మళ్లీ తండ్రైన పవన్..! | Pawan, Anna Blessed With Baby Boy | Sakshi
Sakshi News home page

మళ్లీ తండ్రైన పవన్..!

Published Tue, Oct 10 2017 11:46 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Pawan Kalyan New Baby 1 - Sakshi

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తండ్రి అయ్యారు. ఆయన భార్య అన్నా లెజెనోవా తన రెండో సంతనానికి జన్మనిచ్చారు. పవన్ తన కొడుకును ఎత్తుకున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రేణుదేశాయ్ తో విడాకులు తీసుకున్న తరువాత 2013 లో అన్నా ను వివాహం చేసుకున్నారు పవన్. వీరికి ఇప్పటికే 3 ఏళ్ల పొలెనా అనే కూతురు ఉంది.

పవన్ రేణుదేశాయ్ లకు కూడా అకీరా అనే కొడుకు ఆద్యా అనే కూతురు ఉన్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న పవన్, త్వరలో సినీ రంగానికి గుడ్ బై చెప్పేసి పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయించాలని భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement