
సాక్షి, హైదరాబాద్: కౌలు చట్టాలపై అవగాహన లేకుండా ప్రతిపక్ష నేతలు రైతుబంధు పథకంపై నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లా డుతూ, కౌలు రైతులపై కపట ప్రేమ ఒలకబోస్తూ, టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు.
కౌలు రైతుల గురించి మాట్లాడుతున్న వారు 1956 టెనెన్సీ యాక్ట్ చదివితే బాగుంటుందన్నారు. మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఎప్పుడు, ఏ పార్టీలో ఉంటారో, ఎప్పుడే పార్టీలోకి మారతారో ఎవరికీ తెలి యదని పల్లా ఎద్దేవా చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై, మిషన్ భగీరథపై ఏవేవో మాట్లాడుతున్న నాగం వాదనల్లో నిజం ఉంటే కోర్టులకు ఎందుకు వెళ్లట్లేదని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment