స్క్రీన్‌ టెస్ట్‌ | tollywood movies special screen test | Sakshi
Sakshi News home page

స్క్రీన్‌ టెస్ట్‌

Published Fri, Nov 2 2018 5:31 AM | Last Updated on Fri, Nov 2 2018 5:31 AM

tollywood movies special screen test - Sakshi

1. శ్రీకాంత్, ఊహ ‘ఆమె’ సినిమా టైమ్‌లో ప్రేమించుకున్నారు. ఈ ఇద్దరూ ఎన్ని సినిమాలు కలిసి చేశారో తెలుసా?
ఎ) 2 బి) 6 సి) 4 డి) 10

2. ఆమెను చూడగానే ఆమె నా ప్రపంచం అనిపించింది, అని ఆ హీరో పలు సందర్భాల్లో చెప్పారు. ఆ హీరో ఆమెను మార్చి 1న పెళ్లి చేసుకున్నారు. ఆ ప్రేమ జంటలోని హీరో ఎవరో కనుక్కోండి?
ఎ) రామ్‌ చరణ్‌  బి) అల్లు అర్జున్‌  సి) నాగచైతన్య  డి) మంచు విష్ణు

3. వీళ్లిద్దరూ తెలుగువారే, ఇద్దరూ ఆర్టిస్టులు కూడా. కానీ తమిళ సినిమాల ద్వారా ఫ్రెండ్స్‌ అయ్యారు. ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. ఆ జంట ఎవరు?
ఎ) అజిత్‌–షాలిని  బి) నాగౖచైతన్య–సమంత  సి) శివ బాలాజీ– మధుమిత డి) శ్రీకాంత్‌–ఊహ

4.శేఖర్‌ కమ్ముల ‘హ్యాపీడేస్‌’ కోసం ఆమెరికా నుంచి ఇండియాకి ఆడిషన్స్‌కి వచ్చి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో వరుణ్‌ సందేశ్‌. ‘పడ్డానండి ప్రేమలో మరి’ సినిమాలో నటించిన హీరోయిన్‌ను  ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఆ నటి పేరేంటి?
ఎ) వితికా శేరు బి) ధన్యా బాలకృష్ణ   సి) శ్రీ దివ్య        డి) నిషా అగర్వాల్‌

5. ప్రముఖ నటి అంజలీదేవి ఆ రోజుల్లోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  ఆమె భర్త ప్రముఖ సంగీత దర్శకుడు, నిర్మాత. ఆయన పేరేంటి?
ఎ) చక్రపాణి బి) ఆది నారాయణరావు సి) వేదాంతం రాఘవయ్య   డి) ఘంటసాల బలరామయ్య

6. నటుడు శ్రీహరి, డాన్సర్‌ శాంతిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏ సంవత్సరంలో వారు వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారో తెలుసా? (సి)
ఎ) 1986 బి) 1998  సి) 1996 డి) 1992

7.  జ్యోతిక పెళ్లికి ముందు సూర్యని ఓ సినిమాకు రికమెండ్‌ చేశారు. ఆ సినిమా పెద్ద హిట్‌. ఆ సినిమా పేరేంటి? (ఆ తర్వాతే సూర్య–జ్యోతికల పెళ్లి  జరిగింది)
ఎ) కాక్క కాక్క బి) నేరుక్కు నేర్‌  సి) పెరియన్నా  డి) ఫ్రెండ్స్‌

8. నటి సుహాసిని, మణిరత్నంల వివాహం 1988లో జరిగింది. వాళ్లిద్దరికీ ఓ బాబు ఉన్నాడు. ఆ అబ్బాయి పేరేంటో తెలుసా?  
ఎ) నందు        బి) నందన్‌   సి) నందీశ్వర్‌   డి) నందకిశోర్‌

9. మహేశ్‌ బాబు, నమ్రతా శిరోద్కర్‌లు ఏ సినిమా టైమ్‌లో లవ్‌లో పడ్డారో తెలుసా?
ఎ) వంశీ             బి) అతడు   సి) మురారి       డి) యువరాజు

10.  ఇక్కడ ఉన్న హీరోల్లో ఏ హీరో తన చిన్ననాటి స్నేహితురాలిని వివాహమాడారో తెలుసా?
ఎ) మహేశ్‌ బాబు బి) యన్టీఆర్‌  సి) రామ్‌చరణ్‌ డి) అల్లు అర్జున్‌

11. నటి రమాప్రభ, నటుడు శరత్‌బాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాతి కాలంలో వారు విడిపోయారు. ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారో తెలుసా?
ఎ) 10 ఏళ్లు     బి) 5 ఏళ్లు    సి) 7 ఏళ్లు     డి) 12 ఏళ్లు

12. లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ అంటారు. అలా ఓ పెళ్లిలో ఆమెను చూసి మనసు పారేసుకున్న వరుడు ఎవరో కనుక్కోండి?
ఎ) అల్లు అర్జున్‌  బి) ఎన్టీఆర్‌   సి) మంచు మనోజ్‌   డి) మంచు విష్ణు

13. నటి స్నేహ, ప్రసన్నలు లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. వాళ్ల బాబు పేరు విహాన్‌. ఈ జంట పెళ్లి ఎప్పుడు జరిగిందో తెలుసా?
ఎ) 2008    బి) 2010    సి) 2011   డి) 2012

14. న్యూయార్క్‌లో మొదటిసారి వాళ్ల లవ్‌ మొదలయిందట. పెళ్లయ్యాక మళ్లీ ఆ ప్లేస్‌కి వెళ్లి సెలబ్రేట్‌ చేసుకున్న ఆ జంట ఎవరు?
ఎ) నాగచైతన్య–సమంత  బి) మహేశ్‌ బాబు–నమ్రత  సి) రామ్‌చరణ్‌–ఉపాసన  డి) అల్లు అర్జున్‌–స్నేహ

15. సింగర్‌ హేమచంద్ర లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. ఆయన భార్య కూడా సింగరే. ఆమె పేరేంటి?
ఎ) గీతా మాధురి బి) శ్రావణ భార్గవి సి) ప్రణవి డి) మాళవిక

16. పాటల రచయిత చంద్రబోస్‌ భార్య సుచిత్ర సినీ పరిశ్రమకు చెందినవారే. ఆమె ఏ శాఖకి చెందినవారో తెలుసా?
ఎ) పాటల రచయిత    బి) డాన్స్‌ డైరెక్టర్‌ సి) సింగర్‌                డి) ఎడిటర్‌

17. రమా రాజమౌళిని దర్శకుడు రాజమౌళి ఏ సినిమా టైమ్‌లో పెళ్లాడారో కనుక్కోండి?
ఎ) స్టూడెంట్‌ నెం 1  బి) సై    సి) ఛత్రపతి            డి) సింహాద్రి

18. కె.రాఘవేంద్రరావు కుమారుడు కె.యస్‌. ప్రకాశ్‌ ఓ బాలీవుడ్‌ రైటర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె పేరేంటి?
ఎ) జోయా అక్తర్‌  బి) కనికా థిల్లాన్‌ సి) జుంపాలహరి       డి) తనూజా చంద్ర

19. నటుడు జేడీ చక్రవర్తి పెళ్లాడిన నటి పేరేంటి?
ఎ) అనుకృతి శర్మ     బి) నేహా శర్మ  సి) కిమ్‌ శర్మ            డి) మహేశ్వరి

20. ఇక్కడున్న దర్శకుల్లో ఏ దర్శకుడు ఎయిర్‌ హోస్టెస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారో తెలుసా?
ఎ) పూరి జగన్నాథ్‌ బి) శ్రీను వైట్ల  సి) సురేందర్‌ రెడ్డి  డి) వీవీ వినాయక్‌

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) సి 2) డి 3) సి 4) ఎ 5) బి 6) సి 7) ఎ 8) బి 9) ఎ 10) సి
11) ఎ  12) డి 13) ఎ 14) ఎ 15) బి 16) బి 17) ఎ 18) బి 19) బి 20) సి

నిర్వహణ: శివ మల్లాల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement