకు పాస్ బుక్కులు లేకుండానే చెక్కులు ఇచ్చారని తెలిపింది. ఆ చెక్కులను నగదుగా మార్చుకునే అంశంపై పార్థసారథి ఎస్ఎల్బీసీ అధికారుతో మాట్లాడారని వివరించింది. -
పార్టీకి ‘బంధువే’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘రైతు బంధు’పథకంతో గ్రామాల్లో టీఆర్ఎస్కు చాలా ప్రయోజనం కలుగుతుందని ఆ పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి పెట్టుబడి సాయం కింద ఏటా ఎకరానికి రూ.8 వేలు అందజేసే ఈ పథకం ద్వారా ప్రభుత్వం పై, పార్టీపై రైతుల్లో కృతజ్ఞతాభావం పెరుగుతుందని వారంటున్నారు. ‘రైతుబంధు’చెక్కులు అందుకున్న రైతులు సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారంటూ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి టీఆర్ఎస్ శ్రేణులు పార్టీ కేంద్ర కార్యాలయానికి సమాచారం పంపుతున్నాయి. ఈ పథకం పెద్దగా ప్రచారం చేసే అవసరం లేకుండానే.. పార్టీకి, ప్రభుత్వానికి పేరు తెచ్చిపెట్టునట్టు పేర్కొంటున్నాయి. కేసీఆర్‌పై ప్రశంసలు.. ఇప్పటిదాకా రుణాల కోసం బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేదని.. రైతు బంధు ద్వారా ఉచితంగానే, ఎలాంటి పైరవీలు లేకుండానే ఎకరానికి రూ.4 వేల సాయాన్ని అందుకుంటున్నామని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. రైతు క్షేమాన్ని ఆలోచించే నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రశంసల జల్లు కురుస్తోందంటున్నారు. ఇప్పటివరకూ కేసీఆర్ కు ఇంత పేరు తెచ్చిన పథకమేదీ లేదంటున్నారు. అట్టహాసంగా కార్యక్రమాలు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ‘రైతు బంధు’ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించగా.. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధులు చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లెల్లో ఎడ్లబండ్లపై ఊరేగింపులు, అలంకరణలు వంటివి చేసి సంబురాలు జరుపుకుంటున్నారు. -
ఆదాయం ఓకే.. సంక్షేమమేదీ?
కాశిబుగ్గ, న్యూస్‌లైన్ : వ్యవసాయ మార్కెట్లు అభివృద్ధి చెందాలన్నా.. ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు రావాల న్నా.. పాలక మండళ్లు ఏర్పడాలన్నా వాటి నిర్వహణ సక్రమంగా ఉండాలి. అప్పుడే ఎక్కువ సంఖ్యలో రైతులు పంట సరుకులు తీసుకురావడం.. తద్వారా ఆదాయం పెరిగే అవకాశముంటుంది. అయితే, రైతు ల ద్వారా రాబడి పెద్దమొత్తంలో ఉన్నా వారి సంక్షేమం కోసం నిబంధనల ప్రకారం ఖర్చు పెట్టే విషయంలో అటు పాలకవర్గాలు, ఇటు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా వ్యవసాయ మార్కెట్లకు వచ్చే రైతులు సౌకర్యాల లేమితో ఇబ్బం ది పడుతుండగా, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల నిర్వహణ లోపభూయిష్టంగా మారుతోంది. జిల్లాలో 14 మార్కెట్లు జిల్లా పరిధిలో ప్రస్తుతం 14 మార్కెట్లు ఉండగా, వీటిన్నింటిపై గత ఆరేళ్లలో రూ.177 కోట్ల ఆదాయం వ చ్చింది. ఇందులో ఒక వరంగల్‌లోని ఏనుమాముల మార్కెట్ ద్వారా గత ఏడాది రూ.20కోట్ల ఆదాయం లభించింది. ఇది ఏటేటా పెరుగుతున్నా మార్కెట్లో మౌలిక వసతుల కల్పన ఆ స్థాయిలో ఉండడం