ప్రిస్క్రిప్షన్‌ అడిగి మరీ .. డాక్టర్‌ని కాల్చి చంపిన టీనేజర్లు | Doctor Was Shot Dead By Two Teenagers In Delhi | Sakshi
Sakshi News home page

ప్రిస్క్రిప్షన్‌ అడిగి మరీ .. డాక్టర్‌ని కాల్చి చంపిన టీనేజర్లు

Published Thu, Oct 3 2024 11:40 AM | Last Updated on Thu, Oct 3 2024 1:38 PM

Doctor Was Shot Dead By Two Teenagers In Delhi

ఢిల్లీ :  గాయమైన తన కాలుకి వైద్యం చేసిన ఓ డాక్టర్‌ను ప్రిస్క్రిప్షన్‌ అడిగి మరీ ఓ ఇద్దరు టీనేజర్లు కాల్చి చంపారు. ఈ ఘటన ఢిల్లీలో కలకలం రేపుతుంది.  

ఢిల్లీ పోలీసు వివరాల మేరకు..  ఢిల్లీలోని జైత్‌పూర్ ప్రాంతంలో జావేద్‌ అక్తర్‌ యునాని వైద్యుడిగా చెలామణీ అవుతున్నారు. నిమా ఆస్పత్రి పేరుతో ప్రాచీన వైద్యాలుగా పేరుగాంచిన యునానీ వైద్య పద్ధతుల ద్వారా పేషెంట్లకు వైద్య సేవలందిస్తున్నారు.

జావెద్‌ అక్తర్‌ రెండ్రోజుల క్రితం కాలికి గాయమైన ఇద్దరు టీనేజర్లకు ట్రీట్మెంట్‌ అందించారు. అయితే ఆ ఇద్దరు టీనేజర్లు మరోసారి బుధవారం అర్థరాత్రి 1.30గంటల సమయంలో కాలికి డ్రెస్సింగ్‌ చేయాలని కోరారు. దీంతో  ఆస్పత్రి సిబ్బంది వారికి డ్రెస్సింగ్‌ చేశారు. అనంతరం ప్రిస్క్రిప్షన్‌ కావాలంటూ డాక్టర్‌ క్యాబిన్‌లోకి వెళ్లారు. వెళ్లిన క్షణాల్లోనే క్యాబిన్‌ నుంచి కాల్పులు శబ్ధం వినపడింది. దీంతో అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది డాక్టర్‌ క్యాబిన్‌ను పరిశీలించగా.. డాక్టర్‌ రక్తపు మడుగులో పడి ఉన్నారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారు.

వెంటనే ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుల గురించి ఆరా తీశారు. పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. రెండ్రోజుల క్రితం ఆ ఇద్దరు టీనేజర్లు ఆస్పత్రి భయట రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement