dayeria patients
-
గుర్ల బాధిత కుటుంబాలకు అండగా వైఎస్సార్సీపీ.. చెక్కులు అందజేత
సాక్షి, విజయనగరం: ఏపీలో కూటమి ప్రభుత్వ నేతల్లో ప్రజల పట్ల బాధ్యత లేదన్నారు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. చంద్రబాబు సర్కార్ డయేరియా బాధితులను పట్టించుకోలేదన్నారు. డయేరియా మరణాలు ఎంతో బాధాకరమని చెప్పారు.విజయనగరంలోని గుర్ల మండలంలో డయేరియాతో మృతి చెందిన 13 కుటుంబాలకు వైఎస్సార్సీపీ తరఫున ఒక్కొక్కరికి రెండు లక్షలు ఆర్ధిక సాయం అందించారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ..‘డయేరియాతో మరణించడం బాధాకరం. అసెంబ్లీలో ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా సమాధానం చెప్పింది. ప్రభుత్వాన్ని ఎన్ని అడిగినా వాళ్లు సక్రమంగా సమాధానం చెప్పలేదు. సీఎం చంద్రబాబు.. ఎనిమిది మంది అని, డిప్యూటీ సీఎం పది మంది మృతి చెందారని చెప్పారు. ప్రభుత్వం ఒక్కరే అని చెప్పిందని మండిపడ్డారు.గతంలో నేను ఎప్పుడూ విజయనగరంలో ఇంత మంది డయేరియాతో చనిపోవడం చూడలేదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్లు బాధ్యతగా వ్యవహరించడం లేదు. డయేరియా బాధితుల విషయంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ వెంటనే స్పందించారు. ప్రజల పట్ల బాధ్యత వహించారు. బాధితులకు అండగా నిలిచారు. వైఎస్సార్సీపీ తరఫున ఒక్కో కుటుంబానికి రెండు లక్షలు ఆర్ధిక సాయం అందించారు. గుర్ల మండలానికి మేము వచ్చి చూసే వరకు ప్రభుత్వం బాధితులను పట్టించుకోలేదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
అదుపులోకి రాని అతిసారం
మరో 9 కేసుల నమోదు పెద్దాపురం : ఆనూరులో విజృంభించిన అతిసార మహమ్మారి ఇంకా అదుపులోకి రాలేదు. ఆదివా రం మరో ముగ్గురు ఆస్పత్రి పాలవ్వగా, వీరితో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన మరో ఆరుగురు వ్యాధి బారిన పడ్డారు. వాంతులు, విరేచనాలతో ఆనూరుకు చెందిన కనిపే సంతోష్‌కుమార్, పల్లేటి జ్యోతి, నల్లి ఆనూషతో పాటు కాతేటి అప్పారావు, టి.నాగరత్నం, కె.ఆంజనేయలక్ష్మి, నూకతట్టు మంగ, శ్యామల, పైడిమళ్ల గణేష్, చిన్నారావు, కొండపల్లి గ్రామానికి చెందిన కొత్తా సూర్యారావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే పెద్దాపురం భాస్కర కాలనీకి చెందిన యు.హిమబిందు, సామర్లకోటకు చెందిన ఎస్.లక్ష్మి, కాట్రావులపల్లికి చెందిన జి.అమ్ములు, నాయకంపల్లికి చెందిన గంధం నాగమణి, గంధం వెంకాయమ్మ ఆస్పత్రిలో చేరారు. ఆదివారం కావడంతో వైద్యులు పూర్తి స్థాయిలో అందుబాటులో లేనప్పటికీ, ప్రియ అనే వైద్యురాలు సిబ్బందితో కలిసి సేవలందిస్తున్నారు. కరపత్రాలను ఇంటింటా పంపిణీ చేస్తున్నామని, శానిటేషన్ మెరుగుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు మున్సిపల్ కమిషనర్ ఎ.వెంకట్రావు తెలిపారు. ఇలాఉండగా డీఎంహెచ్ఓ చంద్రయ్య ఆస్పత్రిని సందర్శించి, రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు.