రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 288వ రోజు షెడ్యూల్ ఖరారైంది. జననేత చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో అనంతవాహినిలా సాగిపోతోంది. రాజన్న తనయుడు బుధవారం ఉదయం బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం పెద్ద భీమవరం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి జె.రంగరాయపురం, రంగరాయపురం, అప్పయ్య పేట, బొబ్బిలి వరకు పాదయాత్ర కొనసాగనుంది. బొబ్బిలిలో సాయంత్రం జరిగే బహిరంగ సభలో జననేత వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
288వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
Published Wed, Oct 17 2018 7:05 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement