ఈ స్టార్‌ హీరోల రెస్టారెంట్స్‌, పబ్స్‌ గురించి తెలుసా..? | Tollywood Actress And Actors Food Restaurant Details | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఈ స్టార్‌ హీరోల రెస్టారెంట్స్‌ గురించి తెలుసా..?

Published Sun, Feb 16 2025 3:13 PM | Last Updated on Sun, Feb 16 2025 3:50 PM

Tollywood Actress And Actors Food Restaurant Details

ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న వ్యాపారరంగంలోకి కంగనా రనౌత్‌ అడుగుపెట్టారు.  సినీ, రాజకీయ రంగాల్లో బిజీగా ఉన్న ఆమె హిమాచల్‌లోని మనాలిలో కేఫ్‌ను ప్రారంభించారు. హిమాలయాల నడిబొడ్డున ‘ది మౌంటెన్‌ స్టోరీ’ పేరుతో ఒక సుందరమైన రెస్టారెంట్‌ను ప్రారంభించడంతో అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అయితే, హైదరాబాద్‌ వేదికగా కొందరు సినీ సెలబ్రిటీలు పలు రెస్టారెంట్స్‌లను ప్రారంభించారు. విలాసవంతమైన ఆహారం, బ్రేవరేజస్‌తో పాటు, అధునాతన జీవన శైలికి అద్ధం పట్టే అద్భుతమైన ఇంటీరియర్‌ ఫ్యాషన్‌ లుక్‌ నేటి రెస్టారెంట్‌ కల్చర్‌లో భాగమైపోయింది. అయితే నగర వాసుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరినీ ఆకర్షించేందుకు ఎవరికి వారు తమ సొంత స్టైల్లో యునీక్‌ యాంబియన్స్‌ కోసం తాపత్రయపడుతున్నారు.

బంజారా హిల్స్‌లో మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ 'AN రెస్టారెంట్'
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ డిసెంబర్ 8, 2022న  AN రెస్టారెంట్‌ని బంజారా హిల్స్‌లో ప్రారంభించారు. మినర్వా, ఆసియన్ ఫుడ్ గ్రూపులతో కలిసి వారు దీనిని ప్రారంభించారు. రెస్టారెంట్‌లో అద్భుతమైన ఇంటీరియర్స్, అగ్రశ్రేణి సర్వీస్‌తో పాటు వివిధ రకాల ప్రపంచ వంటకాలతో భారీగానే మెనూ లిస్ట్‌ ఉంటుంది.  ఆహార ప్రియులకు తప్పకుండా నచ్చేలా ఇక్కడి ఫుడ్‌ ఉంటుందని చాలామంది పేర్కొన్నారు.

విరాట్ కోహ్లీ,  అనుష్క శర్మల వన్‌–8 కమ్యూన్‌
గత ఏడాదిలో హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీకి దగ్గరలో  వన్‌–8 కమ్యూన్‌ పేరుతో ఒక లగ్జరీ రెస్టారెంట్‌ను కోహ్లీ, అనుష్క శర్మ ప్రారంభించారు. హైదరాబాద్‌కు ఉన్న రాజసాన్ని, రిచ్‌ ఫ్లేవర్‌ను ప్రతిబింబిస్తుంది. ఇందులోని కిచెన్‌.. పాక ప్రపంచానికి నూతన హంగులు అద్దిందని ఫుడ్‌ లవర్స్‌ చెబుతున్నారు. వన్‌–8 కమ్యూన్‌ బ్రాండ్‌ ఎథోస్‌కు కట్టుబడి, రెస్టారెంట్‌ డిజైన్‌ అందంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఇక్కడి వింటేజ్‌ లుక్స్‌ నగరవాసులను విశేషంగా ఆకర్షిస్తుంది. 

జుహు, బెంగుళూరు, గుర్గావ్‌లలో ఇప్పటికే ఆదరణ పొందుతున్న ఈ రెస్ట్రో బార్‌ను ఇక్కడ ఏర్పాటు చేయడంతో చాలామంది చిల్‌ అవుతున్నారు. ఫుడ్‌ లవర్స్‌తో పాటు క్రికెట్‌ ప్రియులు సైతం ఆసక్తిగా ఇక్కడికి విచ్చేస్తున్నారు. రెస్ట్రో బార్‌లో భాగంగా రిచ్‌ ఫుడ్‌ డిషెస్‌తో పాటు బ్రేవరేజస్‌ అందుబాటులో ఉండటంతో అన్ని వర్గాల వారికీ హాట్‌ స్పాట్‌గా మారింది. కోహ్లీకి అత్యంత ఇష్టమైన కార్న్‌ బార్లీ రిసోట్టో, మష్రూమ్‌ గూగ్లీ డిమ్‌ సమ్, టార్టేర్‌ టాప్‌డ్‌ అవకాడో వంటి పలు వంటకాలను ప్రత్యేకంగా వండి వడ్డిస్తున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్   'ఆరంభం'
గచ్చిబౌలి 'ఎఫ్ 45' పేరుతో జిమ్‌ను ప్రారంభించిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ .. జూబ్లీహిల్స్‌లో కూడా ఓ బ్రాంచ్ మొదలు పెట్టి లీజ్‌కు ఇచ్చేసింది. అయితే, ఆరోగ్యంపై అవగాహన పెంచే ప్రయత్నంలో, నటి రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్‌లో మిల్లెట్ ఆధారిత రెస్టారెంట్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌ వద్ద 'ఆరంభం' పేరుతో ఒక రెస్టారెంట్‌ను ఓపెన్‌ చేశారు.  Curefoods భాగస్వామ్యంతో, సాంప్రదాయ భారతీయ వంటకాల డొమైన్‌లో మిల్లెట్-ఎయిడెడ్ ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేయడానికి ఆమె ఈ వెంచర్‌ను ప్రారంభించారు. మిల్లెట్‌ను భారతీయ ఆహారంలో ప్రధాన భాగం చేయడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో ఈ చొరవ తీసుకున్నట్లు ఆమె చెప్పారు. రుచిలో రాజీ పడకుండా ఆరోగ్యకరమైన, పోషకమైన భోజనం అందిస్తున్నట్లు ఆమె రెస్టారెంట్‌పై ప్రశంసలు వచ్చాయి.

