బ్రదర్స్‌ ఇన్‌ బియర్డ్‌.. అన్నదమ్ముల అనుబంధం | chiranjeevi birthday meet to pavankalyan family | Sakshi
Sakshi News home page

చిరుకు పవన్‌ శుభాకాంక్షలు

Published Thu, Aug 23 2018 12:45 AM | Last Updated on Fri, Mar 22 2019 5:29 PM

chiranjeevi birthday meet to pavankalyan family - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి 63వ జన్మదిన వేడుకలు బుధవారం కుటుంబ సభ్యుల మధ్య జరిగాయి. అన్నయ్యకు శుభాకాంక్షలు తెలియజేయడానికి తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ తన సతీమణి అన్నా లెజెనోవా, కుమార్తె పొలెనా, కుమారుడు మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌లతో కలిసి చిరంజీవి స్వగృహానికి వెళ్లారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘బ్రదర్స్‌ ఇన్‌ బియర్డ్‌ (గడ్డం).. ఇంట్లో నాన్నగారి బర్త్‌డే లంచ్‌కి బాబాయ్‌ వచ్చారు.

అన్నదమ్ముల అనుబంధం’’అని పేర్కొన్నారు. ‘‘మోస్ట్‌ గార్జియస్‌ అండ్‌ కైండెస్ట్‌ మామయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మా ఫ్యామిలీకి మామయ్యే బలం అండ్‌ మేజర్‌ ఇన్‌స్పిరేషన్‌’’ అని రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన పేర్కొన్నారు. అల్లు అర్జున్‌ సతీమణి స్నేహ, కుమారుడు అయాన్, కుమార్తె అర్హా, అల్లు శిరీష్‌.. ఇలా కుటుంబ సభ్యుల మధ్య బర్త్‌డే వేడుక జరిగింది. భార్య సురేఖ, కుమార్తె శ్రీజ, అల్లుడు కల్యాణ్‌ దేవ్, మనవరాలు నివృతితో కలిసి చిరు దిగిన ఫొటో ఓ హైలైట్‌.

అలాగే విదేశాల్లో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుని హైదరాబాద్‌ చేరుకున్న కళాబంధు టి. సుబ్బరామిరెడ్డిని పరామర్శించారు చిరంజీవి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘చిరంజీవి నటించిన ‘సైరా: నరసింహారెడ్డి’ టీజర్‌ అద్భుతంగా ఉంది. చరిత్రలో నిలిచిపోయే సినిమా ఇది’’ అన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే మంగళవారం రాత్రి ఫ్యాన్స్‌ సమక్షంలో చిరంజీవి బర్త్‌ డే వేడుకలు హైదరాబాద్‌లో జరిగాయి. ఈ కార్యక్రమంలో నటుడు సునీల్‌కి పద్మశ్రీ అల్లు రామలింగయ్య అవార్డును ప్రదానం చేశారు.  నిర్మాత అల్లు అరవింద్, నటులు నాగబాబు, రామ్‌చరణ్, అల్లు అర్జున్, వరుణ్‌ తేజ్‌ పాల్గొని ప్రసంగించారు.





No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement