Anna Lezhenova
-
ఇంట్లో పూజలు చేసిన పవన్- అనా దంపతులు
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మూడోసారి విడాకులు తీసుకోబోతున్నారనే న్యూస్.. గత కొన్ని గంటల నుంచి వైరల్ అయింది. దీంతో చాలామంది ఏం జరిగిందా అని మాట్లాడుకున్నారు. నేషనల్ వైడ్ గా ఇది హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు వీటిపై పవన్ నుంచి క్లారిటీ వచ్చేసింది. అది కూడా ఒక్క ఫొటో పోస్ట్ చేసి స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్.. మొదటి విడత పూర్తయిన సందర్భంగా తన ఇంట్లో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే పవన్ కల్యాణ్- అనా లెజినోవా దంపతులు పాల్గొన్నారు. ఆ ఫొటోనే జనసేన ట్వీట్ చేసింది. సినిమాల విషయానికొస్తే.. పవన్ ప్రస్తుతం ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలు చేస్తున్నారు. (ఇదీ చదవండి: ఓ పక్క పెళ్లి.. మరో పక్క విడాకులు.. మెగా ఫ్యామిలీకి ఎందుకిలా?) -
బ్రదర్స్ ఇన్ బియర్డ్.. అన్నదమ్ముల అనుబంధం
మెగాస్టార్ చిరంజీవి 63వ జన్మదిన వేడుకలు బుధవారం కుటుంబ సభ్యుల మధ్య జరిగాయి. అన్నయ్యకు శుభాకాంక్షలు తెలియజేయడానికి తమ్ముడు పవన్ కల్యాణ్ తన సతీమణి అన్నా లెజెనోవా, కుమార్తె పొలెనా, కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్లతో కలిసి చిరంజీవి స్వగృహానికి వెళ్లారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘బ్రదర్స్ ఇన్ బియర్డ్ (గడ్డం).. ఇంట్లో నాన్నగారి బర్త్‌డే లంచ్‌కి బాబాయ్ వచ్చారు. అన్నదమ్ముల అనుబంధం’’అని పేర్కొన్నారు. ‘‘మోస్ట్ గార్జియస్ అండ్ కైండెస్ట్ మామయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మా ఫ్యామిలీకి మామయ్యే బలం అండ్ మేజర్ ఇన్స్పిరేషన్’’ అని రామ్‌చరణ్ సతీమణి ఉపాసన పేర్కొన్నారు. అల్లు అర్జున్ సతీమణి స్నేహ, కుమారుడు అయాన్, కుమార్తె అర్హా, అల్లు శిరీష్.. ఇలా కుటుంబ సభ్యుల మధ్య బర్త్‌డే వేడుక జరిగింది. భార్య సురేఖ, కుమార్తె శ్రీజ, అల్లుడు కల్యాణ్ దేవ్, మనవరాలు నివృతితో కలిసి చిరు దిగిన ఫొటో ఓ హైలైట్. అలాగే విదేశాల్లో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుని హైదరాబాద్ చేరుకున్న కళాబంధు టి. సుబ్బరామిరెడ్డిని పరామర్శించారు చిరంజీవి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘చిరంజీవి నటించిన ‘సైరా: నరసింహారెడ్డి’ టీజర్ అద్భుతంగా ఉంది. చరిత్రలో నిలిచిపోయే సినిమా ఇది’’ అన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే మంగళవారం రాత్రి ఫ్యాన్స్ సమక్షంలో చిరంజీవి బర్త్ డే వేడుకలు హైదరాబాద్‌లో జరిగాయి. ఈ కార్యక్రమంలో నటుడు సునీల్‌కి పద్మశ్రీ అల్లు రామలింగయ్య అవార్డును ప్రదానం చేశారు. నిర్మాత అల్లు అరవింద్, నటులు నాగబాబు, రామ్‌చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ పాల్గొని ప్రసంగించారు. -
మళ్లీ తండ్రైన పవన్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తండ్రి అయ్యారు. ఆయన భార్య అన్నా లెజెనోవా తన రెండో సంతనానికి జన్మనిచ్చారు. పవన్ తన కొడుకును ఎత్తుకున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రేణుదేశాయ్ తో విడాకులు తీసుకున్న తరువాత 2013 లో అన్నా ను వివాహం చేసుకున్నారు పవన్. వీరికి ఇప్పటికే 3 ఏళ్ల పొలెనా అనే కూతురు ఉంది. పవన్ రేణుదేశాయ్ లకు కూడా అకీరా అనే కొడుకు ఆద్యా అనే కూతురు ఉన్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న పవన్, త్వరలో సినీ రంగానికి గుడ్ బై చెప్పేసి పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయించాలని భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. -
చిరు బర్త్ డే పార్టీలో పవన్ సతీమణి
మెగాస్టార్ చిరంజీవి 61వ పుట్టినరోజు వేడుకలు సోమవారం వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. సినీప్రముఖులు, అభిమానుల మధ్య హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో నిన్న సాయంత్రం ఘనంగా వేడుక నిర్వహించింది మెగా ఫ్యామిలీ. కాగా పవన్ సతీమణి అన్నా లెజ్నోవా పవన్ తరఫున ఈ పార్టీలో పాల్గొన్నారట. హోటల్ వద్ద ఆమెకు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తుంది. బెంగళూరులో జరిగిన శ్రీజ వివాహ వేడుకల్లో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు పవన్ సతీమణి. 'సర్దార్ గబ్బర్‌సింగ్' షూటింగ్లో బిజీగా ఉన్న కారణంగా పవన్.. శ్రీజ వివాహానికి హాజరుకాలేకపోయారు. ప్రస్తుతం మెగాస్టార్ పుట్టినరోజు వేడుకకు కూడా ఆయన రాలేకపోవడంతో అన్నా లెజ్నోవా ఆ లోటును భర్తీ చేశారు. మొత్తానికి పవన్ ఫ్యాన్స్ అంతా అన్నా లెజ్నోవా రాక గురించే మాట్లాడుకుంటున్నారు.