లేదు. ఇక మార్కెట్‌కు వ్యవసాయ ఉత్పత్తులు తీసుకువచ్చే రైతుల సంక్షేమాన్ని అటు పాలకవర్గాలు, ఇటు అధికారులు పట్టించుకోకపోవడంతో వారు అరిగోస పడుతున్నారు. మార్కెట్లకు వచ్చే రైతులకు రైతుబం ధు పథకం, రైతు బీమా, రైతు ఆరోగ్య శిబిరాలు, పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వారిని ఆదుకోవా ల్సి ఉంటుంది. కానీ, ఆ దిశగా ఏ పాలకవర్గం కూడా దృష్టి సారించడం లేదు. వరంగల్ మార్కెట్ ఆదాయమే రూ.94 కోట్లు వరంగల్ ఏనుమాముల మార్కెట్‌కు ఏటా ఆదాయం పెరుగుతున్నా మౌలిక సదుపాయాలకు సర్కారు ఖ ర్చు చేస్తున్నది అంతంత మాత్రమే. ఈ మార్కెట్‌కు 2008-2009 సంవత్సరానికి 13.16 కోట్ల ఆదాయం రాగా, 2009-2010 లో రూ.14-15 కోట్లు, 2010-11లో రూ.17.36 కోట్లు, 2011-12లో రూ.18.05 కోట్లు వచ్చింది. ఇక 2012-13 సంవత్సరంలోనైతే మార్కెట్ ఆదాయం రూ.20కోట్లకు చేరుకోగా, ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ వరకు సుమారు రూ.12 కోట్లకు చేరుకుంది. అంటే మొత్తం ఆరేళ్లలో సుమారు రూ.94 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో ఆరోగ్య కేంద్రాల ద్వారా నెలకు రూ.10వేల మందులు మా త్రమే రైతులకు అందజేస్తున్నారు. అలాగే, గత ఆరేళ్ల లో నర్సంపేట మార్కెట్‌కు రూ.16.44 కోట్ల ఆదా యం రాగా, కేసముద్రం మార్కెట్ రూ. 10.52 కో ట్లు, జనగామకు రూ.11.88 కోట్లు, మహబూబాబాద్‌కు రూ.7.96 కోట్లు, ములుగుకు రూ 6.89 కోట్లు చే ర్యాలకు రూ.5.25 కోట్లు, పరకాలకు రూ.4.96 కో ట్లు, స్టేషన్ ఘన్‌పూర్‌కు రూ.4.25 కోట్లు, వర్ధన్నపేటకు రూ.2.97 కోట్లు, నెక్కొండకు రూ.3.91 కోట్లు, ఆత్మకూరుకు రూ.2.13 కోట్లు, తొర్రూరుకు 4.55 కోట్లు, కొడకండ్ల మార్కెట్‌కు రూ.2.04 కోట్ల ఆదాయం లభించింది. అన్ని కలిపి 2008 నుంచి 2014 వరకు రూ.177 కోట్ల ఆదాయం వస్తే, రైతు సంక్షేమానికి రూ.2కోట్లే ఖర్చు చేశారంటే పాలకవర్గాలు, అధికారుల చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. రైతు సంక్షేమం కోసం ఇలా ఖర్చు చేయచ్చు మార్కెట్ యార్డులకు పంట సరుకులు తీసుకొచ్చే రై తుల ద్వారా వచ్చే ఆదాయంలో 25 శాతం వారి సంక్షేమం కోసం ఖర్చు చేయవచ్చు. రైతు బంధు, రైతు బీమా, రైతుల ఆరోగ్యం కోసం వైద్య శిబిరాలు, పశు వైద్య శిబిరాలు వంటి కార్యక్రమాలు ఏర్పాటుచే స్తూ వారికి విశేష సేవలు అందించవచ్చు. కానీ జిల్లా లో ఉన్న 14 మార్కెట్లలోని ఏ పాలకవర్గం కూడా ఈ దిశగా దృష్టి సారించడం లేదు. కొన్ని మార్కెట్లలో మరుగుదొడ్లు, మూత్రశాలలు, మంచినీటి సౌకర్యం సైతం అందుబాటులో లేదంటే మార్కెట్‌కు వచ్చే రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అ ర్థం చేసుకోవచ్చు. ఇక ప్రతి మార్కెట్‌కు వచ్చే ఆదాయంలో 20 శా తం నిధులు యార్డుల అభివృద్ధికి, మార్కెట్లో మౌలిక వసతుల కోసం ఖర్చు చేయొచ్చ నే నిబంధన ఉండగా... ఈ నిధులు మాత్రం ఏటా తప్పకుండా ఖర్చు చేస్తున్నారు. ఏమంటే ఈ నిధుల ద్వారా చేపట్టే పనుల ద్వారా కమీషన్లు లభిస్తాయనే ఆశ. ఇప్పటికైనా పాలకవర్గాలు, అధికారులు రైతు సంక్షేమంపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.