 అల్లు అర్జున్ హైలైఫ్
పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా రేంజ్‌లో అభిమానులను సొంతం చేసుకున్న  అల్లు అర్జున్ కూడా రెస్టారెంట్‌ వ్యాపారంలో ఉన్నారు. అంతర్జాతీయ రేంజ్‌లో గుర్తింపు ఉన్న హైలైఫ్ బ్రూయింగ్ కంపెనీ గురించి వినే వింటారు. హైలైఫ్ పేరుతో 2016లోనే జూబ్లీహిల్స్‌లో ఈ రెస్టారెంట్‌ను ఆయన ప్రారంభించారు.  అంతర్జాతీయ హాస్పిటాలిటీ బ్రాండ్ M కిచెన్, నిర్మాత కేదార్ సెలగంశెట్టితో కలిసి రన్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోబఫెలో వైల్డ్ వింగ్స్ (B-డబ్స్) అనే అమెరికన్ రెస్టారెంట్‌ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ రెండూ కూడా హైదరాబాద్‌లోని పార్టీలకు స్వర్గధామంగా మారాయి. మీరు  ఏదైనా సందర్బంలో పార్టీ కోసం వెతుకుతున్నట్లయితే, హైలైఫ్ మీకు సరైన స్థలమని చెప్పవచ్చు.

అక్కినేని నాగార్జున యొక్క 'N గ్రిల్, N ఏషియన్'
టాలీవుడ్ సీనియర్‌ హీరో నాగార్జునకు కూడా హైదరాబాద్‌లో ప్రముఖ రెస్టారెంట్స్ ఉన్నాయి. జూబ్లీహిల్స్ వద్ద N గ్రిల్ పేరుతో ఆయనకు ఒక రెస్టారెంట్‌ ఉంది. 2014లో ఎంటర్‌ప్రెన్యూర్ ప్రీతం రెడ్డి సహకారంతో ఆయన దీనిని ప్రారంభించారు. ఇది ఆధునిక గ్రిల్ హౌస్‌గా గుర్తింపు ఉంది. దీంతో పాటు జూబ్లీ హిల్స్‌లో కూడా ఎన్ ఏషియన్ అనే చైనీస్ రెస్టారెంట్‌ని కూడా నాగ్‌ ఏర్పాటు చేయడం విశేషం.  రెండు రెస్టారెంట్లు భారతీయ, ఇటాలియన్, పాన్ ఆసియన్‌తో పాటు మెడిటరేనియన్ వంటకాలను అందించే విభిన్న మెనూకు ప్రసిద్ధి చెందాయి. హైదరాబాద్‌లో ప్రీమియం డైనింగ్ అనుభవం కోసం వెతుకుతున్న ఆహార ప్రియుల కోసం ఈ ప్రదేశాలు బెస్ట్‌ ఛాయిస్‌ అని చెప్పవచ్చు.

 నాగ చైతన్య 'షోయూ'
ఫుడ్‌ బిజినెస్‌లోకి 2022లోనే నాగచైతన్య ఎంట్రీ ఇచ్చేశాడు. 'షోయూ' పేరుతో జూబ్లీహిల్స్‌  ప్రాంతలో ఓ సరికొత్త రెస్టారెంట్‌ను ఆయన ఓపెన్‌ చేశాడు. అక్కడ అనేక రకాల పాన్-ఆసియన్ వంటకాలు దొరుకుతాయి.  క్లౌడ్ కిచెన్‌గా తన వ్యాపారాన్ని ఆయన ప్రారంభించారు. స్విగ్గీ ఫుడ్‌ డెలివరీ సంస్థతో  హైదరాబాద్ చుట్టూ  ఉన్న ఆహారప్రియులకు తమ వంటకాలను అందిస్తుంది.  రుచికరమైన జపనీస్ మీల్స్‌ అక్కడి ప్రత్యేకత. బ్రాండ్ స్థిరమైన ప్యాకేజింగ్‌ను ఉపయోగించడం ద్వారా పర్యావరణ స్పృహతో కూడిన విధానాన్ని అవలంబిస్తుంది, క్లయింట్‌లు పర్యావరణ ప్రయోజనకరమైన భోజన అనుభవాన్ని కలిగి ఉండేలా రెస్టారెంట్‌ యాజమాన్యం చూస్తుంది.

నవదీప్‌-  BPM పబ్‌
హీరో నవదీప్ కూడా చాలా రోజుల క్రితమే ఒక పబ్‌ను ప్రారంభించారు. సినిమాల్లో బిజీగా ఉంటూనే ఈ వ్యాపారంలో ఆయన రాణించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో బీట్స్ పర్ మినిట్ అకా BPM పబ్‌ను  నవదీప్ నడుపుతున్నాడు. చాలామంది సెలబ్రిటీలు అక్కడకు వెళ్తూ ఉంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement