Rough movie
-
విజయనగరంలో చూస్తే సినిమా హిట్..
విజయనగరం : విజయనగరంలోనే సినిమా చూస్తే విజయం వరిస్తుందని సినీనటుడు సాయికుమార్ అన్నారు. ఆయన తనయుడు ఆది హీరోగా నటించిన 'రఫ్' చిత్రాన్ని శుక్రవారం సాయికుమార్ స్థానిక ఎన్‌సిఎస్ థియేటర్లో చూశారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తనకు, తన తండ్రికి విజయనగరం అంటే ఎనలేని మక్కువ అని, ఈ జిల్లాలో సినిమా చూస్తే తప్పక విజయం సాధింస్తుందన్న ప్రగాఢ నమ్మకం ఉందన్నారు. రఫ్ సినిమా చాలా చక్కగా వచ్చిందని, కుటుంబ సమేతంగా చూడాల్సిన చిత్రమన్నారు. కచ్చితంగా ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లో రఫ్ చిత్రం వందరోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని సెంటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో సినిమా ఆడుతున్నట్లు తనకు తెలిసిందని, చాలా ఆనందంగా ఉందని సాయికుమార్ తెలిపారు. -
లక్కీ.. లక్కీ...
యువ కథానాయకుల పాలిటి అదృష్ట దేవతగా అవతరించారు ఢిల్లీ భామ ''రకుల్‌ప్రీత్ సింగ్''. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’... సందీప్ కిషన్ కెరీర్‌కి పెద్ద బ్రేక్. ఇక గోపీచంద్‌కి పూర్వవైభవం కట్టబెట్టిన సినిమా ‘లౌక్యం’. ‘కరెంట్ తీగ’తో మంచు మనోజ్ కూడా గ్రాండ్ సక్సెస్ కొట్టేశారు. వీటన్నింటిలో కథానాయిక రకుల్ కావడం గమనార్హం. కథానాయికగా ఇప్పటికే హ్యాట్రిక్ హిట్లు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఆదితో కలిసి ‘రఫ్’ ఆడించడానికి రెడీ అవుతున్నారు. ‘రఫ్’లో రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయిక కావడంతో ఆదికి బంపర్‌హిట్ ఖాయం అని సినీ వర్గాలు నమ్మకం వెలిబు చ్చుతున్నాయి. రామ్ హీరోగా రూపొందుతోన్న ‘పండగ చేస్కో’లో కూడా రకుల్‌ప్రీత్‌సింగే కథానాయిక. రవితేజ ‘కిక్-2’లో కూడా హీరోయిన్గా బుక్కయిపోయారు రకుల్. ఇలా సినిమా సినిమాకూ ఆమె స్థాయి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ విజయపరంపర ఇలాగే కొనసాగితే... అనుష్క, సమంత, కాజల్, తమన్నా, శ్రుతీహాసన్‌లకు రకుల్ పోటీగా మారడం ఖాయమనేది ఫిలింనగర్ టాక్. సీహెచ్ సుబ్బారెడ్డి దర్శకత్వంలో అభిలాష్ మాధవరం నిర్మించిన ‘రఫ్’ ఈ నెల మూడో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రకుల్ యువ కథానాయకుల పాలిటి అదృష్టదేవత అనే సెంటిమెంట్‌ని ‘రఫ్’ ఏ మాత్రం నిజం చేస్తుందో చూడాలి.