విజయనగరం : విజయనగరంలోనే సినిమా చూస్తే విజయం వరిస్తుందని సినీనటుడు సాయికుమార్ అన్నారు. ఆయన తనయుడు ఆది హీరోగా నటించిన 'రఫ్' చిత్రాన్ని శుక్రవారం సాయికుమార్ స్థానిక ఎన్సిఎస్ థియేటర్లో చూశారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తనకు, తన తండ్రికి విజయనగరం అంటే ఎనలేని మక్కువ అని, ఈ జిల్లాలో సినిమా చూస్తే తప్పక విజయం సాధింస్తుందన్న ప్రగాఢ నమ్మకం ఉందన్నారు.
రఫ్ సినిమా చాలా చక్కగా వచ్చిందని, కుటుంబ సమేతంగా చూడాల్సిన చిత్రమన్నారు. కచ్చితంగా ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లో రఫ్ చిత్రం వందరోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని సెంటర్లలో హౌస్ఫుల్ కలెక్షన్లతో సినిమా ఆడుతున్నట్లు తనకు తెలిసిందని, చాలా ఆనందంగా ఉందని సాయికుమార్ తెలిపారు.
విజయనగరంలో చూస్తే సినిమా హిట్..
Published Sat, Nov 29 2014 9:17 AM | Last Updated on Wed, Apr 3 2019 9:02 PM
Advertisement
Advertisement