vizainagaram
-
గుర్ల బాధిత కుటుంబాలకు అండగా వైఎస్సార్సీపీ.. చెక్కులు అందజేత
సాక్షి, విజయనగరం: ఏపీలో కూటమి ప్రభుత్వ నేతల్లో ప్రజల పట్ల బాధ్యత లేదన్నారు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. చంద్రబాబు సర్కార్ డయేరియా బాధితులను పట్టించుకోలేదన్నారు. డయేరియా మరణాలు ఎంతో బాధాకరమని చెప్పారు.విజయనగరంలోని గుర్ల మండలంలో డయేరియాతో మృతి చెందిన 13 కుటుంబాలకు వైఎస్సార్సీపీ తరఫున ఒక్కొక్కరికి రెండు లక్షలు ఆర్ధిక సాయం అందించారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ..‘డయేరియాతో మరణించడం బాధాకరం. అసెంబ్లీలో ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా సమాధానం చెప్పింది. ప్రభుత్వాన్ని ఎన్ని అడిగినా వాళ్లు సక్రమంగా సమాధానం చెప్పలేదు. సీఎం చంద్రబాబు.. ఎనిమిది మంది అని, డిప్యూటీ సీఎం పది మంది మృతి చెందారని చెప్పారు. ప్రభుత్వం ఒక్కరే అని చెప్పిందని మండిపడ్డారు.గతంలో నేను ఎప్పుడూ విజయనగరంలో ఇంత మంది డయేరియాతో చనిపోవడం చూడలేదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్లు బాధ్యతగా వ్యవహరించడం లేదు. డయేరియా బాధితుల విషయంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ వెంటనే స్పందించారు. ప్రజల పట్ల బాధ్యత వహించారు. బాధితులకు అండగా నిలిచారు. వైఎస్సార్సీపీ తరఫున ఒక్కో కుటుంబానికి రెండు లక్షలు ఆర్ధిక సాయం అందించారు. గుర్ల మండలానికి మేము వచ్చి చూసే వరకు ప్రభుత్వం బాధితులను పట్టించుకోలేదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
బావిలో దూకి నలుగురు కరోనా రోగులు ఆత్మహత్య
-
విజయనగరంలో పైడితల్లి అమ్మవారి జాతర
-
ఆయన ఇంతగా దిగజారి మాట్లాడతారా?
సాక్షి, విజయనగరం : టీడీపీ నేత, మాజీమంత్రి అశోక్ గజపతి రాజు వ్యాఖ్యలపై సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు, మన్సాస్ ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ సంచయిత గజపతి రాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహారాజా కళాశాలపై అశోక్ గజపతి రాజు చేసిన ఆరోపణలను ట్విటర్ వేదికగా సంచయిత తిప్పికొట్టారు. ‘మహారాజా కాలేజీ గురించి అశోక్ గజపతి గారు చేస్తున్న తప్పుడు సమాచారం నాకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన ఇంతగా దిగజారి మాట్లాడతారని ఊహించలేదు. ఎంఆర్ కాలేజీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రయివేటు కాలేజీ. ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి ఎయిడెడ్ హోదాను 2017లో ఆయనే సరెండర్ చేశారు. అప్పుడు తీసుకున్న విధాన నిర్ణయం కొనసాగుతోంది. ఇందులో ప్రభుత్వం జోక్యంకాని, సంబంధం కాని లేదు. ఈ విషయాన్ని ఆయన విస్మరించి మాట్లాడుతున్నారు. దయచేసి మీ రాజకీయాల్లోకి మాన్సాస్ విద్యాసంస్థలను లాగవద్దు. (అశోక్ గజపతిపై సంచయిత ఘాటు వ్యాఖ్యలు) అశోక్‌గారు మాన్సాస్ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు తప్పుడు వివరాలు ఇవ్వటం మూలాన మాన్సాస్ కాలేజీలకు రూ.6.5 కోట్లు నష్టం వచ్చింది. అప్పటి టీడీపీ ప్రభుత్వానికి అశోక్‌గారు డిస్కౌంట్‌గా ఈ డబ్బు ఇచ్చారేమో? ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం నుంచి ఈ డబ్బును తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సరైన అనుమతులు లేని కారణంగా 2018–2020లో 170 మంది విద్యార్థులకు ఇచ్చిన డిగ్రీలు చెల్లుబాటు కాకుండా పోయాయి. అశోక్ గజపతి గారి హయాంలో విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నారు. వారిని జీవితాలను చీకట్లోకి నెట్టేశారు. నేను వచ్చాక ఈ సమస్యపై దృష్టి పెట్టాను. అశోక్‌గారు తన రాజకీయ ఆటల కోసం విజయనగరం పెద్దల వారసత్వాన్ని ఏ విధంగా పక్కదారి పట్టించారో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నా. కనీసం గాంధీ జయంతి రోజు అయినా మీరు నిజం మాట్లాడాలి.’ అని సంచయిత గజపతిరాజు వరుస ట్వీట్లు చేశారు. (పవన్ వ్యాఖ్యలకు సంచయిత కౌంటర్) -
తెలుగుదేశం పార్టీకీ మరో ఎదురు దెబ్బ
-
అందుకే పార్టీకి రాజీనామా : గద్దె బాబూరావు
సాక్షి, విజయనగరం : జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం ప్రకటన చేశారు. గద్దె బాబూరావు మీడియాతో మాట్లాడుతూ... ‘పార్టీలో పరిస్థితులు బాగోలేదు. సుదీర్ఘ కాలంగా టీడీపీలో పనిచేసినా గుర్తింపు లేదు. ఆత్మ గౌరవం.. ఆత్మ స్థైర్యంతో పుట్టిన పార్టీ ప్రస్తుతం కరుమరుగైంది. అందుకే రాజీనామా చేస్తున్నా. ఎన్టీఆర్ ఉన్నప్పుడు పార్టీ వేరు. చంద్రబాబు నాయుడు మాలాంటి వారికి గౌరవం ఇవ్వడం లేదు. నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. చాలా కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నా. 1978లో నా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాను. కాంగ్రెస్‌లో ఉన్న నేను, ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత టీడీపీలో చేరారు. అక్కడ నుంచి ఆయన అడుగు జాడల్లో నడిచాను. చీపురుపల్లి ప్రజల సహకారంతోనే నేను ఈ స్థాయిలో ఉన్నాను. పార్టీ కోసం అంకిత భావంతో పని చేశాను. అప్పట్లో ఎన్టీఆర్ శ్రీకాకుళం, విజయనగరం ఎమ్మెల్యే స్థానాల బీ ఫారాలు నా చేతికే ఇచ్చేవారు. కానీ అప్పటి టీడీపీకి ఇప్పటి టీడీపీకి చాలా తేడాలు వచ్చాయి. 2004 నుంచి ఇప్పటివరకూ గద్దె బాబూరావు ఉన్నాడో లేడో కూడా టీడీపీ నాయకత్వం గుర్తించడం మానేసింది. నాకు ఎవరి మీద విమర్శలు చేయడం ఇష్టం లేదు. ఆత్మ గౌరవము, ఆత్మ సంతృప్తి కోల్పోయిన తర్వాత చాలా బాధ కలిగి ఇవాళ టీడీపీకి రాజీనామా చేస్తున్నా. నాకు ఎంతో గౌరవం ఇచ్చిన పార్టీలో నేడు గుర్తించే వారు లేకపోవడం నాకు చాలా బాధ కల్గించింది. ఎంతోమంది నచ్చజెప్పారు కానీ నా రాజీనామా నిర్ణయం మార్చుకోదల్చుకోలేదు.’ అని స్పష్టం చేశారు. కాగా గద్దె బాబూరావు ఒకసారి ఎమ్మెల్సీ, రెండుసార్లు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌గా పని చేశారు. ఎన్టీఆర్‌తో గద్దె బాబూరావు (ఫైల్ ఫోటో) -
చనిపోతున్నా.. చైనాకు చుక్కలు చూపించాడు
సాక్షి, విజయనగరం: చైనాతో జరిగిన సరిహద్దు వివాదంలో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్ బాబుకు విజయనగరంలోని కోరుకొండ సైనిక్ స్కూల్ సిబ్బంది నివాళులు అర్పించారు. అక్కడ ఉపాధ్యాయులు మాట్లాడుతూ... సంతోష్ బాబు తమ విద్యార్థి కావడం గర్వకారణమన్నారు. కల్నల్ సంతోష్ బాబు మరణం తమను ఎంతగానో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృత్యువుతో పోరాడుతూ కూడా సంతోష్ బాబు చైనా సేనకు దడ పుట్టించారని కొనియాడారు. సంతోష్ కుటుంబాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాల ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. (సలామ్ కల్నల్ సంతోష్..) -
అన్నదానం చేస్తున్న పలు ధార్మిక సంస్థలు
-
‘వారి కలల్ని నెరవేర్చేందుకే ఆంగ్ల విద్యా బోధన’
సాక్షి, విజయనగరం: విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసమే ఆంగ్ల బోధనను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మెరకముడిదాం మండలం ఉత్తరావల్లి గ్రామంలో గురువారం ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ధనిక వర్గాల పిల్లలతో సమానంగా పేద విద్యార్థులకు కూడా సమాన విద్యావకాశాలు కల్పించాలన్న లక్ష్యంతోనే ఆంగ్ల బోధనను అమలు చేయబోతున్నామని వెల్లడించారు. మొదట్లో కొంత కష్టంగా ఉన్నా.. భవిష్యత్తులో మన పిల్లలు పోటీ ప్రపంచంలో రాణించగలుగుతారని పేర్కొన్నారు. నేడు పేదలు సైతం తమ పిల్లలను ప్రైవేటు విద్యా సంస్థల్లో ఆంగ్ల మీడియంలో చదివించాలని ఎంతో డబ్బును ఖర్చు చేస్తున్నారని...అలాంటి వారి కలల్ని నెరవేర్చేందుకే ఈ విధానం తీసుకువచ్చామని వివరించారు. చంద్రబాబు విధానాలతోనే రాష్ట్రం అధోగతి.. వచ్చే ఏడాది జనవరి 9 నుంచి అమ్మఒడి పేరిట కుటుంబానికి రూ.15వేలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు అసభ్య పదజాలంతో దూషించడం సమంజసం కాదన్నారు. ప్రజలు హర్షించరనే విషయాన్ని గ్రహించాలన్నారు. చంద్రబాబు విధానాలతోనే రాష్ట్రం అధోగతి పాలయ్యిందని విమర్శించారు. గత ఐదేళ్లలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.60వేల కోట్ల రుణం ఉంటే.. నేడు అది గత ఐదేళ్లలో రూ.2.60 లక్షల కోట్లకు చేరిందన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయం.. ఆర్థికంగా రాష్ట్రం ఎన్ని కష్టాల్లో ఉన్నా.. ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. గత ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో అవినీతి, దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయిందని, ఉద్యోగ నియామకాల్లో ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. టీడీపీ పాలనపై విసిగిపోయిన ప్రజలు వైఎస్సార్సీపీకి అధికారం ఇచ్చారన్నారు. ఏ నమ్మకంతో అధికారం ఇచ్చారో.. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
ఈదురుగాలుల విధ్వంసం
-
‘ఫొని’ హెచ్చరిక, ప్రజలకు ఆర్టీజీఎస్ విజ్ఞప్తి
సాక్షి, విశాఖపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఫొని తుఫాను అలజడి సృష్టిస్తోంది. ప్రస్తుతం విశాఖ తీరానికి 235 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. శ్రీకాకుళం జిల్లాకు కేవలం 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం నుంచే ఒడిశా వైపుగా ప్రయణిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాకు భారీ ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. బంగాళాగాతంలో అతి తీవ్ర తుపాన్‌గా మారిన ఫొని ప్రభావంతో ఉత్తర శ్రీకాకుళం, తీరప్రాంత శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రెండురోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఫొని తుపాన్ ప్రస్తుతం కాకినాడ నుంచి తూర్పు ఆగ్నేయ దిశగా 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఉంది. దీని ప్రభావంతో విశాఖపట్నం,తూర్పు గోదావరి జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. నిన్న సాయంత్రం పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర ఈశాన్య దిశగా తుఫాన్ దిశ మార్చుకుంది. ప్రస్తుతం ఈశాన్య దిశలోనే కదులుతూ గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. రేపు మధ్యాహ్నం పూరీకి సమీపంలో తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో 200 కిలోమీటర్ల వరకు ప్రచండ గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఫొని తుఫానును విశాఖ, మచిలీపట్నం, చెన్నైలోని రాడార్లు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. ఒకటిన్నర మీటర్ల ఎత్తులో అలలు తీరాన్ని తాకుతున్నాయి. తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ముఖ్యంగా ఒడిశాలోని లోతట్టు ప్రాంతాల్లో భారీగా అలలు ఎగసిపడే సూచనలు కనిపిస్తున్నాయి. తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. శ్రీకాకుళం ఉత్తర, తీరప్రాంత మండలాల్లో రెడ్ అలర్ట్ ఫొని తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా ఉత్తర, తీరప్రాంత మండలాల్లో రెండురోజుల పాటు రెడ్ అలర్ట్ కొనసాగనుంది. శ్రీకాకుళం తీరప్రాంత మండలాల్లో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో ఈ ప్రాంతాల్లో పెనుగాలలు వీస్తాయని ఆర్టీజీఎస్ హెచ్చరించింది. శ్రీకాకుళంలో తీవ్ర ప్రభావమున్న మండలాలు : గార, ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, సంతబొమ్మాళి, పలాస, పొలాకి, నందిగం, వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం అలాగే విజయనగరం తీరప్రాంత మండలాల్లో గంటకు 90 నుంచి 110 కిలో మీటర్ల వేగంతో గాలులు వేస్తాయని... ఈరోజు అర్థరాత్రి నుంచి రేపు తెల్లవారుజాము వరకు వరకు తీవ్ర ప్రభావం ఉంటుందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విజయనగరం: భోగాపురం, చీపురుపల్లి, డెంకాడ, గరివిడి, గుర్ల, నెల్లిమర్ల, పూసపాటిరేగ మండలాల్లోని ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, తుపాన్ తీరం దాటడానికి ముందు ఎవరూ బయటకు రాకూడదని అధికారులు హెచ్చరించారు. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని, వాహనాలపైన బయట సంచరించకూడదని ప్రజలకు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) సూచించింది. ఆర్టీజీఎస్ తుపాన్ గమనాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ...తీరప్రాంతాలను సర్వైలెన్స్ కెమెరాల ద్వారా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పర్యాటకులకు అనుమతి నిరాకరణ పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో అలల ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో పర్యాటకులను అధికారులు అనుమతించడం లేదు. తుపాను హెచ్చరికలతో పశ్చిమగోదావరి జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మొగల్తూరు, నరసాపురం, భీమవరం, పాలకొల్లు, యలమంచిలి, ఆచంట మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లో 8 పునరావాస కేంద్రాలు సిద్ధం చేశారు. తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతంలో సముద్రపు అలలు సాధారణం కంటే రెండు, మూడు మీటర్ల ఎత్తు పెరుగుతుందంటూ హెచ్చిరించారు. తీర ప్రాంతంలోని ప్రతీ మండలానికి అందుబాటులో 108, 104 వాహనాలు ఉంచారు. ప్రజలకు ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) విజ్ఞప్తి తుపాన్ పర్యవేక్షణకు పరిష్కార వేదికలో ప్రత్యేక ఏర్పాట్లు ఆర్టీజీఎస్ నుంచి సర్వైలెన్స్ కెమెరాల ద్వారా తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యవేక్షణ కాకినాడ నుంచి తూర్పు ఆగ్నేయ దిశగా 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఫోని తుపాన్ శ్రీకాకుళం ఉత్తర, తీరప్రాంత మండలాల్లో కొనసాగుతున్న రెడ్ అలర్ట్ శ్రీకాకుళం తీరప్రాంత మండలాల్లో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో ఈ ప్రాంతాల్లో పెనుగాలలు విజయనగరం తీరప్రాంత మండలాల్లో గంటకు 90 నుంచి 110 కిలో మీటర్ల వేగంతో గాలులు ఈరోజు అర్థరాత్రి నుంచి రేపు తెల్లవారుజాము వరకు వరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపనున్న ఫొని తుపాన్ ఉత్తర, తీరప్రాంత శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఈరోజు మరియు రేపు అతి భారీ వర్షాలు కురిసే సూచనలు -
దోచుకో...దాచుకో...
విజయనగరం మున్సిపాలిటీ: ఐదేళ్ల చంద్రబాబు పాలన పూర్తిగా లంచమయంగా సాగిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చివరి రోజు మంగళవారం 7వ వార్డు ఆయన హుకుంపేట, 13వ వార్డు అశోక్‌నగర్, 9వ వార్డు మేధరవీది, 16వ వార్డు జమ్ము ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు కోలగట్లకు అడుగడుగునా ఘన స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. మహిళలు నుదుట విజయ తిలకం దిద్ది విజయీభవ అంటూ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ దివంగత వైఎస్సార్ హయాంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తే... ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అమరావతి నుంచి గల్లీ వరకు ఒకే ఒక్క పథకం అమలైందని అది దోచుకో.. దాచుకో పథకమని వాఖ్యానించారు. చంద్రబాబు పోలవరం, అమరావతి ప్రాజెక్టులలో లంచాలు తీసుకుంటే... కింద స్థాయి నాయకులు ఇళ్లిస్తే లంచం, పింఛను ఇస్తే లంచం అంటూ దోచుకున్నారని దుయ్యబట్టారు. ఇవన్నీ కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజుకు తెలియదా.. అని ప్రశ్నించారు. కర్ఫ్యూలో అశోక్ ఎక్కడ ఉన్నారో తాను అక్కడే ఉన్నానని పేర్కొన్నారు. 2014 ఎన్నికలకు ముందు జరిగిన సంఘటనను ప్రస్తావించి ప్రజలను భయపెట్టి ఓట్లు దండుకున్న అశోక్‌గజపతిరాజు ఐదేళ్లలో తాను చేసిందేమి లేకనే మళ్లీ కర్ఫ్యూ పేరు చెప్పుకుని పబ్బం గడుపుకోవటం సిగ్గు చేటన్నారు. ఐదేళ్ల కాలంలో మీరేం చేశారో చెప్పాలన్నారు. తాను ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 8 వేలు ఇళ్లు కట్టామని, పట్టణంలోని ప్రధాన రహదారులు విస్తరించామన్నారు. మరల అధికారమిస్తే అటువంటి కాలనీలు మరో నాలుగు కట్టించి ఇస్తామన్నారు. తాగు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. ప్రచారంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆశపు వేణు, మండల అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
బాలకృష్ణ నీ యాక్షన్ సినిమాల్లో చూపించుకో..
సాక్షి, చీపురుపల్లి: సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ తీరుపై వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చిన బాలకృష్ణ చీపురుపల్లిలో ఓ అభిమానిపై చెయ్యి చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై బొత్స స్పందిస్తూ.. ఖబడ్దార్ .. బాలకృష్ణా అంటూ హెచ్చరించారు. సోమవారం చీపురుపల్లిలోని జి.అగ్రహారంలో సోమవారం నిర్వహించిన ఎన్నికల సభలో బొత్స మాట్లాడారు. టీడీపీ కార్యకర్త అయినా..చీపురుపల్లికి చెందిన ఓ కుర్రాడిని కొట్టే అధికారం బాలకృష్ణకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. బాధిత యువకుడు ఏ పార్టీకి చెందిన వాడో మాకు అనవసరం కానీ చీపురుపల్లి ప్రాంతానికి చెందిన వ్యక్తిపై ఈగ వాలినా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ‘మీరు సినిమా నటులైతే మీ యాక్షన్లు సినిమాల్లో చూపించుకోవాలి తప్ప వీధుల్లోకి వచ్చి మా కుర్రాళ్లను కొడతామంటే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరన్న సంగతి గుర్తుంచుకోండి’ అని బాలకృష్ణను ఉద్దేశించి బొత్స అన్నారు. యువకుడికి బాలకృష్ణ భేషరతుగా క్షమాపణ చెప్పాలని లేదంటే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. వీధుల్లోకి వచ్చి ఇష్టానుసారంగా వ్యక్తిత్వ విలువలు కోల్పోయి కొడతామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. ప్రజాస్వామ్యంలో విలువలు, వ్యక్తిత్వం ముఖ్యమని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య విలువలు లేని ఇలాంటి వ్యక్తులను దగ్గరకు చేర్చితే వ్యవస్థకు నష్టమని వ్యాఖ్యానించారు. కాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బాలకృష్ణ ...అభిమానులు, పార్టీ కార్యకర్తలతో దురుసుగా ప్రవర్తిస్తున్న విషయం తెలిసిందే. గొంతు కోస్తా, అంతు చూస్తా... అంటూ బెదిరింపులకు పాల్పడటమే కాకుండా...చేయి చేసుకోవడంతో ఆయన తీరుపై సొంతపార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. -
‘ఇద్దరు రాజు’లకు వ్యతిరేక పవనాలు
తెలుగుదేశం పార్టీకి మొదటినుంచీ జిల్లాలో పెద్ద దిక్కుగా నిలుస్తున్నవారు ఒకరు. ఎంతోకాలంగా రాష్ట్ర మంత్రిగా... కేంద్ర మంత్రిగా... ఎంపీగా... ఎన్నో పదవులు ఆయన అలంకరించారు. కానీ జనం కోసం ఈయనేమీ చేయలేదన్న అపప్రధ మాత్రం మూటగట్టుకున్నారు. ఇక రెండో వ్యక్తి పదవికోసం గెలిపించిన పార్టీని... నమ్మిన జనాన్ని వదిలేసి తెలుగుదేశం పార్టీలో చేరినవారు. ఈయన కూడా అభవృద్ధికోసమే ఈ మార్పు అని చెప్పి సొంత లాభం చూసుకున్నారు. జనం సమస్యలను గాలికొదిలేశారు. వీరిద్దరూ రాజ వంశీయులే. రాజులంటే ప్రజలకు అండగా నిలవాలి. ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలి. వారి సమస్యల్లో పాలుపంచుకోవాలి. వాటన్నింటికీ వీరు వ్యతిరేకం. అందుకే ఈ సారి ఎన్నికల్లో వారు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జనం నుంచి వ్యతిరేకతను చవిచూస్తున్నారు. వీరి వైఖరి ప్రత్యర్థులకు అనుకూలంగా మారుతోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాకు చెందిన ఇద్దరు రాజులకు తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. క్షేత్రస్థాయిలో వీరు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రచారంలో భాగంగా జనం వద్దకు వెళుతుంటే.. ఇన్నాళ్లూ ఏం చేశారని మళ్లీ ఓట్లడగడానికి వచ్చారంటూ ఒక రాజుని ప్రజలు నిలదీస్తున్నా రు. దీంతో ప్రచారంలోకి వెళ్లడమే మానేశారు మరొక రాజు. ఇదీ జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావుల పరిస్థితి. 1955 సంవత్సరంలో నిర్వహించిన ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేటాయించారు. ప్రస్తుతం విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం కొనసాగుతోంది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో పూసపాటి వంశానికి చెందిన పి.వి.జి.రాజు, పి.అశోక్ గజపతిరాజు అధిక ఎన్నికల్లో గెలుపొందినప్పటికీ ఇక్కడి ప్రజల సమస్యల పరిష్కారంలో మాత్రం చొరవ చూపించలేకపోయారు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే, బీసీ సామాజిక వర్గానికి చెందిన మీసాల గీతను కాదని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా తండ్రీ కూతుళ్లు అశోక్, అదితి టిక్కెట్టు తెచ్చుకున్నారు. ఇన్నేళ్ల పాలనపై ఇప్పుడు వ్యతిరేకత ఐదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, జిల్లా నుంచి ఎంపీ, కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్ గజపతి విజయనగరం పార్లమెంట్‌కు చేసిందేమీ లేదు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపాధి కల్పించే రెండు ప్రధాన జూట్‌మిల్లులు మూతపడి సుమారు 12వేల కార్మిక కుంటుంబాలు రోడ్డున పడ్డా పట్టించుకోలేదు. రాష్ట్రంలోని 12 జిల్లా కేంద్రాల్లో మెడికల్ కళాశాలలు ఉన్నా విజయనగరంలో ఏర్పాటు కాలేదు. ఇన్నాళ్లూ అశోక్‌గజపతిరాజుకు చెందిన మాన్సాస్ ట్రస్ట్ ద్వారా మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామంటూ కాలం గడిపారు. కనీసం తాను నివసించే బంగ్లా ఉన్న విజయనగరం పట్టణాన్ని తాగు నీటి సమస్య వేధిస్తున్నా ఆయనకదేమీ పట్టలేదు. ఇవన్నీ అశోక్‌కు, ఆయన కుమార్తె అదితికి ప్రతికూలతలుగా మారనున్నాయి. ప్రత్యర్ధి పార్టీకి ప్రచారాస్త్రాలుగా మారాయి. కేవలం టీడీపీకి, రాజ వంశానికి ఉన్న సంప్రదాయ ఓటింగ్‌పైనే వీరిద్దరూ ఆధారపడాల్సి వస్తోంది. సొంత ప్రాభవం లేని బొబ్బిలి రాజు 2004లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి బొబ్బిలి రాజులకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారు. రాజశేఖరరెడ్డి నేతృత్వంలో ఈ ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి సుజయకృష్ణ రంగారావు గెలుపొందారు. ఆ తరువాత 2009లో కూడా వైఎస్ హయాంలోనే సుజయ్ గెలుపొందారు. 2014లో వైఎస్ తనయుడు జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్సీపీ నుంచి సుజయ్ పోటీచేసి గెలిచారు. అంటే వైఎస్ .రాజశేఖరెడ్డి, జగన్‌ల నేతృత్వంలోనే ప్రజలు బొబ్బిలి రాజును గెలిపించారు తప్ప ఆయన వ్యక్తిగత చరిష్మా ఏమీ లేదని స్పష్టమవుతోంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గెలిచింది లేదు. రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన వైఎస్ కుటుంబాన్ని సుజయ్ పదవి కోసం వంచించి, పార్టీ మారడంతో ప్రజలు ఛీదరించుకుంటున్నారు. అంతగా తలకెత్తుకున్న అభిమానమంతా ఒక్కసారిగా చల్లారిపోయిందనీ, తాము వైఎస్ కుటుంబానికి నేటికీ అండగా ఉంటామని స్థానిక ప్రజలు, నాయకులు ఇప్పటికీ వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. మంత్రి పదవి రాగానే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని చెప్పిన సుజయ్ ఆ విషయాన్ని మర్చిపోయి సొంత ప్రయోజనాలకు పదవిని వినియోగించుకున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీనివల్లే ఆయనపై ప్రజా వ్యతిరేకత మొదలైంది. ఇటు పార్టీలోనూ సుజయ్‌పై బహిరంగంగానే నాయకులు, కార్యకర్తలు అసంతృప్తిని బయటపెట్టారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో పర్యటనకు వెళుతున్న సుజయ్‌కు అక్కడక్కడ జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తన నియోజకవర్గాన్ని కాదు కదా కనీసం తాను నివసిస్తున్న బొబ్బిలి పట్టణాన్ని కూడా సుజయ్ పట్టించుకోలేకపోవడం ఆయనకు ప్రధాన అవరోధంగా మారింది. దీంతో ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ధనాన్ని, రాజుల సంప్రదాయ ఓటింగ్‌ను నమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది. -
అవినీతిలో ప్రథమ పౌరులు
ప్రజాప్రతినిధులంటే.. పదిమందికీ ఆదర్శంగా నిలవాలి. ప్రజలు.. ప్రభుత్వానికి వారధిగా నిలవాలి. ప్రజా సంక్షేమానికి అహరహం శ్రమించాలి.. ఆ ముగ్గురు ప్రజా ప్రతినిధులు కూడా అవిశ్రాంతంగా శ్రమిస్తుంటారు.. కమీషన్లు దండుకోవడం.. పోస్టుల్ని అమ్మేసుకోవడం.. గెడ్డల్ని కబ్జా చేయడం.. కాంట్రాక్టులు దక్కించుకోవడం.. ఇనాం భూముల్ని కారు చవగ్గా కొట్టేయడంలో వీరు నిత్యం తలమునకలై ఉంటారు. వారే పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు.. ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్.. ఆయన సతీమణి, పార్వతీపురం మున్సిపల్ చైర్పర్సన్ ద్వారపుడ్డి శ్రీదేవి. దండుకోవడంలో ఈ త్రయానికున్న పేరు పార్వతీపురంలో మారు మోగిపోతోంది. పనికి ఇంత ధర నిర్ణయించేశారు. పైసలిస్తే తప్ప ఏ పనీ చేయరు. పార్వతీపురాన్ని దోచుకు తింటున్నారు. పట్టం గట్టిన ప్రజల్ని ఉసూరుమనిపిస్తున్నారు. ఒకరు ఎమ్మెల్యే.. మరొకరు ఎమ్మెల్సీ.. ఇంకొకరు పట్టణ ప్రథమ పౌరురాలు. కమీషన్లు దండుకోవడం.. ఉద్యోగాలు అమ్ముకోవడం.. కాంట్రాక్టులు ఇప్పించడంలో ఈ ముగ్గురూ ఘనాపాటీలు. వాళ్లే పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు..ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్.. మున్సిపల్ చైర్పర్సన్ శ్రీదేవి. ఏ పని కావాలన్నా గ్రామీణ ప్రాంతంలో అయితే ఎమ్మెల్యే.. పట్టణ ప్రాంతంలో అయితే ఎమ్మెల్సీకి అడిగినంత చదివించుకోవలసిందే. ఇక ఎమ్మెల్సీ సతీమణి, పార్వతీపురం మున్సిపల్ చైర్పర్సన్ శ్రీదేవి భర్త స్ఫూర్తితో అయినకాడికి దోచుకోవడంలో పోటీ పడుతున్నారు. అడ్డూ అదుపూ లేని ఈ ముగ్గురి అక్రమార్జనపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. సాక్షి ప్రతినిధి, విజయనగరం: మున్సిపల్ చైర్పర్సన్ రేట్లివి పార్వతీపురం పురపాలక సంఘం చైర్పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి భర్త ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ కావడం ఆమెకు ఎదురు లేకపోయింది. భర్త అధికారాన్ని అడ్డం పెట్టుకొని పురపాలక సంఘంలో చక్రం తిప్పుతున్నారు. ఏ పని చేయాలన్నా చేయి తడపాల్సిందే. ఇళ్లు, బహుళ అంతస్తుల నిర్మాణాలు, లే ఔట్ల రెగ్యులరైజేషన్, కొత్త లే అవుట్లకు అనుమతులు ఇచ్చేందుకు రూ.లక్షల్లో డిమాండ్ చేస్తున్నారు. పురపాలక సంఘంలో కంప్యూటర్ ఆపరేటర్లు, మెప్మా కార్యాలయంలో ఆర్పీలు, పారిశుద్ధ్య కార్మికుల నియామకంలో దండిగా డబ్బులు వసూలు చేశారు. పారిశుద్ధ్య కార్మికులను కొత్తగా 36 మందిని నియమించాలని పాలకవర్గం తీర్మానిస్తే.. చైర్పర్సన్ ఏకంగా 42 మందిని నియమించి ఒక్కొక్కరి వద్ద రూ.3 లక్షల చొప్పున వసూలు చేశారనేది బహిరంగ రహస్యం. కాంట్రాక్టులన్నీ ఎమ్మెల్సీ తమ్ముడికే.. పార్వతీపురం పురపాలక సంఘంలో ప్రతి సివిల్ కాంట్రాక్టును ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ తన సోదరుడు ద్వారపురెడ్డి వెంకట తిరుపతిరావుకు అప్పగిస్తున్నారు. భార్య ద్వారపురెడ్డి శ్రీదేవి మున్సిపల్ చైర్పర్సన్ కావడంతో ఆమె అధికారాన్ని అడ్డం పెట్టుకొని పురపాలక సంఘంలో రూ.కోట్ల విలువైన సీసీ రోడ్లు, సీసీ డ్రైన్స్ నిర్మాణాలను తిరుపతిరావుకు కట్టబెడుతున్నారు. సింగిల్ టెండర్లు వస్తే వాటిని తిరస్కరించి మళ్లీ టెండర్లు పిలవాలన్న నిబంధనలున్నాయి. కానీ చైర్పర్సన్ అధికారాన్ని ఉపయోగించుకొని తమ్ముడికి సింగిల్ టెండర్లను కూడా ఆమోదింపజేసి కాంట్రాక్టులు కట్టబెట్టి కమీషన్లు దండుకుంటున్నారు. డివైడర్ పనుల పేరిట దోపిడీ పార్వతీపురం పట్టణ ప్రధాన రహదారిలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నిబంధనలకు విరుద్ధంగా సెంట్రల్ డివైడర్ నిర్మాణ పనులు చేపట్టారు. అంతర్రాష్ట్ర ప్రధాన రహదారిపై పనులు చేపట్టాలంటే ఆర్అండ్బి శాఖ చేపట్టాలి. కానీ అందుకు విరుద్ధంగా ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ తమ్ముడు కాంట్రాక్టర్ ద్వారపురెడ్డి తిరుపతిరావుకు ఆ నిర్మాణ పనులను అప్పగించారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందనుకుంటే పర్వాలేదు.. కానీ అవసరం లేని చోట పార్వతీపురం పురపాలక సంఘం రూ.1.39 కోట్ల ప్రజాధనం వెచ్చించి డివైడర్లు నిర్మించింది.. అన్ని పనులకు కలిపి ఒకేసారి టెండర్లు పిలిచినçప్పటికీ, డివైడర్లకు సున్నాలు, రంగులు వేయడానికి రూ.22 లక్షలు అదనంగా నిధులు మంజూరు చేసి పాలకవర్గంతో ఆమోదించారు. కొన్ని చోట్ల పాత డివైడర్లపై రంధ్రాలు వేసి ఇనుప కంచెతో గోడ నిర్మించినందుకు అదనంగా నిధులు మంజూరు చేసి తినేశారు. కమీషన్ల కోసం సుందరీకరణ పనులు పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలోని బైపాస్ రోడ్డుకు ఇరువైపులా సుందరీకరణ పేరుతో రూ.16 లక్షలు వెచ్చించి మొక్కలు నాటారు. వాస్తవానికి దీనివల్ల పట్టణ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. ప్రైవేటు వ్యక్తుల స్థలాల ముందు అడ్డంగా కంచెను నిర్మించి అందులో పేపర్ గులాబీ మొక్కలను వేశారు. ఎమ్మెల్సీ తమ్ముడు కాంట్రాక్టర్ ద్వారపురెడ్డి వెంకట తిరుపతిరావుకు లబ్ధి చేకూర్చేందుకే అవసరం లేకపోయినా సుందరీకరణ పేరుతో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో వీటిని నిర్మించి ప్రజాధనాన్ని వృథా చేశారు. మరమ్మతుల పేరిట మేత పార్వతీపురం 14వ వార్డులోని షటిల్ బ్యాడ్మింటన్ స్టేడియం ఇదివరకు ఐటీడీఏ పీఓ చైర్మన్‌గా ఆఫీసర్స్ స్టేడియంగా ఉండేది. అందులో ప్రభుత్వోద్యోగులు, క్ల»బ్ సభ్యులుగా ఉన్నవారు మాత్రమే ఆటలు ఆడేవారు. కానీ సొంత ప్రయోజనాల కోసం మున్సిపాల్టీతో దత్తత తీసుకొని మరమ్మతుల పేరుతో రూ.30 లక్షల ప్రజాధనాన్ని వెచ్చించి దాని నిర్మాణ బాధ్యతలను కూడా ఎమ్మెల్సీ సోదరుడు కాంట్రాక్టర్ ద్వారపురెడ్డి తిరుపతిరావుకు అప్పగించారు. అక్కడితో ఆగకుండా మరమ్మతుల పేరుతో రూ.5 లక్షలు మంజూరు చేసేందుకు పాలకవర్గ సమావేశంలో అజెండాలో పొందుపరిచారు. దీనిని అధికార, విపక్ష కౌన్సిల్ సభ్యులతోపాటు మున్సిపల్ వైస్ చైర్మన్ బెలగాం జయప్రకాష్‌నారాయణ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. మున్సిపాలిటీకి ఆదాయం రాని స్టేడియంకు ఎందుకు ప్రజాధనాన్ని ఖర్చు చేయాలని నిలదీశారు. అయినా తమ్ముడికి భారీగా కమీషన్లు రావడం కోసం పాలకవర్గంతో ఒప్పించి తీర్మానం చేయించిన ఘనత ఎమ్మెల్సీదే. కారు చవగ్గా ఇనాం భూములు గరుగుబిల్లి మండలం పోలినాయుడు వలస గ్రామ రెవెన్యూ పరిధిలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని 56.34 ఎకరాల ఇనాం భూములను ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ చేజిక్కించుకున్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికవక ముందు వరకు ఆయన పేరుమీద ఈ భూముల్లేవు. ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టాక మాత్రమే ఈ భూములు ఆయన కొనుగోలు చేసినట్టు ఆధారాలు ధ్రువీకరిస్తున్నాయి. పోలినాయుడు వలస గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 178లో 56.34 ఎకరాలను వల్లభ జోష్యుల సూర్యనారాయణ నుంచి ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, ఆయన సోదరుడు ద్వారపురెడ్డి ధనుంజయనాయుడు పేరుమీద కొనుగోలు చేసినట్టు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదై ఉంది. విశేషమేమిటంటే ద్వారపురెడ్డి జగదీష్ రూ.2,02,83,000కు ఈ భూములను కొనుగోలు చేసినట్టు దస్తావేజుల్లో చూపిస్తోంది. ఈ ఖర్చును ఎమ్మెల్సీ ఎన్నికల అఫిడవిట్లో చూపించకపోవడం గమనార్హం. భూ క్రయ విక్రయాలు జరిగే సమయంలో ఒక వ్యక్తి భూమి అమ్మితే మరో వ్యక్తి ఆ భూమిని కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో రిజిస్ట్రేషన్ ఖర్చులను కొనుగోలుదారు భరించాలి. కానీ భూ విక్రయదారే రిజిస్టేషన్ ఖర్చులను భరించుకున్నట్టు దస్తావేజు స్పష్టం చేస్తోంది. పోలినాయుడు వలస గ్రామ రెవెన్యూ పరిధిలో పల్లపు భూమి ఎకరా రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ధర పలుకుతుండగా.. ఎమ్మెల్సీ కేవలం రూ.3 లక్షల చొప్పున 56.34 ఎకరాలను కారు చౌకగా దక్కించుకున్నారు. బినామీకి 40 ఎకరాల డీ పట్టా భూములు పార్వతీపురం