గుర్ల బాధిత కుటుంబాలకు అండగా వైఎస్సార్‌సీపీ.. చెక్కులు అందజేత | YSRCP MLC Botsa Satyanarayana Given Checks To Gurla Victim Families | Sakshi
Sakshi News home page

గుర్ల బాధిత కుటుంబాలకు అండగా వైఎస్సార్‌సీపీ.. చెక్కులు అందజేత

Published Tue, Nov 26 2024 5:28 PM | Last Updated on Tue, Nov 26 2024 6:32 PM

 YSRCP MLC Botsa Satyanarayana Given Checks To Gurla Victim Families

సాక్షి, విజయనగరం: ఏపీలో కూటమి ప్రభుత్వ నేతల్లో ప్రజల పట్ల బాధ్యత లేదన్నారు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. చంద్రబాబు సర్కార్‌ డయేరియా బాధితులను పట్టించుకోలేదన్నారు. డయేరియా మరణాలు ఎంతో బాధాకరమని చెప్పారు.

విజయనగరంలోని గుర్ల మండలంలో డయేరియాతో మృతి చెందిన 13 కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ తరఫున ఒక్కొక్కరికి రెండు లక్షలు ఆర్ధిక సాయం అందించారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ..‘డయేరియాతో మరణించడం బాధాకరం. ⁠అసెంబ్లీలో ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా సమాధానం చెప్పింది. ⁠ప్రభుత్వాన్ని ఎన్ని అడిగినా వాళ్లు సక్రమంగా సమాధానం చెప్పలేదు. సీఎం చంద్రబాబు.. ఎనిమిది మంది అని, డిప్యూటీ సీఎం పది మంది మృతి చెందారని చెప్పారు. ప్రభుత్వం ఒక్కరే అని చెప్పిందని మండిపడ్డారు.

గతంలో నేను ఎప్పుడూ విజయనగరంలో ఇంత మంది డయేరియాతో చనిపోవడం చూడలేదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్లు బాధ్యతగా వ్యవహరించడం లేదు. డయేరియా బాధితుల విషయంలో వైఎస్సార్‌సీపీ అధినేత ⁠వైఎస్ జగన్ వెంటనే స్పందించారు. ప్రజల పట్ల బాధ్యత వహించారు. బాధితులకు అండగా నిలిచారు. వైఎస్సార్‌సీపీ తరఫున ఒక్కో కుటుంబానికి రెండు లక్షలు ఆర్ధిక సాయం అందించారు. గుర్ల మండలానికి మేము వచ్చి చూసే వరకు ప్రభుత్వం బాధితులను పట్టించుకోలేదు’ అంటూ కామెంట్స్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement