
కె.జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు పథకం విధివిధానాలను నిర్ధారించేందుకుగాను అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయా లని సీఎల్పీ నేత కె.జానారెడ్డి డిమాండ్ చేశారు. వ్యవసాయానికి పెట్టుబడి సాయం కౌలుదారుడికి కూడా అందజేయాలనేది తమ విధానమన్నారు. కౌలురైతుల వివరాలను సేకరించాలని బుధవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోరారు. వ్యవసాయం చేసినవారికే రైతుబంధు నిధులివ్వాలని అన్నారు. సినీ విమర్శకుడు కత్తి మహేశ్ చేసిన వ్యాఖ్యానాలు సమాజంలో భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, ఆయనపై చట్టరీత్యా కఠినచర్యలు తీసుకోవాలన్నారు.