మండలం వెంకంపేట పంచాయతీ పరిధిలోని వెంకంపేట చెరువు దిగువ భాగంలో డీ పట్టా భూములను కూడా తన బినామీ పేరుమీద సుమారు 40 ఎకరాల వరకు కొనుగోలు చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. ఎమ్మెల్సీ కొనుగోలు చేసిన భూములు నేటికి అనేక మంది రైతుల ఆధీనంలో సాగులో ఉన్నాయి. ద్వారపురెడ్డి జగదీష్ కొనుగోలు చేసిన విషయం నేటికి సాగు చేస్తున్న రైతులకు తెలియక పోవడం గమనార్హం. ఈ విషయం తెలిసిన రైతులు ఇటీవల కలెక్టర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు కూడా చేశారు. వరహాల గెడ్డ కబ్జా పార్వతీపురం పట్టణ నడిబొడ్డుగుండా ప్రవహిస్తున్న వరహాలగెడ్డను ఆక్రమించి ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ ఇల్లు నిర్మించుకుంటున్నారు. సహజంగా వరహాలగెడ్డ వెడల్పు 12 మీటర్లు ఉండాలి. కానీ ఎమ్మెల్సీ ఇంటి వద్దకు వచ్చేసరికి గెడ్డను కుదించి ప్రహరీ నిర్మించి లోపలి భాగంలో ఇల్లు నిర్మిస్తున్నారు. ఎమ్మెల్సీ సోదరుడు డాక్టర్ రామ్మోహనరావు ఆస్పత్రి వెనుకభాగంలో వరహాలగెడ్డను కప్పి అందులో అరటి మొక్కలు, కొబ్బరి మొక్కలు వేసి పెంచుతున్నారు. దీనిపై గతంలో పత్రికల్లో కథనం రాగా పరిశీలనకు వెళ్లాలని కలెక్టర్ స్థానిక ఆర్డీఓను ఆదేశించారు. వివరణ కోరేందుకు వెళ్లిన అధికారులకు సరైన సమాధానం చెప్పకపోవడంతో వారు వెనుదిరిగారు. మా పొట్ట కొడుతున్నారు ఎన్నో దశాబ్ధాలుగా సాగు చేస్తున్న మా భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉన్నాయి. మా సాగులో ఉన్న ఇనాం భూమిని సరిచేసి హక్కు కల్పించాలని నా లాంటి ఎంతో మంది రైతులం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా స్పందించలేదు. మాకు తెలియకుండానే మా సాగులో ఉన్న భూములు వేరొకరు రెవెన్యూ రికార్డుల్లో తారుమారు చేశారు. ఈ విషయం కొద్ది రోజుల ముందే ఆనోటా, ఈనోటా తెలిసింది. దీంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. – బడే శంకరరావు, రైతు, పెద్దూరు. -
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి నిరసన
పార్వతీపురం: వాళ్లిద్దరూ మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. కలిసి తిరిగారు. నువ్వు లేకపోతే నేను లేనంటూ బాసలు చేసుకున్నారు. ఇంతలో యువకుడు ముఖం చాటేయడంతో కథ అడ్డం తిరిగింది. బాధిత యువతి, కుటుంబ సభ్యులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని జమదాల గ్రామానికి చెందిన కళింగపట్నం పద్మ (రజక కులానికి చెందిన యువతి) అదే గ్రామానికి చెందిన మత్స్యకార సామాజికవర్గానికి చెందిన కొర్ర సంతోష్‌కుమార్ ప్రేమించుకున్నారు. సంతోష్‌ను పూర్తిగా నమ్మిన పద్మ శారీరకంగా దగ్గరైంది. పద్మ తల్లిదండ్రులు సంబంధాలు తీసుకువచ్చినా ఎవర్నీ పెళ్లి చేసుకోవద్దని... తానే చేసుకుంటానని సంతోష్ చెప్పడంతో బాధిత యువతి వచ్చిన సంబంధాలను వదులుకుంది. అయితే తనను పెళ్లి చేసుకోవాలని పద్మ కోరగా కొద్దికాలం నుంచి సంతోష్ తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా సంతోష్ పెళ్లికి నిరాకరించాడు. దీంతో రెండు రోజుల కిందట పద్మ ప్రియుడి ఇంటిముందు తనకు న్యాయం చేయాలంటూ బైఠాయించగా.. పెద్ద మనుషుల ముందు సం తోష్ పెళ్లికి ఒప్పుకున్నాడు. మరలా మాట తప్పడంతో పద్మ శుక్రవారం యువకుడి ఇంటి ముందు బైఠాయించింది. తనకు న్యాయం చేసే వరకూ దీక్ష విరమించేది లేదని బాధితరాలు స్పష్టం చేస్తోంది. మాకు ఇష్టమే.. తమ కుమారుడు సంతోష్‌కి నచ్చితే పెళ్లి చేయడానికి తమకు ఇబ్బంది లేదని యువకుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే ఈ నాటకమంతా వారే ఆడిస్తున్నారని బాధిత యువతి ఆరోపించింది. తనను పెళ్లి చేసుకుంటే చనిపోతామని తల్లిదండ్రులు బెదిరించడం వల్లే సంతోష్ తనతో వివాహానికి వెనకడుగు వేస్తున్నాడని చెప్పింది. ఇదిలా ఉంటే తనతో పాటు తమ కుటుంబ సభ్యులపై దాడి కూడా చేస్తున్నారని ఆరోపించింది. చివరకు ఈ కేసు పార్వతీపురం రూరల్ పోలీసు స్టేషన్‌కు చేరింది. ఎస్సై లోవరాజు ఇరువర్గాలతో మాట్లాడినా సంతోష్ పెళ్లికి ఒప్పుకోవడం లేదు. అనేక మలుపులు..! ప్రేమికుల వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. ఒకసారి చేసుకుంటాను.. మరోసారి చేసుకోను.. అంటూ ప్రియుడు మాట మార్చడం వెనుక కొంతమంది పెద్దల దన్ను ఉందని బాధిత యువతి తరఫు వారు ఆరోపిస్తున్నారు. ఇరువర్గాల మధ్య గొడవలు సృష్టించి ఆ నెపం మామీద వేసి కేసులు బనాయించాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మరోసారి ప్రజలను మోసం చేయకండి : మజ్జి
సాక్షి, విజయనగరం : రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌తో కలిశామని చెప్పి మరోసారి ప్రజలను మోసం చేయకండని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. కేంద్రంతో సఖ్యంగా ఉంటూ మీ అవసరాలు తీర్చుకుని, రాష్ట్ర ప్రయోజనాలు జిల్లా ప్రయోజనాల గురించి పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. మీరు విడుదల చేసిస శ్వేత పత్రంలో ఇచ్చిన అంశాలు అన్నీ పూర్తిగా అవాస్తవమన్నారు. 'నిరుద్యోగులకు ప్రత్యేక హోదా వల్ల కలిగే లాభాలను వివరించడానికి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో 2015లో యువభేరి కార్యక్రమం నిర్వహించాము. యువభేరిలకు రవాణా సౌకర్యం కల్పించిన స్కూళ్లు, కాలేజీలకు నోటీసులు ఇచ్చారు. పీడీ యాక్ట్‌లు అంటూ బెదిరించారు. మనం కేంద్ర ప్రభుత్వంతో పోరాడి, పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేసి బీజేపీనీ దోషిగా నిల్చోపెడదాం అన్నాం. రాష్ట్ర హక్కుల కోసం రాజీనామా చేస్తే మన కోసం అడిగే వారు ఉండరని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ఏం సాధించారు. ప్రత్యేక హోదా అవసరం లేదు అంటూ ప్యాకేజీ ఆహ్వానించారు. 2015, మార్చి10న మోదీని పొగుడుతూ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మాట్లాడారు. ఇప్పుడు శ్వేత పత్రం విడుదల చేశారు. ఢిల్లీ వెళ్లి అన్ని పార్టీలను సమాయత్తం చేస్తాను అన్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత నుంచి కనిపించడం లేదు. బీజేపీ ఒక పక్క రాష్ట్రానికి అన్యాయం చేస్తే, పూర్తిగా అన్యాయం చేసిన ఘనత టీడీపీదే. మనం సఖ్యతతో అన్నీ సాధించుకోవాలి అంటూ మూడున్నర సంవత్సరాల పాటూ ఎన్డీఏలో ఉన్నారు. కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు అశోక గజపతి రాజు రాష్ట్ర ప్రయోజనాలు కోసం మాట్లాడిన దాఖలాలు లేవు. మరో మూడు నెలల్లో ఎన్నికలు వస్తుండటంతో మళ్లీ డ్రామాలు మొదలు పెట్టారు. 2019 ఎన్నికల్లో ప్రజలే మిమ్మల్ని దోషిగా నిలుచోబెడతారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ తో కలిశారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తాం అని ఎన్నికల ముందే చెప్పింది. కొత్తగా ఇప్పుడు చెప్పింది ఏమీలేదు' అంటూ మజ్జిశ్రీనివాసరావు నిప్పులు చెరిగారు. -
ధీమానివ్వని బీమా
విజయనగరం గంటస్తంభం: రైతుల కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు చేస్తున్న విషయం విదితమే. రైతులు 10శాతం ప్రీమియం చెల్లిస్తే మిగతా సొమ్ము కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా బీమా ప్రీమియం డీఆర్డీఏ అధికారులు కట్టిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 27వేల మంది ప్రీమి యం చెల్లించారు. గడిచిన మూడేళ్లలో 25వేల నుంచి 30వేల మంది వరకు ఐసీఐసీఐ ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం కట్టినట్టు సమాచా రం. ప్రీమియం చెల్లించిన రైతులు పంట నష్టపోతే ఆ కంపెనీ రైతులకు పరిహారం ఇవ్వాల్సి ఉంది. ఇందులో భాగంగా 2015–16 సంవత్సరానికి సం బంధించి 25వేల మంది వరకు రైతులు బీమా కట్ట గా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వి డుదల చేస్తున్నారు. ఇందులో అనేక వింతలు చోటు చేసుకుంటున్నాయి. ప్రీమియం చెల్లించిన రైతులందరికీ పరిహారం రావడం లేదు. మంజూరైన జాబితాలో కూడా చాలామంది రైతుల పేర్లు లేవు. వాస్తవానికి పంటల బీమా గ్రామం యూనిట్‌గా కట్టిస్తారు. కానీ ఒకే గ్రామంలో కొందరికి పరిహారం రావడం, మరికొందరికి రాకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇక ప్రీమియం చెల్లించిన రైతులకు పరిహారం వచ్చినట్లు అధికారులకు సమాచారం వచ్చింది. ఆ జాబితాలో పేర్లున్నా... బ్యాంకు ఖాతాలో కొందరికి జమ కావట్లేదు. పట్టించుకోని అధికారులు బీమా ప్రీమియం కట్టినా పరిహారం రాకపోవడం, పరిహారం వచ్చినా బ్యాంకు ఖాతాలో సొమ్ము లేకపోవడంతో రైతులు, రైతు సంఘాల నాయకులు డీఆర్డీఏ, వ్యవసాయాధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రీమియం చెల్లించినా అసలు నష్టపరిహారం రాకపోతే డీఆర్డీఏ, వ్యవసాయాధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. పరిహారం సొమ్ము పడకపోతే బీమా కంపెనీ కూడా స్పందించాలి. కానీ ఎవరూ ట్టించుకోకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. వివరాలు చెబితే పరిష్కరిస్తాం ఐసీఐసీఐ కంపెనీకి 2015–16 సంవత్సరం బీమాతో సంబంధం లేదు. తర్వాత నుంచి పంటల బీమా మా కంపెనీ కట్టించుకుం టోంది. కాబట్టి ఆ ఏడాది నుంచి ఎవరికైనా సమస్య ఉంటే వివరాలు తెలియజేస్తే పరిష్కరిస్తాం. సోమవారం సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలియజేస్తాం. ప్రీమియం కట్టినా పరి హారం రాకపోయినా, పరిహారం మంజూరై జమ కాకపోయినా రైతుల వివరాలు తెలియజేస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. – మల్లికార్జున, ఐసీఐసీఐ లాంబోర్డు బీమా అధికారి ప్రీమియం కట్టినా రాలేదు నాకు పినవేమలి రెవెన్యూలో మూడు ఎకరాల భూమి ఉంది. బీమా కోసం రూ.1540 చెల్లిం చాను. పంట నష్టపోవడంతో బీమా పరిహారానికి ఆ గ్రామం ఎంపికైంది. కొందరు రైతులకు పరిహారం వచ్చింది. కానీ నాకు మాత్రం రాలేదు. ఇదేమని అడిగితే ప్రీమియం మీపేరున కట్టలేదని డీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. కావాలంటే ప్రీమియం సొమ్ము వెనక్కి ఇచ్చేస్తామని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఇదేమి ఘోరం. – సిరిపురం క్రిష్ణంనాయుడు,రైతు కోరుకొండపాలెం -
302వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
-
వైఎస్ జగన్‌కు కష్టాలు చెప్పుకున్న అరటి రైతులు
-
301వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
-
ప్రజా సంకల్పం@300 రోజులు
-
301వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
-
300వ రోజు పాదయాత్ర డైరీ
-
వైఎస్ జగన్‌ను కలిసిన గిరిజన నిరుద్యోగులు