అదుపులోకి రాని అతిసారం
అదుపులోకి రాని అతిసారం
Published Sun, Aug 7 2016 10:58 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
మరో 9 కేసుల నమోదు
పెద్దాపురం :
ఆనూరులో విజృంభించిన అతిసార మహమ్మారి ఇంకా అదుపులోకి రాలేదు. ఆదివా రం మరో ముగ్గురు ఆస్పత్రి పాలవ్వగా, వీరితో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన మరో ఆరుగురు వ్యాధి బారిన పడ్డారు. వాంతులు, విరేచనాలతో ఆనూరుకు చెందిన కనిపే సంతోష్‌కుమార్, పల్లేటి జ్యోతి, నల్లి ఆనూషతో పాటు కాతేటి అప్పారావు, టి.నాగరత్నం, కె.ఆంజనేయలక్ష్మి, నూకతట్టు మంగ, శ్యామల, పైడిమళ్ల గణేష్, చిన్నారావు, కొండపల్లి గ్రామానికి చెందిన కొత్తా సూర్యారావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే పెద్దాపురం భాస్కర కాలనీకి చెందిన యు.హిమబిందు, సామర్లకోటకు చెందిన ఎస్.లక్ష్మి, కాట్రావులపల్లికి చెందిన జి.అమ్ములు, నాయకంపల్లికి చెందిన గంధం నాగమణి, గంధం వెంకాయమ్మ ఆస్పత్రిలో చేరారు. ఆదివారం కావడంతో వైద్యులు పూర్తి స్థాయిలో అందుబాటులో లేనప్పటికీ, ప్రియ అనే వైద్యురాలు సిబ్బందితో కలిసి సేవలందిస్తున్నారు. కరపత్రాలను ఇంటింటా పంపిణీ చేస్తున్నామని, శానిటేషన్ మెరుగుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు మున్సిపల్ కమిషనర్ ఎ.వెంకట్రావు తెలిపారు. ఇలాఉండగా డీఎంహెచ్‌ఓ చంద్రయ్య ఆస్పత్రిని సందర్శించి, రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు.
Advertisement