లక్కీ.. లక్కీ... | Rough to release in third week of Nov | Sakshi
Sakshi News home page

లక్కీ.. లక్కీ...

Published Tue, Nov 11 2014 2:31 AM | Last Updated on Tue, Oct 2 2018 2:40 PM

లక్కీ.. లక్కీ... - Sakshi

లక్కీ.. లక్కీ...

యువ కథానాయకుల పాలిటి అదృష్ట దేవతగా అవతరించారు ఢిల్లీ భామ ''రకుల్‌ప్రీత్ సింగ్''. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’... సందీప్ కిషన్ కెరీర్‌కి పెద్ద బ్రేక్. ఇక గోపీచంద్‌కి పూర్వవైభవం కట్టబెట్టిన సినిమా ‘లౌక్యం’. ‘కరెంట్ తీగ’తో మంచు మనోజ్ కూడా గ్రాండ్ సక్సెస్ కొట్టేశారు. వీటన్నింటిలో కథానాయిక రకుల్ కావడం గమనార్హం. కథానాయికగా ఇప్పటికే హ్యాట్రిక్ హిట్లు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఆదితో కలిసి ‘రఫ్’ ఆడించడానికి రెడీ అవుతున్నారు.

రఫ్’లో రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయిక కావడంతో ఆదికి బంపర్‌హిట్ ఖాయం అని సినీ వర్గాలు నమ్మకం వెలిబు చ్చుతున్నాయి. రామ్ హీరోగా రూపొందుతోన్న ‘పండగ చేస్కో’లో కూడా రకుల్‌ప్రీత్‌సింగే కథానాయిక.

రవితేజ ‘కిక్-2’లో కూడా హీరోయిన్‌గా బుక్కయిపోయారు రకుల్. ఇలా సినిమా సినిమాకూ ఆమె స్థాయి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ విజయపరంపర ఇలాగే కొనసాగితే... అనుష్క, సమంత, కాజల్, తమన్నా, శ్రుతీహాసన్‌లకు రకుల్ పోటీగా మారడం ఖాయమనేది ఫిలింనగర్ టాక్. సీహెచ్ సుబ్బారెడ్డి దర్శకత్వంలో అభిలాష్ మాధవరం నిర్మించిన ‘రఫ్’ ఈ నెల మూడో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రకుల్ యువ కథానాయకుల పాలిటి అదృష్టదేవత అనే సెంటిమెంట్‌ని ‘రఫ్’ ఏ మాత్రం నిజం చేస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement