సడలని సంకల్పం, ఒడిదుడుకులను లెక్క చేయని పట్టుదల, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోవాలనే ఆకాంక్ష జననేత వైఎస్ జగన్‌ను ముందుకు నడిపిస్తున్నాయి. నిరంకుశ పాలనలో మగ్గుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టసుఖాలను తెలుసుకుని వారికి భరోసా ఇవ్వడానికి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గత ఏడాది నవంబర్ 6వ తేదీన ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర ఆదివారం 300 రోజుల మైలు రాయిని అధిగమించింది. ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి తొలి అడుగుతో ప్రారంభమైన పాదయాత్ర.. అశేష ప్రజానీకం అపూర్వ ఆదరాభిమానాల నడుమ అప్రతిహతంగా కొనసాగుతోంది. వెల్లువెత్తిన జన నీరాజనాలు, పోటెత్తిన మహిళల హారతులు, వృద్ధుల ఆశీర్వాదాలు, యువకుల కేరింతల నడుమ జిల్లాలు దాటే కొద్దీ మహోన్నత రూపం దాల్చింది.
ప్రజా సంకల్పం@300 రోజులు
Published Mon, Nov 19 2018 7:43 AM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM
Advertisement
Advertisement
Advertisement