
సాక్షి, సిటీబ్యూరో: కరోనా తర్వాతి నుంచి కో-వర్కింగ్ స్పేస్‌కు డిమాండ్ పెరిగింది. స్టార్టప్స్‌తో పాటు ప్రధాన కంపెనీలు కూడా ఫ్లెక్సిబుల్ వర్క్ ప్లేస్‌ల నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. దీంతో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ప్రతి ఏటా కో–వర్కింగ్ స్పేస్ లావాదేవీల వాటా 20 శాతానికి పైగా ఉంటుంది.
కో–వర్కింగ్ స్పేస్ డిమాండ్‌కు ప్రధాన కారణం సిటీ సెంటర్లు లేదా ప్రధాన ఉపాధి కేంద్రాలలో మాత్రమే కాకుండా నగర వ్యాప్తంగా విస్తరించి ఉండటమే.. అభివృద్ధి చెందుతున్న కొత్త ఏరియాలు, శివారు ప్రాంతాలు, గృహ సముదాయాలకు చేరువలో ఈ సెంటర్లు ఉంటున్నాయి. అలాగే ప్రధాన మెట్రో నగరాలలో షాపింగ్ మాల్స్, హోటళ్లలోనూ ఫ్లెక్సిబుల్ స్పేస్‌లు అందుబాటులోకి వచ్చాయి.
దీంతో చాలా కంపెనీలు ఉద్యోగుల గృహాలకు చేరువలో ఉండే కో–వర్కింగ్ స్పేస్‌లను తీసుకొని కార్యకలాపాలు సాగిస్తున్నాయని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. అలాగే ఫ్లెకిబుల్ ఆఫీస్ స్పేస్ అద్దె కూడా సాధారణ ఆఫీసు స్పేస్ రెంట్స్‌కు సమానంగా ఉండటం, రెగ్యులర్ ఆఫీసు స్పేస్‌కు ఉండే 3–4 ఏళ్ల లాకిన్ పీరియడ్‌తో పోలిస్తే కో–వర్కింగ్ స్పేస్‌కు కాల పరిమితి ఉండకపోవటం వంటివి కూడా కంపెనీల ఆకర్షణకు కారణాలని ఆయన పేర్కొన్నారు.

Comments
Please login to add a commentAdd a comment