రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న చంద్రబాబు పాలనను తుదముట్టించేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలోని సాలూరు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 292వ రోజు పాదయాత్ర మంగళవారం ఉదయం సాలూరు శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి సీతమ్మదొరపాలెం క్రాస్ రోడ్డు, చంద్రప్పవలస క్రాస్‌రోడ్డు, దేవబుచ్చమ్మపేట, వల్లాపురంల మీదుగా సన్యాసిరాజుపేట వరకు కొనసాగనుంది