సాక్షి, హైదరాబాద్: రైతుబంధు పథకం కింద రెండోరోజు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 1,372 గ్రామాల్లో 4.48 లక్షల చెక్కులను పంపిణీ చేసినట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. శుక్రవారం సాయంత్రానికి రూ.227 కోట్ల విలువైన చెక్కులను రైతులు నగదుగా మార్చుకున్నారని వెల్లడించింది. శుక్ర వారం వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి రైతుబంధు పథకం కింద చెక్కుల పంపిణీ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.
అన్ని గ్రామాలలో నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే చెక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ జరుగుతున్నట్టు వ్యవసాయ శాఖ తెలిపింది. ఎండ తీవ్రత దృష్ట్యా కౌంటర్ల వద్ద తాగునీరు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లతోపాటు ఫిర్యాదు కౌంటర్లను కూడా ఏర్పాటు చేసినట్లు వివరించింది. కొన్నిచోట్ల రైతులకు పాస్ బుక్కులు లేకుండానే చెక్కులు ఇచ్చారని తెలిపింది. ఆ చెక్కులను నగదుగా మార్చుకునే అంశంపై పార్థసారథి ఎస్‌ఎల్‌బీసీ అధికారుతో మాట్లాడారని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment